
ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన సలార్ భారీ విజయం సాధించింది. అయితే ఈ మూవీ కొన్ని ఏరియాల్లో నష్టాలు మిగల్చగా నిర్మాత విజయ్ కిరగందూర్ డబ్బులు తిరిగి చెల్లిచారంటూ ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది.
ప్రభాస్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది సలార్. వరల్డ్ వైడ్ ఈ మూవీ రూ. 700 కోట్ల వసూలు చేసింది. 2023 డిసెంబర్ 22న సలార్ వరల్డ్ వైడ్ విడుదల చేశారు. సలార్ కి పోటీగా షారుఖ్ ఖాన్ డంకీ విడుదలైంది. అయితే సల్మాన్ ఖాన్ పై ప్రభాస్ దే పై చేయి అయ్యింది. దర్శకుడు ప్రశాంత్ నీల్ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందించాడు. ప్రభాస్-పృథ్విరాజ్ సుకుమార్ మిత్రులుగా నటించారు.
కాగా సలార్ భారీ వసూళ్లు రాబట్టినప్పటికీ కొన్ని ఏరియాల్లో నష్టాలు మిగిల్చినట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో సలార్ హక్కులు రూ. 150 కోట్ల వరకు అమ్మడుపోయాయి. నైజాం హక్కులు మైత్రీ మూవీ మేకర్స్ రూ. 60 కోట్లకు దక్కించుకున్నారని సమాచారం.
ఇక ఏపీ డిస్ట్రిబ్యూటర్స్ దాదాపు రూ. 90 కోట్లకు సలార్ హక్కులు కొన్నారు. నైజాం లో బ్రేక్ ఈవెన్ అయిన సలార్ ఏపీలో కాలేదు. దాంతో నష్టాల్లో కొంత మేర సలార్ నిర్మాత విజయ్ కిరగందూర్ తిరిగి చెల్లించారట. ఈ మేరకు ఓ న్యూస్ వైరల్ అవుతుంది.
కాగా సలార్ కి సీక్వెల్ ప్రకటించిన విషయం తెలిసిందే. జూన్ లేదా జులై నెలలో సలార్ 2 పట్టాలెక్కనుంది. ఇటీవల పృథ్విరాజ్ సుకుమారన్ దీనిపై అప్డేట్ ఇచ్చాడు. సలార్ 2 షూటింగ్ ఏర్పాట్లు జరుగుతున్నాయని అన్నారు. శౌర్యంగ పర్వం పేరుతో రెండవ భాగం తెరకెక్కనుంది. దర్శకుడు ప్రశాంత్ నీల్ అసలు కథ మొత్తం పార్ట్ 2 కోసం దాచేశాడు. పార్ట్ 1 మిక్స్డ్ టాక్ తెచ్చుకోవడానికి కారణం కూడా కథ అసంపూర్తిగా చెప్పడమే.
ఇక పార్ట్ 2 కథ కూడా చెప్పేశాడు ప్రశాంత్ నీల్. ప్రాణ మిత్రులైన దేవ-వరదరాజులు బద్ద శత్రువులు అవుతారు. ప్రధాన పోరాటం వీరి మధ్య సాగుతుంది. మిత్రులు శత్రువులు ఎలా అయ్యారనేది కథలో ట్విస్ట్. సలార్ 2లో బాబీ సింహ, ఈశ్వరి రావు, జగపతిబాబు కీలక రోల్స్ చేస్తున్న విషయం తెలిసిందే... సలార్ 2 వచ్చే ఏడాది విడుదలయ్యే అవకాశం కలదు.
Comments