top of page

సీదిరి అరెస్టులో చట్టం ఎంత? రాజకీయం ఎంత?

  • Writer: Prasad Satyam
    Prasad Satyam
  • Jul 23
  • 3 min read
  • BNS 105 చుట్టూ ముదురుతున్న వివాదం

  • పలాస పోలీస్‌స్టేషన్‌లో ఇంకా కొనసాగుతున్న హైడ్రామా

  • మంత్రిగా ఉన్నప్ప్పుడు శిరీషను వేధించిందీ తక్కువేం కాదు

  • త్యాడీ పేరుతో కేసు ముగింపు నుంచి సీసీటీవీ ఫుటేజ్ లీక్ నిజాలు తేలేది కోర్టులోనే!

(సత్యంన్యూస్, పలాస)

మాజీమంత్రి సీదిరి అప్పలరాజును అరెస్ట్ చేసిన తర్వాత కూడా పలాస పోలీస్‌స్టేషన్‌లో ఇంకా హైడ్రామా కొనసాగుతోంది. బుధవారం రాత్రి 7 గంటలకు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించిన తర్వాత గురువారం మధ్యాహ్నం 3.30 గంటల వరకు ఆయన్ను విచారిస్తున్నట్లు పోలీసులు పేర్కొంటూ పరిసర ప్రాంతాల్లోకి ఎవర్నీ అనుమతించలేదు. అప్పలరాజు పెద్ద కొడుకు ఆరవ్ వర్మ పది రోజుల క్రితం పలాస జాతీయ రహదారిపై చేసిన యాక్సిడెంట్‌లో సాక్ష్యాలు తారుమారు చేయడానికి అప్పలరాజు ప్రయత్నించారన్న అభియోగంతో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో తండ్రీకొడుకులిద్దరి మీద భారత న్యాయసంహిత (BNS)లో సెక్షన్ 105 కింద ఎఫఐఆర్ నమోదైనట్లు గురువారం ఆంధ్రజ్యోతి పేర్కొంది. అప్పలరాజు అరెస్టు, ఆయన తనయుడు రిమాండు వంటి అంశాలపై కంటే సెక్షన్ 105నే వైకాపా వర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. పాత ఐపీసీ 304 సెక్షన్ స్థానంలో వచ్చిన BNSలో 105 ప్రకారం మానవ హననానికి పాల్పడితే ఈ సెక్షన్‌ను వర్తింపజేస్తారు. ఇందులో పదేళ్ల వరకు జైలుశిక్ష పడే అవకాశం ఉన్నందున స్టేషన్ బెయిల్ ఇచ్చే అవకాశం లేదు. అదే సమయంలో పోలీసులు కూడా వారెంట్ లేకుండా అరెస్టు చేయొచ్చు. నాన్ బెయిలబుల్ కేసు కావడంతో కోర్టుకు వెళ్లినా అప్పలరాజుకు అందుకే ఉపశమనం లభించలేదు.

సిద్ధార్థ త్యాడి అనే యువకుడికి చెందిన వాహనాన్ని నడుపుతూ అప్పలరాజు తనయుడు ఆరవవర్మ గొర్రెల కాపరి దానయ్యను ఢీకొట్టడంతో స్పాట్‌లోనే దానయ్య మరణించిన తర్వాత ఈ కేసు అనేక మలుపులు తీసుకుంది. అయితే ఇందులో తెలుగుదేశం పార్టీగాని, లేదూ సోషల్‌మీడియా గాని చెబుతున్నట్టు అనేక అప్పలరాజు వైపు నుంచి అనేక తప్ప్పులు జరిగివుండొచ్చు. అయితే ఇందులో ఉద్దేశపూర్వకంగా దానయ్య మృతికి అటు అప్పలరాజు తనయుడు గాని, ఇటు సీదిరి అప్పలరాజు గాని ఎలా కారకులవుతారో భవిష్యత్తులో న్యాయస్థానంలో ఎస్టాబ్లిష్ చేయడంలో ఏమేరకు అందరికీ తెలుసు. ఇక్కడ యాక్సిడెంట్ జరిగిన మాట వాస్తవం. దానయ్య చనిపోవడం అంతకు మించిన వాస్తవం. ప్రమాదానికి కారకుడైన కొడుకును అప్పలరాజు ఆసుపత్రికి పట్టుకెళ్లి చికిత్స చేయించడం అందరికీ తెలిసిన నిజం. ఇంతవరకు ఎవరూ కాదనలేరు. కాకపోతే బైక్ యజమాని సిద్ధార్థ్ త్యాడి ఈ ప్రమాదానికి కారకుడని పోలీసులు ఆయన్ను స్టేషన్‌కు తీసుకువెళ్లడం, రోడ్డు ప్రమాదం కింద కేసు నమోదు చేసి స్టేషన్ బెయిల్‌పై విడిచిపెట్టడంపై ఇప్పటికే టీడీపీ శ్రేణులు మాట్లాడాయి. బహుశా అందుకే అక్కడ ఎసఐలు, సీఐలు ఇద్దర్నీ వీఆర్‌కు పంపించారు. రోడ్డు ప్రమాదం జరిపింది అప్పలరాజు తనయుడేనని సీసీ ఫుటేజ్‌ల ద్వారా బయటకు వచ్చేలా చేసింది టీడీపీ నాయకులే.. తప్ప్పులేదు. అయితే ఇందులో కావాలనే దానయ్యను బండితో గుద్ది చంపేశారనడానికి ఉన్న ఆధారాలేమిటనేదే వైకాపా నాయకులు అడుగుతున్న ప్రశ్న. అలాగే కొడుకును ఆసుపత్రికి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించారు తప్ప సంఘటన స్థలంలో ప్రమాదం జరిగిందన్న ఆనవాలు చెరిపేయడం గాని, సీసీ టీవీ ఫుటేజ్‌ను డెలిట్ చేయించడం గాని అప్పలరాజు చేశారా? అంటే సమాధానం చెప్పేవారు అక్కడ లేరు. కొడుకుకు ట్రీట్మెంట్ ఇప్పించి, ఊరు దాటించే ప్రయత్నం చేశారంటున్నారే తప్ప దానయ్యను చంపాల్సిన అవసరం ఎందుకొచ్చిందో ఎవరూ చెప్పడంలేదు. ఇక అప్పýరాజు తనయుడు స్థానంలో సిద్ధార్థ్ త్యాడీ అనే యువకుడ్ని బలి తీసుకుందామని చూశారన్న వాదన బలంగా వినిపిస్తోంది. అసలు ప్రమాదం చేసిన వాహనం సిద్ధార్థ్ త్యాడీ పేరు మీదే ఉంది. త్యాడీ తండ్రి అప్పలరాజు గూటిలో ఉన్న పక్షి. సాధారణంగా రోడ్డు ప్రమాదాలు జరిగినప్ప్పుడు సీబుక్, లైసెన్స్ ఉన్నవారి పేరుతో కేసు నమోదైతేనే ఇన్సూరెన్స్ వస్తుంది. బహుశా పోలీసులు మొదట్లో ఆ కోణంలోనే త్యాడీ మీద కేసు నమోదుచేసి, అన్ని యాక్సిడెంట్ కేసుల్లాగే స్టేషన్ బెయిల్ ఇచ్చేశారు. దీనికి తోడు స్వయంగా తెలుగుదేశం నాయకులే చనిపోయిన దానయ్య కుటుంబానికి, రోడ్డు యాక్సిడెంట్ తానే చేశారంటూ స్టేషన్‌కు వెళ్లిన సిద్ధార్థ్ త్యాడి మధ్య సొమ్ములు ముట్టజెప్పే ఒక అగ్రిమెంట్‌ను కుదుర్చారు. దీంతో ఈ కేసు అక్కడితో ముగిసిపోయిందనుకున్నారు పోలీసులు. కానీ ఎప్ప్పుడైతే అప్పలరాజు కొడుకు దీనికి కారకుడని తెలిసిందో ఈ కేసు మామÖలు టర్న్ తీసుకోలేదు. ఒప్పందం కుదిర్చిన పెద్దలే కులానికి నేతృత్వం వహిస్తూ ర్యాలీలు తీశారు. అప్పలరాజు కొడుకును రిమాండ్‌కు పంపిన తర్వాత సీదిరిని కూడా ఎలా లోపలేయాలన్నదానిపై రాజకీయ చదరంగంలో పావులు చకచకా కదిలాయి.

రోడ్డు ప్రమాదంలో దానయ్య చనిపోవడానికి కారణం సిద్ధార్థ్ త్యాడీ కాదని, సీదిరి తనయుడు ఆరవ్ వర్మ కారకుడని పోలీసులు అప్పలరాజుకు చెప్పివుంటే ఆ తర్వాత కూడా కొడుకును తప్పించడానికి సీదిరి ప్రయత్నాలు చేసి త్యాడీని ఇరికించివుంటే కచ్చితంగా అది క్రైమ్. లేదూ దానయ్య మరణాన్ని దాచేసి అసలు అటువంటిది జరగలేదని బుకాయిస్తే అది ఇంకా పెద్ద నేరం. కానీ ఆరవ్ ఫోన్ నుంచే సంఘటన స్థలం నుంచి 108కు ఫోన్ వెళ్లింది. ఇక సీసీ టీవీలు ప్రైవేట్ వ్యక్తులవే అయినా అందులో ఫుటేజ్ ఏమాత్రం పోలేదు. ఇందులో హత్య కోణం ఎక్కడుందో అర్థం కావడంలేదు. అక్కుపల్లి జంక్షన్‌లో శ్రీనివాస ఫిల్లింగ్ స్టేషన్ నుంచి జులై 10న రాత్రి 9.30 గంటల ప్రాంతంలో తీసిన ఫుటేజ్ మేరకు బండి డ్రైవింగ్ సీటులో ఉన్నది ఆరవ్ వర్మ. అప్పలరాజు మంత్రిగా ఉన్నప్ప్పుడు పలాస నియోజకవర్గంలో తెలుగుదేశం శ్రేణులు సఖ్యంగానే ఉన్నాయి. గౌతు కుటుంబాన్ని నమ్ముకున్న కొందరు తప్ప మిగిలినవారు ఆయన ప్రాపకం కోసం తహతహలాడారు. చాలామంది పార్టీ మారి పనులు చేయించుకుంటే, కొందరు పార్టీలో ఉంటూనే ఆయన్నుంచి లబ్ధి పొందారు. దీంతో పలాసలో టీడీపీ ఉండదన్న భావనతో గౌతు శిరీషను వైకాపా తీవ్రంగా వేధించింది. ఒక మహిళ అని కూడా చూడకుండా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేశారు. అయినదానికి, కానిదానికి పలాసలో శాంతిభద్రతల సమస్య సృష్టించేవారు. ఇప్ప్పుడు దానికి సమాధానం అప్పలరాజుకు ఇలా దొరికిందని భావించాలి. అప్పలరాజు తనయుడికి ఎలఎలఆర్ మాత్రమే ఉంది. ఇంక పూర్తిస్థాయి లైసెన్స్ రాలేదు. ఈ కోణంలో ఆయనకు బెయిల్ వచ్చి ఉండకపోవచ్చు. ఇక ర్యాష్ డ్రైవింగ్ చేశాడా? లేదా? అనేది పోలీసులు నిర్ధారించాలి.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page