top of page

39 మంది తహసీల్దార్లకు పోస్టింగ్‌లు

Writer: BAGADI NARAYANARAOBAGADI NARAYANARAO

Updated: Aug 8, 2024

  • సిఫార్సులు మేరకు సీట్ల కేటాయింపు

  • కలెక్టరేట్‌లో లాబీయింగ్‌లకు అవకాశం

  • చక్రం తిప్పిన సీసీ ప్రసాద్‌

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

సార్వత్రిక ఎన్నికల ముందు జిల్లా నుంచి జోన్‌`1 పరిధిలో ఉన్న మిగతా జిల్లాలకు బదిలీపై వెళ్లిన 39 మంది తహసీల్దార్లకు పోస్టింగ్‌లు ఇస్తూ కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ ఉత్తర్వులు జారీచేశారు. వారం రోజులుగా పోస్టింగ్‌లు ఇవ్వకుండా అంటిపెట్టిన జాబితాను బుధవారం విడుదల చేశారు. జిల్లాకు చెందిన మంత్రులు, ఆయా నియోజక వర్గాల ఎమ్మెల్యేలు ఇచ్చిన సిఫార్సుల మేరకు మండలాల్లో పోస్టింగ్‌లు ఇచ్చారు. కలెక్టరేట్‌లో మాత్రం గత కొన్నేళ్లుగా పనిచేసి లాబీయిస్టులుగా ముద్ర వేసుకున్నవారికే పోస్టింగ్‌ ఇచ్చారు. వారిపై అవినీతి, అక్రమాలకు సంబంధించిన ఆరోపణలు ఉన్నా వారినే ఇక్కడ కొనసాగించడానికి ఉన్నతాధికారులు సిద్ధమయ్యారు. ఈ వ్యవహారంలో కలెక్టర్‌ సీసీ ప్రసాద్‌ కీలక భూమిక పోషించినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోస్టింగ్‌లు విషయంలో అధికార ప్రజాప్రతినిధులు సూచించిన స్థానాల్లో చివరి నిమిషంలో నిబంధనల పేరుతో కొందరిని మార్పులు చేర్పులు చేసినట్టు తెలిసింది. సీసీ ప్రసాద్‌ జోక్యంతోనే ఇవన్నీ జరిగాయని రెవెన్యూ వర్గాల్లో ప్రచారం నడుస్తుంది. ప్రజాప్రతినిధులు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం.

కొత్త తలనొప్పులు

లాఠకర్‌ హయాంలో సీసీగా పని చేసిన రెడ్డి ఇక్కడి నుంచి విజయవాడకు బదిలీపై వెళ్లిపోవడంతో సీసీగా ఆయన స్థానంలో ప్రసాద్‌ను తీసుకువచ్చారు. ప్రసాద్‌ కంటే సమర్ధులు ఉన్నా, వారిని కాదని అప్పటి కలెక్టర్‌ లాఠకర్‌కు మాయమాటలు చెప్పి సీసీగా బాధ్యతలు అప్పగించారన్న ఆరోపణలు ఉన్నాయి. అందరూ వ్యతిరేకించినా ప్రసాద్‌ను సీసీగా తీసుకువచ్చినందుకు కృతజ్ఞతగా అప్పటి ఏవో రాజేశ్వరరావును కలెక్టరేట్‌లో సీ`విభాగం సూపరింటెండెంట్‌గా పోస్టింగ్‌ వేయించినట్టు రెవెన్యూ వర్గాల్లో చర్చ సాగుతుంది. గతంలో అనేక మంది కలెక్టర్లు, జేసీలను తప్పుదోవ పట్టించి రెవెన్యూ అధికారులు, ఉద్యోగులతో ఉన్నతాధికారులకు మధ్య గ్యాప్‌ పెంచి వివాదాలు సృష్టించడానికి కారణమయ్యారని రాజేశ్వరరావుపై ఆరోపణలు ఉన్నాయి. అయినా రాజేశ్వరరావుకు సీ`విభాగంలో పోస్టింగ్‌ ఇవ్వడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య గ్యాప్‌ పెరగడానికి ఏవోగా పని చేసిన రాజేశ్వరరావు నిర్వాకమేనని కారణమన్న విమర్శలు ఉన్నాయి. ప్రజాప్రతినిధులకు, ఉన్నతాధికారులకు పరస్పర విరుద్ధమైన సమాచారం ఇచ్చి వారి మధ్య దూరం పెంచారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు సీ`విభాగానికి సూపరింటెండెంట్‌గా వచ్చినా కలెక్టరేట్‌పై ఆయన ప్రభావం చూపిస్తారని గుసగుసలు ఉన్నాయి. ఆర్డీవో ఏవోగా పని చేసిన సమయంలోనే కలెక్టరేట్‌లో అధికారులను ప్రభావితం చేసేవారిని రెవెన్యూ అధికారులు చెబుతుంటారు. జిల్లాలో పని చేస్తున్న అందరు తహసీల్దార్లు రాజేశ్వరరావు బాధితులే. రాజేశ్వరరావుతో పాటు సూర్యనారాయణను కలెక్టరేట్‌ ఏవోగా బాధ్యతలు అప్పగించడంతో కలెక్టరేట్‌లో రెండు పవర్‌ పాయింట్‌లు వెలుస్తాయని అప్పుడే ప్రచారం సాగుతుంది. పనిష్మెంట్‌లో ఉన్న సూర్యనారాయణను కలెక్టరేట్‌కు తీసుకువచ్చిన రాజేశ్వరరావు చివరి నిమిషంలో ఆయనకు రaలక్‌ ఇచ్చారని ప్రచారం ఉంది. సూర్యనారాయణకు రెండు ఇంక్రిమెంట్‌లు కట్‌ చేయించి రాజేశ్వరరావు తన మార్కును చూపించుకున్నారు. దీంతో ఇరువురి మధ్య కొంత వైరుధ్యం నడుస్తుంది. దీంతో ఏవోగా సూర్యనారాయణను సీ`విభాగానికి వచ్చిన రాజేశ్వరరావు కుదుటగా పని చేయిస్తారన్న నమ్మకం కలెక్టరేట్‌ వర్గాల్లో కనిపించడం లేదు. దీంతో కలెక్టరేట్‌లో ఉన్నతాధికారులకు కొత్త తలనొప్పులు తప్పవన్న భావనతో రెవెన్యూ అధికారులు ఉన్నారు. వీరిని కలెక్టర్‌ సీసీ ప్రసాద్‌ వెనకేసుకు వచ్చి పోస్టింగ్‌లు ఇప్పించారని విమర్శలు వినిపిస్తున్నాయి.

పోస్టింగ్‌లు

కలెక్టరేట్‌ ఏవో సూర్యనారాయణ

సీ`విభాగం సూపరింటెండెంట్‌ రాజేశ్వరరావు

హెచ్‌`విభాగం సూపరింటెండెంట్‌ బి.ప్రకాశరావు

డి`విభాగం సూపరింటెండెంట్‌ డి.రమణమూర్తి

ఈ`విభాగం సూపరింటెండెంట్‌ పి.సరోజిని

టెక్కలి సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ఏవో జి.ప్రభాకరరావు

శ్రీకాకుళం డివిజన్‌ కార్యాలయం ఏవో జె.రామారావు

పలాస డివిజన్‌ కార్యాలయం ఏవో ఎస్‌.హైమావతి

స్పెషల్‌ తహసీల్దారు గెయిల్‌ కె.శ్రీరాములు

స్పెషల్‌ తహసీల్దారు కొవ్వాడ పి.వేణుగోపాలరావు

కేఆర్‌ఆర్‌సీ శ్రీకాకుళం డివిజన్‌ ప్రవళ్లికా ప్రియ

కేఆర్‌ఆర్‌సీ టెక్కలి డివిజన్‌ బీఎస్‌ఎస్‌ సత్యనారాయణ

తహసీల్దార్లు

శ్రీకాకుళం ఎస్‌.గణపతిరావు

పోలాకి ఎం.సురేష్‌ కుమార్‌

రణస్థలం ఎన్‌.ప్రసాదరావు

వజ్రపుకొత్తూరు పి.బాల

సారవకోట కె.విజయలక్ష్మీ

హిరమండలం బి.వెంకటరమణ

పొందూరు ఎన్‌.రమేష్‌ కుమార్‌

ఇచ్ఛాపురం ఎన్‌.వెంకటరావు

జలుమూరు జి.లక్ష్మీనారాయణ

గార ఎస్‌.రమణారావు

ఎచ్చెర్ల ఎ.సింహాచలం,

పలాస బి.సత్యం

మెళియాపుట్టి ఎన్‌.హనుమంతరావు

నరసన్నపేట టి.హనుమంతరావు

పాతపట్నం ఎస్‌.కిరణ్‌కుమార్‌

టెక్కలి ఎస్‌.దిలీప్‌చక్రవర్తి

బూర్జ ఈశ్వరమ్మ

ఎల్‌ఎన్‌ పేట వై.విపద్మావతి

కవిటి బి.మురళీకృష్ణ

జీ`సిగడాం ఎం.శ్రీకాంత్‌

కోటబొమ్మాళి ఆర్‌.అప్పలరాజు

సరుబుజ్జలి ఎల్‌.మధుసూదనరావు

కొత్తూరు బి.పాపారావు

సోంపేట బి.అప్పలస్వామి

కంచిలి వై.జయలక్ష్మీ

లావేరు వై.జోగారావు

మందస బీడీవీ ప్రసాదరావు

 
 
 

Comentarios


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page