తమ పదవులకు సార్థకత చేకూరుస్తున్న బాబాయ్, అబ్బాయ్
విజయవాడ బాధితులకు అండగా అచ్చెన్న, రాము
సహాయ కార్యక్రమాల్లో స్వయంగా పాల్గొంటున్న నేతలు
డ్రోన్ సేవలు అందుబాటులోకి తెచ్చి కేంద్రమంత్రి రామ్మోహన్

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
సార్వత్రిక ఎన్నికల అనంతరం కేంద్ర, రాష్ట్రాల్లో ఎన్డీయే కూటమి ప్రభుత్వాలు కొలు వుదీరాయి. ఆ సందర్భాల్లో శ్రీకాకుళం జిల్లా ప్రత్యేక స్థానం పొందడమే కాకుండా, విశే షంగా వార్తల్లో నిలిచింది. జిల్లాకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన బాబాయ్, అబ్బాయ్‌లు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల్లో కేబి నెట్ మంత్రులుగా చోటు సంపాదించడం ప్రత్యేకత సంతరించుకుంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఒక్క కుటుంబానికే రెండు కీలక మంత్రి పదవులు విశేషమన్న చర్చ ఒకవైపు. ఇదేం పద్ధతి అన్న మాటవిరుపులు మరోవైపు బాగానే వినిపించాయి. అటువంటి వ్యాఖ్య లను ఏమాత్రం పట్టించుకోకుండా వారిద్దరూ తాము చేపట్టిన శాఖలకు న్యాయం చేసే పనిలో నిమగ్నమైపోయారు. వారెవరో ఇప్ప టికే అర్థమై ఉంటుంది. వారే రాష్ట్ర వ్యవ సాయ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు. స్వయానా బాబాయ్, అబ్బాయ్‌లైన వీరిద్దరూ రాజకీయాల్లోనే కాదు.. పదవుల నిర్వహణలోనూ తమకు సాటిలేదని నిరూపించుకుంటూనే ఉన్నారు. పదవులు కాదు.. వాటిని సమర్థవంతంగా నిర్వహించడమే ముఖ్యమన్నట్లు కార్యనిర్వ హణతో చూపిస్తూ విమర్శకుల నోళ్లు మూయిస్తున్నారు. తాజాగా వరద ముట్టడిలో చిక్కుకుని విలవిల్లాడుతున్న విజయవాడ లోనూ వీరిద్దరూ రాత్రింబవళ్లు శ్రమిస్తూ వరద సహాయ చర్యల్లో తమదైన ముద్ర వేస్తు న్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు నందుకుని తక్షణమే విజయవాడ చేరుకుని అక్కడే మకాం వేశారు. రాష్ట్రమంత్రి హోదా లో అచ్చెన్నాయుడు మూడు రోజులుగా విజయవాడ నగరంలో వరద బాధిత ప్రాం తాల్లో కలియదిరుగుతూ సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు. బాధితులను పరామర్శి స్తూ, ధైర్యం చెబుతున్నారు. సీఎం మాదిరి గానే పొక్లెయిన్‌లోనే వైఎస్‌ఆర్ నగర్, చిట్టి నగర్ తదితర ప్రాంతాల్లో ముంపు ప్రాంతా ల్లో స్వయంగా సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మరోవైపు కేంద్ర మంత్రి గా ఉన్న కింజరాపు రామ్మోహన్‌నాయుడు కూడా ఢల్లీిలో తన అధికారిక విధులను తాత్కాలికంగా పక్కనపెట్టి విజయవాడలో వాలిపోయారు. కేంద్రమంత్రిని కనుక తనకు రాష్ట్ర వ్యవహారాలతో సంబంధంలేదంటూ ఏదో చుట్టపు చూపుగా వచ్చి నాలుగు మాట లు చెప్పి వెళ్లిపోకుండా విజయవాడలోనే మకాం వేశారు. తాను కేంద్ర మంత్రినైనా స్వరాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు చేతనైన సాయం చేయాలన్న ఆరాటంతో వరద సహాయ చర్యల్లో నిరంతర పాల్గొంటున్నారు. రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌తో కలిసి సహాయ చర్యలను పర్యవేక్షి స్తూనే, కొన్ని ప్రాంతాల్లో స్వయంగా పర్య టించి ఆ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇక కేంద్ర విమానయాన శాఖ మంత్రి హోదాలో ఆ శాఖ పరిధిలో ఉండే యం త్రాంగాన్ని, పరికరాలను కూడా తెప్పించి వరద ప్రాంతాల్లో వినియోగిస్తున్నారు. రాము చొరవతోనే హెలికాప్టర్లు, డ్రోన్లు పెద్దసంఖ్య లో సహాయ కార్యక్రమాల్లో భాగస్వామ్యం వహిస్తున్నాయి. అలాగే రోడ్డుమార్గంలో లేదా జలమార్గంలో ఆహారం, ఇతర సహాయ సామగ్రి అందని బాధిత ప్రాంతాలకు మరో వెసులుబాటు కల్పించారు. ఉచిత డ్రోన్ సర్వీస్ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆహారం, పాలు, నీరు, ఇతర నిత్యావసర వస్తువులు అందని బాధితులు ఫోన్ ద్వారా సమాచారం అందిస్తే ఆయా ప్రాంతాలకు డ్రోన్‌ల ద్వారా వాటిని పంపిస్తామని సూచిం చారు. ఆ మేరకు సెల్ నెం. 88970 67212ను అందుబాటులోకి తెచ్చారు. ఆ విధంగా బాబాయ్, అబ్బాయ్‌లిద్దరూ తమ పదవులకు సార్థకత చేకూరుస్తున్నారు.

Commentaires