top of page

CM భార్యలకూ తప్పని గ్లామర్ పిచ్చి?

  • Guest Writer
  • Jun 24
  • 2 min read
  • ఆధునికత పేరుతో హద్దులు దాటుతున్న సెలబ్రిటీల ధోరణి

  • సీఈఓల భార్యల నుంచి లీడర్ల దాకా సోషల్ మీడియా సెల్ఫీల గోల

  • ‘అమృతా ఫడ్నవిస్ ’ వస్త్రధారణపై నెట్‌లో సెగలు

షేక్‌స్పియర్ రాసిన హేమ్లెట్ అనే నాటకంలో రాజు క్లాడియస్ మంత్రివర్గంలో ముఖ్యుడైన పొలోనియస్ తన కొడుకు లార్టెస్‌కి చాలా విషయాల్లో సుద్దులు నేర్పుతూ సమాజంలో ఆహార్యం - దుస్తులు వేసుకునే విధానం బట్టి ఒక వ్యక్తి గుణగణాలను, స్థాయిని, ధనవంతుడా కాదా అనే విషయాలను బేరీజు వేస్తుంది అని చెప్తూ... సందర్భాన్ని బట్టి, మనకి ఆహ్వానం వచ్చిన చోటుని బట్టి, మన స్థాయిని బట్టి అలాగే మనల్ని ఆహ్వానించిన వారి స్థాయిని బట్టి కూడా మనం దుస్తులను ధరించాల్సి ఉంటుంది అని చెపుతాడు.

మనం వెళ్లే చోటును సమయం సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఏ దుస్తులను వేసుకోవాల్సి ఉంటుంది. పెళ్లికి ఒకలాగా, చావు ఇంటి పరామర్శకు ఒకలాగా, బడిలో పిల్లలని కలిసేప్పుడు ఒకలాగా మనం వేసుకునే బట్టలు మారుతుంటాయి. ఇది ముఖ్యంగా ఆడవాళ్ల విషయంలో అయితే మరి ఎక్కువ వ్యత్యాసంతో ఉంటాయి. ఇప్ప్పుడున్న సమాజ స్థితిగతులను బట్టి ఆడవారు చీర కట్టుకోవాలా, చుడీదార్ వేసుకోవాలా, జీన్స్-టీషర్ట్ వేసుకోవాలా అనేది కూడా ఆధారపడి వుంటుంది.

ఇదే షేక్‌స్పియర్ ఇంకో నాటకం కింగ్ లీర్‌లో ‘సమాజం మనుషులను వారి వస్త్రధారణ బట్టి జడ్జి చేస్తుంది, పేదవారు తమ పేదరికాన్ని వస్త్రధారణతో కప్పి పుచ్చుకోలేరు, కానీ అదే వస్త్రాలతో ధనవంతులు వారి పాపలపైన కుడా ముసుగు వెయ్యగలరు’ అని అంటాడు.

ఇప్ప్పుడు ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకు అంటే.. నిన్నటి అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మ్ముంబైలో జరిగిన ఒకానొక కార్యక్రమంలో పలువురు సెలబ్రిటీలు పాల్గొన్నారు. మన సొంత శ్రీలీల కూడా పాల్గొంది. ఆమెతో పాటు అక్కడికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి భార్య అమృతా ఫడ్నవిస్ వేసుకున్న దుస్తులపై నెట్‌లో బోలెడంత డిబేట్ జరుగుతోంది. ఇప్ప్పుడే కాదు ఆవిడ అనేక సందర్భాల్లో సినిమా తారలను మించి ఆకర్షణీయంగా కొండొకచో అధ్వానంగా డ్రెస్సులు వేసుకొచ్చి ఆడియన్స్ మైండ్‌ని డైవర్ట్ చేస్తుంది. కొన్ని ఇంటర్వ్యూలో కూడా చాలా రివీలింగ్‌గా డ్రెస్సింగ్ చేసుకుంటుంది.

ముఖ్యమంత్రే తన మొగుడైనప్పుడు ఇంకెవరిని ఆకర్షించాలి అనుకుంటుంది ఈవిడ అని చాలామంది కామెంట్స్ చేసిన వారికి ‘నా వొళ్లు ... నా ఇష్టం’ అన్న పంథాలో ఉంటుంది ఈవిడ వ్యవహారం. ఈవిడే కాదు చాలామంది స్త్రీలు ఈ మధ్యకాలంలో స్కిన్ షో చెయ్యడానికి తహతహలాడుతున్నారు. పెద్ద పెద్ద హోదాల్లో ఉన్న ఆడవారు మొదలుకుని పెద్ద పెద్ద హోదాల్లో ఉన్న సీఈవోల భార్యలు కూడా అలా వస్త్రధారణ చేసుకుని మీటింగ్స్‌కి రావడం సెల్ఫీలు తీసి సోషల్ మీడియాలో పెట్టడం కద్దు.

బహుషా వారి తెలితేటలపై కంటే స్కిన్ షో పైననే ప్రగాఢ విశ్వాసం అయి ఉంటుంది. బహుషా ఆయా భర్తలు కూడా వీరిని అలా వేసుకోవాలి అని వత్తిడి చేస్తారయివుండవచ్చు. సామాన్య జనాల సంగతి ఏంటో గానీ మరి ముఖ్యమంత్రి స్థాయి భార్యలు కూడా ఇలా అందాలను జాతికి అంకితం ఇయ్యడం ఎలా అర్థం చేసుకోవాలో?! ఒక డెకారం అనేది ఉంటుందని ఆ హోదాకు విలువని తనవంతుగా ఇవ్వాలి అనే విజ్ఞత లేదేమో మరి..!!

డ్రెస్ ఒకరి కారెక్టర్‌ని నిర్ణయించదు, చీర కట్టుకుంటే పతివ్రత, షార్ట్స్ వేసుకుంటే బజారు మనిషి అనే డిసైడ్ అయ్యే మీరు చలా ఎదగాలి అని డిస్కషన్ మొదలెట్టే వాళ్లకు ఒక దణ్ణం...!!!

- ప్రియదర్శిని కృష్ణ

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page