విధానాల రూపకర్త.. సంక్షోభ పరిష్కర్త
- DV RAMANA

- Mar 3
- 3 min read
కొత్త రైల్వేజోన్ ఆర్థిక సారథి మనవాడే
ప్రిన్సిపాల్ ఫైనాన్షియ అడ్వయిజర్‌గా డాక్టర్ హరిప్రసాద్
కవిటికి చెందిన ఆయన ఐఆరఏఎస్ అధికారి
మూడు దశాబ్దాలకుపైగా అనుభవం, సమర్థత
తెలుగు అధికారి నియామకం శుభ సంకేతం

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి)
ఆంధ్రుల చిరకాల కోరిక అయిన విశాఖ రైల్వేజోన్ క్రమంగా సాకారమవుతోంది. రాష్ట్ర పునర్విభజన చట్టంలో పొందుపర్చిన విధంగా కొంత ఆలస్యమైనా విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా (సౌత్ కోస్టల్) రైల్వేజోన్ కార్యకలాపాలు సాధించేందుకు వీలుగా ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి. ఇప్పటికే జోన్ సరిహద్దులు, వాల్తేర్ డివిజన్ విభజన ప్రక్రియలు ఒక కొలిక్కి వచ్చాయి. సిబ్బంది సర్దుబాట్లు జరుగుతున్నాయి. మరోవైపు కీలకమైన పరిపాలన అధికారుల నియామకాలు కూడా ఊపందుకున్నాయి. అందులో భాగంగా అతిముఖ్యమైన ఆర్థిక వ్యవహారాలు పర్యవేక్షించే ప్రిన్సిపాల్ ఫైనాన్షియల్ అడ్వయిజర్(పీఎఫఏ)గా ఆంధ్రుడినే నియమించడం ముదావహం. సాధారణంగా రైల్వేశాఖలో ఆంధ్రేతరులు ముఖ్యంగా హిందీవారి ప్రాబల్యం అధికం. కొత్తగా ఏర్పడుతున్న దక్షిణకోస్తా రైల్వేజోన్‌కు సైతం రాష్ట్రేతర అధికారులనే నియమిస్తే.. చాలా సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. సహజంగానే కొత్తగా ఏర్పాటయ్యే వ్యవస్థల్లో అనేక బాలారిష్టాలు ఉంటాయి. ఇక ప్రజారవాణాకు చెందిన రైల్వేలాంటి వ్యవస్థల్లో మరీ ఎక్కువగా ఉంటాయి. స్థానిక అవసరాల గురించి నాన్ లోకల్ అధికారులకు తెలియదు. అదే తెలుగు అధికారే అయితే.. అందులోనూ ఈ ప్రాంతానికి చెందినవారే అయితే.. అంతకంటే కావాల్సిందేముంటుంది. విశాఖ రైల్వే జోన్ విషయంలో ఇప్పుడు అదే జరిగింది. ఈ జోన్‌కు ఫైనాన్షియల్ అడ్వయిజర్‌గా సోమవారం బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ పూడి హరిప్రసాద్ అచ్చతెలుగు అధికారే కాకుండా.. ఉత్తరాంధ్రుడు.. అందునా మన శ్రీకాకుళం జిల్లావాసి కావడం ఈ జిల్లాకు గర్వకారణం. సివిల్ సర్వీస్ అధికారి అయిన ఈయనకు ట్రబుల్ షూటర్ (సంక్షోభ పరిష్కర్త) అనే గుర్తింపు ఉంది. ఎక్కడ పనిచేసినా సమస్యల పరిష్కారంలో చొరవ చూపుతూ తనదైన ముద్ర వేశారు.
రైతు కుటుంబం నుంచి రైల్వేలోకి

డాక్టర్ హరిప్రసాద్ స్వగ్రామం జిల్లాలోని మండల కేంద్రమైన కవిటి. వ్యవసాయమే ప్రధాన జీవనాధారమైన రైతు కుటుంబం. దివంగత జగ్గారావు, అనసూయమ్మ దంపతుల ముగ్గురు సంతానంలో చివరివాడే డాక్టర్ హరిప్రసాద్. వ్యవసాయం ప్రధాన వత్తి అయినప్పటికి వారు తమ పిల్లలను పెద్ద చదువులు చెప్పించి ఉన్నతస్థానాýకు చేరుకునేలా చేశారు. హరిప్రసాద్ పెద్దన్నయ్య రామారావు వైద్యవిద్య అభ్యసించి కవిటిలోనే డాక్టర్‌గా కొనసాగుతుండగా, రెండో అన్నయ్య లక్ష్మణరావు కవిటి సర్పంచ్‌గా వ్యవహరిస్తున్నారు. ఇక చిన్నవాడైన హరిప్రసాద్ 1994లో సివిల్స్ రాసి అందులో భాగమైన ఇండియన్ రైల్వే అకౌంట్స్ సర్వీస్ (ఐఆరఏఎస్)కు ఎంపికయ్యారు. 1995లో రాజహారతిని వివాహం చేసుకున్న ఆయనకు ఇద్దరు సంతానం. కుమార్తె బీటెక్ చేసి ఢిల్లీలో ఉద్యోగం చేస్తుండగా, కుమారుడు ఎంఎస్ చేసి అమెరికాలో పని చేస్తున్నారు. ఇక హరిప్రసాద్ ఇంట్లోనే కాకుండా ఆయన అత్తింటి వారిది కూడా రాజకీయ కుటుంబమే. వైకాపా నాయకుడు, మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్ హరిప్రసాద్‌కు స్వయానా బావమరిది. సాయిరాజ్ సొంత అక్కనే ఆయన చేసుకున్నారు. ఇక సాయిరాజ్ సతీమణి పిరియా విజయ జిల్లాపరిషత్ ఛైర్‌పర్సన్ అన్నది తెలిసిందే. సివిల్ ఇంజినీరింగ్‌లో బీటెక్ చేసిన హరిప్రసాద్, అనంతరం మార్కెటింగ్ అండ్ ఫైనాన్స్‌లో ఎంబీఏ, ఆంధ్రా యూనివర్సిటీ నుంచి ఎలఎల్‌బీ చేయడమే కాకుండా విద్యుత్ రంగంలో సంస్కరణలు( పవర్ సెక్టార్ రిఫార్మ్స్)పై పీహెచ్‌డీ కూడా చేసి డాక్టరేట్ అందుకున్నారు.

రైల్వే ఆర్థికంలో అపార అనుభవం
ఐఆరఏఎస్‌కు ఎంపికై రైల్వేలో చేరిన డాక్టర్ హరిప్రసాద్ మూడు దశాబ్దాలకుపైగా దేశవ్యాప్తంగా అనేక కీలక పోస్టులు నిర్వహించి తన సమర్థతను నిరూపించుకున్నారు. ఆగ్నేయ రైల్వే పరిధిలోని రాంచీ, తూర్పుకోస్తా రైల్వే పరిధిలోని సంబల్‌పూర్, వాల్తేర్, భువనేశ్వర్‌లలో డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ అండ్ ఫైనాన్స్ మేనేజర్‌గా పనిచేశారు. వారణాసిలోని డీజిల్ లోకోమోటివ్ వర్క్స్‌లో ఫైనాన్షియల్ అడ్వయిజర్ అండ్ సీఏఓగా కూడా పనిచేశారు. కాగా విశాఖలోని తూర్పుప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఏపీఈపీడీసీఎల్)కు ఫైనాన్స్ అండ్ ప్లానింగ్ డైరెక్టర్‌గా కూడా కొన్నాళ్లు సేవలందించారు. రాంచీలో కొత్త రైల్వే డివిజన్ కేంద్రం ఏర్పాటు సమయంలో, ఈపీడీసీఎల్ రెవెన్యూ పెంచడంలో హరిప్రసాద్ చేసిన కషి ప్రశంసలు అందుకుంది.
సైనిక సంక్షేమంలోనూ సొంత ముద్ర
గతంలో రక్షణ శాఖ పరిధిలో ఎక్స్ సర్వీస్‌మెన్ వెల్ఫేర్ విభాగం జాయింట్ సెక్రటరీగా పని చేసిన హరిప్రసాద్ మాజీ సైనికుల సంక్షేమానికి కొత్త ప్రణాళికలు అమలు చేయడంతోపాటు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ‘వన్ ర్యాంక్.. వన్ పెన్షన’ విధానం సుప్రీంకోర్టు కేసులో విజయం సాధించడంలోనూ కీలకపాత్ర పోషించారు. మాజీ సైనికులు ఆరోగ్యపరిరక్షణ, సంక్షేమం, సెటిల్‌మెంట్స్, పెన్షన్ల మంజూరు అంశాల్లో ఉదారంగా వ్యవహరించారన్న పేరుంది. కేంద్రీయ సైనిక్ బోర్డును కూడా పర్యవేక్షించిన ఆయన మాజీసైనికులు, అమరులైన మాజీ సైనికుల కుటుంబాల కోసం సీఎసఆర్, పబ్లిక్ విరాళాలు పెద్దమొత్తంలో అందేలా కషి చేశారు. ఈ ీVAదాలో హరిప్రసాద్ సాధించిన పెద్ద విజయం వన్ ర్యాంక్.. వన్ పెన్షన్ విషయంలో సుప్రీంకోర్టులో కేంద్రం విజయం సాధించేలా చేయడం. ఈ విధానానికి అనుకూలంగా కేంద్రం వాదనలకు ఊతమిచ్చి 2022 మార్చిలో సుప్రీంకోర్టులో విజయం అందజేశారు. ఈ కేసులో లభించిన విజయం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి రూ.రెండు లక్షల కోట్లు ఆదా చేశారని అంచనా. ఈయన హయాంలోనే మాజీ సైనికులకు స్పర్శ్ పేరుతో కొత్త సమగ్ర పెన్షన్ విధానం తీసుకొచ్చారు. అలాగే మాజీ సైనికులకు పబ్లిక్, ప్రైవేట్ ఉద్యోగాల్లో కోటా ఇచ్చే పున:స్థాపన కార్యక్రమాన్ని, మాజీ సైనికుల ఆరోగ్య పరిరక్షణకు ఆయుష్ విధానం అమల్లోకి తేవడానికి కషి చేశారు. హరిప్రసాద్ అమలు చేసిన వినూత్న విధానాల కారణంగా ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే ఫండ్‌కు అందే విరాళాలు ఏడాదికి రెండు మూడు కోట్ల నుంచి ఏకంగా రూ.45 కోట్లకు పెరిగాయి. రైల్వేతోపాటు మౌలిక సదుపాయాలు, ఆర్థిక వ్యవహారాలు, ప్రాజెక్టుల నిర్వహణ, యాజమాన్యం తదితర విభాగాల్లో ఆయన సమర్థతను, అనుభవం కొత్తగా ఏర్పడుతున్న విశాఖ రైల్వేజోన్‌ను ప్రగతి పట్టాలపై పయనింపజేయడానికి దోహదం చేస్తాయన్న ఆశాభావం వ్యక్తమవుతోంది.






Comments