
మధ్యప్రదేశ్‌లో ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒక తప్పు చేసిన పాపానికి కొందరు దుండగులు ఓ వ్యక్తిని విచక్షణారహితంగా కొట్టారు. బలవంతంగా మూత్రం తాగించడంతో పాటు చెప్పు నాకించారు. మెడలో బూట్ల హారం వేసి ఊరేగించారు. అంతేకాదు.. ఈ తతంగాన్ని ఫోన్ లో రికార్డ్ చేసి, వీడియోలను నెట్టింట్లో పోస్టు చేశారు.
మధ్యప్రదేశ్‌లో (Madhya Pradesh) ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒక తప్పు చేసిన పాపానికి కొందరు దుండగులు ఓ వ్యక్తిని విచక్షణారహితంగా కొట్టారు. బలవంతంగా మూత్రం తాగించడంతో పాటు చెప్పు నాకించారు. మెడలో బూట్ల హారం వేసి ఊరేగించారు. అంతేకాదు.. ఈ తతంగాన్ని ఫోన్ లో రికార్డ్ చేసి, వీడియోలను నెట్టింట్లో పోస్టు చేశారు. దీంతో.. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అసలు అతడ్ని ఇంతలా శిక్షించడానికి గల కారణం ఏంటో తెలుసా? ఓ వివాహితతో పారిపోవడమే. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
బాధిత వ్యక్తి ఉజ్జయిని (Ujjain) జిల్లాలోని భట్‌పచ్లానా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న భిల్‌ఖేడి గ్రామానికి చెందినవాడు. అతడు స్థానికంగా ఉంటున్న ఓ వివాహిత మహిళను ప్రేమించాడు. ఆమె బంజారా కమ్యూనిటీకి చెందింది. ఆ మహిళ కూడా అతడ్ని ప్రేమించింది. ఈ నేపథ్యంలోనే.. తమ ప్రేమను సమాజం అంగీకరించదని భావించి, ఇద్దరు కలిసి పారిపోయారు. అయితే.. వీళ్ల ఆచూకీ కనుగొని వెనక్కు తీసుకొచ్చారు. తమ వర్గానికి చెందిన మహిళను, అది కూడా వివాహితను తీసుకెళ్తావా? అంటూ బాధితుడ్ని ఘోరంగా కొట్టారు. ఇందాకే చెప్పుకున్నట్టు.. అతనితో బలవంతంగా మూత్రం తాగించారు. మెడలో బూట్ల దండ వేశారు. ఒక చెప్పుని అతని తలపై పెట్టి, మరో చెప్పు నాకించారు. సగం మీసం, సగం గుండుతోనూ అతడు కనిపించాడు. మరో షాకింగ్ విషయం ఏమిటంటే.. అతడు ఏ మహిళతో అయితే పారిపోయాడో, ఆమె కూడా అతడ్ని కొట్టడం వీడియోలో రికార్డ్ అయ్యింది.
Commentaires