సినిమా దందాకు.. ప్రజలకెందుకు అవస్థలు ..?!
- Guest Writer
- Aug 11
- 2 min read

సినిమాలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డిని ఎవరో గానీ తప్పుదోవలో తీసుకుపోతున్నట్టుగా కనిపిస్తోంది. తన ధోరణి నుంచి యూటర్న్ తీసుకోవడం వెనుక ఎవరి ప్రభావం ఉందో గానీ మామూలు జనానికి మాత్రం నచ్చని పంథాకు మళ్లింది ప్రభుత్వ విధానం.
ఇక్కడ బతుకుతూ, ఇక్కడి నుంచే ప్రేక్షకులను దోచుకుంటూ, ఇక్కడి సీఎం పేరు తెలియనట్టు బహిరంగంగా, ఆఫ్టరాల్ తెలియాల్సిన అవసరమే లేదన్నట్టు నటించిన ఓ బన్నీని అరెస్టు చేయడం గానీ, సుద్దపూసలా నటిస్తూ ప్రభుత్వ భూమిని కబ్జా చేసి కట్టిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేయడం గానీ, ఈ సినిమావాళ్ల ప్రభావం పడని ప్రజా ముఖ్యమంత్రిగా పేరొచ్చింది.
అల్లు అర్జున్‌ను పరామర్శించడానికి మొత్తం టాలీవుడ్ తన ఇంటికి క్యూ కట్టడం ఒకరకంగా రేవంత్ రెడ్డిని ఆక్షేపించడం.. అది ఎందుకో మరిచిపోయినట్టున్నాడు సీఎం.
సినిమా కుటుంబానికి చెందిన చంద్రబాబుకు చేతకాకపోయినా పదేళ్ల సినిమాలను గుర్తించి, గద్దర్ అవార్డులు ఇచ్చి, సినిమా రంగానికి మరో పాజిటివ్ కోణాన్నీ చూపించాడు. సంధ్య థియేటర్ తొక్కిసలాట తరువాత నో బెనిఫిట్ షోస్, నో ప్రిరిలీజ్ ఫంక్షన్స్, నోమోర్ టికెట్ రేట్స్ హైక్, నో అడిషనల్ షోస్ అనే విధానం తీసుకున్నారు. జనం హర్షించారు.
కానీ ఏమైంది..? మళ్లీ అదే పాత పంథాకు వెళ్లిపోయింది ప్రభుత్వం. అన్నీ మళ్లీ ప్రవేశించాయి. అసలు టికెట్ల రేట్ల పెంపు అనేదే దుర్మార్గం.. దానికి సినిమావాళ్లు చూపించే నిర్మాణ వ్యయాలు పెద్ద బోగస్ యవ్వారం. పైగా దోపిడీ కోసం బెనిఫిట్ షోస్, అదనపు షోస్.. ఇక ప్రిరిలీజ్ ఫంక్షన్లు దేనికి..? ఎవరిని ఉద్దరించడానికి..?
అది పక్కా వ్యాపారం. తమ సినిమాలకు హైప్ క్రియేట్ చేయడం కోసం ఓటీటీ, శాటిలైట్, ఓవర్సీస్ రైట్స్ రేట్లను అడ్డగోలుగా పెంచుకోవడం కోసం ఉద్దేశించిన మార్కెటింగ్ టెక్నిక్. వాడు వీడిని పొగుడుతాడు, వీడు వాడిని పొగుడుతాడు. టీమ్ మొత్తం స్వకుచమర్దనం. దీనికి ఫ్యాన్స్ పేరిట హంగామా, హడావుడి, సొసైటీకి అదనపు నష్టం. ఈ ఖర్చులన్నీ మళ్లీ ప్రేక్షకుడే భరించాలి.
ఇప్పుడు చూడండి.. వార్-2 సినిమా వార్త.. యూసుఫ్‌గూడ బెటాలియన్ పోలీస్ లైన్స్‌లో ప్రిరిలీజ్ అట.. పలుచోట్ల వాహనాల డైవర్షన్ అట.. పార్కింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు అట.. ఏదో ప్రైవేటు సినిమా దందాకు భారీగా పోలీసుల మొహరింపు దేనికి..? ప్రజలకు ఈ మళ్లింపు అవస్థలు దేనికి..? అసలే అత్యంత భారీ వర్షాలు అని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. చినుకు కురిస్తే చాలు నగరం స్థంభించిపోతోంది. మరి ఎందుకీ పర్మిషన్..? ఎవరి సంపాదనకో ప్రభుత్వాలు ఎందుకు సాగిలబడాలి..?
హిందీ సినిమాలను ఎవడూ దేకడం లేదు. అందుకని సౌత్ మార్కెట్ కోసం జూనియర్ ఎన్టీయార్ కావాలి. పాన్ ఇండియా పేరు పెట్టాలి. చిత్రపరిశ్రమను ఏపీకి తరలిస్తాం అనే బెదిరింపులు ఏమైనా పనిచేస్తున్నాయా ప్రభుత్వం మీద.., నవ్వొచ్చే విషయం.
ఇదే ఇండస్ట్రీ జగన్‌ను ఎలా చూసిందో చూశాం, సినిమా కుటుంబాలు ఏపీకి చిరకాలం పాలించవు. మళ్లీ ఎవరో వస్తారు..? ఐనా అబ్రకదబ్ర అనగానే ఇండస్ట్రీ ఎటూ తరలిపోదు. పైగా హైదరాబాదులో ఉండటానికి అలవాటైనవాడు అస్సలు దీన్ని విడిచిపెట్టడు. అమరావతి వాతావరణం అక్కరకు రాదు. వైజాగులో సాధ్యం కాదు. హైదరాబాదే దిక్కు.
ముంబైలో మరాఠీ గోల, బెంగుళూరులో కన్నడ దాష్టికం, చెన్నైలో అరవ పెత్తనం.. అలాంటివేమీ లేకుండా అందరినీ అక్కున చేర్చుకునేది హైదరాబాద్ ఒక్కటే.. వేరే భాషలు, వేరే సంస్కృతులు జానేదేవ్.. మరెందుకు ప్రభుత్వం మళ్లీ మళ్లీ ఇలా సాగిలబడటం..?!
- ముచ్చట సౌజన్యంతో...
ఆమె కోసమే.. జనం ఎగబడ్డ రోజులుండేవి!

శృంగార కావ్యాలలో రాసిన స్త్రీ సౌందర్యానికి, శరీర లావణ్యానికి సరైన కొలబద్దలా ఉండేది జ్యోతిలక్ష్మి. జ్యోతిలక్ష్మి ఆట, ఎల్లారీశ్వరి పాట, రాజబాబు కామెడీ ఒక జమానాలో తెలుగు సినిమాని ఊపేశాయి. అప్పట్లో హండ్రెడ్ డేస్ ఆడిన ప్రతి మూడు సినిమాల్లో రెండు వీళ్ల మూలానే ఆడాయంటే నమ్మరు. అంత పాపులారిటీ సంపాదించారు. పిల్లా? పిడుగా?’, ‘మొనగాడొస్తున్నాడు జాగ్రత్త!’, ‘గుండెలు తీసిన మొనగాడు’ వంటి కొన్ని కౌబాయ్, అడ్వంచరస్ చిత్రాల్లో హీరోయిన్‌గా కూడా నటించింది. మొత్తం మీద ఇరవై చిత్రాల్లో హీరోయిన్‌గా నటించగా, తమిళంలోనే పది సినిమాలలో లీడ్ రోలు పోషించింది. ‘మోసగాళ్లకు మోసగాడు’ సినిమాలో వ్యాంప్ క్యారెక్టర్ వేసి హీరోయిన్ విజయనిర్మల కంటే ఎక్కువ మార్కులే కొట్టేసింది. ‘మొనగాడొస్తున్నాడు జాగ్రత్త!’ సినిమాకి ఎల్లారీశ్వరి సింగిల్ కార్డ్ గాయని. హీరో కృష్ణ సహా మరొకరికి పాటే లేదు!
శాస్తీయ నృత్యంలో ఆరితేరిన జ్యోతిలక్ష్మి..’’ఇదా లోకం?(1973)’’ సినిమాలో ‘‘గుడి ఎనక నా సామి గుర్రమెక్కి కూకున్నాడు’’ పాటలో అటు శాస్త్రీయాన్ని, ఇటు పక్కా మాస్ స్టెప్పుల్ని వేసి ప్రేక్షకుల్ని గిలిగింతలు పెట్టింది. ఎన్టీఆర్, ఏఎన్‌ఆర్, కృష్ణ, శోభన్‌బాబు%ౌ% ఇలా హీరోలు ఎవరైనా.. వాణిశ్రీ, కాంచన, మంజుల, భారతి వగైరా అందాల తారలు ఉన్నా జ్యోతి లక్ష్మి ఆట-పాట ఉండాల్సిందే! కేవలం జ్యోతిలక్ష్మి పాట కోసమే సినిమాలకు వెళ్లే జనం ఉండేవారట! బొబ్బిలి పులి(1983) నాటికే ఈమె రిటైరయ్యింది.
- మణిభూషణ్










Comments