అసహనంతోనే అమెరికా అక్కసు!
- DV RAMANA

- 34 minutes ago
- 3 min read

ఒకవైపు ఇరాన్‌పై మిసైళ్లతో విరుచుకుపడుతున్న అగ్రరాజ్యం అమెరికా మరోవైపు భారత్‌లాంటి ప్రజాస్వామ్య దేశాలపై అడ్డగోలు మాటలతోనూ మంటలు రేపుతోంది. తాజాగా అమెరికా అమాత్య వర్యుడొకరు చేసిన ఇదే తరహా వ్యాఖ్యలకు మన విదేశాంగ మంత్రి జైశంకర్ దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చి బొమ్మ చూపించినంత పనిచేశారు. విడ్డూరమేమిటంటే అమెరికా విదేశాంగ శాఖ డిప్యూటీ మంత్రి క్రిష్టోఫర్ లాండు రైసినా డైలాగ్ అనే వేదికలో పాల్గొనడానికి మన గడ్డపైకి వచ్చి మనల్నే కించపరిచేలా వాచాలత ప్రదర్శించారు. భారత విదేశాంగ శాఖ, అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ సంయుక్తంగా ప్రతి యేడు మాదిరిగా ఈ ఏడాది ఢిల్లీలో నిర్వహించే రైసినా డైలాగ్ అనే చర్చావేదికలో ప్రపంచ దేశాల నాయకులు పాల్గొని ప్రపంచ రాజకీయ, ఆర్థిక వ్యవహారాలపై తమ అభిప్రాయాలు వ్యక్తంచేస్తుంటారు. అవే చర్చల్లో పాల్గొనడానికి వచ్చిన క్రిస్టోఫర్ లాండు అనుచిత వ్యాఖ్యలతో భారతీయులను చిర్రెత్తిం చారు. చైనా విషయంలో ఇరవయ్యేళ్ల క్రితం తాము చేసిన తప్పును భారత్ విషయంలో జరగనివ్వ బోమని, దాన్ని పరిమితికి మించి ఎదగనివ్వబోమని ఆయన అర్థంపర్థం లేని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను బట్టి తన సొంత దేశం అమెరికా ఆనాడు ఏం తప్పులు చేసిందో కూడా ఆయనకు తెలి యదని అర్థమవుతుంది. ఆనాటి పరిణామాలను మననం చేసుకుంటే.. తనను సవాల్ చేస్తూ అడుగడు గునా అడ్డుపడుతున్న సోవియట్ యూనియన్(ఒకనాటి ఉమ్మడి రష్యా)ను ఎలాగైనా దెబ్బకొట్టాలన్న లక్ష్యంతో 1970 దశాబ్దిలో చైనాలో పెట్టుబడులు పెట్టడంతోపాటు టెక్నాలాజీని ఇవ్వడం మొదలు పెట్టింది. 1975లో మనదేశంలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించే సమయానికి అమెరికా చైనాలో పెట్టుబడులు పెట్టడం ప్రారంభమైంది. 1980 నుంచి మెల్లగా టెక్నాలాజీని కూడా బదలాయించింది. మరోవైపు 1985 నుంచి అమెరికా ప్రోద్బలంతో, దాన్ని నమ్మి జపాన్ కూడా చైనాలో ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ పరిశ్రమలు ఏర్పాటు చేయడం ప్రారంభించింది. ఆ దాంతో 1990 నుంచి చైనాలో తయారైన అమెరికన్, జపనీస్ ఉత్పత్తులు ప్రపంచ మార్కెట్లను ముంచెత్తాయి. క్రమంగా జపాన్ తన శక్తిని మర్చిపోయి అమెరికా, చైనాల మీద ఆధారపడే స్థితికి దిగజారింది. 2000లో నానో టెక్నాలజీని అమెరికా, యూరప్ దేశాలు చైనాకు ఇచ్చి మరో తప్పు చేశాయి. అయితే చైనా తనకు బదిలీ అయిన సాంకేతికతో సంతప్తి చెందకుండా ఆయా రంగాల్లో ప్రత్యేక యూనివర్సిటీలు ఏర్పాటు చేసి, పరిశోధన లు చేసి ప్రపంచాన్నే సవాలు చేసే స్థాయికి ఎదిగింది. ఆవిధంగా సోవియట్ యూనియన్‌ను ముంచే యాలన్న ఆమెరికా ప్లాన్ దానినే ఎదురుతన్నింది. అమెరికా ఎత్తుగడలు, దాని కారణాలు ఎలా ఉన్నా.. వాటిని తెలుసుకోకుండా చైనా పేరు చెప్పి భారత్‌ను ఎదగనివ్వబోమని చెప్పడం ఒక పెద్ద దేశాన్ని కించపర్చడమే. కాగా విదేశాంగ మంత్రి జైశంకర్ అమెరికా పేరు ఎత్తకుండానే భారత్ ఎవరో చేసిన తప్పుల ఆధారంగా ఎదగాలని ఎన్నటికీ కోరుకోదని, అటువంటి అభివద్ధి తమ దేశానికి అక్కర్లేదని ముఖం మీద కొట్టినట్లు స్పష్టం చేశారు. సొంత ప్రజల శక్తిసామర్ధ్యాలు, తెలివితేటలు, కష్టపడేతత్వం మీద నమ్మకంతోనే భారత్ అభివద్ధిపథంలో పయనిస్తుందని అన్నారు. కాగా ముంబైలో జరిగిన పారి శ్రామికవేత్తల సదస్సులో ప్రసంగించిన ఫిన్‌లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌ను ప్రశంసిస్తూనే గతంలో ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలను తన ప్రసంగంలో ప్రస్తావిం చారు. ‘ఐరోపా సమస్యలన్నీ ప్రపంచ సమస్యలే.. కానీ ప్రపంచ సమస్యలు మాత్రం యూరప్‌వి కావు’ అంటూ గతంలో ఒక సందర్భంలో విదేశాంగ మంత్రి జైశంకర్ ఐరోపా దేశాలను ఎత్తిపొడుస్తూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను గుర్తుచేసుకుని మరీ ఫిన్‌లాండ్ అధ్యక్షుడు వివరణ ఇచ్చే ప్రయత్నం చేయడం విశేషం. యూరప్ సమస్యలతోపాటు ప్రపంచ సమస్యలను కూడా యూరప్ దేశాలు తమవిగా పరిగణిస్తాయని హామీ ఇచ్చారు. పశ్చిమాసియా, మధ్యప్రాచ్యం (మిడిల్ ఈస్ట్), సూడాన్‌లలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై ఐరోపా సమాజం తగినవిధంగా స్పందించి చర్యలు తీసుకుంటుందని కూడా చెప్పారు. అయితే ఆ మరుసటి రోజే అమెరికన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి క్రిష్టోఫర్ లాండు భారత్‌ను ఉద్దేశించి పరుష వ్యాఖ్యలు చేశారు. ఫిన్‌లాండ్ అధ్యక్షుడు ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల అన్యాపదేశంగా ప్రస్తావిస్తూ ఐరోపా సమాజం గురించి వ్యాఖ్యా నించి ఉంటారన్న భావించిందేమో.. ఆయన వ్యాఖ్యలు ఆమెరికాకు ములుకుల్లా గుచ్చుకున్నాయేమో! ఫిన్‌లాండ్ మీద కాకుండా తమ డిప్యూటీ మంత్రి ద్వారా భారత్ మీద అక్కసు వెళ్లగక్కింది. ఇరాన్ విషయంలో ఐరోపా దేశాల్లోనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్‌ని ఉద్దేశించి అమెరికా అధినేత ట్రంప్ ‘నువ్వు ఒక ఫెయిల్డ్ అధ్యక్షుడివి.. మళ్లీ ఎన్నికల్లో గెలవలేవు’ అని ఆడిపోసు కున్నారు. ట్రంప్ అక్కసు దేనికంటే మాక్రాన్ హయాంలోనే భారత్, ఫ్రాన్స్ మధ్య రాఫెల్ జెట్స్ ఒప్పందం కుదరడమే ట్రంప్ అక్కసుకు కారణం కావచ్చు. ఇక ఇటలీ ప్రధాని జార్జియా మెలోని భారత్ బాటలోనే ఫాలో రష్యాతో సత్సంబంధాలు నెలకొల్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. జర్మనీ ఎటూకాని రీతిలో వ్యవహరిస్తున్నది. జర్మనీ ఆటో, ఎలక్ట్రానిక్ పరిశ్రమ మొత్తం చైనా మీద ఆధారపడి మనుగడ సాధిస్తుండటమే దీనికి కారణం. బ్రిటన్ కూడా అదే బాటలో ఉంది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ చెîప్పి నట్లు నడుచుకుంటున్నది. పైగా బ్రిటన్ ప్రధాని కెయిర్ స్టార్మర్‌తో ట్రంప్‌కు అసలు పడటంలేదు. హంగేరి పూర్తిగా రష్యా వైపు ఉంటున్నది. భారత్‌లో అమెరికా రాయబారిగా సెర్జియా గోర్‌ను ఏరికోరి నియమించినప్పుడే ట్రంప్ లక్ష్యం ఏమిటో అర్థమైపోయింది. ట్రంప్‌కు నమ్మినబంటైన సెర్జియా అమె రికా తరఫున విదేశీ కూýగొట్టడంలో సిద్ధహస్తుడు. అమెరికా రాయబారిగా న్యూఢిల్లీలో ఉంటూనే శ్రీలంక, నేపాల్, బాంగ్లాదేశ్‌ల్లోని భారత వ్యతిరేకులతో కాంటాక్ట్‌లో ఉంటాడు. అయితే మన విదే శాంగ విధానం ముందు వారి పప్పులు ఉడకవు.






Comments