
డానీ డెంజోగ్పా.. హిందీ సినిమాలే కాదు.. తెలుగులోనూ విలన్ గా అలరించిన నటుడు. అగ్నిపథ్, క్రాంతివీర్, ఘాతక్ వంటి సినిమాల్లో ప్రభావవంతమైన పాత్రలతో బాగా పేరు తెచ్చుకున్న యాక్టర్. అంతం, రోబో వంటి పలు తెలుగు సినిమాల్లోనూ నటించిన డ్యానీ విలన్ గా ఎంత సుపరిచితుడో.. బీర్ల వ్యాపారిగా మాత్రం చాలామందికి అపరిచితుడు.
1987లో డానీ తన స్వస్థలమైన యుక్సమ్ పేరుతోనే.. సిక్కింలో మొట్టమొదట యుక్సమ్ బ్రూవరీస్ ప్రారంభించాడు. జస్ట్ బీర్ ఫ్యాక్టరీ నెలకొల్పడమే కాదు.. దాన్ని ఇండియాలో నంబర్ 3 పొజిషన్ కు తీసుకొచ్చిన వ్యాపారి, నేర్పరి డానీ.
బాలీవుడ్ స్టార్ డమ్ నుంచి బ్రూవరీస్ వ్యాపారిగా!
1971లో జరూరత్ సినిమాతో బాలీవుడ్ రంగప్రవేశం చేసిన డానీ.. లవ్ స్టోరీ, ఖుదాగవా వంటి సినిమాల విజయాలతో మంచి పేరు సంపాదించుకున్నాడు. ఓవైపు వెండితెరపై విలన్ గా అలరిస్తున్న సమయంలోనే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవానుకున్నాడు. అలా తాను మంచి బూమ్ లో ఉన్న కాలంలోనే బ్రూవరీస్ వైపు అడుగులేశాడు. వ్యాపారిగా ఎదిగేందుకు 1987లో యుక్సమ్ బ్రూవరీస్ పరిశ్రమను నెలకొల్పి.. సిక్కిం స్థానిక అభిరుచులకు అనుగుణంగా బీర్లను తయారుచేశాడు. డాన్స్ బర్గ్ 16000, జూమ్, హిమాలయన్ బ్లూ వంటి 11 విభిన్న బ్రాండ్స్ తో బీర్ మార్కెట్ లోకి ఎంటరయ్యాడు. అనతికాలంలోనే ఈశాన్యరాష్ట్రాల్లోని మార్కెట్ ను శాసించే స్థాయికి ఎదిగాడు.
ఈశాన్య మార్కెట్ లో ఆధిపత్యం, విస్తరణ!
2005లో డానీ ఒడిశాలో డెంజాంగ్ బ్రూవరీస్‌ను స్థాపించాడు. అలా తన కార్యకలాపాలను విస్తరించాడు. 2009 నాటికి ఈశాన్య బీర్ మార్కెట్ ను తన యుక్సమ్ బ్రూవరీస్ వైపు పూర్తిగా ఆకర్షించి లాభదాయక వ్యాపారంగా మార్చేశాడు. అప్పటికే భారతదేశంలో విజయమాల్యా యునైటెడ్ బ్రూవరీస్ హవా నడుస్తున్న రోజులవి. అస్సాంలోని రైనో ఏజన్సీని కూడా కొనుగోలు చేసి.. ఈశాన్య మార్కెట్ లోకి కూడా విజయ్ మాల్యా ప్రవేశించాలని ప్రయత్నించాడు. కానీ, సినిమాల్లో అప్పటికే తెలివైన విలన్ గా నటిస్తున్న డానీ%ౌ% అంతకుముందే ఆ విషయాన్ని తెలుసుకుని విజయ్ మాల్యా ఒప్పందాల కంటే ముందే అప్రమత్తమయ్యాడు. తానే రైనో ఏజెన్సీని కొని%ౌ% ఈశాన్య రాష్ట్రాల్లో యునైటెడ్ బ్రూవరీస్ అడుగు పెట్టకుండా చేసి నిజ జీవితంలోనూ తన విలనీ చేష్టలతో బీర్ మార్కెట్ లో రారాజైనాడు. విలన్ కాస్తా ఏకఛత్రాధిపత్యం సాగించే హీరో అయిపోయి కూర్చున్నాడు.
దాంతో ఈశాన్య రాష్ట్రాల్లో డానీ యుక్సమ్ బ్రూవరీస్ ఓ తిరుగులేని శక్తిగా ఎదిగింది. యుక్సమ్ బీర్స్ స్థానాన్ని సుస్ధిరం చేసింది. బీర్ల పరిశ్రమలో తనకెదురెవ్వరూ పోటీలో లేకుండా చేసింది.
ఆర్థిక వ్యవస్థకూ ఆలంబనగా!
సిక్కిం వంటి ఈశాన్య రాష్ట్రంలో అక్కడి ఆర్థిక వ్యవస్థకూ యుక్సమ్ బ్రూవరీస్ తోడ్పాటైంది. సిక్కిం ఎక్స్ ప్రెస్ 2022 నివేదిక ప్రకారం 250 మందికి ఉపాధి కల్పించడంతో పాటు, ఏటా వంద కోట్ల రూపాయల ఉత్పత్తితో ఆర్థికవ్యవస్థలో వెన్నుదన్నుగా నిల్చింది. కంపెనీ వ్యాపార నమూనా.. డానీ సంస్థ సంపద స్థిరంగా పెరగడానికీ.. అలాగే, స్థానిక సమాజానికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి కల్పనకు ఉపయోగపడిరది.
వైవిధ్యమైన రకాలతో బ్రూవరీస్ లో విజయం!
యుక్సమ్ బ్రూవరీస్ తీసుకొచ్చిన బీర్లలో హీమ్యాన్ 9000, ఇండియా స్పెషల్ వంటి బీర్లతో స్థానికంగా మద్యంబాబుల అభిరుచికనుగుణంగా మార్కెట్ లోకి విస్తరించింది. ధరల్లో కూడా ఇతర బ్రాండ్స్ తో పోలిస్తే కాస్త అందుబాటులో ఉండటం కూడా డానీ వ్యాపార విస్తరణకు మరింత కలిసివచ్చింది. 6 లక్షల 80 వేల హెక్టోలీటర్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో యూక్సమ్ బ్రూవరీస్ భారతీయ బీర్ కంపెనీల్లో మూడో స్థానంలో నిల్చింది. యుక్సమ్ కంటే ముందు ఉన్నవాటిలో నంబర్ వన్ గా కింగ్ ఫిషర్, రెండో స్థానంలో కిమయ బీర్లు నిల్చాయి.
అయితే, ఓవైపు బ్రూవరీస్ వ్యాపారం ఇంతింతై పెరుగుతూ తీరికలేని సమయంలో కూడా.. డానీ, నటనపై మాత్రం తన ఆసక్తిని కోల్పోలేదు. సినిమాతో సంబంధాన్ని మాత్రం కొనసాగిస్తూ వచ్చాడు. తను బాగా బిజీ ఉన్న సమయంలో కూడా థ్రిల్లర్ మూవీస్ నామ్ షబానా, బేబీ వంటి సినిమాల్లోనూ నటించాడు.
డానీ బహుముఖ ప్రజ్ఞాశాలి. ఓవైపు నటుడిగా, ఇంకోవైపు వ్యాపారిగా కొనసాగుతూనే.. కిషోర్ కుమార్, లతా మంగేష్కర్ వంటి వారితో కలిసి పాటలు కూడా పాడాడు. బ్రాడ్ పిట్ తో కలిసి సెవెన్ ఈయర్స్ ఇన్ టిబెట్ వంటి హాలీవుడ్ సినిమాల్లోనూ నటించాడు. తన ఊరంటే ఉన్న మమకారంతో తన ఊరు పేరే బ్రూవరీస్ కు యుక్సమ్ గా నామకరణం చేసిన డానీ జర్నీ క్వైట్ ఇంట్రెస్టింగ్. దృఢసంకల్పం, వ్యూహాత్మక దృష్టి ఉంటేగనుక బహుళ రంగాల్లో ఎలా రాణించవచ్చో డానీ ప్రయాణం మనకు చెబుతుంది.
యానిమల్‌ని విమర్శించి హీరోని పొగిడారు.. నా సంగతేంటి?
రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలో సందీప్ వంగా తెరకెక్కించిన యానిమల్ సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. రణబీర్ కెరీర్ బెస్ట్ హిట్ చిత్రాన్ని తెలుగు దర్శకుడు సందీప్ వంగా అందించారు. అయితే యానిమల్ సినిమాపై చాలా విమర్శలు వచ్చాయి. సినిమాలో రక్తపాతం హింసను విమర్శించారు. చాలామంది దర్శకుడిని టార్గెట్ చేసారు. ముఖ్యంగా రణబీర్ కి ఇంత పెద్ద హిట్టిచ్చిన సందీప్ ని బాలీవుడ్ లోని కొందరు ప్రత్యేకంగా టార్గెట్ చేయడం చర్చకు వచ్చింది. ఇప్పుడు దర్శకుడు సందీప్ వంగా టోకున అందరికీ తనదైన స్టైల్లో ఇచ్చారు. చిత్ర పరిశ్రమ యానిమల్‌ను విమర్శించి, రణ్‌బీర్ కపూర్‌ను ఎలా ప్రశంసించిందో గుర్తుచేసుకుంటూ బాలీవుడ్‌లో ఉన్న అసమానతను సందీప్ రెడ్డి వంగా ప్రశ్నించారు. యానిమల్ సినిమాను విమర్శించారు.. కానీ రణబీర్ ని పొగిడారు. నాకు రణబీర్ పై అసూయ లేదు, కానీ నాకు ఆ అసమానత అర్థం కాలేదు. వారు (పరిశ్రమలోని వ్యక్తులు) రణబీర్‌తో కలిసి పనిచేయాలని కోరుకుంటున్నారని నేను అర్థం చేసుకున్నాను. పరిశ్రమకు నేను కొత్త. నాపై కామెంట్లు చేయడం సులభం. విమర్శించడం సులువు. ఒక ఫిలింమేకర్ ప్రతి 2-3 సంవత్సరాలకు ఒక సినిమా చేస్తాడు.. కానీ ఒక నటుడు సంవత్సరానికి ఐదుసార్లు సినిమాల్లో కనిపిస్తాడు. స్టార్లు ఎవరితో కలిసి పని చేస్తారో ఎక్కువగా చెప్పరు.. అని అన్నారు. బాలీవుడ్‌లో తనను బయటి వ్యక్తిగా భావిస్తున్నారా? అని ప్రశ్నించగా, సందీప్ వంగా అలాంటిదేమీ లేదని అన్నారు. నేను లోపలి వ్యక్తి.. బయటి వ్యక్తి అనేవి నమ్మను. నేను ఎప్పుడూ బయటి వ్యక్తిగా భావించలేదు. నేను ఇప్పటికే చెప్పినట్లుగా ముఠా తత్వం, అసమానత ఉన్నాయి. అయితే ఇలాంటి పాఠశాలకు కొత్త వ్యక్తి వచ్చినప్పుడు ఇలాగే జరుగుతుందని నేను భావిస్తున్నాను. మీరు కిండర్ గార్టెన్ నుండి అక్కడ చదువుతున్నారు. ఎవరైనా కొత్త వ్యక్తి 10వ తరగతిలో చేరినప్పుడు మీరు సీనియారిటీ ఫీలవుతారు కదా! ఇదీ అలాంటిదేనని అన్నారు. %Aశ్రీంశీ Rవaస% - విడాకుల వార్తలపై స్పందించిన స్టార్ హీరో! కబీర్ సింగ్‌లో తనతో కలిసి పనిచేసిన ఒక నటుడికి ఒక ప్రధాన బాలీవుడ్ నిర్మాణ సంస్థ ఎలా అవకాశం ఇవ్వలేదో కూడా సందీప్ వంగా చెప్పాడు. ఈ పక్షపాతానికి పరిశ్రమను విమర్శించాడు. రణబీర్ కపూర్, త్రిప్తి దిమ్రీ , రష్మిక మందన్న విషయంలోను అలాగే చేయమని ఆ నిర్మాణ సంస్థకు సవాల్ విసిరాడు. సందీప్ వంగా తన నిరాశను వ్యక్తం చేస్తూ, పరిస్థితి చూసి తాను చిరాకు పడ్డానని, బాధపడ్డానని చెప్పాడు. యానిమల్ ఒక యాక్షన్-డ్రామా. హింస, స్త్రీ ద్వేషపూరిత సన్నివేశాల కారణంగా విమర్శలను ఎదుర్కొంది. జావేద్ అక్తర్, కంగనా రనౌత్ వంటి ప్రముఖులు ఈ చిత్రాన్ని బహిరంగంగా విమర్శించారు. అయితే ఎవరు ఎలా విమర్శించినా కానీ, యానిమల్ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. ప్రపంచవ్యాప్తంగా 900 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ చిత్రం ఒక శక్తివంతమైన పారిశ్రామికవేత్త కుమారుడు రణ్‌విజయ్ సింగ్ కథను.. అతడి తండ్రితో సమస్యాత్మక సంబంధాన్ని తెరపై సందీప్ వంగా అద్భుతంగా ఆవిష్కరించారు. కథానాయకుడి తండ్రిపై హత్యాయత్నం తర్వాత ప్రతీకారం కోసం కథానాయకుడు ఎలాంటి విధ్వంశం సృష్టించాడో ఇందులో చూపించారు.
Comments