top of page

సమర్థతే శాపమా!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Jul 16
  • 1 min read
  • కొత్త డీఎంహెచ్‌వో రాకలో అనుకోని ఆలస్యం

  • అతని సేవలు అవసరమంటూ రిలీవ్ చేయని విశాఖ కమిషనర్

  • డాక్టర్ నరేష్ స్థానంలో వచ్చిన అధికారిని వెనక్కి పంపేయడంపై చర్చ

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి)

ప్రభుత్వ రంగమైనా, ప్రైవేటు రంగమైనా.. ఉద్యోగులకు సంబంధించి సమర్థత, నిబద్ధతలనే కొలబద్దగా తీసుకోవడం సహజం. దాని ఆధారంగానే ఉద్యోగులకు ీVAదాలు, ప్రమోషన్లు, ఇతరేతర గుర్తింపులు కల్పించి గౌరవిస్తుంటారు. కానీ దురదృష్టవశాత్తు కొన్ని సందర్భాల్లో ఆ సమర్థత, నిబద్ధతలే శాపంగా పరిణమించి సంబంధిత ఉద్యోగులు, అధికారుల ఎదుగుదలను అడ్డుకుంటుంటాయి. ఈ పరిస్థితికి తాజా ఉదాహరణగా జిల్లా కొత్త డీఎంహెచ్‌వో నియమితులైన డాక్టర్ ఈ.వి.నరేష్‌కుమార్‌కు ఎదురవుతున్న అడ్డంకులను పేర్కొనవచ్చు. వైద్యఆరోగ్య శాఖలో ఇటీవల జరిగిన బదిలీల్లో భాగంగా గ్రేటర్ విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) చీఫ్ మెడికల్ ఆఫీసర్‌గా ఉన్న డాక్టర్ నరేష్‌కుమార్‌ను శ్రీకాకుళం డీఎంహెచ్‌వోగా నియమించారు. అలాగే నరేష్‌కుమార్ ఖాళీ చేసిన స్థానంలో పార్వతీపురం మన్యం జిల్లా డీఎంహెచ్‌వోను జీవీఎంసీ చీఫ్ మెడికల్ ఆఫీసర్‌గా నియమించారు. ఆ మేరకు డాక్టర్ నరేష్‌కుమార్ గురువారం విశాఖలో రిలీవ్ అయ్యి.. అదేరోజు సాయంత్రం శ్రీకాకుళం వచ్చి డీఎంహెచ్‌వోగా బాధ్యతలు చేపట్టేందుకు నిర్ణయించుకున్నారు. కానీ ఊహించని రీతిలో ఆయనకు అడ్డంకులు ఎదురయ్యాయి. సమర్థుడైన అధికారిగా పేరున్న ఆయన్ను వదులుకునేందుకు జీవీఎంసీ కమిషనర్ గౌతమ్ ఇష్టపడటం లేదని తెలిసింది. ఆ మేరకు డాక్టర్ నరేష్‌కుమార్‌ను విధుల నుంచి రిలీవ్ చేయకపోగా.. ఆయన స్థానంలో బాధ్యతలు స్వీకరించేందుకు వచ్చిన పార్వతీపురం మన్యం జిల్లా డీఎంహెచ్‌ను వెనక్కి పంపేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. జీవీఎంసీకి వచ్చి తనను కలుసుకునేందుకు ప్రయత్నించిన ఆయన్ను కమిషనర్ ఆ అవకాశం ఇవ్వకపోగా, తన సీసీ ద్వారా ఫోన్ చేయించి ఇప్పుడు వెళ్లిపోయి.. వారం తర్వాత రమ్మని చెప్పించినట్లు తెలిసింది. దాంతో హర్ట్ అయిన ఆయన వెళ్లిపోయినట్లు సమాచారం. మరోవైపు విశాఖలో ఇంకా రిలీవ్ కాని పరిస్థితుల్లో డాక్టర్ నరేష్‌కుమార్ శ్రీకాకుళం డీఎంహెచ్‌వో బాధ్యతలు చేపట్టడం కూడా అనివార్యంగా వాయిదా పడింది. ఈ విషయం శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌తో పాటు జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు, రాష్ట్ర వైద్యఆరోగ్య మంత్రి సత్యకుమార్ యాదవ్‌ల దృష్టికి వెళ్లినట్లు తెలిసింది.

1 Comment


Markonda Patnaikuni Markandeya Rao
Markonda Patnaikuni Markandeya Rao
Jul 20

You are 100% right.

Like

Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page