top of page

రండి.. స్వదేశాన్ని సుసంపన్నం చేద్దాం!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Mar 3
  • 3 min read

డాలర్ డ్రీమ్స్.. నిన్నటివరకు భారతీయ చదువరులు ఇవే కలలు కనేవారు. ‘అమెరికా వెళ్లాలి.. డాలర్లు సంపాదించి దర్జాగా బతకాలి’.. స్థూలంగా డాలర్ డ్రీమ్స్ సారాంశం ఇదే. కానీ ఇటీవలి కాలం లో ఆ డ్రీమ్స్ కరిగిపోతున్నాయి. అమెరికాలోని వలసదారుల విషయంలో ట్రంప్ సర్కారు తీసుకుం టున్న నిర్ణయాలే అక్కడి ప్రవాస భారతీయులపాలిట శరాఘాతాలుగా మారుతున్నాయి. కాగా ట్రంప్ సర్కారు నిర్ణయాలు మింగుడుపడక అమెరికన్లే స్వదేశాన్ని వీడి ఇతర దేశాల వైపు చూస్తున్నారు. ఇతర దేశాల నుంచి అమెరికాకు వలస వెళ్లేవారి కంటే అమెరికా నుంచి ఇతర దేశాలకు వలస వెళ్తున్న అమె రికన్ల సంఖ్య పెరుగుతున్నది. చరిత్రలో ఎన్నడూ లేనంతగా అమెరికన్లు వలసబాట పడుతున్నారని వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనం ద్వారా వెల్లడవుతున్నది. ఈ కథనం ప్రకారం 90 ఏళ్ల క్రితం మహామాంద్యం సమయంలో కనిపించిన పరిస్థితులే ఇప్పుడు పునరావృతమవుతున్నాయి. మరోవైపు ప్రముఖ థింక్ ట్యాంక్ బ్రూకింగ్స్ ఇన్‌స్టిట్యూషన్ అంచనాల ప్రకారం.. 2025లో స్వదేశాన్ని వీడిన అమెరికన్ల సంఖ్య దేశంలోకి వచ్చిన వలసదారుల కంటే ఎక్కువగా ఉంది. గత కొన్నేళ్ల గణాంకాలను పరిశీలిస్తే.. 2023 లో దాదాపు 60 లక్షల మంది అమెరికాకు వలస వెళ్లగా, 2025 నాటికి ఆ సంఖ్య 27 లక్షలకు పడిపో యింది. మరోవైపు గత ఏడాది సుమారు 1.8 లక్షల అమెరికన్లు ఇతర దేశాలకు శాశ్వతంగా లేదా తాత్కాలికంగా వలస వెళ్లారు. రోజురోజుకూ పెరుగుతున్న జీవన వ్యయం, ఇళ్ల ధరలు, వైద్య ఖర్చులు మధ్యతరగతి కుటుంబాలను ఒత్తిడికి గురిచేస్తున్నాయి. మరోవైపు రిమోట్ వర్క్ సంస్కృతి విస్తరించడం తో అమెరికాలో ఉండాల్సిన అవసరం తగ్గింది. యూరప్‌లోని జర్మనీ, పోర్చుగల్, ఐర్లాండ్ వంటి దేశా ల్లో తక్కువ ఖర్చుతో మెరుగైన జీవన ప్రమాణాలు, సామాజిక భద్రత లభిస్తున్నాయని అమెరికన్లు భావి స్తున్నారు. అయితే దీనిపై వైట్‌హౌస్ భిన్నంగా స్పందించింది. అమెరికా ఆర్థిక వ్యవస్థ ఇప్పటికీ బలంగా ఉందని, అక్రమ వలసలను నియంత్రిస్తూనే, అత్యంత సంపన్నులను గోల్డ్ కార్డ్ వంటి పథకాలతో ఆకర్షిస్తున్నామని తెలిపింది. ఏదేమైనా 1930 నాటి గ్రేట్ ఆపరేషన్ సమయంలో చాలామంది అమెరి కన్స్ ఉపాధి కోసం సోవియట్ యూనియన్ వైపు వలస వెళ్లిన తర్వాత.. మళ్లీ ఇప్పుడే అమెరికా నుంచి నికర వలసలు నమోదవడం చరిత్రలో ఒక కీలక మలుపుగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. ఈ పరిస్థితు ల్లో అమెరికా పౌరసత్వం ఉన్న వారిని పక్కన పెట్టి కనీసం ఇతర తాత్కాలిక వీసాల మీద ఉన్నవారు భారత్‌కు తిరిగి వచ్చేయడంపై సీరియస్‌గా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే అమెరికాలో సంపా దించినంత భారత్‌లో సంపాదించగలమా.. అన్న ప్రశ్నలు వినిపించవచ్చు. దానికి సమాధానం ఆశించే ముందు అమెరికా సురక్షిత దేశమా అనేది ఆలోచించాలి. ఆ కోణంలో ఆలోచిస్తే పరిగెత్తి ‘పాలు తాగే కంటే.. నిలబడి నీళ్లు తాగడం మేలు’ అన్నట్లు నిరంతరం భయం గుప్పిట్లో దర్జా ఎలా వెలగబెట్టగలం? పైకా అమెరికా శాంతి వచనాలు వల్లిస్తున్నా.. ట్రంప్ ప్రభుత్వం ఇటీవలి కాలంలో పెద్ద యుద్ధాల్లో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పాల్గొంటున్నది. ఫలితంగా రక్షణ బడ్జెట్ భారీగా పెరిగి ఖజానా పరిస్థితి దిగజారిందన్నది వాస్తవం. అలా ఖాళీ అయిన ఖజానాను నింపుకోవడానికి, దివాలా ముప్పునుంచి తప్పించుకోవడానికే రకరకాల సాకులతో ప్రపంచ దేశాలపై టారిఫ్‌ల భారం మోపుతున్నది. అమెరికా లాంటి పెద్ద ఆర్థిక వ్యవస్థ ఇప్పటికిప్పుడు కూలిపోదులే అని ధీమా వ్యక్తం చేసేవారు ఒక విషయం ఆలోచించాలి. తమ పనులు తాము చేసుకోలేని దుర్బలులు అమెరికన్లు. ప్రతిదానికీ ఇతర దేశాలపై ఆధారపడే పరాధీన దేశం. ఇప్పటికే అమెరికన్ యూనివర్సిటీల్లో చైనా తిష్ఠ వేసింది. అమెరికాను చెడ గొట్టడానికి అవసరం అయిన చెత్త ప్రచ్ఛన్న యుద్ధకాలంలోనే అక్కడికి తరలిపోయింది. మరోవైపు ఇస్లాం తన పట్టును బాగా పెంచుకుంది. బయట ఇస్లాం దేశాల మీద యుద్ధం చేస్తున్న అమెరికా ప్రభు త్వం తమ దేశంలోనే పెరుగుతున్న ఇస్లామికీకరణను గుర్తించలేని స్థితిలో ఉంది. ముఖ్యంగా అమెరికన్ల లో తమది ఒక దేశం.. ఒక జాతి అనే సమైక్య భావన లోపించడం ప్రమాదకరం. పైకి అమెరికన్లది ఒక ప్రత్యేక జాతి అని.. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని చెబుతుంటారు కానీ వాస్తవం వేరు. అమెరికా అనే దేశం విలాసాలు అనుభవించడానికే ఏర్పరచుకున్న భూమి అని అక్కడి ప్రజలందరికీ తెలుసు.. అలాంటివారికి అదో టెంపరరీ షెల్టర్ అనే భావన ప్రబలంగా ఉంది. ఒకప్పుడు అమెరికాను సవాల్ చేసి ప్రచ్ఛన్న యుద్ధం నెరిపిన అంత పెద్ద సోవియట్ రష్యా ముక్కచెక్కలు అయిపోయిన తర్వాత అమె రికాకు తిరుగులేదని, ప్రపంచ పెత్తనమంతా దానిదేనని అనుకుంటాం గానీ.. అమెరికా ఇప్పటికే ముక్క లైంది. కాకపోతే ఇంకా బహిర్గతం కాలేదు. మరో పదేళ్లలో ప్రపంచానికి అది ద్యోతకమవుతుంది. అభి వద్ధి చేయడం మహాకష్టం గానీ.. ధ్వంసం కావడం ఎంత సేపు! గాజా, లిబియా వంటి ప్రాంతాల పతనం చూడాలేదా! ఒక జాతి అన్న నమ్మిక, భావోద్వేగం లేని భూభాగంలో ఉండే ఎంత పెద్ద రాజ్య వ్యవస్థ, సామాజిక వ్యవస్థ ఉన్నా కూలిపోవడం చాలా సులభం. అదీగాక ప్రవాసుల పట్ల ట్రంప్ సర్కారు తీసుకుంటున్న కఠిన నిర్ణయాలు ఒకవైపు.. ఇరాన్‌పై కత్తిగట్టి ప్రజలను మూడో ప్రపంచ యుద్ధం ముంగిటికి లాక్కెళ్లిన అమెరికా యుద్ధోన్మాద జ్వాలలు రేగుతున్న ఈ తరుణమే స్వదేశానికి తిరిగి వచ్చే విషయం తీవ్రంగా ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే.. శత్రువు ఊరికే చేతులు ముడుచుకుని కూర్చోడు. ఎంత బలహీనుడైనా తన శక్తిమేరకు పోరాడటానికే ప్రయత్నిస్తాడు. ప్రస్తుతం ఇరాన్ తనపై విరుచుకుపడుతున్న అమెరికా విషయంలో అదే చేస్తున్నది. పశ్చిమాసియాలో ఉన్న అమె రికన్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులతో విధ్వంసం సష్టిస్తున్నది. కాగా ఇప్పుడు నిజ మైన అభివృద్ధి, నైపుణ్యం గ్లోబల్ సౌత్ వైపు ఉన్నాయి. ముఖ్యంగా చైనా, భారత్‌లు శరవేగంగా పురో గమిస్తున్న పరిస్థితుల్లో ప్రవాసులందరూ తరలివచ్చి భారత్‌ను సుసంపన్నం చేయాలి.

Comments

Couldn’t Load Comments
It looks like there was a technical problem. Try reconnecting or refreshing the page.

Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page