మనసు మూలలను తాకుతుంది!
- Guest Writer
- 16 hours ago
- 2 min read

మనసు ఎక్కడ ఆగిపోయిందో తెలియని ప్రేమ... చేతులు ఎవరి చేతిలో బంధించబడ్డాయో అర్థంకాని జీవితం... ప్రేమించినవాడు హృదయంలో... పెళ్లి చేసుకున్నవాడు పక్కన...
తాను ఎవరికో సొంతమో తనకే తెలియని ఆ అంతర్గత ఖాళీ... అదే మౌనరాగం.
శబ్దం లేని సంగీతం... అలుపు లేని ఆత్మవేదన...
ఈరోజు చూస్తే “ఇదేంటి పెద్ద విషయం?” అనిపించొచ్చు. కానీ...80ల కాలంలోనే ఈ అంత సూక్ష్మమైన మానసిక సంఘర్షణను తెరపై చూపించి దాన్ని ఒక క్లాసిక్‌గా మలిచిన దర్శకుడు మణిరత్నం.
కార్తీక్ - రేవతి ప్రేమకథ.. కేవలం ఒక లవ్ స్టోరీ కాదు... అది మనసు ఎంచుకున్న దారికి సమాజం వేసిన మలుపుల కథ. ప్రేమించిన వాడిని మర్చిపోలేక... పెళ్లి చేసుకున్న భర్తకు దగ్గరవ్వలేక... ఏ దారికీ పూర్తిగా చెందలేని ఆ సందిగ్ధతలో రేవతి చేసిన నటన అద్భుతం కాదు... అది నిజం.
ఆమె కన్నుల్లో మాటలకంటే ఎక్కువ భావం... నిశ్శబ్దంలోనే వినిపించే అరుపు... ఆ పాత్రలో ఆమె లీనమైపోవడం కాదు, ఆ పాత్రే ఆమెగా మారిపోవడం. కార్తీక్ స్క్రీన్ మీద కనిపించే సమయం తక్కువే... కానీ అతని పాత్ర వదిలిపెట్టే ప్రభావం మాత్రం చాలా లోతైనది. ఆ ప్రేమలోని స్వచ్ఛత, అసంపూర్తి, వదులుకోవలసిన నిస్సహాయత... అన్నీ మనతోనే మిగిలిపోతాయి.
మోహన్ పాత్ర... చాలామందికి తమని తాము చూసుకునే అద్దం. ఎవరినీ బాధపెట్టకుండా ఉండాలనుకునే మనసు, కానీ తానే మెల్లగా నలిగిపోతూ ఉండే వ్యక్తిత్వం. ఆ పెర్ఫార్మెన్స్ గురించి ఎక్కువ చెప్పాల్సిన పనిలేదు... సింప్లీ ఫెంటాస్టిక్.
ఈ కథను ఇలా చెప్పగలగడం మణిరత్నంకే సాధ్యం. ఒకే రకమైన కథలతో నడుస్తున్న భారతీయ సినిమాకు కొత్త కోణాలు చూపించిన సెల్యులాయిడ్ సైంటిస్ట్ ఆయన. మౌనరాగానికి కల్ట్ ఫ్యాన్స్ ఉండటం ఆశ్చర్యం కాదు. ఎందుకంటే ఇది సినిమా కాదు... అనుభూతి. ఇళయరాజా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్... అది వినిపించదు... అది మనల్ని వెంటాడుతుంది. సన్నివేశం అయిపోయినా సంగీతం మనసులో ఆగదు. ఈ సినిమాను చూసి బయటకి రావడానికి టైం పడుతుంది. ఎందుకంటే ఇది మన మనసులోని ఏదో మూలను తాకుతుంది.
ఇలాంటి కథలు... ఇలాంటి పాత్రలు... ఇలాంటి సినిమాలు... ప్రేక్షకులు సులభంగా మర్చిపోలేరు. అందుకే మౌనరాగం ఒక క్లాసిక్. ఉపిరి ఉన్నంతవరకూ ఇళయరాజా గారికి మన గుండెల్లో గుడి ఉంటుంది... మణిరత్నం సినిమాలు మన మనసుల్లో శాశ్వతంగా నిలిచిపోతాయి...
హీట్ పుట్టిస్తున్న డింపుల్ హయతి

టాలీవుడ్‌లో గ్లామర్‌తోపాటూ పర్ఫార్మెన్స్‌తో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి డింపుల్ హయతి. ‘కిలాడీ’, ‘రామబాణం’ వంటి చిత్రాలతో కుర్రకారు గుండెల్లో సెగలు రేపిన ఈ భామ, సోషల్ మీడియాలో కూడా అదే స్థాయిలో హీట్ పెంచుతోంది. తాజాగా ఆమె షేర్ చేసిన బ్లాక్ అవుట్‌ఫిట్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తన కిల్లింగ్ లుక్స్‌తో, అదిరిపోయే ఫిజిక్‌తో నెటిజన్లను కట్టిపడేస్తున్న ఈ సొగసరి ఫోటోషూట్ విశేషాలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.
డింపుల్ హయతికి ఫ్యాషన్ సెన్స్ , గ్లామర్‌ను ఎలా పండించాలో బాగా తెలుసు. తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఫోటోలలో బ్లాక్ కలర్ స్టైలిష్ డ్రెస్ ధరించి మెరిసిపోతోంది. ఆమె చూపులు, ఆ పోజులు చూస్తుంటే కుర్రాళ్లకు నిద్ర కరువవ్వడం ఖాయం. ‘గద్దలకొండ గణేష’లో ‘జర్రా జర్రా’ అంటూ తన డాన్స్ స్టెప్పులతో థియేటర్లను ఊపేసిన ఈ బ్యూటీ, ఇప్పుడు తన గ్లామర్ ఫోటోలతో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను షేక్ చేస్తోంది. తన ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టే డింపుల్, ఈ ఫోటోలలో తన పర్ఫెక్ట్ కర్వ్‌లను ప్రదర్శిస్తూ నెటిజన్లను మంత్రముగ్ధులను చేస్తోంది.
కేవలం గ్లామర్ మాత్రమే కాదు, నటనలోనూ తనదైన ముద్ర వేయాలని తపిస్తోంది ఈ భామ. రవితేజ సరసన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమాలో అదిరిపోయే గ్లామర్ రోల్ పోషించి టాలీవుడ్‌లో ఒక్కసారిగా లైమ్ లైట్లోకి వచ్చింది. ఆ తర్వాత గోపీచంద్ సరసన ‘రామబాణం’లో పద్ధతిగా ఉంటూనే తన నటనతో మెప్పించింది. ఒకవైపు కమర్షియల్ మాస్ సాంగ్స్ చేస్తూనే, మరోవైపు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ తన కెరీర్ గ్రాఫ్‌ను పెంచుకుంటోంది. ఈ తాజా ఫోటోషూట్ చూస్తుంటే, త్వరలోనే డింపుల్ మరిన్ని పెద్ద ప్రాజెక్టులను దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
డింపుల్ హయతి షేర్ చేసిన ఈ ఫోటోలపై నెటిజన్లు రకరకాల కామెంట్లతో ముంచెత్తుతున్నారు. బ్యూటీ, అగ్గి పుట్టిస్తున్నావు, టాలీవుడ్ సెన్సేషన్ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటూ తన అప్‌డేట్స్‌తో అభిమానులను అలరించే ఈ భామ, రాబోయే రోజుల్లో మరిన్ని వైవిధ్యమైన పాత్రలతో మన ముందుకు రానుంది. గ్లామర్ ప్లస్ టాలెంట్ ఉన్న ఈ సుందరి, స్టార్ హీరోయిన్ రేసులో దూసుకుపోవడం ఖాయం.
-తుపాకి.కామ్ సౌజన్యంతో...










Comments