top of page


చాలా పద్ధతిగా.. చేస్తున్నారు దగా!
దోపిడీకి గురవుతున్న వరి రైతులు నాసిరకం సాకుతో 4.3 కేజీల ఎక్కువ డిమాండ్ మరోవైపు చెల్లింపుల్లోనూ అదే కారణంతో కోత కొనుగోలు కేంద్రాల ద్వారా పూర్తిస్థాయిలో జరగని సేకరణ అదే అదనపు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న మిల్లర్లు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) జిల్లాలో అధికారులు, మిల్లర్లు, దళారులు కలిసి ఒక పద్ధతి ప్రకారం వరి రైతులను దగా చేస్తున్నారు. 80 కేజీల బస్తా వద్ద 4.3 కేజీల ధాన్యాన్ని అదనంగా తూస్తూ దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఆరు నుంచి ఎ

BAGADI NARAYANARAO
18 hours ago3 min read


కోనేరు విస్తీర్ణమెంత.. కొట్టేసిందెంత?
వరద గట్టు భూమి నిగ్గు తేల్చాలని స్థానికుల డిమాండ్ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు ఆక్రమణదారులకే కొమ్ముకాస్టున్న రెవెన్యూ సిబ్బంది రోడ్డు విస్తరణ బాధితులకు అక్కడ స్థలాలు ఇవ్వాలని వినతి (సత్యంన్యూస్, శ్రీకాకుళం) నగరంలో బలగ రెవెన్యూ పరిధి సర్వే నెంబర్ 1/5లో ఉన్న చెరువు అసలు విస్తీర్ణం ఎంత? అది ఎవరికి చెందుతుంది?? దాన్ని 74 సెంట్లగా ఎలా గుర్తించారన్నది??? తేల్చాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నా అధికారులు పట్టించుకోవడంలేదన్న విమర్శలు వినిపిస్తున

BAGADI NARAYANARAO
2 days ago2 min read


ఇన్ని అవమానాలు మనకొద్దు బాలూ..!
( సత్యంన్యూస్, శ్రీకాకుళం ) మంచి చేశాడని కాటన్ దొరకు కూడా విగ్రహం పెట్టిన రాష్ట్రం మనది. బాలు యూనివర్సల్.. అడ్డు చెప్పుడం అనేది సంకుచిత మనస్తత్వానికి నిదర్శనం అవుతుంది. అంబేద్కర్, రాజీవ్ గాంధీ వగైరాలు పక్కా తెలంగాణ వాసులు కాబోలు. అందుకే వీళ్ల విగ్రహాలకు ఎలాంటి అడ్డు చెప్పరు శభాష్. ఇప్పుడు కేసీఆరే వచ్చి ఒరే తప్పురా.. బాబు, అలాంటి గొప్ప వారి విషయంలో ఇలా చేస్తే పుట్టగతులు ఉండవు.. అన్నా వినే స్థితి లేదు కొంతమందికి. వాళ్లదేం తప్పు కాదు.. అలా ఒకప్పుడు ఎగదోసిన మీడియా, చూస్తూ ఊ
Prasad Satyam
3 days ago4 min read


పాపం పండిoది.. వేటు పడిoది!
సీఎంవో ఆదేశాలతో కదిలిన ఐసీడీఎస్ అధికారులు లంచం కేసులో ఎట్టకేలకు స్పందన విధుల నుంచి డేటా ఎంట్రీ ఆపరేటర్ తొలగింపు సీడీపీవో తొలగింపు కోరుతూ డైరెక్టర్‌కు ఫైల్ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) పాపాలు పండాయి. వాటిని మసిపూసి మాయ చేసే యత్నాలు విఫలమయ్యాయి. బాధితుడిని లొంగదీసుకునే ప్రయత్నాలూ వమ్మయ్యాయి. ఫలితంగా లంచం కేసులో చర్యలు మొదలయ్యాయి. గ్రీవెన్స్‌లో బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుపై ఎట్టకేలకు జిల్లా ఉన్నతాధికారులు స్పందించారు. ఎచ్చెర్ల సీడీపీవో కార్యాలయ డేటా ఎంట్రీ ఆపరేటర్ శ్రీ

BAGADI NARAYANARAO
6 days ago2 min read


బాలలే బలిపశువులు!
బెగ్గింగ్ మాఫియా కోరల్లో బాల్యం నానాటికీ విస్తృతమవుతున్న పిల్లల అక్రమ రవాణా పంజా విసురుతున్న చైల్డ్ ట్రాఫికింగ్ ముఠాలు అమ్మడానికి, ఆవయవాల దోపిడీకి కూడా కిడ్నాపులు సరైన రీతిలో స్పందించలేకపోతున్న ప్రభుత్వాలు ఈ తరహా కేసుల్లో రాష్ట్రంలో శ్రీకాకుళానికి మూడోస్థానం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఆగినప్పుడు చంకలో చంటిబిడ్డను పెట్టుకొని పాలకోసం డబ్బులివ్వమని కోరే మహిళలు కనిపిస్తుంటారు. ఎప్పుడు గ్రీన్‌లైట్ పడుతుందా? ఎప్పుడు జంక్షన్ దాటేద్దామా అన్న ఆ

BAGADI NARAYANARAO
Nov 294 min read


నమ్ముకున్న ‘బోయిన’కే రాజమకుటం
నమ్మకం నిలిచింది.. పట్టుదల గెలిచింది! ఆయనకే కళింగకోమటి కార్పొరేషన్ ఛైర్మన్ పదవి పార్టీని అంటిపెట్టుకుని ఉన్నందుకు దక్కిన గుర్తింపు మంత్రి అచ్చెన్నాయుడు పట్టుదలకు నిదర్శనం వేరే ఆలోచనలు చేసినా.. గోవిందరాజులు వైపే అందరి మొగ్గు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) పార్టీని నమ్ముకుంటే ఏ రోజుకైనా పదవులు వస్తాయనడానికి ఇదొక నిదర్శనం. నిబద్ధత కలిగిన నాయకుడు నమ్ముకున్న కార్యకర్త కోసం ఎంతవరకైనా వెళ్లి యుద్ధం చేస్తారనడానికి కూడా ఇదే నిదర్శనం. ఒ

NVS PRASAD
Nov 282 min read


భారత సైన్యానికి ‘భైరవ’ కవచం
మన పదాతిదళంలో కొత్త బెటాలియన్లు ఆరు నెలల్లో 25 యూనిట్ల ఏర్పాటకు చర్యలు డికేడ్ ట్రాన్స్‌ఫార్మేషన్‌లో భాగంగా సైన్యం ఆధునికీకరణ త్వరలో రుద్ర, శక్తిబాణ్, దివ్యాస్త్ర దళాల ఏర్పాటు (డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి) పహల్గాం ఉగ్రదాడి.. తదనంతరం ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో మనదేశ రక్షణ విధానాల్లో కేంద్ర ప్రభుత్వ అనేక సంస్కరణలు చేపడుతోంది. మన త్రివిధ దళాలకు ఆధునిక ఆయుధ సంపత్తి సమకూర్చడంతోపాటు వ్యూహాత్మకంగా సరికొత్త మానవ అస్త్రాలను సిద్ధం చేస్తోంది. ముఖ్యంగా పదాతిదళం(ఆర్మీ)ల

DV RAMANA
Nov 272 min read


హతవిధీ.. ‘ఉపాధి’కీ పరిమతి!
ఉపాధి హామీ పనులకు రూ.50 లక్షల పరిమితి కొత్త ఆంక్షలతో కాంట్రాక్టర్లు బెంబేలు ఇప్పటికే దానికి మించి జిల్లాలో అనేక పనులు ఆ బిల్లులను తిరస్కరిస్తున్న అధికారులు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) సీతను గీత దాటి బయటకు రావద్దంటూ నాడు లక్ష్మణుడు ఒక రేఖ గీశాడు. దాన్నే లక్షణరేఖ అంటారు. కానీ సీతమ్మ ఆ గీత దాటింది.. అవుటై రావణుకి చేతికి చిక్కింది. అలాగే కబడ్డీ తదితర క్రీడల్లో లైన్ దాటితే అవుటవుతారు. సరిగ్గా ఇలాంటి లక్ష్మణరేఖనే ఉపాధి హామీ పథకం ఉన్నతాధికారులు గీశారు. నిధుల వినియోగానికి సంబం
Prasad Satyam
Nov 272 min read


ఉద్యోగం రాకముందొకలా.. వచ్చాక మరో గోల!
నిరుద్యోగుల కోరికల ముందు జావగారిపోతున్న జాబ్‌మేళాలు ఉద్యోగాల్లో చేరాక కోరికల చిట్టా విప్పుతున్న అభ్యర్థులు సాకులతో అవకాశాలు చేజార్చుకుంటున్న యువత నెపాన్ని మాత్రం ప్రభుత్వంపైకి నెట్టేస్తున్న వైనం (సత్యంన్యూస్,శ్రీకాకుళం) ఉద్యోగం లేనంతకాలం ఏదో ఒకటి వస్తే అదే పదివేలు అనుకుంటాం.. తీరా ఉద్యోగం వచ్చిన తర్వాత అక్కడ మన హక్కులు, జీతాల ప్రస్తావన తీసుకొస్తాం. ఏదో ఒక అవకాశం లభించిందని సంతృప్తి చెందకుండా జీతాలు పెరగలేదని, పనిభారం ఎక్కువగా ఉందని నిత్యం అసంతృప్తి వ్యక్తం చేస్

BAGADI NARAYANARAO
Nov 262 min read


ఎమ్మెల్యే ఎత్తు.. కాంట్రాక్టర్లు చిత్తు!
కార్పొరేషన్లో ఇన్నాళ్లూ వారు ఆడిరదే ఆట గొండు శంకర్ రంగ ప్రవేశంతో బెంబేలు లొంగదీసుకునేందుకు సహాయ నిరాకరణ ప్లాన్`బి అమలుతో ప్రజాప్రతినిధిపై దుష్ప్రచారం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) పదిహేనేళ్లకుపైగా పాలకవర్గం లేదు.. కమిషనర్లుగా వస్తున్నవారు పట్టుమని పది నెలలు కూడా ఉండటం లేదు.. ఇంజినీరింగ్ వ్యవస్థ మొత్తం పక్క జిల్లా నుంచి అప్ అండ్ డౌన్ చేస్తుంటం.. గత ఐదేళ్లూ షాడో మేయర్ పెత్తనం.. తదితర పరిణామాలు ఏకంగా శ్రీకాకుళం నగరపాలక సంస్థన
Prasad Satyam
Nov 253 min read


బాబోయ్.. బూడిద మేఘం!
ఇథియోపియాలో పేలిన అగ్నిప్రమాదం కిలోమీటర్ల ఎత్తులో ఎగసిన రసాయన బూడిద వేల కి.మీ. దూరంలోని భారత్‌పై దట్టంగా ధూళి వాతావరణ సమస్యలు, ఆరోగ్యాలకు దెబ్బ అనేక విమానాలు రద్దు, మరికొన్ని దారిమళ్లింపు (డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి) ఉరుము ఉరిమి మంగళం మీద పడటమంటే బహుశా ఇదేనేమో!.. కాకపోతే ఎక్కడ ఆఫ్రికా ఖండంలోని ఇథియోపియా.. ఎక్కడ పదివేల ఏళ్లనాటి అగ్నిప్రమాదం. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దేశంలో వేల ఏళ్లుగా నిద్రాణంగా ఉన్న అగ్ని పర్వతం విస్ఫోటనం చెం

DV RAMANA
Nov 252 min read


హసీనా హత్యను అడ్డుకున్న ఫోన్‌కాల్!
విద్యార్థుల దాడి నుంచి తప్పించుకున్న బంగ్లా మాజీప్రధాని భారత్ నుంచి అజ్ఞాత అధికారి ఫోన్‌కాల్‌తో అప్రమత్తం ఆమె నివాసాన్ని వీడిన 20 నిమిషాల్లోనే దాడులు ‘ఇన్షా బంగ్లాదేశ్’ పుస్తకంలో అప్పటి పరిణామాల ప్రస్తావన (డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి) విద్యార్థుల ఆందోళనలను అణచివేసే క్రమంలో మానవ హక్కుల హననానికి పాల్పడి ఏకంగా 1400 మంది మరణానికి కారణమయ్యారన్న తీత్ర నేరారోపణలతో బంగ్లాదేశ్ మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనాను ఆ దేశానికి చెందిన అంతర్జాతీయ నేరాల ట్రిబ్యూనల్(ఐసీటీ) ఈ నెల 17న

DV RAMANA
Nov 242 min read


సొసైటీ స్థలంలో అక్రమాల అంతస్తులు
అనుమతులు తీసుకోలేదు.. నిబంధనలు పాటించలేదు కలెక్టర్ నుంచి ఈవో వరకు ఫిర్యాదులు వెళ్లినా చర్యలు నిల్ సుడా నోటీసులు ఇచ్చినా ఖాతరు చేయకుండా నిర్మాణం స్థానిక రాజకీయుల అండతో రెచ్చిపోతున్న నిర్మాణదారు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) బంగారంతో పాటు ఇతరత్రా అనే సరుకులకు హోల్‌సేల్ మార్కెట్‌గా ఉన్న నరసన్నపేట పట్టణంలో అదే స్థాయిలో అక్రమ కట్టడాలు పెరిగిపోతున్నాయి. మేజర్ పంచాయతీ అయిన నరసన్నపేట జిల్లాలో వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణంగా పేరొందడంతో భూములు, స్థలాలకు, ఇళ్లకు డిమాండ్

BAGADI NARAYANARAO
Nov 222 min read


పాపాల ఫీజుతో ‘పార్కింగ్’ ప్లాజా
మడపాం టోల్‌ప్లాజా వద్ద వాహనాల అక్రమ పార్కింగ్ అనుమతుల్లేకుండానే సమీపంలో షాపులు, హోటళ్లు వాటికి వచ్చే వారి వాహనాలతో నిండిపోతున్న పరిసరాలు మామూళ్ల మత్తులో పట్టించుకోని అధికారులు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఈ ఫ్రేమ్‌లో కనిపిస్తున్న ఫొటోల సమాహారం శ్రీకాకుళం నుంచి నరసన్నపేట వైపు వెళ్లే మార్గంలో మడపాం టోల్‌గేట్‌కు చెందినది. శ్రీకాకుళం నుంచి వెళ్లడానికి ఏడు ద్వారాలు, నరసన్నపేట వైపు నుంచి రావడానికి ఏడు ద్వారాలు.. మొత్తం 14 లైన్ల రహదారిపై అడ్డదిడ్డంగా నిలిపిన వాహనాలు ఈ ఫోటోల
Prasad Satyam
Nov 212 min read


సమీకృత కలెక్టరేట్ కల.. నిధుల లేమితో కళవెళ!
ఉగాదికి ప్రారంభించాలన్న కృతనిశ్చయంతో కలెక్టర్ ఇంకా పూర్తి కాని మౌలిక వసతుల కల్పన నిర్మాణంలో జాప్యంతో పెరిగిన నిర్మాణ వ్యయం బకాయిలు చెల్లించనిదే పనులు చేయలేనంటున్న కాంట్రాక్టర్ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) దశాబ్దం కల.. మరో నాలుగు నెలల్లో సాకారం కానుంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమీకృత కలెక్టరేట్ సముదాయాన్ని ఉగాది నాటికి ప్రారంభించి జిల్లా పరిపాలనను అక్కడి నుంచే నిర్వహించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ కృతనిశ్చయంతో ఉన్నారు. కలెక్టరేట్ కాంప్లెక్స్‌లో తుద

BAGADI NARAYANARAO
Nov 212 min read


శివం.. సుందరం..
ఇటలీ దంపతుల సనాతన సౌందర్యం ఏటా కార్తీకంలో 108 శైవక్షేత్రాల సందర్శనం (డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి) వెనుక విద్యుత్ అలంకార శోభితమైన ఆలయ ప్రాకారం.. వారి నుదుట హిందూ సంప్రదాయాన్ని ప్రతిఫలించే కుంకమ బొట్టు.. కానీ వారి రూపురేఖలు, ఆహార్యం చూస్తే హిందూ ధర్మాన్ని పాటించే భారతీయుల్లా లేరు. అవును.. వారి విదేశీయులు.. ఇటలీవాసులు.. కానీ హిందూ ధర్మాన్ని ప్రత్యేకించి అనిర్వచనీయ అనుభూతినిచ్చే శివతత్వాన్ని మనసావాచా.. అనుసరిస్తున్న దంపతులు. అతని పేరు అలన్.. ఆమె పేరు మార్జియా. సనా

DV RAMANA
Nov 201 min read


రాష్ట్రంలో ఎన్కౌంటర్ల కలకలం
వరుసగా రెండు రోజుల్లో రెండు ఘటనలు మంగళవారం ఆరుగురు, బుధవారం ఏడుగురు మృతి తాజా ఘటనలో దేవ్‌జీ మరణించినట్లు ప్రచారం కానీ పోలీసుల జాబితాలో కనిపించని ఆ పేరు హిడ్మాను కావాలని చంపలేదన్న ఇంటెలిజెన్స్ ఏడీజీపీ (డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి) వరుసగా రెండోరోజూ రాష్ట్రంలోని మారేడుమిల్లి అడవుల్లో తుపాకులు గర్జించాయి. మరో ఏడుగురు మావోయిస్టులు మరణించారు. వీరిలో సీపీఐ మావోయిస్టు పార్టీ అగ్రనేతగా చెబుతున్న తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జ

DV RAMANA
Nov 192 min read


ఎవర్రా మీరంతా..?!
కాపీ లేకుండా ఒక్క సినిమా ఉందా? మలయాళంలో పావలా ఖర్చు.. మనకు వంద రెట్లు మోత బెనిఫిట్ షో డబ్బులు ఏ ఛారిటీలకు వెళ్తున్నాయి? ఎన్కౌంటర్ చేయాల్సింది సినిమావారిని కాదా! (సత్యంన్యూస్, శ్రీకాకుళం) మలయాళంలో లూసీఫర్ అనే సినిమాకు హీరో మోహన్‌లాల్. అక్కడ పెద్ద హిట్. దాన్నే తెలుగులో మెగాస్టార్‌తో గాడ్‌ఫాదర్‌గా రీమేక్ చేశారు. ఇక్కడ ఢమాల్. తెలుగులో పవన్‌కల్యాణ్ హీరోగా నటించిన భీమ్లానాయక్ మలయాళంలో పేరూ ఊరూ లేని హీరోతో తీస్తే ఇండస్ట్రీ హిట్. ఇక్కడ ఇద్దరు స్టార్లు ఉన్నా ఈ సిన

ADMIN
Nov 194 min read


ఆ పనులు చేస్తే.. మీ ఖర్మ!
‘ఉపాధి’ పనులపై హెచ్చరికతో కూడిన సందేశమిస్తున్న డుమా జిల్లా బడ్జెట్ రూ.241 కోట్లు.. ఆమోదాలు మాత్రం 400 శాతం అధికం రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో ఇదే పరిస్థితి ప్రజాప్రతినిధుల ఒత్తిడే కారణం కాదని పనులు చేపడితే నాలుగేళ్లు బిల్లుల కోసం ఆగాల్సిందే (సత్యంన్యూస్, శ్రీకాకుళం) జిల్లాలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో చేపట్టే పనులకు కాంట్రాక్టర్లు సొంతంగా బ్రేకులు వేసుకున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ఏడాది మార్చి నుంచి ఎడతెగకుండా ఉపాధి నిధులతో పనులు చేపట్టడానికి జిల్లావ్యాప్తంగా పు

NVS PRASAD
Nov 183 min read


పేలుతున్న కూరల బాంబ్!
జిల్లాలో కూరగాయ పంటల సాగే తక్కువ వాటిని కూడా ముంచేసిన మొంథా తుపాను దీనికితోడు కార్తీకమాసం ప్రభావం పెరిగిన దిగుమతులు.. ధరలు (సత్యం న్యూస్,శ్రీకాకుళం) అసలే వర్షాకాలం.. ఆపై మొంథా తుపాను కలిసి కూరగాయల దిగుబడులను భారీగా దెబ్బతీశాయి. దానికితోడు కార్తీకం ఎఫెక్ట్ వెరసి ధరలు ఆకాశాన్నంటి సామాన్య ప్రజలు కూర‘గాయాల’ పాలవుతున్నారు. జిల్లా కూరగాయల సాగు పెద్దగా లేకపోవడం వల్ల అధిక శాతం దిగుబడులపై ఆధారపడాల్సి వస్తోంది. సాధారణంగా కార్తీకమాసంలో మెజారిటీ ప్రజలు శాకాహారమే స్వీకరిస్తారు.

BAGADI NARAYANARAO
Nov 172 min read
bottom of page






