చీరకట్టులో గిలిగింతలు పెడుతోంది!!
- Guest Writer
- 16 hours ago
- 3 min read

సినిమా అనే రంగుల ప్రపంచంలో ముఖానికి రంగు పులుముకొని ప్రేక్షకులను ఆకట్టుకోవాలని ఎంతోమంది పరితపిస్తున్నారు. అందులో భాగంగానే సామాన్యులను మొదలుకొని సెలబ్రిటీల వారసులు కూడా ఇండస్ట్రీలోకి అడుగు పెడుతూ తమ టాలెంటును నిరూపించుకుంటున్నారు. ఇంకొంతమంది సినిమాపై ఇష్టంతో మోడల్స్ గా మారి ఇష్టంతో కష్టమైన పనులను కూడా చేస్తూ ఆఖరికి మిస్ ఇండియా, తెలంగాణ మిస్ వరల్డ్ టైటిల్స్ ను సొంతం చేసుకొని ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు.
అలా మార్గం ఏదైనా సరే ఇండస్ట్రీలోకి రావాలనే కలను నెరవేర్చుకుంటున్నారు. అలాంటి వారిలో మానస వారణాసి కూడా ఒకరు. ఫెమినా మిస్ ఇండియా 2020 అందాల పోటీలో పాల్గొని కిరీటాన్ని అందుకున్న ఈమె.. పలు యాడ్స్ లో కూడా నటించి ఆకట్టుకుంది. ఇక 2020 డిసెంబర్ 20న కోకో కోలా మ్యూజిక్ హాల్లో జరిగిన మిస్ వరల్డ్ పోటీలో భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించి పదవ స్థానంలో నిలిచింది. అలాంటి మానస వారణాసి 1997 మార్చి 27న హైదరాబాదులో జన్మించింది.. ఈమె తండ్రి ఉద్యోగం కారణంగా మలేషియాకు వెళ్లిన మానస 2012లో పదవ తరగతి పూర్తి చేసింది. ఆ తర్వాత హైదరాబాద్ కి వచ్చి.. ఎఫఐఐటి జేఈఈ లో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన ఈమె.. వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో కంప్యూటర్ సైన్స్ పూర్తి చేసి ఫ్యాక్ట్ సెట్ లో ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ విశ్లేషకురాలిగా కూడా పనిచేసింది.
ఇక ఆ తర్వాతే మోడల్ గా మారి పలు అందాల పోటీలలో పాల్గొని తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న ఈమె.. గత ఏడాది దేవకీ నందన వాసుదేవా అనే సినిమా ద్వారా హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయమైంది. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఇందులో అశోక్ గల్లా హీరోగా నటించారు. ఈ ఏడాది కపుల్ ఫ్రెండ్లీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వంలో సంతోష్ శోభన్ హీరోగా, మానస వారణాసి హీరోయిన్గా వస్తున్న చిత్రం ఇది. ఈ చిత్రాన్ని యు వి క్రియేషన్స్ , యు వి కాన్సెప్ట్స్ బ్యానర్లపై అజయ్ కుమార్ రాజు నిర్మిస్తున్నారు. ఇక ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా అందులో తన అద్భుతమైన లుక్స్ తో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది మానస వారణాసి.
ఇకపోతే తాజాగా అవే ఫోటోలను ఆమె ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకోవడంతో ఆమె అందాన్ని చూసి అభిమానులు మంత్రముగ్ధులవుతున్నారు. బ్లూ కలర్ ప్లెయిన్ నెట్టేడ్ శారీ కి కలర్ ఫుల్ గా ఎంబ్రాయిడరీ డిజైన్ తో బార్డర్ ను రూపొందించారు.. ఈ చీరకట్టలో మానస తన అందాన్ని మరింత రెట్టింపు చేసుకుంది. సింపుల్ లుక్ లో చాలా సింపుల్ గా స్మైల్ ఇచ్చి అభిమానుల హృదయాలను దోచుకుంది. ప్రస్తుతం మానస వారణాసి షేర్ చేసిన ఫోటోలు అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
- తుపాకి.కామ్ సౌజన్యంతో...
బరాబర్... ప్రేమికుడు

యాటిట్యూడ్ స్టార్‌గా... తొలి సినిమాతోనే ఓ ట్యాగ్‌లైన్ తెచ్చుకొన్నాడు చంద్రహాస్. ‘ఈటీవీ’ ప్రభాకర్ తనయుడీయన. తొలి సినిమా ఫ్లాప్ అయ్యింది. అయినా సరే.. మొండి ధైర్యంతో మరో సినిమా చేశాడు. అదే `బరాబర్ ప్రేమిస్తా`. ఈవారమే విడుదల అవుతోంది. ఈరోజు ట్రైలర్ వదిలారు.
పల్లెటూరి ప్రేమ కథ ఇది. చందూ అనే కుర్రాడికీ, బుజ్జమ్మ అనే అమ్మాయికీ మధ్య పరిచయం, వాళ్ల స్నేహం, ప్రేమ.. మధ్యలో వచ్చే ఆటంకాల సమ్మేళనం ఈ కథ. చంద్రహాస్ చాలా ఈజ్ తో నటించేశాడు. ప్రెస్ మీట్లలో, ఇంటర్వ్యూలలో తన యాటిట్యూడ్ పక్కన పెడితే, స్క్రీన్ మీద మాత్రం ఈతరం కుర్రాళ్లకు నచ్చేలా కనిపిస్తున్నాడు. డైలాగులు, బాడీ లాంగ్వేజ్ అంతా మాసీ.. మాసీగా కనిపిస్తున్నాయి. ‘రెడ్డి మామ’ పాటలో స్టెప్పుల కోసం కష్టపడినట్టు కనిపిస్తోంది. చిన్న సినిమాలు ఈమధ్య ఊహించని రేంజ్ లో విజయం సాధిస్తున్నాయి. మంచి టాక్ వచ్చి, కాస్త పబ్లిసిటీ చేసుకొంటే చాలు. ఫలితాలు కనిపిస్తున్నాయి. కానీ ‘బరాబర్ ప్రేమికుడు’ కోసం చంద్రహాస్ నెగిటీవ్ పబ్లిసిటీని ఎంచుకొన్నాడనిపిస్తోంది. ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఆయన పాడిన ఓ పాట ఇప్పుడు వివాదాస్పదం అయ్యింది. సోషల్ మీడియాలో చంద్రహాస్ ని టార్గెట్ చేస్తున్నారు. వాళ్లకు చంద్రహాస్ కౌంటర్ కూడా ఇస్తున్నాడు. పబ్లిసిటీ స్టంట్ ఎలా ఉన్నా.. కంటెంట్ బాగుంటే జనం ఆదరిస్తారు. ఈ సినిమాలో కంటెంట్ బాగుండి, చంద్రహాస్ పై పడిన నెగిటివిటీ అంతా పోవాలని టీమ్ మొత్తం కోరుకొంటోంది.
- తెలుగు 360.కామ్ సౌజన్యంతో...
ఫౌజీ , స్పిరిట్ డార్లింగ్ నుంచి నెక్స్ట్ సినిమా ఏమై ఉంటుంది !

ఎప్పుడెప్పుడా వేయికళ్లతో ఎదురుచూసిన రాజాసాబ్ వచ్చేసింది. సినిమా మీద చాలా మంది చాలానే ఆశలు పెట్టుకున్నారు కానీ ఎందుకో ఊహించినంత రేంజ్ లో మూవీ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. చాలా చోట్ల బ్రేక్ ఈవెన్ కూడా అవ్వలేదనే టాక్ కూడా వినిపించింది. సినిమాను మెచ్చుకున్నవారు ఉన్నారు .. సినిమా చూసి నొచ్చుకున్నవారు కూడా ఉన్నారు. కానీ చాలా కాలం తర్వాత అందరూ డార్లింగ్ వింటేజ్ వైబ్ ను ఎంజాయ్ చేసిన మాట వాస్తవం. సరే ఇదంతా అయిపోయిన కథ.. ఎదో ఈ సినిమాకు ఇలా అయింది కదా అని డార్లింగ్ అభిమానులు నిరాశలో ఉండిపోరు. ఎందుకంటే దానికి మించిన సినిమాలు ప్రభాస్ అప్ కమింగ్ లిస్ట్ లో చాలానే ఉన్నాయి.
వాటిలో ప్రస్తుతం బజ్ అంతా ఫౌజీ , స్పిరిట్ సినిమాల మీదే నడుస్తుంది. ఈ రెండు సినిమాలు కూడా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి. ఈ రెండు కంప్లీట్ అయితే కల్కి 2 సెట్స్ మీదకు వెళ్తుంది. వీటిలో ఫౌజీ షూటింగ్ దాదాపు సగానికి పైగానే కంప్లీట్ అయినట్టు చెప్తున్నారు. స్పిరిట్ కూడా మొన్నీమధ్యనే సెట్స్ మీదకు వెళ్లినట్టు సమాచారం. ఈ రెండు సినిమాల కోసం ప్రేక్షకులు ఎంత వెయిట్ చేస్తున్నారో తెలియనిది కాదు. అసలు లెక్క ప్రకారం ఫౌజీ ముందు విడుదల కావాల్సి ఉంది. ఆ తర్వాత స్పిరిట్ రావాలి. కానీ ఇప్పుడు లెక్కలు తారుమారు అయ్యాయట.
అన్నిటికంటే ముందు స్పిరిట్ రిలీజ్ అవుతుందట. 2027 మార్చి 5న ఈ చిత్రాన్ని విడుదల చేస్తామంటూ నిర్మాతలు ప్రకటించేశారు. కానీ ఫౌజీ రిలీజ్ డేట్ మాత్రం ఇంకా పెండింగ్ లోనే ఉంది . ఆగస్టు లేదా సెప్టెంబర్ కు ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అవుతుందట. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ కు ఇంకాస్త ఎక్కువ సమయం పడుతుందట . స్పిరిట్ రిలీజ్ అయినా నాలుగు నెలల గ్యాప్ లో ఫౌజీ రానుందట. అంటే వచ్చే ఏడాది ప్రభాస్ నుంచి బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు రానున్నాయట. మార్కెట్ లెక్కల ప్రకారం కూడా ఇదే ముందు రావడం బెటర్ అని అంటున్నారు. ఇక ఏమౌతుందో చూడాలి.
- ఐడ్రీమ్‌పోస్ట్.కామ్ సౌజన్యంతో...










Comments