top of page

మెగాస్టార్ కోసం స్పెషల్ స్టార్ నైట్.. ఎవరి ప్లాన్ ఇది?

  • Guest Writer
  • 4 hours ago
  • 2 min read

మెగాస్టార్ చిరంజీవి.. ఆయనకు ఉన్న క్రేజే వేరు.. నాలుగు దశాబ్దాలుగా హీరోగా కొనసాగుతూ కోట్లాది అభిమానుల మనసుల్లో స్థానం సంపాదించుకున్నారు. అనేక సినిమాల్లో నటించి.. ఎన్నో విభిన్న పాత్రల్లో యాక్ట్ చేసి తనదైన గుర్తింపు సొంతం చేసుకున్న ఆయనకు గౌరవంగా కాకినాడలో స్పెషల్ డిన్నర్ జరిగింది. ఆయన చేసిన సేవలకు థాంక్స్ చెబుతూ ఆ డిన్నర్ పార్టీను గ్రాండ్ గా ఏర్పాటు చేయడం విశేషం.

ఆ వేడుకను కాకినాడ పోర్ట్ చైర్మన్ కేవీ రావు శనివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. మెగాస్టార్ కు సన్మానం చేయాలనే ఉద్దేశంతో ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ లో ఆ కార్యక్రమాన్ని ప్లాన్ చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రోగ్రామ్ స్టార్టింగ్ నుంచే అక్కడికి వచ్చిన గెస్టులతో ప్రాంగణం కళకళలాడింది. టాలీవుడ్ కు చెందిన పలువురు ప్రముఖ నిర్మాతలు, దర్శకులు, నటీనటులు, వ్యాపారవేత్తలు హాజరయ్యారు.

చాలా రోజుల తర్వాత అందరూ ఒకే చోట కలవడంతో సందడి వాతావరణం కనిపించింది. ఎక్కడ చూసినా పలకరింపులు, నవ్వులు, ఫొటోలు దిగుతున్న విజువల్స్ కనిపించాయి. స్టార్ల సందడి కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చిరంజీవి అక్కడికి రాగానే అందరూ లేచి నిలబడి చప్పట్లతో స్వాగతం పలికారు. ఆయన కూడా చాలా కూల్ గా ప్రతి ఒక్కరితో మాట్లాడారు. పెద్దగా ఆర్భాటం లేకుండా అందరితో కలిసిపోయారు.

పాత జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటూ సరదాగా మాట్లాడటం అందరినీ ఆకట్టుకుంది. ఆయనతో ఫొటోలు దిగేందుకు చాలామంది ఇంట్రెస్ట్ చూపించారు. విందు ఏర్పాట్లు చక్కగా చేశారు నిర్వాహకులు. రుచికరమైన వంటకాలు, అందంగా అలంకరించిన వేదిక, కూల్ మ్యూజిక్.. అన్నీ కలిసి వేడుకను మరింత ఆనందంగా మార్చాయి. అతిథులకు ప్రత్యేకంగా సత్కారం అందించగా.. వారంతా వచ్చిన ప్రతి ఒక్కరితో సంతోషంగా గడిపారు. మొత్తం కార్యక్రమం అంతా కుటుంబ వేడుకలా అనిపించిందని పలువురు చెప్పారు.

ఈ సందర్భంగా పలువురు చిరంజీవి గురించి మాట్లాడారు. తెలుగు సినిమాకు ఆయన చేసిన కృషి ఎంతో గొప్పదని చెప్పారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తిగా ఆయన యువతకు స్ఫూర్తి అని అభిప్రాయపడ్డారు. సినిమాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా ముందుండటం గొప్పతనమని కొనియాడారు. ఇలాంటి వ్యక్తిని గౌరవించడం తమకు గర్వంగా ఉందని తెలిపారు. కాకినాడలో ఇంత పెద్ద స్థాయిలో సినీ ప్రముఖులు ఒకే చోట కలవడం అరుదు. అందుకే స్పెషల్ డిన్నర్ పార్టీ చర్చనీయాంశంగా మారింది.

సోషల్ మీడియాలో కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. మెగాస్టార్ ను దగ్గరగా చూసిన ఆనందం అందరిలో కనిపించింది! ఏదేమైనా చిరుకు గౌరవంగా ఏర్పాటు చేసిన ఆ ప్రత్యేక డిన్నర్ పార్టీ సింపుల్ గా, కానీ గ్రాండ్ గా జరిగింది. తారల సందడి మధ్య జరిగిన ఆ వేడుకను హాజరైన వారు ఎన్నాళ్లైనా గుర్తు పెట్టుకుంటారని చెప్పవచ్చేమో. మొత్తానికి కాకినాడలో జరిగిన ఆ స్టార్ నైట్ హాట్ టాపిక్ గా మారింది.

- తుపాకి.కామ్ సౌజన్యంతో...

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page