top of page


‘ఆన్‌లైన’ రేటింగ్ మాయ!
ఇప్పుడు నడుస్తున్నది డిజిటల్ యుగం.. మనం విహరిస్తున్నది ఆన్లైన్ లోకం. ఇంటర్నెట్ పుణ్యాన అరచేతిలోనే ప్రపంచాన్ని ఇముడ్చుకోగలుగుతున్నాం. కాలు బయట పెట్టకుండా ఇంటి నుంచే చాలా పనులు చేసుకోగలుగుతున్నాం. ఏది కావాలన్నా మన కాళ్ల దగ్గరికే రప్పించుకుంటున్నాం. ఆహారం, ప్రయాణ టికెట్లు, పచారీ సామాన్లను ఇంటికే రప్పించుకుంటున్న మనం.. చివరికి నెలవారీ కట్టాల్సిన కరెంటు, ఫోన్ బిల్లులు, పాలసీల ఈఎంఐలను ఆయా కార్యాలయాలకు వెళ్లకుండానే, క్యూలైన్లలో పడిగాపులు పడకుండానే నిమిషాల్లో చెల్లించేయగలుగుతున్నాం

DV RAMANA
15 hours ago3 min read


నబిన్ ముంగిట పెద్ద సవాళ్లు
పుష్కర కాలంగా దేశాన్ని ఏలుతున్న ఎన్డీయే కూటమిలో ప్రధాన భాగస్వామిగా కేంద్ర ప్రభుత్వంలోనూ, జాతీయ రాజకీయాల్లోనూ చక్రం తిప్పుతున్న భారతీయ జనతాపార్టీ కొత్త జవసత్వాలు సంతరించుకునే దిశగా అడుగులు వేస్తోందా? పార్టీ జాతీయ అధ్యక్షుడిగా 46 ఏళ్ల నేతను ఎన్నుకోవడమే ఈ ప్రశ్నకు అవుననే సమాధానం ఇస్తోంది. అగ్ర నాయకత్వంతోపాటు సంస్థాగతంగా కూడా పార్టీలో భారీ మార్పులకు ఇది ఆరంభమని బీజేపీ శ్రేణుల్లోనే చర్చ జరుగుతోంది. ఎక్కడో బీహార్‌లో ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా ఉన్న నితిన్ నబిన్‌ను అనూహ్యంగా తెరపై

DV RAMANA
2 days ago3 min read


శివసేన శకం అంతరిస్తోందా?
ఎన్నికల్లో పార్టీల గెలుపు ఓటములు సహజం. ఒకసారి గెలిచిన పార్టీ మరోసారి ఓడిపోవచ్చు. ఇప్పుడు ఓడిపోయిన పార్టీ మళ్లీ పుంజుకుని అధికారం అందుకోవచ్చు. కానీ కొన్ని ఎన్నికలు మాత్రం పార్టీల ఉనికినే ప్రశ్నార్థకంగా మార్చేస్తుంటాయి. మహారాష్ట్రలో ఇటీవల జరిగిన నగరపాలక సంస్థల ఎన్నిÅ£లు ఒక పార్టీని అటువంటి దుస్థితిలోకే నెట్టేశాయి. మిగతా నగరపాలక సంస్థల సంగతెలా ఉన్నా మన దేశ ఆర్థిక రాజధానిగా, మహారాష్ట్రకు గుండెకాయలా విలసిల్లుతున్న ముంబై మహానగరం తనను రెండున్నర దశాబ్దాలపాటు అవిచ్ఛిన్నంగా ఏలిన ఒక

DV RAMANA
3 days ago3 min read


కుక్కకాటుకు ‘సుప్రీం’ చెప్పుదెబ్బ!
వీధికుక్కల విషయంలో మరోసారి సుప్రీంకోర్టు కొరడా రaుళింపించడం ప్రభుత్వాలకు, సోకాల్డ్ జంతు ప్రేమికులకు ఇప్పటికైనా కనువిప్పు కావాలి. గుణపాఠం నేర్చుకోవాలి. దీనిపై గతంలోనే తాము ఇచ్చిన డైరెక్షన్స్‌ను ఆయా వర్గాలు పట్టించుకోకపోడాన్ని సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా ఆక్షేపించింది. కుక్కలవే ప్రాణాలా? మనుషులవి ప్రాణాలు కావా?? అని నిలదీసింది. వీధికుక్కలు పాదచారులు, పిల్లలపై పడి కండలు పీకేస్తూ మరణాలకు కారణమవుతుంటే చూస్తూ ఊరుకోవాలా? ఇంకా కుక్కలపై సానుభూతి చూపించాలా అని నిలదీసింది. తనకుమాలి

DV RAMANA
Jan 142 min read


అక్కరకురాని వెనిజులా ఆయిల్!
ఆయిల్ నిక్షేపాలు కలిగిన దేశాలు సుసంపన్నంగా ఉంటాయని అందరూ అభిప్రాయపడుతుంటారు. కానీ అది వాస్తవం కాదు. దానికి ఉదాహరణ ప్రస్తుతం వార్తల్లో నిలిచిన వెనిజులా దేశమే. ప్రపంచంలోనే అత్యధిక ఆయిల్ నిక్షేపాలు కలిగిన ఈ దేశం పేదరికం అనుభవిస్తోంది. వనరులు ఉన్నా వాటిని అమ్ముకోలేకపోవడం, ప్రభుత్వ లోపభూయిష్ట విధానాలు ఈ దుస్థితికి కారణంగా నిలుస్తున్నాయి. ఆ దేశంలో లభించే ముడి చమురు చాలా చిక్కగా ఉంటుంది. అందువల్ల దాన్ని శుద్ధి చేయడం చాలా కష్టం, ఖర్చుతో కూడుకున్నది. వెనిజులాకు చెందిన ఒరినోకో బెల్ట్

DV RAMANA
Jan 133 min read


అసద్ ఆశ ఆకాశంలో.. వారి మహిళలు పాతాళంలో!
మనది సెక్యూలర్ దేశం. మెజారిటీలు, మైనారిటీలు అన్న తారతమ్యాలు లేకుండా అన్ని రంగాల్లో.. అందరికీ సమానావకాశాలు ఇవ్వాలన్నది రాజ్యాంగం సాక్షిగా భారతదేశ స్ఫూర్తిమంత్రం. ఇప్పటివరకు అదే జరుగుతోంది. కులమతవర్గాలకు అతీతంగా వ్యవహరిస్తున్నందునే ఆదివాసీవర్గానికి చెందిన ద్రౌపది ముర్ము రాష్ట్రపతి పదవినధిష్టించగలిగారు. దేశ ప్రథమ పౌరురాలిగా గౌరవమర్యాదలు అందుకుంటున్నారు. అదే క్రమంలో ఇతర మైనారిటీ వర్గాల మహిళలు కూడా ఉన్నత రాజ్యాంగ పదవులు అధిష్టించడం మనదేశంలో అసాధ్యమేమీ కాదు. దానికి అడ్డుచెప్పేవారు

DV RAMANA
Jan 123 min read


రెండోసారి ఆదివారం బడ్జెట్!
కొత్త సంవత్సరంలో అడుగుపెట్టినప్పుడు అనేక మార్పులకు ఆహ్వానం పలకాల్సి వస్తుంది. వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, సామాజికంగా, ప్రభుత్వపరంగానూ ఈ మార్పులు ఉంటాయి. వాటికి అనుగుణంగా మన నిర్ణయాలను, కార్యాచరణను కూడా మార్చుకోవాల్సి వస్తుంది. వీటన్నింటిలోనూ అత్యంత కీలకమైనవి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్లు. ఈ బడ్జెట్లలో ప్రతిపాదించే కొత్త పన్నులు, మినహాయింపులు, ఇతర అంశాలు కుటుంబ బడ్జెట్‌పైనా ప్రభావం చూపుతాయి కనుక బడ్జెట్ సమయానికి నెలా రెండు నెలల ముందు నుంచే ఈసారి బడ్జెట్ ఎలా ఉంటుందో? ప

DV RAMANA
Jan 93 min read


ఆ వీడియోతో ఫిట్‌నెస్‌కు లంకె!
పాత వాహనాలు నిర్ణీత కాలపరిమితి తర్వాత కూడా రోడ్లపై నడవాలంటే తప్పనిసరిగా రవాణా శాఖ నుంచి ఫిట్నెస్, పొల్యూషన్ సర్టిఫికెట్లు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ నిబంధనలను అమలు చేయడంలో రవాణా శాఖ అధికారులు విఫలమవుతున్నారన్న ఆరోపణలు కొత్త కాదు. రవాణా శాఖ అంటేనే అవినీతి పుట్ట. అక్కడ దళారులదే రాజ్యం. వాహనాల రిజిస్ట్రేషన్లు చేయడం నుంచి డ్రైవింగ్ లైసెన్సుల జారీ, రెన్యూవల్స్, ఫిట్నెస్ సర్టిఫికెట్ల జారీ వంటివన్నీ ఈ కార్యాలయాలే చేయాల్సి ఉంటుంది. అధికారులు స్వయం తనిఖీలు, పరిశీలనలు జరిపి, భ

DV RAMANA
Jan 83 min read


ఆర్థిక నావను ముంచడం ‘గ్యారెంటీ’!
ఇటీవలి కాలంలో జరుగుతున్న ఎన్నికల్లో గ్యారెంటీ లేదా ష్యూరిటీ పేరుతో కొన్ని హామీలు ప్రత్యేకంగా ఇవ్వడాన్ని పార్టీలు అలవాటు చేసుకున్నాయి. అంటే.. ‘గ్యారెంటీ లేదా ష్యూరిటీ’ అన్న ముద్ర వేసిన ఉచిత పథకాలను కచ్చితంగా అమలు చేస్తామని చెప్పడమన్నమాట! ఇటువంటి గ్యారెంటీ హామీలతోనే హిమాచల్‌ప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తదితర రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాలు గద్దెనెక్కాయి. కానీ ఆచరణలోకి వచ్చిన తర్వాతే తెలిసింది గ్యారెంటీ హామీలు అంటే ఆయా పథకాల అమలుకు గ్యారెంటీ కాదని.. మొత్తం

DV RAMANA
Jan 72 min read


‘విమానం’లో క్రెడిట్ వార్!
ఉత్తరాంధ్ర వరదాయినిగా భావిస్తున్న.. విశాఖపట్నానికి ప్రత్యామ్నాయ విమానాశ్రయంగా భావిస్తున్న భోగాపురంలో నిర్మిస్తున్న అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా నిర్ణీత గడువు కంటే ముందే ప్రయాణికుల సర్వీసులు నిర్వహించేందుకు దాదాపు సిద్ధం కావడం ముదావహం. ఆదివారం నిర్వహించిన తుది ట్రయల్ రన్ విజయవంతం కావడంతో వచ్చే జూన్ నుంచి విమానాశ్రయ కార్యకలాపాల నిర్వహణకు మార్గం సుగమమైంది. ఈ క్రమంలోనే ఈ ఎయిర్‌పోర్టు అరుదైన రికార్డు నమోదు చేసింది. గ్రీన్ఫీల్డ

DV RAMANA
Jan 62 min read


పొగరాయుళ్లకు కొత్త ఏడాది సెగ
‘పొగ తాగనివాడు దున్నపోతై పుట్టున్ ’.. అన్నాడు కన్యాశుల్కంలో గిరీశం. ‘సరదా సరదా సిగరెట్టు.. ఇది దొరల్ తాగు భల్ సిగరెట్టు’ అన్నాడో సినీకవి. దొరలేం ఖర్మ.. ఈరోజుల్లో చదువుకుంటున్న కుర్రాళ్లు కూడా సరదా సరదాగానే సిగరెట్టు తాగడం మొదలుపెట్టి.. క్రమంగా దానికి బానిసలైపోతున్నారు. తామూ దొరల్లా ఫీలైపోతున్నారు. సిగరెట్టు పొగను గుండెల నిండా పీల్చి గుప్పుమని రైలు ఇంజను మాదిరిగా గాలిలోకి వదులుతూ దాని మాయలో పడి పరిసరాలనే మర్చిపోతున్నారు. సిగరెట్టు, చుట్ట, బీడీ వంటి పొగ పీల్చే రకాలతోపాటు

DV RAMANA
Jan 53 min read


కొత్త ఏడాది కేంద్ర సర్కారు తొలి కోత
విద్యుత్ వాహనరంగానికి కొత్త ఏడాది ఆరంభంలోనే కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఈ రంగానికి కొంతకాలంగా ఇస్తున్న భారీ సబ్సిడీలు, ఇతర ప్రోత్సాహకాల్లో కోతలకు శ్రీకారం చుట్టింది. కోతల్లో తొలిదశగా ఎలక్ట్రిక్ త్రిచక్ర(ఆటోలు) వాహనాలకు సబ్సిడీలు నిలిపివేస్తూ పాత ఏడాది(2025) చివరిరోజే ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం వల్ల త్రిచక్ర వాహనాలు కొనుగోలు చేయాలనుకునేవారికి భారంగా పరిణమించనుంది. వీటి ధరలు పెరిగే అవకాశం ఉండటంతో ఈ వాహనాలను ఉత్పత్తి చేస్తున్న తయారీ కంపెనీలు, పంపిణీ చేసే మార్కెట

DV RAMANA
Jan 33 min read


వైద్య కళాశాలలపై రాజకీయ యుద్ధం!
సార్వత్రిక ఎన్నికల్లో థంపింగ్ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం గత వైకాపా ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలను, పథకాలను తిరిగదోడుతూ తన విధానాలకు అనుకూలంగా మార్పులు చేర్పులు చేస్తోంది. కొన్నింటికి పేర్లు మార్చితే, మరికొన్నింటిలో మూల లక్ష్యాన్నే మార్చివేస్తోంది. వీటిలో మిగతావాటి సంగతెలా ఉన్న మెడికల్ కళాశాలల విషయంలో చంద్రబాబు సర్కారు అనుసరిస్తున్న వైఖరి, దాన్ని సమర్థించుకుంటున్న తీరు మాత్రం సామాన్య జనంలో విమర్శల పాలవుతున్నా

DV RAMANA
Jan 22 min read


వాడకం మితిమీరితే ప్రాణభక్షణే!
కాలం మారుతున్న క్రమంలో ఆ మార్పులకు అనుగుణంగా మన జీవితాలను కూడా మెరుగులు దిద్దుకోవాల్సి ఉంటుంది. దీనికి ఒక కాలప్రమాణంగా ఏడాదికాలం నిలుస్తుంది. అందుకే పాత సంవత్సరం ముగిసి కొత్త వత్సరాదిలోకి ప్రవేశించే సమయంలో ప్రతి ఒక్కరూ తమ జీవితాలకు సంబంధించి కొత్త లక్ష్యాలు నిర్దేశించుకునే తరుణంగా కొత్త ఏడాదిని పరిగణిస్తారు. ఈ ఏడాది నుంచి జీవితంలోకి కొత్తదనాన్ని ఆహ్వానించాలని, ఆరోగ్యంగా జీవించాలని ప్రతి ఒక్కరూ ఆకాంక్షించడం సహజం. ఈ కొత్త లక్ష్యాల్లో మరో ప్రత్యేక అంశాన్ని చేర్చుకోవాల్సిన అవసరాన

DV RAMANA
Jan 12 min read


ఇదేం ‘సరసం’ సామీ!
‘మా థియేటర్లలో టికెట్ల ధరలు ఏమాత్రం ఎక్కువ కావు. వాటిలో అమ్మే స్నాక్స్ కూడా సరసమైన ధరలకే లభిస్తాయి’.. ఈ మాట వింటే అదో పెద్ద జోక్ అని ఎవరైనా సరే చెబుతారు. కానీ పీవీఆర్ ఐనాక్స్ ఎండీకి మాత్రం అవి చాలా తక్కువ ధరలేనట! ఈ రోజుల్లో మల్టీప్లెక్స్‌లలో సినిమా చూడటం సామాన్యులకు ఎంత ప్యాషనో అంతకుమించిన ఖరీదైన వ్యవహారంగా మారిపోయింది. టికెట్ రేట్ల సంగతి పక్కన పెడితే లోపల స్టాల్స్ ద్వారా విక్రయించే స్నాక్స్ ధరలు చూసి జనం బెంబేలెత్తిపోతున్నారు. పీవీఆర్ ఐనాక్స్ ఎండీ అజయ్ బిజిలీ మాత

DV RAMANA
Dec 31, 20253 min read


రాయచోటికి కన్నీరు.. మదనపల్లికి పన్నీరు
జిల్లాల పునర్విభజన తేనెతుట్టెను గత వైకాపా ప్రభుత్వం కదిపి రాష్ట్రంలో జిల్లాల సంఖ్యను రెట్టింపు చేసింది. దాని ప్రకంపనలు ఇప్పటికీ చాలాచోట్ల కనిపిస్తున్నాయి రెవెన్యూ డివిజన్లు, మండలాలను వేరే జిల్లాల్లో చేర్చడం, కొత్త డివిజన్ల ఏర్పాటు వంటిపై భిన్నాభిప్రాయాలు, ఆందోళనలు కూడా అప్పట్లో వ్యక్తమయ్యాయి. శాస్త్రీయంగా కాకుండా రాజకీయ కోణంలో పలు మార్పులు చేశారని వైకాపా ప్రభుత్వంపై అప్పట్లో తెలుగుదేశం సహా పలువురు విమర్శలు గుప్పించారు. వాటిలో ప్రధానంగా చెప్పుదగ్గది కొత్తగా ఏర్పాటు చేసిన అన్నమ

DV RAMANA
Dec 30, 20252 min read


అప్పుడు లేచిన నోళ్లు ఇప్పుడు మూగబోయాయేం?
హింస ఎక్కడైనా హింసే.. మరణం అందరికీ ఒక్కటే.. దానికి కులమతవర్ణాలన్న తేడా ఉండదు. కారణం ఏదైనా మారణకాండ మాత్రం క్షంతవ్యం కాదు. అది ఎవరి మీద, ఏ కారణంతో జరిగినా దాన్ని ఖండిరచాల్సిందే, బాధితులకు అండగా నిలవాల్సిందే, సంఫీుభావం తెలపాల్సిందే. ఇటువంటి విషయాల్లో సెలబ్రిటీలు అనే ముసుగు తొడుక్కునేవారు చాలా వేగంగా స్పందిస్తుంటారు. పత్రికలు, టీవీ, సోషల్ మీడియా తదితర వేదికల ద్వారా నిరసన గళం వినిపిస్తుంటారు. రాజకీయ నాయకులు కూడా ఈ కోవలోకే వస్తారు. కానీ దురదృష్టకరం ఏమిటింటే.. బంగ్లాదేశ్‌లో మైనా

DV RAMANA
Dec 29, 20252 min read


భగవద్గీత నైతికశాస్త్రం!
మన సనాతన ధర్మాలు, సంప్రదాయాలు, పురాణాలు.. తరచూ వివాదాలకు కారణమై విస్తృత చర్చలకు తావిస్తుంటాయి. వీటిని హిందువులు పాటిస్తారు కనుక ఇవి హిందూ మతానికి మాత్రమే పరిమితమన్న వాదనలు వినిపిస్తుంటాయి. వాటిలో చాలావరకు మానవ జీవన విధానాన్ని ప్రకాశవంతం చేసే గ్రంథాలని అనేక సందర్భాల్లో రుజువైనా ఇతర మతాలకు చెందినవారు ఒక పట్టాన దానికి అంగీకరించారు. మత ముద్ర వేసి వాటిని పక్కన పడేస్తుంటారు. అలా మతం ముద్ర పడిన వాటిలో శ్రీమద్భగవద్గీత ఒకటి. ఇది మహాభారతంలోని కురుక్షేత్ర సంగ్రామ ఘట్టంలో శ్రీకృష్ణుడు అర

DV RAMANA
Dec 27, 20252 min read


ఆగ్రహావళికి తలొగ్గిన కేంద్రం
తమకు కావాలనుకున్నప్పుడు పరిమితులు, పరిధులు మార్చేయడం ప్రభుత్వాలకు కొత్త కాదు. నిబంధనలు సడలించడం, అంతేవాసులకు అగ్రాసనం వేయడం ఇటీవలి కాలంలో మితిమీరిపోయింది. కోర్టులు అభ్యంతరం చెప్పినా.. వేరే మార్గాల్లో తాము అనుకున్నది సాధించుకోవడం ప్రభుత్వాలకు కరతలామలకం. కానీ అటువంటి నిర్ణయాన్ని ఉపసంహరించునేలా దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన ఒక వ్యతిరేకత చేయగలగడం ఇటీవలి కాలంలో ఇదే మొదటిసారి. కేంద్రంలోని ఎన్డీయే సర్కారు ఎన్ని అభ్యంతరాలు ఎదైనా లెక్కచేయకుండా తాను అనుకున్నది చేసేస్తుందని పేరుపొందింది

DV RAMANA
Dec 26, 20252 min read


బాండ్ పోయె.. ట్రస్ట్ వచ్చే..ఢాం ఢాం!
ఎత్తుకు పైఎత్తు వేయడం, ఒక మార్గం మూసుకుపోతే మరో మార్గాన్ని చూసుకోవడం.. ప్రతిచోటా ఉండేదే. ఇది రాజకీయాల్లో ఇంకాస్త ఎక్కువగా కనిపిస్తుంటుంది. అందులోనూ ఈ రంగంలో డబ్బు ప్రాధాన్యం పెరిగిన తర్వాత మరింతగా పాతుకుపోయింది. దానికి ఎన్నికల బండ్ల వ్యవహారమే నిదర్శనం. గతంలో ఎన్నికల బాండ్ల పేరుతో రాజకీయ పార్టీలకు గుప్త విరాళాలు ఇచ్చే సంస్కృతి ఉండేది. అది వికృతరూపం దాల్చడంతో సుప్రీంకోర్టు దాన్ని రద్దు చేసేసింది. దాన్ని రద్దు చేస్తేనేం.. పార్టీలు, కార్పొరేట్ వర్గాలు మార్గాన్ని ఓపెన్ చేసి యథాప

DV RAMANA
Dec 25, 20253 min read
bottom of page






