top of page


నిన్నటి విజయం.. నేటి ఆందోళన!
ఎన్డీఏ ఆధిపత్యం.. ప్రతిపక్షం అస్తవ్యస్తం సమీకరణాలు మార్చే దిశగా డీఎంకే? రాజకీయాల్లో ఏ క్షణంలోనైనా ఏమైనా జరగొచ్చు అనడానికి తాజా పరిణామాలే నిదర్శనం. ఏప్రిల్ 17న ముగిసిన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి ఒక అరుదైన విజయాన్ని సాధించింది. మహిళా రిజర్వేషన్ల అమలును నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్)తో ముడిపెట్టే రాజ్యాంగ సవరణ బిల్లును ప్రతిపక్షాలన్నీ ఏకమై అడ్డుకోగలిగాయి. లోక్‌సభలో బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లు వచ్చినప్పటికీ, రాజ్యాంగ సవరణకు అవసరమైన

NVS PRASAD
1 day ago2 min read


పాముల ఫారాలు.. స్నేక్ విలేజ్‌లు!
చైనాలో దశాబ్దాలుగా వర్థిల్లుతున్న సర్పాల పెంపకం పాము చర్మం, విషానికి అంతర్జాతీయంగా డిమాండ్ వాటి ద్వారా రూ.కోట్లలో వ్యాపార లావాదేవీలు చైనీయుల ఆహారంలోనూ దానిది ప్రత్యేక స్థానం (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) మనం పామును దేవతగా, దేవుడిగా పూజిస్తాం. కానీ అదే పాము మన సమీపంలోకి వస్తే చాలు.. హడలి చస్తాం.. ఆమడదూరం పారిపోతాం. వీలేతే దాన్ని చంపేస్తాం.. లేదా స్నేక్ క్యాచర్స్‌ను పిలిపించి పట్టిస్తాం. వారు కూడా పట్టుకున్న పాములను అటవీ ప్రాంతాల్లో విడిచిపెట్టేస్తారు. ఇక పాములు ఆ

DV RAMANA
1 day ago2 min read


కలుషిత నిర్వాకం.. విద్యార్థుల ఆరోగ్యంతో చెలగాటం
మెనూ సూపర్.. మెటీరియల్ వేస్ట్ గార కేజీబీవీలో బయటపడ్డ అసలు రంగు నలుగురు సస్పెండ్.. ఇద్దరు వెండర్లు బ్లాక్‌లిస్ట్ ఇంకా పాత వాసనలు వదిలించుకోని కేజీబీవీ ఎస్వోలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) “ఉదయం రాగిజావ.. బ్రేక్‌ఫాస్ట్ పూలీ, బంగాళాదుంప కూర.. మధ్యాహ్నం అన్నం, పప్ప్పు, చారు, గుడ్డు, వంకాయ`బంగాళాదుంప`శనగపప్ప్పు కూర, సాయంత్రం స్నాక్స్ కింద బెల్లం పాయసం.. రాత్రి అన్నం, చారు, వెజిటబుల్ కర్రీ..” ఇదీ ఒక కేజీబీవీలో మన జిల్లాలో అమలుచేసే మెనూ. ఇది సోమవారం నుంచి ఆదివారం వరకు కూరల్లో
Prasad Satyam
1 day ago3 min read


రివెంజ్ యాక్షన్ డ్రామా
చాలామంది దర్శకులకు మహాభారతంలోని పాత్రలు, సంఘటనలు, ఘట్టాల ఆధారంగా సినిమాలు చేయాలనే తపన ఉంటుంది. మహాభారతం ఆధారంగా వచ్చిన చాలా సినిమాలు, పాత్రలు క్లాసిక్స్‌గా నిలిచాయి. మణిరత్నం దళపతి మొదలుకొని రాజమౌళి బాహుబలి వరకు ఎన్నో చిత్రాల్లో మహాభారతం ఛాయలు కనిపిస్తాయి. ఒక్క సినిమా తీసిన అనుభవం గల దర్శకుడు మురళీకిశోర్ అబ్బూరి, అక్కినేని అఖిల్ కథానాయకుడిగా లెనిన్ సినిమాను మహాభారతంలోని ఘట్టాల ఆధారంగానే తెరకెక్కించాడు. ట్రైలర్లోనే ఆ మొత్తం పాత్రలు, ఒక ప్రాంతాన్ని చూపించిన తీరు మహాభారతాన్ని గ
Guest Writer
1 day ago3 min read


ఇలా అయితే భవిష్యత్తే బ్లాకౌట్!
అభివృద్ధి అంటే కొత్త సౌకర్యాలు, సొబగులు, ఆకర్షణలు కల్పించేదిగా ఉండాలే తప్ప ఉన్న సౌకర్యాలను ఊడగొట్టేదిగా.. కొత్త కష్టాలు సృష్టించేదిగా ఉండకూడదు. కానీ ఈ పాటి వివేచన ప్రభుత్వాలకు, దాని ప్రణాళికలను అమలు చేసే అధికారులకు ఎందుకు ఉండటంలేదో అర్థం కావడంలేదు. వీరి అనాలోచిత నిర్ణయాలు, చర్యలకు నగర జీవనం బలైపోతున్నది. వర్షాకాలం వస్తే చాలు.. ఏ వర్షం, ఎప్పుడు తమను ముంచేస్తుందోనని మెట్రో నగరాలు బెంగటిల్లిపోతున్నాయి. ఈ భయాలకు ఇటీవల భారీవర్షాల తో తల్లడిల్లిన పలు నగరాల దుస్థితే నిదర్శనం. రుతుపవ

DV RAMANA
1 day ago3 min read


మీరెక్కడున్నారు ‘సర్ ’?!
నగరంలో దొరకని ఓటర్ల చిరునామాలు డిజిటలైజేషన్లో అట్టడుగున శ్రీకాకుళం 40వేల వరకు ఓట్లు గల్లంతు ఖాయం వలసలు, డూప్లికేట్లు ఉండటమే ప్రధాన కారణం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఈ నెల 14తో సర్ ప్రక్రియ సమాప్తం కానున్న నేపథ్యంలో ఆన్లైన్ చేసేందుకు అనేక అడ్డంకులు ప్రతిబందకంగా మారుతున్నాయి. ప్రజలు అందుబాటులో లేకపోవడంతో ఫారాలు పంపిణీ చేయడమే పెద్ద ప్రహసనంగా కొన్నిచోట్ల మారగా, మరికొన్నిచోట్ల ఫారాల పంపిణీయే పూర్తికాలేదు. తీసుకున్న ఫారాలు సైతం ప్రజలు తిరిగి ఇవ్వకపోవడం వల్ల కొన్నిచోట్ల జాప

BAGADI NARAYANARAO
2 days ago2 min read


గార కేజీబీవీలో పిల్లల ప్రాణాలతో చెలగాటం
30 మంది విద్యార్థినులకు తీవ్ర అస్వస్థత నాలుగు రోజుల పాటు నిజాన్ని దాచిపెట్టిన ప్రిన్సిపాల్ రజినీ కుమారి పురుగులు పట్టిన రాగి పిండి, నిల్వ అన్నం, పాడైన చిక్కీల వడ్డన చేయి దాటే వరకు అధికారులకు, తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వని వైనం వైద్య బృందంతో రంగంలోకి దిగిన సమగ్ర శిక్ష ఏపీసీ ప్రస్తుతం విద్యార్థినులు క్షేమం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) గార మండలం శాలిహుండం కేజీబీవీ పాఠశాలలో సోమవారం నుంచి విద్యార్థినులు డయేరియా బారిన పడి బాధపడుతున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాఠశాల

BAGADI NARAYANARAO
2 days ago2 min read


అది కాదు సర్దుబాటు.. తెలుగుకు వెన్నుపోటు!
UP పాఠశాలల్లో తెలుగు టీచర్ పోస్టులు రద్దు తద్వారా భాషోపాధ్యాయులను మిగులు సిబ్బందిగా చూపిన వైనం వారి సర్దుబాటు పేరుతో ఇతర సబ్జెక్టు టీచర్లుగా నియామకం విద్యాహక్కు చట్టానికి తూట్లు పొడుస్తున్న విద్యాశాఖ ఈ నిర్వాకాలతో పాఠశాలల్లో తెలుగు బోధనకు గండం (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) పరభాష తెలియని వ్యక్తిని ఆ భాషలోనే మాట్లాడమని ఒత్తిడి చేస్తే ఆ వ్యక్తి చేతకాక బిక్కచచ్చిపోతాడు. అదేరీతిలో ఒక సబ్జెక్టులో ప్రావీణ్యం కలిగి, ఏళ్ల తరబడి అదే సబ్జెక్టు బోధనలో కాకలుతీరిన టీచర్లను ఉన్నఫళ

DV RAMANA
2 days ago2 min read


ఆరోగ్య భారతానికి డిజిటల్ వారధి
సంపూర్ణ ఆరోగ్య భారతాన్ని నిర్మించాలన్న లక్ష్యంతో అనేక పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య కార్యక్రమాలన్నింటినీ డిజిటలైజ్ చేసి ఒకే ఆన్లైన్ ప్లాట్‌ఫారంపైకి తీసుకొచ్చింది. దీంతో దేశప్రజలు అన్ని రకాల వైద్యసేవలను ఇంటి నుంచే పొందవచ్చని కేsద్ర ఆరోగ్యశాఖ వర్గాలు పేర్కొన్నాయి. కోవిడ్ సమయంలో రోగుల కాంటాక్ట్స్‌ను ట్రేస్ చేసేందుకు ఆరోగ్య హెచ్చరికలు జారీ చేసేందుకు రూపొందించిన ఆరోగ్యసేతు యాప్‌ను ఈ లక్ష్యసాధన కోసం పూర్తిస్థాయి డిజిటల్ హెల్త్ ప్లాట్‌ఫారంగా అప్గ్రేడ

DV RAMANA
2 days ago3 min read


బదిలీల గండం నుంచి ‘ముగ్గురు’ సేఫ్!
నాలుగేళ్లు దాటినా కదలని అధికారులు గత ప్రభుత్వ హయాంలో ల్యాండింగ్.. ప్రస్తుత కూటమితో మంతనాలు? అవినీతి ఆరోపణలు, ఏసీబీ కేసులున్నా అండగా నిలుస్తున్న రాజకీయ ప్రాపకం! వెళ్లేది లేదంటున్న బీసీ సంక్షేమ, ఖజానా, ఔషధ నియంత్రణ శాఖల బాస్‌లు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ప్రభుత్వాలు మారినా.. ప్రజాప్రతినిధులు మారినా.. ఆ ముగ్గురు అధికారుల సీట్లు మాత్రం కదలడం లేదు! గత వైకాపా హయాంలో సిఫార్సులతో ల్యాండ్ అయిన సదరు అధికారులు.. ఇప్పుడు కూటమి నేతలతోనూ మంతనాలు సాగిస్తూ జిల్లాలో తిష్ట వేశారు. మూడేళ్

BAGADI NARAYANARAO
3 days ago2 min read


తొలగింపుల్లో.. తారతమ్యాలు!
చిన్న షాపులపై ప్రొక్లైయిన్ల ప్రతాపం పెద్ద వస్త్ర సముదాయాల వద్దకు వెళ్లని మున్సిపల్ యంత్రాంగం ఫుట్‌పాత్‌లను కప్పేసి రోడ్డు మీదకే కార్ల పార్కింగ్ ర్యాంపులు అన్ని ఆక్రమణలనూ తొలగిస్తాం- మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ సుధీర్ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) బాపూ దర్శకత్వం వహించిన ఓ సినిమాలో ముళ్లపూడి వెంకటరమణ రాసినట్టు ఆడాళ్లు, మగాళ్లు సమానమే. కాకపోతే మగాళ్లు కొంచెం ఎక్కువ సమానం అన్నట్టు.. నగరంలో ఫుట్‌పాత్‌లకు ఆనించి రోడ్డు మీదకు యథేచ్చగా నిర్మించిన ర్యాంపులు (గట్లను) మున్సిపల్ యంత్
Prasad Satyam
3 days ago1 min read


ప్రపంచ మార్కెట్లపై ట్రంప్ తూటాలు
‘సీజ్ ఫైర్ ముగిసింది’.. అన్న ఒక్కమాట యావత్తు ప్రపంచం గుండెల్లోకి తూటాలా దూసుకుపోయింది. ప్రపంచ ఆర్థిక, రవాణా, వాణిజ్య, చమురు రంగాలను అతలాకుతలం చేసేసింది. మళ్లీ అమెరికా`ఇరాన్ మధ్య దాడులు పెరగడంతో అంతర్జాతీయ మార్కెట్లు షాక్‌కు గురై కుప్పకూలాయి. అంతర్జాతీయ ప్రయాణాలు సంక్షోభంలో పడ్డాయి. దీనంతటికీ కారణం.. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మహాశయుడేనంటూ యావత్తు ప్రపంచం ముక్తకంఠంతో ఘోషిస్తున్నది. పిచ్చివాడి చేతికి రాయి ఇస్తే ఎలా ఉంటుందో.. ట్రంప్ దొరగారి పాలన అలానే ఉందన్న వ్యాఖ్యలు, వ

DV RAMANA
3 days ago3 min read


యుద్ధం ఛిద్రం చేసింది.. దుబాయ్ దిబ్బయ్యింది!
అమెరికా సైనిక శిబిరాలకు భూమి ఇచ్చినందుకు ఫలితం ఇరాన్ దాడుల్లో పర్యాటక, వ్యాపార కేంద్రాలన్నీ నేలమట్టం అభద్రతాభావంతో దేశం వీడిన పెట్టుబడిదారులు ఆర్థిక పునరుద్దీపనకు చర్యలు చేపట్టిన ప్రభుత్వం ఇంతలోనే మళ్లీ మొదలైన యుద్ధం.. గల్ఫ్‌పై దాడులు (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) ఎటుచూసినా తలెత్తుకునేలా చేసే ఆకాశహార్మ్యాలు.. అందుకు తగినట్లే ఆకాశంలో విహరింపజేసే కలల లోగిళ్లు.. అపారమైన ఉద్యోగావకాశాలు.. విలాసవంతమైన జీవితాలు.. విస్తారమైన చమురు క్షేత్రాలు.. అంతకుమించిన వ్యాపార సామ్ర

DV RAMANA
3 days ago3 min read


ఫుట్‌పాత్ గట్ల తొలగింపు
జీటీ రోడ్డు నుంచి ప్రారంభం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) శ్రీకాకుళం కార్పొరేషన్‌కు పాచారులు నడవడం కోసం ప్రత్యేకంగా ఫుట్‌పాత్‌లు ఏర్పాటు చేయడమే దండగనుకుంటే, ఇప్ప్పుడు ఆ ఫుట్‌పాత్‌ను, రోడ్డును కలిపేసి ర్యాంపులు నిర్మించడంతో ఇటీవల మరణాలు కూడా సంభవించాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని మున్సిపల్ యంత్రాంగం మంగళవారం జీటీ రోడ్డులో ఫుట్‌పాత్ గట్ల తొలగింపునకు శ్రీకారం చుట్టింది. స్థానిక చంద్రమహల్ ఎదురుగా ఇటువంటి ఫుట్‌పాత్ గట్టునే ఢీకొని హయాతినగరాని
SATYAM DAILY
4 days ago1 min read


అతడు.. ఆమె.. ఓ భార్య!
సహజీవన కాంక్షతో ప్రేయసితో పరారైన భర్త కోయంబత్తూరో నెల రోజులుగా కాపురం వారిద్దరికీ నచ్చజెప్పి వెనక్కి తీసుకొచ్చేందుకు భార్య యత్నం మార్గమధ్యంలో రైలు బాత్రూంలోనే ప్రేయసీప్రియుల ఆఘాయిత్యం చావుబతుకుల మధ్య సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స ఇద్దరూ వివాహితులే కావడంతో.. రెండు కుటుంబాల్లో విషాదం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఇద్దరికీ వేర్వేరుగా వివాహాలు జరిగాయి.. సొంత సంసారాలు ఉన్నాయి. కానీ వివాహేతర సంబంధం, సహజీవన కాంక్ష వారిని ఆనందమయమైన వైవాహిక జీవితాన్ని, కుటుంబాన్ని కాలదన
SATYAM DAILY
4 days ago2 min read


అసమానతల అభివృద్ధి!
మన ఆర్థిక వ్యవస్థ దూసుకుపోతోంది.. అగ్రదేశాలతో పోటీపడుతూ ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగి అమెరికా, చైనాల వంటి దేశాల సరసన చేరిందని మనం చంకలు గుద్దుకుంటున్నాయి. కానీ పాలకులు చెబుతున్న ఈ ఆర్థిక వృద్ధి పౌరుల స్థాయికి చేరడంలేదని ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన తాజా నివేదిక కుండ బద్దలు కొట్టింది. ఈ నెల ఒకటో తేదీన విడుదల చేసిన కంట్రీ ఇన్కమ్ క్లాసిఫికేషన్స్`2026 నివేదిక ప్రకారం.. భారతదేశంలో పౌరుల తలసరి ఆదాయం 2760 డాలర్లు మాత్రమే. అంటే దేశం ఇంకా దిగువ మధ్య ఆదాయ దేశాల జాబిత

DV RAMANA
4 days ago3 min read


అనుమతుల్లేని అభిమానం..అధికారులు పెంచిన వివాదం
నిజాయితీపరుడి విగ్రహం చుట్టూ నిబంధనల లొసుగులు ప్రజల మనఃఫలకాలలో ఉన్న నాయకుడ్ని కాంక్రీట్ దిమ్మలలోకి లాగారు మాటిచ్చిన ఎమ్మెల్యేను ప్రశ్నించకుండా సొంత నిర్ణయాలపై విస్మయం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) సుదీర్ఘ తన రాజకీయ జీవితంలో మాజీమంత్రి అప్పలసూర్య నారాయణ ఒక్కటంటే ఒక్కటి కూడా నిబంధనలకు విరుద్ధంగా ఉన్న పనికి సిఫార్సు చేసింది లేదు. సొంత పార్టీలో నేతలు పోలీస్‌స్టేషన్‌లో ఉన్నా వదిలేయాలని చెప్పిన సందర్భం భూతద్దం పెట్టి వెతికినా దొరకదు. రాజ్యాంగం మీద, మనం చేసుకున్న చట్టాల మీద ఆయనకు
Prasad Satyam
5 days ago2 min read


నమ్మకానికి నిలువుటద్దం!
నరసన్నపేట టు నయా లీడర్షిప్ కృష్ణదాస్ బలాలు, భవిష్యత్ పరీక్షలు జగన్‌కు నమ్మకస్తుడిగా, జిల్లా సారధిగా నేడు మరో పుట్టినరోజు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) జిల్లా వైకాపా సారధిగా ధర్మాన కృష్ణదాస్ విజయవంతమయ్యారా? విఫలమయ్యారా? అన్న చర్చకు ఆ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి ఏనాడూ తావివ్వలేదు. ఎందుకంటే.. నమ్మకానికి నిలువుటద్దం ధర్మాన కృష్ణదాస్. తన సోదరుడు ప్రసాదరావు కాంగ్రెస్‌లో కీలక స్థానంలో ఉన్న రోజుల్లోనే జగన్ వెంట నడిచిన కృష్ణదాస్ కంటే నమ్మకస్తుడు మరొకరు ఆయనకు కనిపించలేదు, కనిపించ

BAGADI NARAYANARAO
5 days ago3 min read


విశాఖ జోన్ తొలి ప్రభావం..!
అముదాలవలస నుంచి పలాసకు కార్యాలయాల తరలింపు 56 ఏళ్ల చరిత్ర కలిగిన డివిజనల్ కేంద్రానికి గండం రైల్వే ఉద్యోగుల్లో ఆందోళన. కేంద్ర మంత్రి, ఎమ్మెల్యే జోక్యం కోసం ఎదురు చూపు (సత్యం న్యూస్, అముదాలవలస ) విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్ (విశాఖ రైల్వే జోన్) ప్రభావం శ్రీకాకుళం జిల్లాలో కనిపించడం ప్రారంభమైంది. దశాబ్దాలుగా జిల్లా రైల్వే పరిపాలనా కేంద్రంగా కొనసాగుతున్న శ్రీకాకుళం రోడ్డు (అముదాలవలస) నుంచి కీలక రైల్వే ఇంజినీరింగ్ కార్యాలయాలను పలాసకు తరలించే ప్రక్రియ

BAGADI NARAYANARAO
5 days ago2 min read


స్థానికులకు ‘సున్నా’.. ఇతర రాష్ట్రాల వారికే ‘ఐదు వేలు’
శ్రీకాకుళం పెత్తనం.. బీహార్, యÖపీలకే జీతం నిబంధనలు ఇప్ప్పుడు బయటబెట్టిన మైనార్టీ సంక్షేమ శాఖ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) శ్రీకాకుళంలో ఇమామ్‌ల గౌరవభృతి స్థానికులకు కాకుండా ఇతర రాష్ట్రాల వారికే జమ అవుతున్న వైనం జిల్లాలో వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలు అనర్హుల ఖాతాల్లోకి జమవుతున్నాయని చెప్పడానికి ఇదే నిదర్శనం. ప్రభుత్వం అధికారికంగా గుర్తించిన మసీదుల్లో సేవలందిస్తున్న ఇమామ్‌లకు నెలకు రూ.5వేల గౌరవభృతి అందిస్తోంది. మైనార్టీ సంక్షేమానికి ఉద్దేశించిన ఈ

BAGADI NARAYANARAO
5 days ago2 min read
bottom of page


