top of page

ఏం మానసిక వైకల్యం ఇది?

  • Guest Writer
  • 13 hours ago
  • 2 min read

కొన్ని పోస్టులు ఇన్ఫర్మేషన్ వల్ల వైరల్ కావు. మనుషులు లోపల దాచుకున్న కోపాన్ని ఎవరో బయటకు గట్టిగా అరిచినప్పుడు వైరల్ అవుతాయి. ఇది కూడా అలాంటి విషయం. తనికెళ్ళ భరణి గారు మోదీని కలిశారు. ఒక ఫోటో దిగారు. తన ఆనందాన్ని నాలుగు లైన్లలో రాశారు. అంతే. దేశాన్ని అమ్మలేదు. ఎవరినీ తిట్టలేదు. ఏ మతాన్ని అవమానించలేదు. కానీ వారం రోజులుగా గుంపులుగా పడి కరుస్తున్నారు. ఎందుకు? ఎందుకంటే... ఇప్పుడు ఈ దేశంలో ఎవరు ఎవరిని అభిమానించాలి అనేది కూడా కొంతమంది డిసైడ్ చేయాలనుకుంటున్న ప్రమాదకరమైన మనస్తత్వం.

తనికెళ్ళ భరణి గారు ఎవరు? 30 ఏళ్లకు పైగా సినిమాల్లో నటించిన వ్యక్తి. కవి, రచయిత, దర్శకుడు. “మిధునం” లాంటి సినిమా తీసిన మనిషి. “నాన్న ఎందుకో వెనకబడిపోయాడు” అనే ఒక్క పాటతో ఎంతోమంది గుండెల్ని పిండేసిన వ్యక్తి. ఇండస్ట్రీలో ఎప్పుడూ ఎవరి జోలికి పోలేని వ్యక్తి. అలాంటి మనిషిని కూడా ఇంత పద్ధతిగా వేటాడుతున్నారంటే సమస్య భరణి గారిలో లేదు. మన సమాజంలో పెరిగిపోతున్న ఈ విషపూరిత నీచ మనస్తత్వంలో ఉంది. కొంతమంది ఇప్పుడు మనుషుల్లా కనిపించే పిచ్చి కుక్కల్లా మారిపోయారు. ఎవరు ఎవరిని అభిమానించినా గుంపులుగా పడి కరవడమే పని.

ఇక్కడ సమస్య మోదీ కాదు. ఫోటో కాదు. అసలు సమస్య ఏంటంటే... ఎవరైనా తమ అభిమానాన్ని బహిరంగంగా చెప్పడం. నువ్వు తిట్టితే... “భావ ప్రకటనా స్వేచ్ఛ.” ఇంకొకరు అభిమానిస్తే... “భక్తుడు.” “బానిస.” “చెంచా.” లంజకొడుకుల లాజిక్ కూడా ఇంత చీప్‌గా ఉండదు. ఇప్పుడు కొంతమందికి గౌరవం అంటే అర్థం కాదు. వాళ్లకి తెలిసింది ఒక్కటే. తిట్టడం, ఎగతాళి చేయడం, అవమానించడం. ఎందుకంటే సోషల్ మీడియా వాళ్లలోని వ్యక్తిత్వాన్ని బయటకు తీయలేదు. కానీ లోపల దాచుకున్న కుళ్ళును బయటకు తీసింది. రోజంతా విషం కక్కుతూ బ్రతికే గజ్జి కుక్కల మెంటాలిటీని బయట పెట్టింది.

భరణి గారు ఏమన్నారు? “రాముడిని చూడలేదు. కృష్ణుడిని చూడలేదు. వారి అంశలతో ఉన్న వ్యక్తిని కలిశాను” అన్నారు. ఆయన తన ఆధ్యాత్మిక భావంతో మాట్లాడారు. మనం రోజూ “మనిషి రూపంలో దేవుడు” అనే మాట వాడటం లేదా? డాక్టర్ ప్రాణం కాపాడితే దేవుడు అంటాం. సాయం చేసినవారిని దేవుడు అంటాం. అది భక్తి భాష. కానీ ఇప్పుడు కొంతమందికి ఆధ్యాత్మిక భాష కూడా కడుపుమంట పెడుతోంది. ఎందుకంట వాళ్ల ఐడియాలజీకి బయట కూడా మనుషులు ఉంటారని జీర్ణించుకోలేకపోతున్నారు.

ఇక్కడ ఇంకో దరిద్రమైన నిజం ఉంది. ఇప్పుడు ద్వేషం కూడా బిజినెస్ అయిపోయింది. ఎవరినైనా టార్గెట్ చేస్తే వ్యూలు వస్తాయి. ఫాలోవర్స్ పెరుగుతారు. డబ్బు వస్తుంది. అందుకే సాధారణ ఫోటోలో కూడా మతం వెతుకుతారు. విషం వెతుకుతారు. విభజన వెతుకుతారు. ఎందుకంf శాంతి వైరల్ కాదు. ద్వేషం వైరల్ అవుతుంది. ప్రశాంతమైన సమాజం కంటే కోపంగా ఉన్న జనాల మీద వ్యాపారం చేయడం చాలా సులువు. అందుకే... కొంతమంది యూట్యూబర్లు, కొంతమంది నకిలీ జర్నలిస్టులు, కొంతమంది రాజకీయ దళారులు రోజూ సమాజంలో మంటలు పెడుతూ బ్రతుకుతున్నారు.

ఇది ఫస్ట్ టైమ్ కాదు. రజినీకాంత్ గారు చంద్రబాబు గురించి మాట్లాడినప్పుడు కూడా ఇదే జరిగింది. ఎవరో ఒకరితో ఫ్రెండ్‌షిప్ ఉన్నా ప్రాబ్లమ్. ఎవరో ఒకరిని రెస్పెక్ట్ చేసినా ప్రాబ్లమ్. అంటే... ఈ దేశంలో నీ రాజకీయ అభిప్రాయం కూడా కొంతమంది పర్మిషన్ తోనే ఉండాలా? ఏం రోగం ఇది? ఏం మానసిక వైకల్యం ఇది?

ఇప్పుడు చాలామంది తమ నిజమైన అభిప్రాయం బహిరంగంగా చెప్పడానికి కూడా భయపడుతున్నారు. ఎందుకంటే... వాళ్లని డిబేట్ చేయరు. గుంపుల దాడి చేస్తారు. గుంపులుగా పడి అవమానిస్తారు. వ్యక్తిత్వ హత్య చేస్తారు. కొంతమంది ఇప్పుడు విమర్శించడం కోసం కాదు... మనుషులు భయపడేలా చేయడానికి మాట్లాడుతున్నారు. “నువ్వు కూడా మాట్లాడితే నెక్స్ట్ టార్గెట్ నువ్వే” అనే వాతావరణం సృష్టిస్తున్నారు. ఒక మనిషి ఏం మాట్లాడాడో వినరు. ముందు వాడు ఎవరి పక్కన నిలబడ్డాడో చూస్తారు. తర్వాత గుంపులుగా పడి చింపేస్తారు. ఇది డిస్-అగ్రిమెంట్ కాదు. ఇది గుంపుగా చేసే ఆన్‌లైన్ వేట.

ఈరోజు తనికెళ్ళ భరణి గారిని టార్గెట్ చేస్తున్నారు. రేపు ఒక సాధారణ మనిషి తన అభిప్రాయం చెప్పడానికి కూడా భయపడే పరిస్థితి వస్తుంది. అది ఆరోగ్యకరమైన సమాజం కాదు. ఒక మనిషి తన అభిమానాన్ని చెప్పాడని వారం రోజులుగా వందల మంది పడి కరుస్తుంటే... దాన్ని యాక్టివిజం అనరు. అది ఫ్రస్ట్రేషన్. లోపల ఖాళీగా ఉన్న మనుషుల్లా కనిపించే పిచ్చి కుక్కల గుంపు అరుపు.

నువ్వు మోదీని ఇష్టపడకపోవచ్చు. అది నీ హక్కు. కానీ ఇంకొకరు ఇష్టపడే హక్కు కూడా అంతే ముఖ్యమైనది. ఒక సమాజం ఆరోగ్యంగా ఉందో లేదో...అక్కడ మనుషులు ఎంత స్వేచ్ఛగా తిట్టగలుగుతున్నారో చూసి కాదు... ఎంత స్వేచ్ఛగా అభిమానించగలుగుతున్నారో చూసి తెలుస్తుంది.

- విశ్వ .ఎ

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page