top of page


నారీ నారీ నడుమ మురారి.. వినోదాల వల్లరి
ఈ ఏడాది సంక్రాంతి రేసులోకి చివరగా వచ్చిన సినిమా.. నారీ నారీ నడుమ మురారి. పండక్కి గట్టి పోటీ ఉన్నా సరే.. చాలా కాన్పిడెంటుగా ఈ సినిమాను పోటీలో నిలిపింది చిత్ర బృందం. ‘సామజవరగమన’ ఫేమ్ రామ్ అబ్బరాజు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయడం.. ప్రోమోలు ఆకర్షణీయంగా ఉండడం.. సంక్రాంతికి ఇంతకుముందు వచ్చిన శర్వానంద్ సినిమాలు ఎక్స్ ప్రెస్ రాజా.. శతమానం భవతి ఘనవిజయాలు సాధించడం.. ప్రేక్షకుల్లో ఈ చిత్రంపై అంచనాలు పెంచాయి. మరి బాలయ్య హిట్ మూవీ టైటిల్ తో వచ్చిన ఈ సినిమా.. అంచనాలను అందుకుందా? శర్వాకు కోరుక
Guest Writer
2 days ago3 min read


అనగనగా ఒక రాజు.. నవీన్ పోలిశెట్టి షో
ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ.. జాతిరత్నాలు.. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న యువ కథానాయకుడు నవీన్ పోలిశెట్టి.. కొంత విరామం తర్వాత అనగనగా ఒక రాజుగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సంక్రాంతి కానుకగా ఈ రోజే విడుదలైన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి. కథ: గోదావరి ప్రాంతానికి చెందిన రాజు (నవీన్ పోలిశెట్టి) పేరుకు జమీందారు కుటుంబ వారసుడే కానీ.. ఆస్తులన్నీ కరిగిపోవడంతో సామాన్యుడిలాగే జీవిస్తుంటాడు. తాను దర్జాగా బతకాలంటే బాగా డబ్బున్న అమ్మ
Guest Writer
3 days ago3 min read


‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ పాప్‌కార్న్ ఎంటర్టైనర్
‘అనార్కలి’ వైన్ కంపెనీ నడిపే రామ సత్యనారాయణ (రవితేజ) పెద్ద ముదురు. ‘‘తెల్లోడు చేసిన మందు మనం తాగడం ఏంటి.. మన తెలుగోళ్లు చేసిన ‘అనార్కలి’ వైన్ రుచి తెల్లోళ్లకు చూపించాలి’’ అని కంకణం కట్టుకుని స్పెయిన్ ఫ్లైట్ ఎక్కుతాడు. సీన్ కట్ చేస్తే.. బిజినెస్ డీల్ కోసం వెళ్ళిన మనోడు, ఆ కంపెనీ ఎమ్డీ మానస (ఆషికా రంగనాథ్) గ్లామర్‌కు క్లీన్ బౌల్డ్ అయిపోతాడు. దాంతో తను ఫలానా అని చెప్పకుండా ఇండైరెక్ట్ గా ఆమెకి దగ్గరై తన అనార్కలి వైన్ టేస్ట్ ని పరిచయం చేస్తాడు. దాన్ని ప్రమోట్ చేయా
Guest Writer
Jan 143 min read


ఈ రోజు వెండితెర మీద చూసింది ‘మన శంకరవరప్రసాద్ గారి’ని మాత్రమే కాదు ...
రామ్మోహన్రావు అని అరిచినప్పుడు గాంధీని, జ్వాలా అని ముద్దుగా పిలుస్తున్నప్పుడు పాండుని, గోడ బద్దలు కొట్టినప్పుడు రాజారామ్ ని, సూటూబూటులో నడిచొస్తున్నప్పుడు ఎండీ కల్యాణ్ ని, ‘మే’డమ్’గారికి ..’ అనగానే లీడర్ రాజుని, లుంగీ పైక్కడుతూ గొడవకు దిగుతుంటే కొణిదెల సుభాష్ చంద్రబోస్ ని, విడిపోయిన భార్యకు దొరికిపోగానే మరదల్ని చూసి కంగారు పడ్డ రాజు ‘బావగారి’ని, ‘గంగూలీ సందులో గజ్జెల గోల’ అని నర్తిస్తుంటే రామకృష్ణని, గది బయట అమ్మాయిని చూసి సిగ్గుపడుతుంటే రాజారామ్ అన్నయ్యని, పిల్లలు ‘నా
Guest Writer
Jan 132 min read


శంకరవరప్రసాద్ గారు హిట్టు కొట్టారు!!
చిరు, వెంకీ నటించిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ ఒక పెద్ద కథ చెప్పే సినిమా కాదు. ఇది చిరంజీవిని సరైన విధంగా ప్రెజెంట్ చేసే, లైట్‌గా నవ్విస్తూ ముందుకు వెళ్లే ఫీల్-గుడ్ ఎంటర్టైనర్. కానీ బలమైన డ్రామా, గట్టిగా కదిలించే కాన్ఫ్లిక్ట్ మాత్రం లేకపోవడం వల్ల ఇది ‘‘బాగుంది’’ అన్న దగ్గరే ఆగిపోతుంది. మొత్తానికి, ఇది థియేటర్లో నవ్వించి సంతోషపెట్టే సినిమా, సంక్రాంతికి ఫెరఫెక్ట్ ఎంటర్టైనర్. ఇపుడు వివరంగా ఈ చిత్రం గురించి చర్చించుకుందాం నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్ శంకర వరప్రసాద్(చిరంజ
Guest Writer
Jan 123 min read


సమంతకు చాలా కాలం అయ్యింది
సమంత నుంచి తెలుగులో ఓ సినిమా వచ్చి చాలా కాలం అయ్యింది. తన ఇమేజ్‌కి తగిన కథలు రాక కాస్త గ్యాప్ తీసుకొన్న సమంత ఎట్టకేలకు ‘మా ఇంటి బంగారం’తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి రాజ్ నిడిమోరు కథ అందించడం విశేషం. ఈరోజు టీజర్ బయటకు వచ్చింది. టైటిల్ కీ, టీజర్‌కీ అస్సలు సంబంధమే లేదు. ఇందులో సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఏమిటంటే సమంత యాక్షన్ మోడ్‌లో దిగిపోవడం. సమంత చేసిన విన్యాసాలు, ఫైట్స్ నిజంగా అబ్బురపరుస్తాయి. ఓ ఇంటికి కొత్త కోడలుగా వెళ్లి
Guest Writer
Jan 102 min read


రాజాసాబ్.. డోస్ సరిపోలేదు సాబ్
ప్రభాస్ లాంటి పాన్ ఇండియా సూపర్ స్టార్.. మారుతి లాంటి మిడ్ రేంజ్ సినిమాలు చేసుకునే దర్శకుడితో సినిమా చేయబోతున్నట్లు సమాచారం బయటికి వచ్చినపుడు అంతా ఆశ్చర్యపోయారు. ప్రభాస్ అభిమానులైతే ఈ సినిమా వద్దే వద్దు అన్నారు. కానీ ప్రభాస్.. మారుతిని నమ్మి ముందుకు వెళ్లిపోయాడు. రాజాసాబ్ ప్రోమోలు చూస్తే.. మారుతి ఏదో అద్భుతం చేస్తాడని అనిపించింది. ప్రభాస్ అభిమానులు కూడా నెగెటివిటీనంగతా పక్కన పెట్టి తమ హీరో లాగే మారుతి మీద నమ్మకం పెట్టారు. మరి వీళ్లందరి నమ్మకాన్ని మారుతి నిలబెట్టాడా
Guest Writer
Jan 94 min read


హుక్ స్టెప్స్ గుర్తు చేసిన చిరు
హుక్ స్టెప్స్ అనే మాట ఇప్పుడు వింటున్నాం కానీ.. అసలు దీనికి ఆధ్యుడు తప్పకుండా మెగాస్టార్ చిరంజీవినే. ఒకప్పుడు సినిమాల్లో పాటలు వస్తే, జనం సిగరెట్ కోసం బయటకు వెళ్లిపోయే రోజులు ఉండేవి. దాన్ని మెల్లమెల్లగా మార్చారు చిరంజీవి. పాటల కోసం థియేటర్లకు వెళ్లి, మళ్లీ మళ్లీ టికెట్లు కొనేలా చేశారు. అదంతా చిరు మాయ. ‘ముఠామేస్త్రీ’లో చిరు లయబద్ధంగా వేసిన హుక్ స్టెప్.. ఇప్పటికీ కొత్తగా అనిపిస్తుంది. ఇప్పటికీ దాన్ని ఇమిటేట్ చేయడానికి చూసేవాళ్లెంతో మంది. ‘హిట్లర్’లో పాటని కళ్లార్పకుండా
Guest Writer
Jan 82 min read


చిరు-158 కొంచెం లేటు!
సినిమా సినిమాకీ కాస్త గ్యాప్ ఇచ్చే అలవాటు మానుకొంటున్నారు అగ్రహీరోలు. వీలైతే ఒకేసారి రెండు సినిమాల్ని పట్టాలెక్కించడానికైనా సిద్ధమే. 2026లో మెగాస్టార్ నుంచి రెండు సినిమాలు రాబోతున్నాయి. ఈ సంక్రాంతికి ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ వచ్చేస్తోంది. వేసవికి ‘విశ్వంభర’ సిద్ధం అవుతోంది. మరోవైపు కొత్త సినిమా కూడా మొదలెట్టేస్తున్నారు. ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ తర్వాత బాబీ దర్శకత్వంలో చిరు ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. నిజానికి ఈ సంక్రాంతి తర్వాత ఈ సినిమాని లాంఛనంగా ప్రారంభిద్ద
Guest Writer
Jan 72 min read


సుశాంత్‌తో మీనాక్షి పెళ్లి..?
మీనాక్షి చౌదరి.. ఇచ్చట వాహనములు నిలపరాదు అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ సొట్టబుగ్గల సుందరి.. తన అందంతోనే కాదు నటనతో కూడా అందరిని ఆకట్టుకుంది. 2024 సంక్రాంతి సందర్భంగా మహేష్ బాబుతో గుంటూరు కారం సినిమా చేసి సంక్రాంతి విజేతగా నిలిచిన ఈమె.. గత ఏడాది విక్టరీ వెంకటేష్‌తో కలిసి సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతో మరోసారి సంక్రాంతి విజేతగా నిలిచింది. ఇప్పుడు కూడా మళ్లీ సంక్రాంతి విజేతగా నిలిచి హ్యాట్రిక్ అందుకోవాలని చూస్తోంది ఈ ముద్దుగుమ్మ. అందులో భాగంగానే తాజాగా నవీ
Guest Writer
Jan 63 min read


లోకేష్ కనకరాజ్ పుష్పఎలా ఉంటాడు..?
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్‌పై కూలీ సినిమా ఇంపాక్ట్ బాగా పడిరదని తెలిసిందే. కూలీ సినిమాపై కోలీవుడ్ ఆడియన్స్ చాలా ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకోగా సినిమా డిజప్పాయింట్ చేసింది. ఐతే లోకేష్ కనకరాజ్ నెక్స్ట్ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే రకరకాల వార్తలు వచ్చాయి. అసలైతే అమీర్‌ఖాన్‌తో ఒక సినిమా.. రజనీ, కమల్‌తో సినిమా.. కార్తితో ఖైదీ`2 ఇలా చాలా ప్లానింగ్‌తోనే ఉన్న లోకేష్‌కి ఈ 3 సినిమాలు కాకుండా మరో క్రేజీ ప్రాజెక్ట్ లాక్ అయినట్టు తెలుస్తుంది. లోకేష్ తన డ్రీమ్ ప్ర
Guest Writer
Jan 53 min read


సైక్ సిద్దార్థ.. కిక్కు సరిపోలేదు
హీరో పాత్రలే కాక క్యారెక్టర్.. విలన్ రోల్స్ చాలానే చేసినా సరైన బ్రేక్ దొరక్క ఇబ్బంది పడుతున్నాడు నందు. ఇప్పుడతను వరుణ్ రెడ్డి అనే కొత్త దర్శకుడితో జట్టు కట్టి సైక్ సిద్దార్థ సినిమా చేశాడు. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం నందు కోరుకున్న బ్రేక్ అందించిందా? తెలుసుకుందాం పదండి . కథ: సిద్దార్థ (నందు) ఫ్రెండు చేతిలో వ్యాపారంలో.. అమ్మాయి చేతిలో ప్రేమలో విఫలమై.. జీవితం మీద ఆశలు కోల్పోయి.. ఒక గోల్ అంటూ లేకుండా ఆవారాగా తిరుగుతుంటాడు. అప్పుడే తన ఇంటి కింద ఉండే శ్రావ్యత
SATYAM DAILY
Jan 33 min read


సంగీతం, గణితం, సాంకేతికతలకు కొత్త నిర్వచనం ఇళయరాజా సెంటర్
భారతీయ సంస్క ృతిని భవిష్యత్తు సాంకేతికతతో అనుసంధానిస్తూ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ (ఐఐటీ`ఎం) 2026-27 విద్యా సంవత్సరం నుంచి ‘ఐఐటిఎం`మాస్ట్రో ఇళయరాజా సెంటర్ ఫర్ మ్యూజిక్ లెర్నింగ్ అండ్ రీసెర్చ్’ను ప్రారంభించనుంది. మెడికల్ ఎడ్యుకేషన్ రంగంలోకి ఐఐటి విస్తరణ, ‘ఐఐటి మద్రాస్ ఫర్ ఆల్’ చొరవపై ఐఐటి-ఎం డైరెక్టర్ ప్రొఫెసర్ కామకోటి ఇటీవల ‘డిటి నెక్ట్స్’కు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. దాని సారాంశం మేరకు సంగీతాన్ని కేవలం ఒక కళారూపంగానే కాకుండా ప్రతి రాగం, తాళం,
Guest Writer
Jan 21 min read


సౌందర్య మరణానికి ముందురోజు..
2004 ఎలక్షన్స్ టైమ్ లో తేజా టీవీ కొంతమంది ముఖ్యమైన లీడర్స్ ప్రచారాన్ని ‘ఏ డే విత్ ద లీడర్’ కాన్సెప్ట్‌తో రోజంతా కవర్ చేసి దాన్ని ఒక అర్థ గంటకు కుదించి ప్రసారం చేయాలని నిర్ణయించాం. ఆ విధంగా ఏప్రిల్ 15న రిపోర్టర్ రాజేశ్వర శర్మ గారు కరీంనగర్లో చెన్నమనేని విద్యాసాగర్ రావు ప్రచారాన్ని కవర్ చేయటానికి కెమెరా క్రూను వెంటబెట్టుకొని వెళ్లారు. అక్కడ విద్యాసాగర్ రావుకు ప్రత్యర్థి కేసీయార్ కావటం వల్ల కూడా ప్రాధాన్యం బాగా పెరిగింది. ఆరోజు ప్రచార కార్యక్రమాలన్నీ రికార్డు చేస్త
SATYAM DAILY
Jan 22 min read


2026 డైరీ: హీరోలంతా ఫుల్ బిజీ
కాల చక్రం గిర్రున తిరిగింది. మొన్ననే 2025 సంక్రాంతి సినిమాల గురించి మాట్లాడుకొన్నట్టు అనిపించింది. ఇప్పుడు మరో సంక్రాంతి సీజన్ ముందుకొచ్చేసింది. గతేడాది ఎన్నో పాఠాలు. ఇంకెన్నో జీవిత సత్యాలు. వాటి నుంచి ఏం గ్రహించాం? ఎంత మారాం? అనేది ఈ యేడాది తేల్చి చెప్పబోతోంది. సినిమాలూ, వాటి ఫలితాల్ని పక్కన పెడితే.. గతేడాది మన హీరోలు చాలా కష్టపడ్డారు. 2026 డైరీ కూడా ఇంతే బిజీగా ఉంది. స్టార్ హీరోలు చేతి నిండా పని పెట్టుకొన్నారు. మరి వాళ్ల షెడ్యూల్స్ ఎలా ఉన్నాయి? ఏయే సినిమాలతో అలరించబోతున
Guest Writer
Jan 13 min read


కొండంత హైప్.. ఆపై గట్టి దెబ్బ!
2025 సంవత్సరం సినిమాల పరంగా ఒక విచిత్రమైన అనుభూతిని మిగిల్చింది. పాన్ ఇండియా స్టార్స్, వేల కోట్ల బడ్జెట్లు, స్కై హై అంచనాలతో థియేటర్ల ముందు జాతరలు జరిగాయి. కానీ తీరా సినిమా చూసాక మాత్రం ‘‘కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు’’ అనిపించింది. ఈ ఏడాది రిలీజ్ అయిన చాలా సినిమాలు అనౌన్స్మెంట్ అప్పుడు ఉన్న హైప్ ని, రిలీజ్ తర్వాత నిలబెట్టుకోలేక బాక్సాఫీస్ దగ్గర బోర్లా పడ్డాయి. ఫ్యాన్స్ పండగ చేసుకుందామని వెళ్తే, చివరికి నిరాశే మిగిలింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ విషయం
Guest Writer
Dec 31, 20252 min read


సంక్రాంతి సినిమాలు.. పెను సవాళ్లు
2026 వైపు చిత్రసీమ దూసుకుపోతోంది. జనవరి 1న కొన్ని సినిమాలు వస్తున్నాయి. అయితే అందరి దృష్టీ సంక్రాంతి సీజన్‌పైనే. రాజాసాబ్, మన శంకర వర ప్రసాద్ గారు, భర్త మహాశయులకు విజ్ఞప్తి, అనగనగా ఒక రాజు, నారీ నారీ నడుమ మురారీ... ఈ పండక్కి వస్తున్నాయి. పండగ సినిమా అంటే ఓ క్రేజ్. పైగా ఇది.. సంక్రాంతి. వీటన్నింటిపైనా ప్రేక్షకులు ప్రత్యేకమైన దృష్టి సారించడం ఖాయం. అయితే ఈ పండగ సినిమాలు కొంతమంది కెరీర్‌కి చాలా అవసరం. ఈ సీజన్లో హిట్టు వాళ్ల ఖాతాలో పడడమే ధ్యేయంగా సినిమాలు చేశారు. తమ కెరీర్ పర
Guest Writer
Dec 30, 20252 min read


వృషభ.. వృథా ప్రయాసే!
మోహన్ లాల్ సినిమా అంటే దేశవ్యాప్తంగా ఆసక్తి ఉంటుంది. ఈ ఏడాది ఆయన ఇప్పటికే ఎల్2-ఎంపురాన్.. తుడరుం.. హృదయపూర్వం చిత్రాలతో హ్యాట్రిక్ కొట్టారు. ఏడాది చివర్లో ఆయన ‘వృషభ’తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ చిత్రం.. అన్ని ప్రధాన భాషలతో పాటే తెలుగులోనూ ఈ రోజే విడుదలైంది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి. కథ: ఆదిదేవ్ వర్మ (మోహన్ లాల్) పెద్ద బిజినెస్ మ్యాన్. అతడికి తన కొడుకు తేజ్ వర్మ (సమర్జిత్ లంకేష్) అంటే ప్రాణం. కొడుక్కీ తండ్రి అంటే అంతే ఇ
Guest Writer
Dec 29, 20253 min read


‘‘ ఛాంపియన్ ’’ గోల్ పడలేదు
‘‘పెళ్లిసందడి’’ తర్వాత ఏకంగా నాలుగేళ్లకి రోషన్ ఈ సినిమాతో ముందుకొచ్చాడు. ‘‘గిర గిర..’’ పాట సూపర్ హిట్ అవడం ఈ చిత్రానికి కలిసొచ్చిన అతి పెద్ద ప్రచారం. ట్రైలర్ చూస్తే పీరియడ్ బ్యాక్ డ్రాప్ అని, తెలంగాణా సాయుధ పోరాటం నాటి కథ అని తెలుస్తూనే ఉంది. కథలోకి వెళ్లితే భైరాన్ పల్లి అనే ఒక ఊరు నిజాం పాలనను వ్యతిరేకిస్తూ ఉంటుంది. ఆ ఊరి పెద్ద రాజిరెడ్డి (కళ్యాణ చక్రవర్తి). అయితే ఆ ఊరిని ఎలాగైనా తమ కాళ్లకిందకి తెచ్చుకోవాలని రజాకార్ల నాయకుడు ఖాసిం రజ్వీ (కెకె మీనన్) పట్టుదలగా ఉంటా
Guest Writer
Dec 27, 20253 min read


శివాజీ వేసిన ‘దండోరా’ ఏంటి ?
ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్లో శివాజీ మాట్లాడుతూ ఓ రెండు పదాలతో ‘టముకు’ వేయడంతో సోషల్ మీడియా అంతా ఎటువంటి డప్పు కొట్టకుండానే ఫ్రీగా ‘దండోరా’ అయ్యింది. సినిమా గురించి చెప్పుకునేముందు అసలు ఈ దండోరా అనే పదం గురించి కూడా రెండు మాటలు చెప్పుకుందాం. ఈ దండోరా అనేది పల్లెల్లో ఎక్కువగా వినపడే పదం. గ్రామపెద్దలు ఊళ్ళో ఏదైనా విషయాన్ని చాటింపు చేసేటప్పుడు డప్పు మాస్టర్ కి పనప్పచెబుతారు. అతడు డప్పు కొట్టుకుంటూ ఊరంతా తిరుగుతూ సదరు విషయాన్ని చాటింపు చేస్తాడు. మొదట్లో గ్రామాల్లో ఈ
Guest Writer
Dec 26, 20254 min read
bottom of page






