top of page

సుందర్ పిచైలు ఇక్కడికెందుకు రారు?

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Apr 21
  • 3 min read

ప్రపంచవ్యాప్తంగా టెక్ దిగ్గజ సంస్థలను నడిపించే భారతీయ మేధావులు ఒకవైపు కనిపిస్తుంటే, అదే స్థాయి ప్రతిభ ఉన్న లక్షలాది మంది భారతీయులు సొంత దేశంలో గూగుల్ వంటి సంస్థలను ఎందుకు నిర్మించలేకపోతున్నారు? ప్రపంచపు అతిపెద్ద ఐటీ దిగ్గజాలకు భారతీయులే సారథులు. సుందర్ పిచైలు, సత్య నాదెళ్లలు ప్రపంచ స్థాయి సంస్థలను నడిపిస్తున్నారు. మరి, అటువంటి మేధావులు సొంత గడ్డపై ఎందుకు గూగుల్ వంటి సామ్రాజ్యాలను నిర్మించలేకపోతున్నారు? ఈ ప్రశ్న వెనుక కేవలం మూలధన కొరత మాత్రమే లేదు, అంతకు మించి ప్రభుత్వ విధానాల భయం, సంక్లిష్టమైన పన్ను వ్యవస్థ, మనస్తత్వాల్లోని లోపాలు ఉన్నాయి. ప్రభుత్వం అంటే ఒక ఒక తల్లీతండ్రిగా భావించే మనస్తత్వం నుంచి భారతీయులు బయటపడాలి. ఏదైనా శక్తివంతమైన పని చేస్తే ప్రభుత్వం తమ వెనుక పడుతుందనే భయం ఉంది. ఈ భయం ఉన్న చోట సృజనాత్మకత చచ్చిపోతుంది. పారిశ్రామికవేత్తలకు భద్రత లేని దేశంలో కొత్త ఆవిష్కరణలు పుట్టడం కష్టం. ప్రస్తుత భారతీయ ఆదాయపు పన్ను చట్టాల వల్ల మళ్లీ ఇందిరాగాంధీ కాలం నాటి పన్నుల స్థాయికి చేరుకుంటున్నాం. 98% పన్నులు ఉన్న కాలంలో ప్రజలు ప్రభుత్వానికి బానిసలుగా మారారు, అది ఆర్థిక వ్యవస్థను కుంటుపడేలా చేసింది. ఇప్ప్పుడు జిఎస్‌టి, ఆదాయపు పన్ను, కార్పొరేషన్ పన్ను కలిపి చూస్తే సామాన్యుడిపై, వ్యాపారులపై భారం మోయలేనంతగా ఉంది. గోధుమలు, మొబైల్ ఫోన్లు ఇలా దేనికైనా సరే 10% ఒకే రేటు (ఫ్లాట్ రేట్) పన్ను ఉండాలి. పన్ను రేట్లు భిన్నంగా ఉండటం వల్లే వర్గీకరణ వివాదాలు వస్తున్నాయి, దీనివల్ల వ్యాపారవేత్తలు ప్రభుత్వంతో అనవసరమైన ‘లైసెన్స్ రాజ’ యుద్ధం చేయాల్సి వస్తోంది. 1991 నుంచి 2011 వరకు భారతదేశం సాధించిన వృద్ధికి పాపులిజం కారణం కాదు. అది ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించడం వల్లే జరిగింది. భారతదేశంలో పన్నులు తగ్గాలి, వ్యాపార స్వేచ్ఛ పెరగాలి. ఆర్థిక శాస్త్రంలో ‘లాఫర్ కర్వ’ అనేది పన్ను రేట్లకు, ప్రభుత్వ ఆదాయానికి మధ్య గల సంబంధాన్ని వివరిస్తుంది. పన్ను రేట్లు మరీ ఎక్కువగా ఉంటే, ప్రజలు పన్ను ఎగవేతకు మొగ్గు చూపుతారు లేదా పని చేయడానికి తక్కువ ఆసక్తిని చూపుతారు. దీనివల్ల ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం కూడా తగ్గుతుంది. ఒక ఆదర్శవంతమైన వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) వ్యవస్థలో ‘ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట’ (ఐటీసీ) అనేది వెన్నెముక వంటిది. మనం కొన్న ముడిసరుకుపై చెల్లించిన పన్నును, అమ్మే వస్తువుపై చెల్లించే పన్ను నుంచి మినహాయించుకోవడం దీని ముఖ్య ఉద్దేశ్యం. కానీ ప్రభుత్వం ఆ మినహాయింపులను నిలిపివేసినప్పుడు, అది పన్నుపై పన్నుకి దారితీస్తుంది. ఇది వస్తువు ధరను పెంచడమే కాకుండా, పారిశ్రామికవేత్తల కార్యనిర్వాహక మూలధనాన్ని దెబ్బతీస్తుంది. పన్ను స్లాబులు పెరిగేకొద్దీ, ‘ట్యాక్స్ ఆర్బిట్రేజ’ పెరుగుతుంది. అంటే, పన్ను ఆదా కోసం ప్రజలు అడ్డదారులు వెతకడం. 10% ఫ్లాట్ టాక్స్ వల్ల ప్రభుత్వానికి పన్ను వసూలు చేసే భారం తగ్గుతుంది. తక్కువ పన్ను రేటు ఉన్నప్పుడు పన్ను చెల్లించే వారి సంఖ్య స్వచ్ఛందంగా పెరుగుతుంది. టెక్నికల్‌గా చెప్పాలంటే, భారతదేశం ప్రస్తుతం ‘అధిక పన్ను - అధిక నియంత్రణ’ ఉచ్చులో ఉంది. దీనివల్ల ప్రైవేట్ పెట్టుబడులు ఆశించిన స్థాయిలో రావడం లేదు. ‘ఆదాయపు పన్ను దాడులు అనాగరికం’ అనే జశ్వంత్ సింగ్ కాలం నాటి విశ్వాసాన్ని మళ్లీ తీసుకురావాలి. పన్ను వ్యవస్థ అనేది కేవలం ప్రభుత్వ ఆదాయ వనరు మాత్రమే కాదు, అది ఆర్థిక వ్యవస్థలో ‘ప్రేరణ’ని కలిగించే సాధనం కావాలి. ఎప్పుడైతే పన్ను వ్యవస్థ సరళంగా, పారదర్శకంగా ఉంటుందో, అప్పుడే భారతీయులు ప్రపంచ స్థాయి సంస్థలను నిర్మించే ‘స్వేచ్ఛ’ను అనుభవించగలరు.

ఇందిరా గాంధీ ఒక పాపులిస్ట్. పాపులిజం అంటే పేద ప్రజల కోపాన్ని పెంచి, దానిని దేశంలోని ఉన్నత వర్గాలపై మళ్లించడం. విజయం సాధించిన వారిని, మేధావులను ద్వేషించడమే పాపులిజం. ఇందిరా గాంధీ కాలంలో గరిష్ట ఆదాయపు పన్ను రేటు 98% ఉండేది. అంటే మనం మన కోసం కాకుండా ప్రభుత్వం కోసమే పని చేస్తున్నట్టు లెక్క. ఇప్ప్పుడు కూడా పన్ను మీద పన్ను విధానం బీజేపీ ప్రభుత్వం అనుసరించడం చూస్తుంటే.. మన కడుపు కోసం కాక ప్రభుత్వం బొజ్జ నింపడానికి పని చేస్తున్నట్టు మారింది. అందుకే ఇక్కడ సుందర్ పిచాయ్‌లు, సత్యా నాదెళ్ల వంటివారు గూగుల్ మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలు పెట్టరు. అంతెందుకు? మనదగ్గర ఇంజినీరింగ్ గ్రాడ్యుయేషన్ చేసి ఎంఎస్ కోసం వలసపోతున్న మన పిల్లలు ఎంతమంది మళ్లీ మన దేశంలో అడుగు పెడుతున్నారు? ఇందుకు కారణం విదేశాల్లో క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉండటం మాత్రమే కాదు.. అంతకు మించి అక్కడ స్వేచ్ఛ లేదు. అయినా కూడా అక్కడే స్టార్టప్‌లు పెడుతున్నారు. లేదా ఉద్యోగాలు చేస్తున్నారు. కారణం.. ఇక్కడ సంపాదిస్తే, అందులో సగానికి పైగా ప్రభుత్వానికి పన్నులు చెల్లించడానికే సరిపోతుంది. ఈ పన్నులే మన ఔత్సాహికుల ప్రోత్సాహాన్ని నాశనం చేస్తుంది. నిబంధనలు లేకపోవడం, చట్టం సరిగ్గా అమలు కాకపోవడం సృజనాత్మకతకు పెద్ద అడ్డంకి. ప్రభుత్వం ఎప్పుడు మీ వ్యాపారాన్ని మూసివేస్తుందో తెలియదు. ఇది భారతదేశంలో చాలా మందికి జరిగింది. జిఎస్‌టి విషయానికి వస్తే, మనం పన్నులను తగ్గించాలి. జిఎస్‌టిని డిజైన్ చేసినప్ప్పుడు దాని లక్ష్యం వేరు. ఇప్పుడు జరుగుతున్నది వేరు. ఇది పాత తరహా ఎక్సైజ్ పన్నులా తయారైంది. జశ్వంత్ సింగ్ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు, ‘ఆదాయపు పన్ను దాడులు అనాగరికం’ అని అన్నారు. ఆ కాలంలో దాడులు ఆగిపోయాయి. దేశంలో నమ్మకం పెరిగింది. 1991 నుండి 2011 వరకు భారతదేశం అద్భుతమైన వృద్ధిని సాధించింది. పన్నులు వసూలు చేయడం కోసం అనేక నిబంధనలు విధించడం వల్ల దాన్ని ఎగ్గొట్టే ప్రయత్నాలు కూడా అలాగే చేస్తున్నారు. ఎందుకంటే.. మనం చేసే వ్యాపారం, తీసుకునే జీతం ప్రభుత్వానికి పోషించడానికి కాదన్నది ఇక్కడ మౌలిక ప్రశ్న. ఎప్ప్పుడైతే సగటు వ్యాపారిని పన్ను ఎగ్గొట్టే మోసకారిగా చూస్తున్నారో, అప్ప్పుడే ఇక్కడ పెట్టుబడులు లేకుండాపోతున్నాయి.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page