
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా రాజ కీయాల్లో ఎంతో కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే ఇప్పుడు ఆయన చేయవలసిన సినిమాలకు పవన్ టైం ఇవ్వ లేకపోతున్నారు. మొన్నటి వరకు హరిహర వీరమల్లు ఓజి సినిమా షూటింగ్లో కొంత పాల్గొన్నారు. తర్వాత ఇతర రాష్ట్రాలు ఎన్నికల కారణంగా రాజకీయ కార ణాలతో పవన్ సినిమా షూటింగ్‌లకు టైమ్ ఇవ్వలేక పోయారు. అయితే వచ్చేనెలలో పవన్ నటిస్తున్న హరి హర వీరమల్లు మూవీ ప్రేక్షకుల ముందుకు రావడా నికి రెడీగా ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఒక పాటను కూడా రిలీజ్ చేశారు. రెండో పాటకు సంబం ధించిన ప్రోమోని కూడా రిలీజ్ చేశారు. ఈ పాటను ఈ నెల 24న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఈ సినిమాలో ఓ ముఖ్యమైన సీక్వెన్స్ తీయాల్సి ఉంది అందుకోసం పవన్ డేట్లు కావాలి. అయితే ఇక్కడ పవన్ ఇప్పట్లో షూటింగ్‌కి వచ్చే అవకాశాలు కనిపించ డం లేదు. ఈనెల 24 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు మొదలు కాబోతున్నాయి. ఇక ఇప్పుడు పవన్ ఇంకా బిజీ.. మార్చ్ రెండోవారంలో డేట్ ఇచ్చిన అనుకున్న సమయానికి సినిమా పూర్తి చేస్తారా ? అనేది మాత్రం అనుమానం. ఇప్పటికే సినిమా చాలా ఆలస్యమైంది పవన్‌ని తెరపై చూసి చాలా సంవత్సరాలవుతుంది వీలైనంత త్వరగా ఈ సినిమాని రిలీజ్ చేయాలని పవన్ అభిమానులు కూడా కోరుతున్నారు.
తెలుగులైవ్స్.కామ్ సౌజన్యంతో..
Comentários