top of page

వలసల ముసుగులో వికృత క్రీడ!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • May 23
  • 3 min read

మత సహనం.. సమానత్వం.. మన రాజ్యాంగం నిర్దేశించిన ప్రజాస్వామిక సూత్రాలు. కానీ కొన్ని రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా పొరుగు దేశాలతో సరిహద్దులు కలిగిన పశ్చిమ బెంగాల్లో గత ఒకటిన్నర దశాబ్దాలపాటు అవిచ్ఛిన్నంగా కొనసాగిన ఓట్ల రాజకీయం ఒక వర్గాన్ని ఎక్కువ సమానులుగా పరిగణించి.. సొంత దేశంలోనే మెజారిటీ వర్గీయులను సెకండ్ రేటెడ్ సిటిజన్స్ స్థాయికి అనధికారికంగా దిగజార్చేసింది. ఇదే అదనుగా పొరుగునున్న బంగ్లాదేశ్ నుంచి విపరీతంగా మైనారిటీ వర్గీయుల అక్రమ వలసలు, చొరబాట్లు పెరిగిపోయాయి. ఇవి దేశభద్రతకే సవాల్‌గా మారే ప్రమాదం పొంచి ఉన్న పరిస్థితుల్లో జరిగిన మొన్నటి ఎన్నికల్లో ఆ ఏకపక్ష పాలనకు తెరపడింది. అధికార పగ్గాలు చేపట్టిన కొత్త ప్రభుత్వం అక్రమ చొరబాటుదార్లను సరిహద్దు ఆవలికి తరిమేస్తామని ప్రకటించింది. ఆ ఒక్క మాటతో వెస్ట్ బెంగాల్‌లో ఇప్పుడు ఏకంగా జనాభా యుద్ధం మొదలైందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఎన్నికలకు ఏడాది ముందు ఓటర్ల జాబితా ప్రత్యేక రివిజన్(సర్) ద్వారా కొంతవరకు చొరబాటుదారుల ఏరివేత సాధ్యమైంది. ఇప్పుడు దానికి కొనసాగింపు చర్యలు ఉంటాయన్న చర్చ జరుగుతోంది. మామÖలుగా చూస్తే ఇదో రాజకీయ వివాదంగా కనిపించినా ఆ ముసుగులో జరుగుతున్న కుట్రలకు తెరతీసే సమయం ఆసన్నమైంది. ఎవరు ఈ దేశాన్ని తమ మాతృభూమిగా చూస్తున్నారు? ఎవరు ఓపెన్ బోర్డర్‌లా వాడుకుంటున్నారు? అనే తేడాలు తొలగిపోయే అవకాశం ఉండటం రాజకీయంగా కలకలం రేపుతున్నది. ఇప్పటికే అసోంలో అమలు చేస్తున్న ‘డిటెక్ట్. డిలీట్. డిపోర్ట’ తరమా త్రీడీ మోడల్ అమలు చేస్తామని బెంగాల్ కొత్త పాలకులు స్పష్టం చేస్తున్నారు. వీరి ప్రకటనలు చూసి దేశంలోని మతోన్మాద శక్తులతోపాటు సరిహద్దు దేశమైన బంగ్లాదేశ్‌లోని మతోన్మాద మూకలు సైతం ఉలిక్కి పడుతున్నాయి. ‘భారత్‌తో ముస్లింలను టచ్ చేస్తే మా దేశంలో హిందువులపై దాడులు చేస్తాం’ అంటూ బహిరంగ బెదిరింపులకు తెగబడుతున్నాయి. ఈ బెదిరింపులతోనే వలసల సాకుతో సాగుతున్న చొరబాట్ల అసలు ముసుగు తొలగిపోయింది. నిజంగా ఇది పేద వలసదారుý వ్యథే అయితే హిందువులను చంపేస్తామన్న బెదిరింపులు ఎందుకు? దేవాలయాలు పగులగొడతామన్న హెచ్చరికలు ఎందుకు? చికెన్ నెక్‌ను ఉపయోగించుకుని భారత్ పీక నొక్కి ఈశాన్య రాష్ట్రాలను దాన్నుంచి విడదీస్తామన్న హుంకరింపులు ఎందుకు? అంటే.. ఇది కేవలం ఆకలి తీర్చుకోవడానికి వచ్చిన వలస జనాల కథ కాదు. ఇది దేశ జనభా స్వరూపాన్ని మార్చే ప్రాజెక్ట్.. ఓటు బ్యాంక్ ఆపరేషన్. సరిహద్దులు తెరిచి ఉంచితే దేశాలను ఆక్రమించడానికి, కూల్చడానికి యుద్ధాలు అవసరం ఉండదు. జస్ట్.. జనాభా దామాషాను మార్చగలిగితే చాలు! ఇంకా దారుణం ఏంటంటే.. మన పొరుగు దేశానికి భారత్ నుంచే కరెంట్ కావాలి. భారత్ నుంచే బియ్యం కావాలి. భారత్ నుంచే నీళ్లు కావాలి. భారత్ నుంచే గ్యాస్ కావాలి. భారత్ నుంచే వ్యాపారాలు కావాలి. కానీ అదే భారత్ తన సరిహద్దులు కాపాడుకుంటానంటే మాత్రం నియంతృత్వం, మానవహక్కుల ఉల్లంఘన, మైనారిటీలపై దాడి అంటూ ప్రపంచం ముందు పెడబొబ్బలు పెట్టడం, భారత్‌ను శాపనార్థాలు పెట్టడం బంగ్లాదేశ్‌కు పరిపాటిగా మారింది. ఆ దృష్టితో చూస్తే బెంగాల్ ప్రభుత్వం వలసదారులను అక్రమంగా తరిమేస్తున్నదన్నది బాధితుల రోదన కాదు. అదొక రాజకీయ కుట్ర. ‘ముందు చొరబడు. తర్వాత సెటిల్ అవ్వు. తర్వాత ఓటర్ అవ్వు.. తర్వాత జనాభా మార్చు. . చివరాఖరికి ‘మమ్మల్ని టచ్ చేస్తే అల్లర్లు’ అని బెదిరించే తిరకాసు మోడల్! ఇన్నాళ్లూ ఇవే ఆటలు సాగాయి. చొరబాట్ల సమస్య పరిష్కారానికి చేపట్టిన ఏ చర్యనూ ముందుకు సాగనీయని రాజకీయ అడ్డంకులు. ఫలితంగా.. వెస్ట్ బెంగాల్‌లో నకిలీ ఆధార్‌లు.. ఫేక్ బర్త్ సర్టిఫికెట్లు.. శరణార్థి శిబిరాల నుంచి నేరుగా ఓటర్ల జాబితాల్లో చొరబడిన పేర్లు.. వెరసి ఓటర్ల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయింది. ఇవన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి. దీనిబట్టి చూస్తే దేశ సరిహద్దులు దాటినవారు ఆకలి బాధతో వచ్చిన వలసజీవులు కాదు.. మన ఎన్నికల వ్యవస్థలోకి చొచ్చుకొచ్చిన చొరబాటుదార్లన్నది స్పష్టం అవుతుంది. సైన్యం, ఆయుధాలతో ప్రత్యక్షంగా యుద్ధం చేయకుండానే జనాభాను, ఓటింగ్ సరళిని మార్చడం ద్వారా రాజకీయ సమీకరణాలను ప్రభావితం చేయడం ద్వారా దేశ దశ దిశలను మార్చేయవచ్చన్నమాట. ఈ ప్రమాదాన్ని పట్టించుకోని కుహానా లౌకికవాదులు మాత్రం చొరబాటుదారుల ఏరివేతను తప్పుపడుతుంటారు. అసోంలో ఈ ప్రక్రియ మొదలుపెట్టిన తొలిరోజుల్లో కూడా సెక్యులరిజం ప్రమాదంలో పడిందంటూ కొన్ని వర్గాలు రోడ్లపైకి వచ్చాయి. కానీ స్థానికుల భూములు, ఉద్యోగాలు పోయినప్పుడు, స్థానిక జనాభా తగ్గిపోయినప్పుడు వారంతా ఎక్కడున్నారో అర్థంకాదు. ఎందుకంటే.. వాళ్లకు హిందువుల హక్కులు కనిపించవు. దేశ సరిహద్దుల భద్రత కనిపించదు. ప్రపంచం మొత్తం గమనించాల్సిన మరో విషయం కూడా ఉంది. భారత్‌లో మైనారిటీలుగా ఉన్న ముస్లింలపై కొనసాగుతున్న అణచివేతల వల్ల వారి జనాభా తగ్గిపోతున్నదని మైనారిటీ నేతలు వాపోతుంటారు. కానీ గణాంకాలు పరిశీలిస్తే బంగ్లాదేశ్‌లో ఒకప్పుడు 20 శాతానికి పైగా ఉన్న హిందువులు ఇప్పుడు సింగిల్ డిజిట్‌కు పడిపోయారు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్‌లలో కూడా అదే పరిస్థితి. కానీ భారత్‌లో మాత్రం మైనారిటీ జనాభా పెరుగుతూనే ఉంది. ఆ దేశాల్లో మత సహనం ఎందుకు చనిపోతోంది? ఇక్కడ మాత్రమే ఎందుకు మనగలుగుతోంది? ఇది మాత్రం లౌకికవాదులకు కనిపించదు. దేశ సరిహద్దులను కాపాడుకోవడం ప్రతి దేశం చేసే పని. కానీ భారత్ చేస్తే మాత్రం హఠాత్తుగా ప్రపంచ మానవత్వం మొత్తం ప్రమాదంలో పడిపోతున్నదని గగ్గోలు పెడతారు. ఎవరో గగ్గోలు పెడుతున్నారని.. ఈ చొరబాట్లను నిశ్శబ్దంగా చూస్తూ ఉంటే మాత్రం ముందు మన సరిహద్దులు మారతాయి. తర్వాత జనాభా మారుతుంది. చివరికి..దేశ స్వభావమే మారిపోతుంది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page