ప్రపంచంపై ఇస్లాం బాంబు!
- DV RAMANA

- 15 hours ago
- 2 min read

‘తాము డల్లాస్‌లో నివసిస్తున్నట్లు లేదు.. పాకిస్తాన్‌లో ఉన్నట్లుగా ఉంది’ అని ఇటీవల అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు బ్రాండన్ గిల్ ఒక వీడియో ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు అమెరికాలో ముస్లిం జనాభా పెరుగుదల తీవ్రతను సూచిస్తున్నాయి. ఈ మార్పు ఒక్క అమెరికాకే పరిమితం కాలేదు.. అనేక ప్రపంచ దేశాల్లోనూ ఇది కనిపిస్తోంది. వాస్తవానికి ఆయన ఆందోళన కూడా అదే. అమెరికాలో భాగంగా ఉన్న టెక్సాస్ రాష్ట్రంలో ఇస్లామీకరణ శరవేగంగా జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేకించి డల్లాస్‌లో ఈ తరహా వాతావరణం ఉందన్నారు. మసీదులు, పలు షాపింగ్ మాల్స్‌లను చూస్తుంటే పాకిస్తాన్‌లో ఉన్న భావన కలుగుతున్నదని, ఆ దేశంలో ఉన్న పరిస్థితులే ఇక్కడ కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు. యూఎస్ కాంగ్రెస్‌లో టెక్సస్ 26వ డిస్ట్రిక్ట్‌కు రిపబ్లికన్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అత్యంత నమ్మకస్తుడన్న పేరుంది. ఇస్లామిక్ వలసలు అమెరికాను నాశనం చేస్తున్నాయని ఆయన తేల్చి చెప్పారు. ఈ విషయంలో స్థానిక అమెరికన్ ఓటర్ల నుంచి వెల్లువెత్తుతున్న ఫిర్యాదులను ఉటంకించారు. డల్లాస్ ప్రాంతంలో ఇస్లామీకరణ శరవేగంగా జరుగుతోందని ఓటర్లు తీవ్ర ఆందోళన చెందుతున్నారని, దీనిపై నిరంతరం ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయని స్పష్టం చేశారు. షాపింగ్ మాల్స్‌లో చోటు చేసుకుంటున్న మార్పులను ఓటర్లు తన దృష్టికి తీసుకొచ్చారని వివరించారు. అమెరికన్ కమ్యూనిటీలు, అమెరికన్ సంస్కృతి వంటి ప్రాథమిక మూలాల నుంచి అమెరికన్లు అమితంగా ఇష్టపడే డల్లాస్ నగరం క్రమేణా రూపాంతరం చెందుతూ ఆనవాళ్లు కోల్పోతున్నదని దీనికి ప్రధాన కారణం ఇస్లామీకరణ, వలసలే నని స్పష్టం చేశారు. గిల్ వ్యాఖ్యలపై టెక్సాస్ రాష్ట్రంలోని ముస్లీం కమ్యూనిటీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అమెరికన్ ముస్లింలను అకారణంగా లక్ష్యంగా చేసుకుంటున్నాయని విమర్శించారు. గిల్‌ను ఇస్లామోఫోబిక్ ఫాసిస్ట్‌గా అభివర్ణిస్తున్నారు. అయితే అమెరికా ప్రభుత్వం ఇప్పటివరకు దీనిపై స్పందించలేదు. పెరుగుతున్న ముస్లింల వలసలపై తన వైఖరి ఏమిటో కూడా వెల్లడించలేదు. బ్రిటన్‌లోనూ ఇవే పరిస్థితులు ఉన్నాయి. ఒకప్పుడు పాకిస్తాన్‌సహా అఖండ భారతాన్ని పాలించిన బ్రిటన్‌లో పలు నగరాలు ఇప్పుడు ముస్లిం జనాభాకు ఆలవాలంగా మారుతున్నాయి. కొన్ని చోట్ల స్థానిక ప్రజల కంటే వీరి జనాభాయే ఎక్కువగా ఉందన్న భావన కలుగుతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే చాలా బ్రిటన్ నగరాల్లో ముస్లింలు మెజారిటీ వర్గంగా, బ్రిటీషర్లు మైనారిటీలుగా మారిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఒకప్పుడు ప్రపంచంలో మెజారిటీ దేశాలను పరిపాలించడంతోపాటు ఆర్థికంగానూ పైచేయిగా ఉన్న బ్రిటన్ పరిస్థితి క్రమంగా దిగజారిపోతున్నది. జనాభా విషయంలోనూ ముందు ముందు అదే జరుగుతుందేమో! ఆ దేశంలో స్థానికేతరులు.. ముఖ్యంగా ముస్లింల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోతున్నది. ఇటీవలి గణాంకాల ప్రకారం చూస్తే.. బ్రిటన్‌లోని 11 నగరాల్లో ముస్లిం జనాభా గణనీయంగా పెరిగింది. పాకిస్తాన్ నుంచి ఉపాధిని వెతుక్కుంటూ చాలామంది ఆ దేశానికి వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. అదే అదనుగా తమ వారు ఉన్నారని అక్రమంగా వెళ్లినవారు కూడా ఎక్కువ మందే ఉన్నారు. దీంతో క్రమంగా ఈ నగరాల్లో ముస్లిం జనాభా భారీగా పెరిగింది. వాస్తవం చెప్పాలంటే.. ఇప్పుడు స్థానికులే అక్కడ ద్వితీయ పౌరులుగా జీవిస్తున్న పరిస్థితి ఉంది. స్థానికులు ఏమైనా అంటే వివక్ష చూపుతున్నారని ముస్లింలు ఆరోపిస్తారు. ఒక్క పాకిస్తాన్ నుంచే కాకుండా ఇతర ముస్లిం దేశాల నుంచి కూడా వేల మంది బ్రిటన్‌కు వలస వెళ్లి అక్రమంగానో, సక్రమంగానో అక్కడే స్థిరపడుతున్నారు. ఫలితంగా ఇతర నగరాల్లో కూడా ముస్లిం జనాభా పెరుగుతోంది. పాకిస్తాన్‌తోపాటు, పాకిస్తానేతర ముస్లింలు ఒక్కటై బ్రిటన్‌లో జనబలం పెంచుకుంటున్నారు. తద్వారా అక్కడ స్థానికపాలన అధికారాలను కూడా ముస్లింలే చేజిక్కించుకుంటున్నారు. దీంతో స్థానిక సంస్కృతి దెబ్బతింటున్నదని బ్రిటన్‌వాసులు ఆందోళన చెందుతున్నారు. కొంతకాలంగా ఆందోళనలు కూడా చేస్తున్నారు. పాకిస్తానీలు దేశాన్ని వీడి వెళ్లిపోవాలని, తమకు పాత బ్రిటన్ కావాలని పోరాటం కూడా చేస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు. ముస్లిం జనాభా పెరుగుదలను బ్రిటన్ పాలకులు ఇప్పటికైనా అడ్డుకోవాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ముందుగా అక్రమ వలసదారులను పంపించి వేయాలి. తర్వాత జనాభా నియంత్రణ చర్యలు చేపట్టాలి. స్థానిక సంస్కృతిని దెబ్బతీస్తున్నవారి పట్ల కఠినంగా వ్యవహరించాలి. లేదంటే 2050 నాటికి ముస్లిం జనాభా గణనీయంగా పెరిగి చివరకు బ్రిటిష్ పాలనా పగ్గాలు కూడా ముస్లింల చేతిలోకి వెళ్లే ప్రమాదముందంటున్నారు. ఇతర అనేక ప్రపంచ దేశాల్లోనూ దాదాపు ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం ముస్లింలు కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించకపోవడమేనని జనాభా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత కాలంలో దాదాపు ప్రపంచ దేశాలన్నీ జనాభా నియంత్రణ పద్ధతులను అమలు చేస్తున్నాయి. అదుపులేని జనాభా పెరుగుదల సామాజిక అసమానతలకు, అసమతౌల్యానికి దారితీస్తుందని, ప్రభుత్వాలను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేస్తుందని భావించి జనాభా వద్ధి రేటును తగ్గించేందుకు దేశాలు ప్రయత్నిస్తున్నాయి. కానీ తమ మత విశ్వాసాల కారణంగా ముస్లిం కమ్యూనిటీలో కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించడం చాలా తక్కువగా కనిపిస్తుంది. దీనివల్ల ఇతర మతవర్గాల జనాభా వద్ధిరేటు అదుపులో ఉంటే.. ముస్లిం జనాభా వద్ధిరేటు మాత్రం పెరుగుతూ ఇతర వర్గాలను దాటిపోతున్నది. పైగా ఆయా దేశాల్లో ఉపాధితో సహా కుటుంబం మొత్తం హాయిగా జీవించే పరిస్థితులు లేకపోవడం వల్ల ముస్లింలు ఇతర దేశాలకు వలసపోయి.. అక్కడ కూడా సంతాన వద్ధి చేసుకుంటున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే 2070 నాటికి ఇస్లాం ప్రపంచంలో అతిపెద్ద మతవర్గంగా అవతరిస్తుందని అంచనా. తస్మాత్ జాగ్రత్త.










Comments