top of page

హంతక సజ్జనులు

Writer: DV RAMANADV RAMANA

నలభై ఏళ్ల కిందట దేశ రాజధానిలో కాంగ్రెస్‌ నాయకత్వంలో నరహంతక మూకలు చేసిన హింసా బీభత్సం ఇంకా జ్ఞాపకాల్లో మెదులుతూనేవుంది. మహావృక్షం కూలినప్పుడు భూమి కంపించి తీరాలని సిక్కులను ఊచకోత కోసింది రాజకుటుంబం. మహిళల మీద అత్యాచారాలు, మెడలకు టైర్లు వేసి సజీవదహనాలు, ఆస్తులు దుకాణాల దహనాలు యథేచ్ఛగా మూడు నాలుగు రోజులు నడిపిన హెచ్‌కేఎల్‌ భగత్‌, సజ్జన్‌ కుమార్‌, జగదీష్‌ టైట్లర్‌, లలిత్‌ మాకెన్‌, ఇంకా ఎందరో అధికార కాంగ్రెస్‌ నాయకులు తమ రాజభక్తిని పీపాల కొద్దీ పెట్రోలు, కిరోసన్ల వితరణతో నిరూ పించుకున్నారు. ఎన్నో కమిషన్లు వచ్చాయి, ఎన్నో కేసులు నడిచాయి. హింసకు నేపథ్యం అయిన ఇందిర హత్యకు బాధ్యులను మాత్రం తొందరలోనే ఉరితీశారు. కానీ 5వేల హత్యలకు ఏది న్యాయం? కొందరు దోషుల మీద సిక్కు మిలిటెంట్లు ప్రతీకారం తీర్చుకున్నారు, చిన్నస్థాయి దౌర్జన్యకారులు కొంతకాలం జైళ్లలో ఉన్నారు. చాలామంది ఏ గొడవా లేకుండా సహజమరణం పొందారు. భారత న్యాయవ్యవస్థ ఒక్క కాంగ్రెస్‌ బాధ్యుడినైనా ఈ కేసులో శిక్షిస్తే కనీసం ఒక సంకేతాత్మక న్యాయం జరిగినట్టవుతుందని ఎందరో ఆశించారు. సజ్జనుడు కాదు దుర్జనుడని ప్రత్యేక కోర్టులో తేలినా, ఈ తీర్పు కడదాకా నిలబడుతుందా? ఢల్లీి హత్యాకాండలో మాదిరిగానే, గుజరాత్‌ నరమేధానికి కూడా ప్రతీకాత్మక న్యాయం దొరుకుతుందా, బాధ్యులైన పెద్ద మనుషుల వరుసలోని అతి చిన్నవాడినైనా ఈ వ్యవస్థ శిక్షిస్తుందా? ఇందిరాగాంధీ హత్య తర్వాత జరిగిన సిక్కులు ఊచకోతలో కాంగ్రెస్‌ మాజీ ఎంపీ సజ్జన్‌ కుమార్‌కు ఢల్లీి కోర్టు మంగళవారం జీవిత ఖైదు విధించింది. 1984లో జస్వంత్‌ సింగ్‌, అతని కుమారుడు తరుణ్‌ దీప్‌ సింగ్‌ హత్యలకు సంబంధించి ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా ఇంతకుముందే సజ్జన్‌ను దోషిగా ప్రకటించారు. తాజాగా ఈ కేసుకు సంబంధించి తీర్పును వెలువరించారు. మరణశిక్ష విధించదగిన కేసులలో ఖైదీల మానసిక పరిస్థితులపై నివేదిక సమర్పించాలని సుప్రీంకోర్టు ఇంతకుముందు తీర్పులు చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం కోర్టు తీహార్‌ జైలు అధికారుల నుంచి అటువంటి నివేదికను కోరింది. గరిష్ట శిక్ష వేయాలి దేశంలో హత్య నేరాలకు గరిష్టంగా మరణశిక్ష విధించబడుతుంది. కనిష్టంగా జీవిత ఖైదు విధిస్తారు. కుమార్‌కు గరిష్టంగా శిక్ష విధించాలని ఫిర్యాదుదారు జస్వంత్‌ భార్య, ప్రాసిక్యూ షన్‌ కోర్టును కోరాయి. ప్రస్తుతం సజ్జన్‌ కుమార్‌ జైలులో ఉన్నారు. సజ్జన్‌ కుమార్‌ చేసిన హత్య లపై మొదట పంజాబీ బాగ్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదయింది. తర్వాత ప్రత్యేక దర్యాప్తు బృందం దర్యాప్తును చేపట్టింది. 2021 డిసెంబర్‌ 16న కుమార్‌పై కేసు నమోదుకు ప్రాథమిక సాక్ష్యం ఉందని కోర్టు తెలిపింది. ప్రాసిక్యూషన్‌ ప్రకారం మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్యకు ప్రతీకారం తీర్చుకోవడానికి ఒక పెద్ద గుంపు మారణాయుధాలతో సిక్కుల ఆస్తులపై దాడి చేసి దోచుకోవడం ప్రారంభించింది. అలాగే దహనాలు, దాడులు ప్రారంభించింది. ఆ గుంపు ఫిర్యాదుదారు జస్వంత్‌ భార్య ఇంటిపై దాడి చేసి వ్యక్తులను చంపి వస్తువులను దోచుకుని వారి ఇంటికి నిప్పంటించిందని ప్రాసిక్యూషన్‌ పేర్కొంది. ఈ గుంపులో కుమార్‌ పాల్గొనడమే కాకుండా నాయకత్వం వహించా డని, దానికి సాక్ష్యాలు ఉన్నాయని కోర్టు అభిప్రాయపడిన తర్వాత విచారణ ప్రారంభం అయింది. ఇందిరాగాంధీ హత్య తర్వాత ఏర్పడిన హింస, దాని పర్యవసానాలను దర్యాప్తు చేయడానికి ఏర్పా టుచేసిన నానావతి కమిషన్‌ నివేదిక ప్రకారం.. ఢల్లీిలో రోజుల్లో 2,733 మంది సిక్కులు హత్యకు గురయ్యారు. దీనిపై 587 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. ఇందులో 240 కేసులను గుర్తించబడ నివిగా మూసివేయగా, మరో 250 కేసుల నిందితులను నిర్దోషులుగా విడుదల చేశారు. ఈ మొత్తం కేసులలో కేవలం 28 ఎఫ్‌ఐఆర్‌లకు మాత్రమే శిక్షలు పడ్డాయి. దాదాపు 400 మంది దోషులుగా నిర్దారించారు. కుమార్‌తో సహా దాదాపు 50 మందిని హత్య కేసులో దోషులుగా నిర్ధారించారు. అల్లర్ల సమయంలో కాంగ్రెస్‌ నాయకుడు, ఎంపీ అయిన కుమార్‌ 1984 నవంబర్‌ 1, 2 తేదీల్లో ఢల్లీిలోని పాలం కాలనీలో ఐదుగురు వ్యక్తుల హత్యలకు సంబంధించిన కేసులో నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో ఢల్లీి హైకోర్టు అతనికి జీవిత ఖైదు విధించింది. శిక్షను సవాల్‌ చేస్తూ ఆయన దాఖలు చేసిన అప్పీల్‌ సుప్రీంకోర్టు ముందు పెండిరగ్‌లో ఉంది. ఇదే అల్లర్లకు సంబంధించి మరో కాంగ్రెస్‌ నేత జగదీష్‌ టైట్లర్‌పై నమోదయిన కేసులపై విచారణ కొనసాగు తుందని ఇంతకుముందే సుప్రీంకోర్టు ప్రకటించింది.

 
 
 

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page