top of page

ఈ కమెడియన్ వల్ల.. 16 ఆఫర్లు కోల్పోయాను..I

  • Guest Writer
  • 10 hours ago
  • 3 min read

తమిళ నటి సోనా హైడెన్ పరిచయం అవసరం లేదు. తెలుగులో ఆంధ్రావాలా (ఎన్టీఆర్) చిత్రంలో నటించిన సోనా, తమిళంలో తళా అజిత్ సినిమాతో తెరంగేట్రం చేసారు. ఈ భామ ఇప్పుడు అనూహ్య కారణాలతో మీడియా హెడ్ లైన్స్ లో కొచ్చారు. వివరాల్లోకి వెళితే.. నటి సోనా హైడెన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చిత్ర పరిశ్రమలో పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. ముఖ్యంగా తమిళ స్టార్ కమెడియన్ వడివేలు ప్రవర్తన కారణంగా తాను కెరీర్‌లో భారీగా నష్టపోయానని సోనా ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో రజనీకాంత్ హీరోగా వచ్చిన `కుసేలన్` (తెలుగులో -కథానాయకుడు) చిత్రంలో వడివేలుతో కలిసి నటించిన సోనా.. ఆ తర్వాత మళ్ళీ ఆయనతో కలిసి పని చేసేందుకు ససేమిరా అనడం గమనార్హం.

ఈ నేపథ్యంలో సోనా మాట్లాడుతూ వడివేలుతో తన కాంబినేషన్ బాగుందని భావించిన మేకర్స్..తామిద్దరినీ జంటగా పెట్టి సినిమాలు చేసేందుకు ఏకంగా 16 ఆఫర్లు ఇచ్చారని వెల్లడించారు. అయితే వడివేలు వ్యక్తిత్వం.. సెట్స్‌లో ఆయన ప్రవర్తన తనకు ఎంతమాత్రం నచ్చలేదని ఆమె స్పష్టం చేశారు. ఎన్ని కోట్లు ఇస్తామన్నా.. చివరకు అడుక్కుతినే పరిస్థితి వచ్చినా సరే.. ఆత్మగౌరవాన్ని పణంగా పెట్టి ఆయనతో కలిసి నటించేది లేదని సోనా తెగేసి చెప్పారు.

చిత్ర పరిశ్రమలో ఎదురైన ఇలాంటి చేదు అనుభవాల వల్లే తాను సినిమాలకు సుదీర్ఘ కాలం దూరంగా ఉండాల్సి వచ్చిందని ఈ సీనియర్ నటి పేర్కొన్నారు. వడివేలు వల్ల తాను పడ్డ ఇబ్బందులన్నీ బయటకు చెప్పలేనని.. కానీ ఆ పరిణామాలు తనను తీవ్రంగా కలిచివేశాయని ఆమె వాపోయారు. తోటి కళాకారుల పట్ల కనీస గౌరవం లేని వ్యక్తులతో కలిసి పని చేయడం కంటే ఇంట్లో ఖాళీగా కూర్చోవడమే మేలని నటి సోనా అభిప్రాయపడ్డారు. సినిమా రంగంలో తనకు ఎవరూ అండగా నిలవలేదని.. అవసరం ఉన్నప్పుడు వాడుకుని ఆ తర్వాత అందరూ వదిలేశారని సోనా ఆవేదన చెందారు. కేవలం గ్లామర్ పాత్రలకే తనను పరిమితం చేశారని నటిగా తనలోని ప్రతిభను గుర్తించలేదని అన్నారు. ఈ క్రమంలోనే తన జీవితంలో జరిగిన వాస్తవ సంఘటనలను ప్రపంచానికి తెలియజేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు.

ప్రస్తుతం సోనా తన బయోపిక్‌ను ‘స్మోక’ అనే వెబ్ సిరీస్ రూపంలో తెరకెక్కిస్తున్నారు. 2010 నుంచి 2015 మధ్య తన జీవితంలో జరిగిన సంచలన విషయాలను తాను ఎదుర్కొన్న మోసాలను ఈ సిరీస్‌లో చూపించబోతున్నారు. దీనికి సోనా స్వయంగా దర్శకత్వం వహిస్తూ.. తానే స్వయంగా నిర్మిస్తుండటం విశేషం. సిల్క్ స్మిత జీవితాన్ని ఇతరులు సినిమాగా తీసినట్లు రేపు తన కథను కూడా ఎవరో ఒకరు వక్రీకరిస్తారన్న భయంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోనా తెలిపారు. స్టార్ కమెడియన్‌గా వెలుగుతున్న వడివేలుపై గతంలోనూ కొందరు ఇలాంటి ఆరోపణలు చేసినా కానీ.. సోనా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరింత చర్చనీయాంశమయ్యాయి. ఆత్మగౌరవం కోసం 16 సినిమా ఆఫర్లను వదులుకున్న సోనా ధైర్యాన్ని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. ఒక నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం పోరాడుతున్న ఈ నటీమణి త్వరలో విడుదల కానున్న `స్మోక్` సిరీస్‌తోనైనా తన గొంతును బలంగా వినిపిస్తారని భావిద్దాం.

- తుపాకి.కామ్ సౌజన్యంతో...

మునిగిపోతున్న నావ.. ఆ నిర్మాణ సంస్థ

కేసు ఓడిన వాడు కోర్టు బయట ఏడుస్తాడు, గెలిచిన వాడు ఇంటికెళ్లి ఏడుస్తాడు.. అని న్యాయ వ్యవస్థ, అక్కడ జరిగే జాప్యాల గురించి సెటైరికల్ గా చెబుతుంటారు చాలామంది. సినిమా నిర్మాతదీ అదే పరిస్థితి. ఫ్లాప్ అయితే థియేటర్ బయట ఏడుస్తాడు, హిట్ అయితే.. ఇంట్లో ఏడుస్తాడు నిర్మాత. అలా ఉంది పరిస్థితి. సినిమా హిట్ అయినా, నిర్మాతలకు మిగిలేదేం ఉండడం లేదు. టేబుల్ ప్రాఫిట్ అనేది వింతగా మారిపోయింది. బడ్జెట్లు దాటిపోవడం వల్ల నిర్మాత బతుకులు మరింత భారం అయిపోతున్నాయి. దాంతో బడా నిర్మాతలు కూడా వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి. పేరు మోసిన నిర్మాణ సంస్థలు తమ ఆఫీసులకు తాళాలు వేసుకోవాల్సిన దుస్థితి వచ్చేసింది. ఓ పెద్ద నిర్మాణ సంస్థ కూడా ఇలాంటి సంక్షోభంలోనే ఉందని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

బడా హీరోలు, బడా దర్శకులతో పెద్ద పెద్ద సినిమాలు తీసే ఓ సంస్థ.. అప్పుల బారీన పడిందని, లెక్కలు తీస్తే నష్టాలు తప్ప, లాభాలు కనిపించడం లేదని ఇండస్ట్రీలో చెప్పుకొంటున్నారు. సాధారణంగా నిర్మాతల్లో 90 శాతం బయటి నుంచి ఫైనాన్స్ తీసుకొచ్చే బండి నడిపిస్తుంటారు. కొంతమందికి ఇన్వెస్టర్లు ఉంటారు. ఈ నిర్మాణ సంస్థ కూడా ఇన్వెస్టర్ల మీద ఆధార పడి సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం పరిస్థితులు బాగోకపోవం వల్ల, ఎంత పెద్ద సినిమా తీసినా, మిగలకపోవడం వల్ల.. ఇన్వెస్టర్లు వెనక్కి తగ్గుతున్నారు. దాంతో పెట్టుబడులు ఆగిపోతున్నాయి. దానికి తోడు వడ్డీలు పెరిగిపోతున్నాయి. సినిమా హిట్టయినా పైసా కూడా మిగలడం లేదు. ఓ స్టూడియోకి దాదాపు 75 కోట్లు బాకీ పడినట్టు టాక్. ఆ సంస్థ తాలుకూ పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ ఆ స్టూడియోలోనే జరుగుతుంటాయి. దాంతో స్టూడియో అధినేతలు కూడా నిర్మాతలపై ఒత్తిడి తీసుకురావడం లేదు. ఎలాగూ రెప్యుటేషన్ ఉంటుంది. ఈ సినిమాతో కాకపోయినా, మరో సినిమాతో డబ్బులు వస్తాయన్న ధీమా ఉంటుంది. కాబట్టి గొడవ చేయడం లేదు. ఒక్క స్టూడియోకే ఇంత మొత్తం బాకీ పడితే, మిగిలిన స్టూడియోల మాటేమిటి? మిగిలిన ఫైనాన్షియర్ల దగ్గర పరిస్థితి ఏమిటి? అనే చర్చ మొదలైంది.

సదరు సంస్థ కూడా కొత్త ఇన్వెస్టర్ల మీద దృష్టి పెట్టింది. పెట్టుబడులు సేకరించడానికి రకరకాల మార్గాలు అన్వేషిస్తోంది. అదృష్టవశాత్తూ.. ఈ సంస్థకు మంచి గుర్తింపే ఉంది. బడా హీరోలు, దర్శకులు ఈ సంస్థలో పని చేయడానికి ఉత్సాహం చూపిస్తారు. కాబట్టి.. కాంబినేషన్లు సెట్ చేయడం ఈజీ. కాంబోల్ని చూసి వచ్చే ఇన్వెస్టర్లు ఉన్నంత కాలం ఈ సంస్థకు ఢోకా ఉండదు. కానీ ఆ చైన్ కి ఎక్కడైనా బ్రేక్ పడితే మాత్రం చేతిలో ఉన్న సినిమాల్ని పూర్తి చేయడానికి, పాత అప్పులు తీర్చడానికి మూలధనం కావాలి. అలాంటప్పుడు మాత్రం ఇబ్బంది పడాల్సివస్తోంది. ప్రస్తుతానికైతే ఈ నిర్మాణ సంస్థకు ఢోకా లేదని, కాకపోతే లాంగ్ రన్ లో ఇబ్బందులు తప్పవని టాలీవుడ్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. వరుసగా రెండు మూడు పెద్ద హిట్లు పడి, లాభాలు చూస్తే పరిస్థితి మెరుగు అవుతుందని ఆ నిర్మాతలు భావిస్తున్నారు. ఏం అవుతుందో చూడాలి.

- తెలుగు 360.కామ్ సౌజన్యంతో..


Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page