top of page

విలనిజానికి కొత్త ఊపు

  • Guest Writer
  • Sep 29
  • 3 min read
ree

మోహన్‌ బాబు తన కెరీర్‌ను విలన్‌గా ప్రారంభించారు. విలనిజానికి ఒక కొత్త ఒరవడిని సృష్టించిన ఘనత ఆయనకి దక్కుతుంది. చాలా కాలం తర్వాత, ఆయన మళ్లీ విలన్‌ అవతారంలోకి వచ్చారు. నాని నటిస్తున్న పారడైజ్‌ సినిమాలో శికంజ మాలిక్‌ అనే పవర్‌ఫుల్‌ క్యారెక్టర్‌ చేస్తున్నారు. రెండు పోస్టర్లు విడుదల చేయగా, ఆ లుక్స్‌ మోహన్‌ బాబును కొత్తగా చూపిస్తున్నాయి. అన్ని రకాల హావభావాలను అద్భుతంగా పలికించే మోహన్‌ బాబు కోసం దర్శకుడు శ్రీకాంత్‌ ఒదెలా ప్రత్యేకంగా ఒక పాత్రను తీర్చిదిద్దారు. ఇటీవల మోహన్‌ బాబు సినిమాలు చేయడం లేదు, ఆయనకి తగిన కథలు, పాత్రలు రావడం లేదు. కానీ శ్రీకాంత్‌ చెప్పిన ఈ క్యారెక్టర్‌ ఆయనకు నచ్చడంతో, మళ్లీ తెరపైకి రావడానికి ముందుకు వచ్చారు. మంచి డైలాగ్‌ డిక్షన్‌, పవర్‌ఫుల్‌ స్క్రీన్‌ ప్రెజెన్స్‌ కలిగిన మోహన్‌ బాబు విలన్‌గా కనిపిస్తే, విననిజానికి కొత్త ఊపు వచ్చినట్లే. పారడైజ్‌ లోకి ఆయన రాక తప్పకుండా సినిమాకి ప్రత్యేక ఆకర్షణ.

 - తెలుగు 360.కామ్‌ సౌజన్యంతో..



సైట్‌ కొడితే.. పక్కకు పిలిచి కుమ్మేస్తా!!
ree

ముంబై బ్యూటీ రితికా సింగ్‌ సుపరిచిమతే. ‘గురు’..’నీవెవరో’ లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఇటీవలే రిలీజ్‌ అయిన ‘కింగ్‌ ఆఫ్‌ కొత్త’ సినిమాలోనూ నటించింది. తమిళ్‌, మలయాళ చిత్రాల్లోనూ పనిచేసింది. కానీ ఏ భాషలోనూ బిజీ నటిగా మారలేకపోయింది. అందం, అభినయం గల నాయికే అయినా అవకాశాలు అందుకోవడంలో వెనుకబడిరది. పోటీని తట్టుకుని మార్కెట్‌ లో నిలబడలేకపోతుంది. ఈ మధ్య కాలంలో అమ్మడు నటించిన సోలో చిత్రాలేవి రిలీజ్‌ కాలేదు. చివరిగా రజనీకాంత్‌ నటించిన ‘వెట్టేయాన్‌’ లో నటించింది.

ఆ తర్వాత రితిక అడ్రస్‌ లేదు. కానీ ఈ బ్యూటీలో మరో ప్రత్యేకత కూడా ఉంది. అమ్మడు మిక్స్‌ డు మార్సల్‌ ఆర్స్ట్‌లో శిక్షణ తీసుకుంది. చిన్న వయసు నుంచే మార్షల్‌ ఆర్స్ట్‌లో తర్పీదు పొందింది. ఆ ట్యాలెంట్‌ తోనే ‘గురు’లో బాక్సర్‌ పాత్రకు ఎంపికైంది. కానీ తాను రియల్‌ లైఫ్‌ లోనూ రియల్‌ బాక్సర్‌ అన్నది చాలా తక్కువ మందికే తెలుసు. మహిళలపై దాడులు జరిగిన సమయంలో సోషల్‌ మీడియాలో తప్పక స్పందిస్తుంది. స్వీయా రక్షణపై అవగాహన కల్పిస్తుంటుంది. ఈ క్రమంలో నేటి జనరేషన్‌ మహిళలంతా తప్పకుండా బాక్సింగ్‌ , కరాటే, కుంగూపూ లాంటివి నేర్చుకోవాలని సూచించింది.

ఇలాంటి విద్యలు తెలిస్తే తమను తాము కాపాడుకోగలుగుతారని ముందు జాగ్రత్త చెప్పింది. దేశంలో అత్యాచారాలు పెరుగుతోన్న వేళ ఇలాంటి విద్యలు తెలిస్తే వాటి నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుందన్నారు. అలాగే తనకు ఎవరైనా సైట్‌ కొట్టినట్లు అనిపిస్తే ఎలాంటి భయం లేకుండా అతడిని పక్కకు పిలిచి కుమ్మేస్తానంది. అలాంటి వాటిని చూస్తూ ఊరుకోనంది. ఛాన్స్‌ ఇస్తేనే ఎవరైనా చూస్తారని..ఆ ఛాన్సే ఇవ్వకుండా చేతి బలం చూపిస్తే? పిచ్చి పిచ్చి వేశాలు వేసే వారు భయపడతారంది.

మారుతోన్న రోజుల్లో మహిళలు కూడా అంతే మారాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపింది.ఈ బ్యూటీ కూడా సోషల్‌ మీడియాలో యాక్టివ్‌ గానే ఉంటుంది. ఎప్పటికప్పుడు కొత్త ఫోటోలు షేర్‌ చేస్తూ కుర్ర కారులో సెగలు రేపుతుంది. చేతిలో సినిమాలు లేకపోయినా ఇప్పటికీ యువత అటెన్షన్‌ డ్రా చేస్తుందంటే? కారణం అమ్మ డిలో ఆ రకమైన యాంగిలే అని చెప్పాల్సిన పనిలేదు. ఇన్‌ స్టాలోనూ అమ్మడికి భారీ ఫాలోయింగ్‌ ఉంది. ఆ క్రేజ్‌ తో మాత్రం సినిమా అవకాశాలు అందుకోలేకపోతుంది.

- తుపాకి.కామ్‌ సౌజన్యంతో...



ప్రేమ కథలకు ఆమె ఛాయిస్‌ అవుతుందా..?
ree

సిద్ధు జొన్నలగడ్డ నెక్స్ట్‌ సినిమా తెలుసు కదా అక్టోబర్‌ 17న రిలీజ్‌ ఫిక్స్‌ చేశారు. ఈ సినిమాను నీరజ కోన డైరెక్ట్‌ చేయగా సినిమాలో రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్స్‌ గా నటించారు. ఈ సినిమా నుంచి వచ్చిన రెండు సాంగ్స్‌ సూపర్‌ అనిపించుకున్నాయి. ముఖ్యంగా సిద్ధు, శ్రీనిధి మధ్య సాంగ్‌ అయితే ఇంప్రెస్‌ చేసింది. తెలుసు కదా ఇద్దరు భామలు ఒక హీరో.. ఈ ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీ అసలు ట్విస్ట్‌ ఏంటో సినిమాలోనే చూడాలి. ఐతే ఈ సినిమా టీజర్‌, సాంగ్స్‌ లో శ్రీనిధి శెట్టి చాలా క్యూట్‌ గా కనిపిస్తుంది.

నాని హిట్‌ 3లో.. సినిమాలో ఆమె పాత్ర చాలా స్పెషల్‌ గా ఉండేలా ఉంది. కె.జి.ఎఫ్‌ తో సూపర్‌ క్రేజ్‌ తెచ్చుకున్న శ్రీనిధి శెట్టి ఆ తర్వాత తమిళ్‌ లో చియాన్‌ విక్రం తో కోబ్రా సినిమా చేసింది. ఆ నెక్స్ట్‌ నాని హిట్‌ 3లో నటించింది. నాని సినిమాతో టాలీవుడ్‌ లో సూపర్‌ హిట్‌ అందుకున్న అమ్మడు తెలుసు కదాతో ఆ హిట్‌ ఫాం కొనసాగించాలని చూస్తుంది. సిద్ధు కూడా తెలుసు కదాతో ఒక డీసెంట్‌ సక్సెస్‌ ఆశిస్తున్నాడు. సినిమాలో శ్రీనిధి శెట్టిని చూస్తే ఇలాంటి ప్రేమకథలకు ఆమె పర్ఫెక్ట్‌ ఛాయిస్‌ అనిపించేలా ఉంటుందట. అంతేకాదు ఆ తర్వాత కూడా ఆమెకు ఇలాంటి రోల్స్‌ వచ్చే పరిస్థితి ఉంటుందని తెలుస్తుంది. ప్రేమ కథలకు ఎవరైతే బాగుంటారని ఆడియన్స్‌ అనుకుంటారో అలాంటి వారికి ఎక్కువ అవకాశాలు వస్తాయి. శ్రీనిధి శెట్టి ఇప్పటివరకు తీసిన సినిమాల్లో ఏది లవ్‌ స్టోరీ కాదు. గ్యాంగ్‌ స్టర్‌ మూవీ, డిఫరెంట్‌ జానర్‌ మూవీస్‌ చేసింది.

క్రేజీ లవ్‌ స్టోరీతో తెలుసు కదా.. తెలుసు కదా తో ఒక క్రేజీ లవ్‌ స్టోరీతో వస్తుంది. నీరజ కోన ఈ సినిమాను చాలా ప్లానింగ్‌ తో చేస్తున్నట్టు తెలుస్తుంది. సిద్ధు శ్రీనిధి జోడీ మాత్రమే కాదు రాశి ఖన్నా కూడా ఈ సినిమాకు మరో హైలెట్‌ అని అంటున్నారు. తెలుగులో ఈమధ్య పెద్దగా సినిమాలు చేయని రాశి ఖన్నా తెలుసు కదాతో కంబ్యాక్‌ ఇవ్వాలని చూస్తుంది. శ్రీనిధి మాత్రం తెలుగు ఆడియన్స్‌ చూపిస్తున్న ప్రేమకు ఫిదా అయినట్టు ఉంది. అందుకే అమ్మడు ఇక్కడ సినిమాలు ఎక్కువగా చేయాలని అనుకుంటుంది. హిట్‌ 3 తో మంచి బోణీ కొట్టింది కాబట్టి తెలుసు కదాకు ఆ లక్‌ కలిసి వస్తే సిద్ధు కూడా సూపర్‌ హ్యాపీ అన్నట్టే లెక్క. ఎందుకంటే జాక్‌ తో ట్రాక్‌ తప్పిన అతను ఈ సినిమాతో సక్సెస్‌ అందుకోవాలని చూస్తున్నాడు.

- తుపాకి.కామ్‌ సౌజన్యంతో...

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page