top of page

సిక్కోలు లో భలే ఉన్నాడే హాడావుడి

Writer: ADMINADMIN

యువ హీరో రాజ్ తరుణ్ ,హీరోయిన్ మనీషా కంద్కూర్ జంటగా నటించిన భలే ఉన్నాడే సినిమా ప్రేక్షకులను అలరించింది. సినిమా చూసిన వారంతా భలే ఉందంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు మారుతి సమర్పకుడిగా జె.శివ సాయి వర్థన్ దర్శకత్వంలో శ్రీకాకుళంకి చెందిన వ్యాపారవేత్త నారయణశెట్టి కిరణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. రవి కిరణ్ ఆర్ట్స్ పేరుతో ఈ సినిమాను కిరణ్ కుమార్ తీయగా శ్రీకాకుళం వాసుల చూపు అంతా భలే ఉన్నాడే సినిమాపైనే ఉంది. రాజ్ తరుణ్ ,మనీషా కంద్కూర్ నటించిన ఈ సినిమా శుక్రవారం విడుదలైన సందర్భంగా శ్రీకాకుళం నగరంలోని ఆ చిత్రం ప్రదర్శితమైన సన్ మ్యాక్స్ వద్ద సందడి నెలకొంది. చిత్ర నిర్మాత స్వస్థలమైన శ్రీకాకుళంలో మిత్రులు,శ్రేయోభిలాషులతో కలిసి భలే ఉన్నాడే సినిమాను ఆయన వీక్షించారు. శ్రీకాకుళం నగరానికి చెందిన వ్యక్తి నిర్మాతగా ఉన్న రాజ్ తరుణ్ సినిమా విడుదల సందర్భంగా సన్ మ్యాక్స్ వద్ద శుక్రవారం సందడి నెలకొంది. పెద్ద హీరోల సినిమా విడుదలైనట్లుగా శ్రీకాకుళం వాసులు హంగామా చేసారు. కాంగో డ్రమ్స్ తో చేసిన శబ్థాలు,బాణా సంచా పేలుళ్ళతో పండుగ వాతావరణం అక్కడ కనిపించింది.కాగితాల రెపరెపలు,ప్రేక్షకుల సందడితో భలే ఉన్నాడే చిత్రం ప్రదర్శితమైన థియేటర్ వద్ద శ్రీకాకుళం వాసులు హడావుడి చేసారు. భలే ఉన్నాడే సినిమాను తొలి ఆటగా చూసిన వారంతా సూపర్ అంటూ తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఇంటిల్లపాది కలిసి చూడదగ్గ సినిమా భలే ఉన్నాడేనని ప్రశంసించారు. మంచి కథాంశాన్ని ఎంచుకుని సినిమా తీసారంటూ శ్రీకాకుళంకి చెందిన నిర్మాత కిరణ్ కుమార్ ను పలువురు అభినందించారు. వినూత్న కథాంశం అందరిని మెప్పించడంతో సినిమా హాల్ లోనే విజయోత్సవ సంబరాలను నిర్వహించారు. నిర్మాతగా ఉన్న కిరణ్ కుమార్ మిత్రులు,శ్రేయోభిలాషులు సన్ మ్యాక్స్ థియేటర్ వద్దనే కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. ఆయన కేక్ కట్ చేసి అందరికి పంచిపెట్టి సంతోషాన్ని వ్యక్తం చేసారు.


సిక్కోలు ఎటుచూసినా భలే ఉన్నాడే సందడే

శ్రీకాకుళం నగరానికి చెందిన వ్యాపారవేత్త నారాయణశెట్టి కిరణ్ కుమార్ నిర్మాతగా తెరకెక్కించిన భలే ఉన్నాడే సినిమా విడుదల సందర్భంగా జిల్లా కేంద్రంలో ఎక్కడ చూసినా సినిమా సందడే కనిపించింది.భలే ఉన్నాడే విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ నిర్మాత కిరణ్ కుమార్ ఫోటోలతో భారీ ఫ్లెక్సీలు ఎక్కడికక్కడ వెలిసాయి. ఆయన మిత్రులు,శ్రేయోభిలాషులు శ్రీకాకుళం నగరంలోని ముఖ్యకూడళ్ళలో భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసారు. థీయేటర్ బయట కూడా సినిమా పోస్టర్లతో పాటు స్థానికులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు అందరిని ఆకట్టుకున్నాయి.


మంచి సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారు : నిర్మాత కిరణ్ కుమార్

కథ బాగుంటే మంచి సినిమాను ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తారని భలే ఉన్నాడే చిత్ర నిర్మాత కిరణ్ కుమార్ అన్నారు. విభిన్న కథాంశంతో రాజ్ తరుణ్ ,మనీషా కంద్కూర్ జంటగా తెరకెక్కించిన సినిమా విజయవంతం కావడం ఆనందంగా ఉందన్నారు. ప్రముఖ దర్శకుడు మారుతీ సమర్పణలో దర్శకుడు జె.శివ సాయి వర్థన్ ఎంతో బాగా సినిమాను మలిచారన్నారు. శేఖర్ చంద్ర చక్కనైన సంగీతాన్ని అందించారన్నారు. నగేష్ బానెల్లా అద్భుతంగా ఛాయా గ్రహణం చేసారన్నారు. ఈ సినిమాలో అందరు నటీనటులు వారి పాత్రలకి న్యాయం చేసారన్నారు. భలే ఉన్నాడే సినిమా విజయవంతం కావడం వెనుక అందరి కృషి ఉందన్నారు. ఈ కృషిలో భాగస్వామ్యులైన వారందరికి నిర్మాత కిరణ్ కుమార్ కృతజ్ఞతలను తెలియజేసారు.

تعليقات


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page