top of page

సామాన్యుడే.. హీరో!!

  • Guest Writer
  • Mar 18
  • 3 min read


యే ముహూర్తాన రామ్‌ చరణ్‌ రంగస్థలం సినిమా చేశాడో కానీ ఆ రోజు నుంచీ మన తెలుగు హీరోలు సామాన్యుడిని వదలడం లేదు.అడవిలో కట్టెలు కొట్టేవాడు, సముద్రం లో చేపలు పట్టేవాడు, జాతరలో జీళ్ళు అమ్మేవాడు.......ఇలా రెక్కాడితే కానీ డొక్కాడని వారి జీవితాలను కెమెరాలలో బంధించి ఆ చిత్రాను వారీకే బ్లాక్‌ లో అమ్మేస్తున్నారు.

యే మాట కా మాట,కష్టం అంటే ఎలా వుంటుందో తెలియ కుండా పెరిగిన మన నటవారసులు ఆ క్లిష్టమైన పాత్రలను అవలీలగా చేసి పడేస్తున్నారు.అదెంత అవలీలగా అంటే వాళ్ళ తండ్రులు ,తాతలు కంటే వీళ్ళే బాగా నటిస్తున్నారు అన్నంతగా. వీళ్ళు నటులా అనిపించుకున్న వాళ్ళు కూడా వీళ్ళింత నటులా అని మనం ముక్కున వేలేసుకునేలాగా వాళ్ళు ఆ పాత్రలను నటించి పడేస్తున్నారు అంటే దానికి ముఖ్య కారణం వాటి వెనుక వున్న సాంకేతిక నిపుణులు, వారిలో మరీ ముఖ్యంగా వాటి దర్శకులు.మరి అలాంటి ప్రతిభావంతులైన దర్శకులకి సినిమాల్లో బత్తాయిజాన్ని చొప్పించాల్సిన ఖర్మ ఎందుకో నాకు అర్ధం కావడం లేదు.

పెద్ద హీరోల తెలుగు సినిమాని అత్యవసరం అయితే తప్ప

థియేటర్లో చూడకూడదని దిల్‌ రాజు , అల్లు అరవింద్‌ ల మీద ఒట్టు పెట్టుకున్న నేను ఓటీటీ లోకి వచ్చిన తండేల్‌ సినిమాని ఒక గంట చూసాను.నాకు పెద్దగా ఎక్క లేదు.

నేను నాగ చైతన్య స్క్రీన్‌ ప్రెజన్స్‌ ని చాలా ఇష్టపడతాను అలాంటిది నాకు అతని పాత్ర రుచించలేదు.ఇక యే పాత్ర నయినా తెల్లగా తొమీపడేసే డాక్టర్‌ సాయి పల్లవి అయితే ‘‘రాజూ రాజూ’’ అని కలవరించే సైక్రియాటిక్‌ పేషంట్‌ లాగా అనిపించింది.ఇంకా గంట పైన సినిమా వుంది కాబట్టి అది

కూడా చూసేస్తే కానీ ఆ సినిమా మీద పూర్తి అవగాహనకి రాలేను కానీ కథ పాకిస్థాన్‌ చేరాక ఇక చూడలేక కట్టేసాను.

నిన్న రాత్రి.ఇంకో రోజు కాస్త తీరికగా చూస్తాను సినిమాను.

సినిమా ఎలా వున్నా ఈ సినిమా ద్వారా నాకు సంతోషం కలిగించిన విషయం ఏమిటంటే తెలుగు సినిమా నేనిలా వెళ్ళగానే అలా నా వెనుకే గుజరాత్‌ దాకా వచ్చేయడం !!!

రఘు శ్రీమంతుల

విమర్శల నుంచి తప్పించుకోలేకపోతున్న ‘కన్నప్ప’

‘కన్నప్ప’గా ప్రేక్షకుల ముందుకు రావడానికి మంచు విష్ణు రెడీ అవుతున్నాడు. వచ్చే నెల 25వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌ వేగాన్ని పెంచారు. ‘కన్నప్ప’ చరిత్రను ఫారిన్‌ లొకేషన్స్‌ లో చిత్రికరించడమనేది మొదటి నుంచి కూడా చర్చనీయాంశమైంది. ఒక కోయగూడానికి చెందిన మొరటు వ్యక్తిని యుద్ధ వీరుడిగా చూపించడం .. శివుడికి మీసాలు లేకపోవడం .. ప్రభాస్‌ లుక్‌ అయోమయంగా అనిపించడం చాలామందికి అసంతృప్తిని కలిగించింది.

ఈ నేపథ్యంలో వదిలిన ‘శివశివశంకర .. ‘ పాటలో, కన్నప్ప తనకి అందుబాటులో ఎలాంటి పాత్ర లేకపోవడం వలన నోట్లో నీళ్లు పోసుకుని శివలింగాన్ని అభిషేకిస్తాడు. ఆ తరువాత షాట్‌ లోనే మట్టిపాత్రలో దుప్పి మాంసం నైవేద్యం పెట్టినట్టు చూపించడం విస్మయం కలిగించింది. ఇక రీసెంటుగా ‘కన్నప్ప’ నుంచి ‘సగమై చెరిసగమై’ అంటూ సాగే మరో లిరికల్‌ సాంగ్‌ ను వదిలారు. మొదటి పాట మాదిరిగానే ఈ పాట కూడా విమర్శల నుంచి తప్పించుకోలేకపోయింది.

‘‘ కోయగూడానికి చెందిన భార్యాభర్తలు ఆ యాసలోనే పాటలు పాడుకుంటారు .. గతంలో వచ్చిన ‘భక్త కన్నప్ప’లోని పాటలు ఇప్పటికీ నిలిచిపోవడానికి కారణం ఆ సహజత్వమే. కానీ ఈ పాటలో కన్నప్ప పాత్రకి ‘ఇరు పెదవుల శబ్దం .. విరి ముద్దుల యుద్ధం’ అనే ప్రయోగం చేశారు. ఇది ఒక సాధారణ యువతీ యువకులు పాడుకునే పాట మాదిరిగానే ఉందిగానీ, కోయగూడానికి చెందిన ఆలుమగలు పాడుకునే పాటలా లేదనే విమర్శలు గట్టిగానే వినిపిస్తున్నాయి.

-రాజేష్‌ కోత -


అందాల నిధి వెయిటింగ్‌ ఇంకా ఎన్నాళ్లు?

నిధి అగర్వాల్‌ ఇండస్ట్రీలో అడుగు పెట్టి దశాబ్ద కాలం కాబోతున్నా ఇప్పటి వరకు ఈమె చేసిన సినిమాల సంఖ్య చాలా తక్కువ. కొందరు హీరోయిన్స్‌ కెరీర్‌ ఆరంభంలో ఏడాదికి రెండు మూడు అంతకు మించి సినిమాలు చేసిన దాఖలు ఉన్నాయి. కానీ నిధి అగర్వాల్‌ మాత్రం ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న పెద్దగా ఫలితాన్ని పొందలేదు. ఆ సినిమా వల్ల వరుస ఆఫర్లు సొంతం చేసుకోలేక పోయింది. తెలుగులో ఈమె ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తోంది. ఆ రెండు సినిమాల విడుదల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంది. నిధి అగర్వాల్‌తో పాటు ఆమె ఫ్యాన్స్‌ ఆ రెండు సినిమాల విడుదల ఎప్పుడు అని ఆశగా ఎదురు చూస్తున్నారు.

ఈ ముద్దుగుమ్మ 2022 లో చివరగా హీరో, కలగ తలైవన్‌ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమాలు పెద్దగా ఆడకపోవడంతో ఆఫర్లు రాలేదు. కానీ లక్కీగా తెలుగులో ఏకంగా పవన్‌ కళ్యాణ్‌ హీరోగా నటిస్తున్న హరి హర వీరమల్లు సినిమాలో అవకాశం కొట్టేసింది. ఆ సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంటే కచ్చితంగా టాలీవుడ్‌లో వరుసగా పది సినిమా ఆఫర్లు వస్తాయని నిధి అగర్వాల్‌ ఆశ పడుతుంది. కానీ పవన్‌ కళ్యాణ్‌ బిజీ షెడ్యూల్‌ వల్ల దాదాపు మూడు ఏళ్లుగా ఈ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తుంది. ఎప్పటికీ ఈ సినిమా విడుదల అయ్యేది క్లారిటీ లేదు. కానీ మేకర్స్‌ మాత్రం ఈ ఏడాదిలో విడుదల చేస్తామని అంటున్నారు. ఫ్యాన్స్‌ నమ్మకం లేదు దొర అంటూ మీమ్స్‌ చేస్తున్నారు.

వీరమల్లు సినిమా కాకుండా ప్రభాస్‌తో రాజాసాబ్‌ సినిమాలోనూ ఈ అందాల నిధి నటిస్తుంది. వీరమల్లు సినిమా మాదిరిగానే రాజాసాబ్‌ సినిమా సైతం వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో సినిమా విడుదల ఉంటుందని అంతా అన్నారు. కానీ షూటింగ్‌ ఆలస్యం కావడంతో మళ్లీ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. అందాల నిధి అగర్వాల్‌ రాజాసాబ్‌ సినిమాపైనా చాలా ఆశలు పెట్టుకుంది. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటే కచ్చితంగా మూడు నాలుగు పెద్ద ఆఫర్లు వస్తాయనే నమ్మకంతో నిధి అగర్వాల్‌ ఉంది. కానీ ఆమె మాత్రం ఆ సినిమాలతో ఎప్పుడు వచ్చేది క్లారిటీ రావడం లేదు.

తుపాకి.కామ్‌ సౌజన్యంతో...

留言


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page