top of page

బ్లాక్ డ్రెస్ లో అందాల జాతర!!

  • Guest Writer
  • 15 hours ago
  • 3 min read

ఈమధ్య కాలంలో వెరైటీ ఇండియా రూపొందిస్తున్న ఫ్యాషన్ దుస్తులతో హీరోయిన్స్ తమ అందాన్ని మరింత రెట్టింపు చేసుకుంటున్నారు. ముఖ్యంగా తమ అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా వెరైటీ డ్రెస్ లతో ఫ్యాషన్ ప్రియులకు మరింత స్పెషల్ అట్రాక్షన్ గా కనిపిస్తున్నారు. ఇందులో బాగానే మలయాళీ ముద్దుగుమ్మ మాళవిక మోహనన్ కూడా తాజాగా వెరైటీ ఇండియా డిజైన్ చేసిన బ్లాక్ అవుట్ ఫిట్ తో అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఇటీవలే రకుల్ ప్రీత్ సింగ్ వెరైటీ డ్రెస్ తో మెస్మరైజ్ చేయగా.. ఇప్పుడు మాళవిక కూడా అలాంటి తరహా డ్రెస్ లోనే ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.

టాప్ ట్రెండీ ఔట్ ఫిట్ ధరిస్తూనే.. బాటమ్ చీరకట్టులో కనిపిస్తూ సరికొత్తగా కనిపించింది. ముఖ్యంగా ఫ్యాషన్ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటుంది ఈ ఔట్ ఫిట్. ఇక చేతులకు గోల్డెన్ కడ ధరించి తన మేకోవర్ ను ఫుల్ ఫిల్ చేసింది. ప్రస్తుతం ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకున్న ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మలయాళ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ఈమె తొలిసారి తెలుగులో ప్రభాస్ హీరోగా.. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ది రాజా సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో మాళవికతో పాటు రిద్దీ కుమార్, నిధి అగర్వాల్ కూడా హీరోయిన్లుగా నటించారు. ఇకపోతే భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా మాత్రం ఏడాది సంక్రాంతి బడిలో నిలిచి డిజాస్టర్ గా నిలిచింది.

అయినా సరే మాళవిక మోహనన్ కి మాత్రం మంచి గుర్తింపు లభించిందని చెప్పవచ్చు. ఇకపోతే ఈమె ఎవరో కాదు ప్రముఖ మలయాళ సినిమాటోగ్రాఫర్ కేయు మోహనన్ కుమార్.. 2013లో వచ్చిన మలయాళ చిత్రం పట్టంపోల్ సినిమా ద్వారా నటన రంగ ప్రవేశం చేసింది. ఇక తర్వాత ది గ్రేట్ ఫాదర్ , పెట్ట , మాస్టర్ , హృదయపూర్వం వంటి సినిమాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈమె 1993 ఆగస్టు 4న కేరళలోని కన్నూరు జిల్లాలోని పయ్యనూరు పట్టణంలో జన్మించింది. కానీ ముంబైలో పెరిగింది. ప్రస్తుతం కార్తీ హీరోగా నటించిన సర్దార్ సినిమా సీక్వెల్ సర్దార్ 2లో నటిస్తోంది. తమిళ భాష స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీకి పిఎస్ మిత్రన్ దర్శకత్వం వహిస్తున్నారు.

రత్నకుమార్ , ఆశామీరా అయ్యప్పన్ , విగ్నేష్ మునియాండి రచన , నంబి స్క్రీన్ ప్లే అందించారు. ప్రిన్స్ పిక్చర్స్, ఐవి ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై ఈ చిత్రం రూపుదిద్దుకుంటుంది. ఇందులో కార్తీక్, రజీషా విజయన్ తో పాటు మాళవిక మోహనన్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. వీరితోపాటు ఆషికా రంగనాథ్, ఎస్ జె సూర్యా కూడా ఈ సర్దార్ 2 లో భాగం కానున్నారు. 2024 జూలైలోనే షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమా ఈ ఏడాది జూన్లో విడుదల కానున్నట్లు సమాచారం.

- తుపాకి.కామ్ సౌజన్యంతో...

రాజమౌళి నుంచి సీక్వెల్స్ రానట్టే!

పార్ట్ 2, సీక్వెల్ జాడ్యం ఇండియన్ సినిమాని పట్టి పీడిస్తోంది. ప్రతీ ప్రాజెక్ట్ ‘టు బి కంటిన్యూడ’ అంటూ ఓ ఎండ్ కార్డ్ వేసుకొంటోంది. అయితే ఎస్.ఎస్.రాజమౌళి మాత్రం ఈ హంగామాకు దూరం. `బాహుబలి`తో సీక్వెల్ మొదలు పెట్టింది ఆయనే. అప్పటి నుంచే పార్ట్ 2 దందా మొదలైంది. కాకపోతే బాహుబలి స్పెషల్. ఓ కథని ఆయన రెండు భాగాలుగా చేశారు. ఓ సినిమాని కాదు. ఒక భాగంలో కథంతా చెప్పడానికి కుదరదు కాబట్టి పార్ట్ 2ని ఎంచుకొన్నారు. పార్ట్ 1 కంటే పార్ట్ 2నే ఎఫెక్టీవ్ గా తీయగలిగారు. ఆ తరవాత ఎప్పుడూ పార్ట్ 2 గురించి కానీ, సీక్వెల్ గురించి కానీ మాట్లాడలేదు. ఈగ 2 చేస్తానని చాలా సందర్భాల్లో చెప్పారు రాజమౌళి. కానీ దాన్ని ఎప్పుడో పక్కన పెట్టేశారు. ఆర్.ఆర్.ఆర్ కీ రెండో భాగం ఉంటుంది అనుకొన్నారు. కానీ రాజమౌళి మాత్రం ఆ ఊసెత్తలేదు.

ఇప్పుడు ‘వారణాసి’ కూడా సింగిల్ పార్టే. ఈసినిమాని రెండు భాగాలుగా విడుదల చేస్తారని ముందు నుంచీ ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఆ వార్తలకు రాజమౌళి చెక్ పెట్టారు. ఈసినిమాని ఒక పార్ట్ గానే విడుదల చేస్తామని ప్రకటించారు. కాకపోతే రన్ టైమ్ మాత్రం 3 గంటలు. రాజమౌళి, మహేష్ బాబు సినిమా 3 గంటలు తీస్తే.. చూడ్డానికి ప్రేక్షకులు రెడీనే. కాబట్టి రన్ టైమ్ పెద్ద ఇబ్బంది కాదనే అనుకోవాలి.

పార్ట్ 2, సీక్వెల్ అంటే చెప్పిన కథనే మరో కోణంలో చెప్పడం. లేదంటే ఆ క్యారెక్టర్‌ని, ఆ కథని పొడిగించడం. ఇవి రాజమౌళికి ఇష్టం లేదు. ఎందుకంటే ఆయన దగ్గర చెప్పాలనుకొన్న కథలు, చూపించాలనుకొన్న అద్భుతాలు చాలా ఉన్నాయి. సీక్వెల్ కి బదులు ఓ కొత్త కథ చెప్పడం ఎప్పుడూ బాగుంటుంది. రాజమౌళి కూడా ఆ దిశగానే ఆలోచిస్తున్నారనుకోవాలి.

- తెలుగు 360.కామ్ సౌజన్యంతో...

ఇరుముడిలో రవితేజ డ్యూయల్ రోల్ అట

మాస్ మహారాజ్ రవితేజకు ఇప్పుడు ఓ భారీ హిట్ అవసరం ఎంతైనా ఉంది. మొన్న వచ్చిన భర్తమహాశయులకు విజ్ఞప్తి బానే ఉందిలే కానీ అది రవితేజ రేంజ్ హిట్ బొమ్మ కాదు. సో ఇప్పుడు ఆ రేంజ్ హిట్ రవితేజ సొంతం కావాలంటే ఇప్పుడు తీస్తున్న ఈ డివోషనల్ టచ్ మూవీ హిట్ అవ్వాల్సిందే. రీసెంట్ గానే ఈ సినిమాకు సంబందించిన మూవీ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు మూవీ నుంచి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వినిపిస్తుంది.

ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకుడు. ఈ సినిమాను మైత్రి మూవీ సంస్థ నిర్మిస్తుంది. అయ్యప్పస్వామి మాలలో రవి తేజ చాలా డిఫరెంట్‌గా కనిపించారు. కచ్చితంగా ఈ సినిమా రవితేజకు మంచి హిట్ అందిస్తుందని అంతా అనుకున్నారు.అయితే ఈ సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్ చేస్తున్నారని ఇన్సైడ్ టాక్ నడుస్తుంది. వాటిలో ఒకటైతే భక్తుడి రోల్ అని క్లియర్ గా తెలుస్తుంది.

రెండోది ఏమిటో తెలియదు కానీ.. ఈ రెండు పాత్రలలో కూడా వేరియేషన్స్ బాగా తెలుస్తున్నాయని.. బాగా కుదిరాయనే టాక్ వినిపిస్తుంది. ఇక్కడ ఎన్ని పాత్రలలో రవితేజ కనిపించాడు అనేది ఇంపార్టెంట్ కాదు. రవితేజ నుంచి హిట్ పడాలి అంతే. అందుకోసం ఎంతటి కష్టమైన రవితేజ పడతాడని అందరికి తెలుసు. ఇక ముందు ముందు సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి.

- ఐడ్రీమ్‌పోస్ట్.కామ్ సౌజన్యంతో...

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page