top of page

వెలుగుల నగరం.. చీకట్ల కోణం

  • Writer: SATYAM DAILY
    SATYAM DAILY
  • Jun 11
  • 1 min read
  • వీధి దీపాల నిర్వహణలో వైఫల్యం

  • ఒకే ప్రాంతం.. రెండు భిన్నమైన చిత్రాలు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

చీకటివెలుగుల రంగేళి.. జీవితమే ఒక దీపావళి అని సినిమా కవి అన్నట్టు నగరంలో కొన్నిచోట్ల విద్యుత్ దీపాలు దగద్ధాయమానంగా వెలుగుతుంటే.. మరికొన్నిచోట్ల కనీసం మసకవెలుతురు కూడా అందించలేకపోతున్నాయి. ప్రతీ 2,500 మంది జనాభాకు ఒక సచివాలయం పెట్టి, అందులో ప్రతీ విభాగానికి ఒక బాధ్యుడ్ని నియమిస్తే.. కనీసం కొన్నిచోట్ల వీధి దీపాలు వెలుగుతున్నాయో లేదో పట్టించుకోవడంలేదు. ఒకే నాణేనికి రెండు ముఖాల్లా కనిపిస్తున్న ఈ రెండు ఫొటోలు ఒకే ప్రాంతానికి రెండు దిక్కుల్లో ఉన్నాయి. పాత టీపీఎం హైస్కూల్ దండివీధికి ఒక ముఖం కాగా, కంపోస్టు కాలనీ మరో కోణం. ఇందులో ఒకచోట ఒక్క దీపం కూడా వెలగకపోగా, మరోచోట దీపాలు కాంతివంతంగా కనిపిస్తున్నాయి. తేడా అంతా సచివాలయ ఉద్యోగుల చిత్తశుద్ధే. ఇటీవలే కమిషనర్ కూర్మారావు నగరంలో ఆన్ అండ్ ఆఫ్ బోర్డులు, వాటి కాన్ఫిగరేషన్, విద్యుత్ దీపాలకు సంబంధించిన రికార్డు తయారుచేయించారు. గతంలో వీధి దీపాలు వేశామని, ఆన్ అండ్ ఆఫ్ టైమర్లు బిగించామంటూ లక్షలాది రూపాయలు బిల్లు చేసుకొని కాంట్రాక్టర్లు వెళ్లిపోయారు. దీంతో ఎన్ని స్తంభాలకు ఎన్ని దీపాలు ఉన్నాయి? వాటి ఆన్ అండ్ ఆఫ్ స్విచ్‌ల కాన్ఫిగరేషన్ ఏమిటి? టెండరులో ఏం చెప్పారు? ఇక్కడ ఏం సప్లై చేశారన్న దానిపై ఆరా తీస్తున్నారు. ఈ ఒక్క సాకుతో కొత్త దీపాలు వేయడానికి సచివాలయ సిబ్బంది మురిపించుకుంటున్నారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page