మనమూ యుద్ధం చేయాల్సిందే.. ధరలతో!
- DV RAMANA

- 7 hours ago
- 3 min read

ప్రపంచం మరో యుద్ధంలో చిక్కుకుంది. అంటే దీనర్ధం ప్రపంచమంతా యుద్ధం జరుగుతున్నట్లు కాదు. దేశాలన్నీ యుద్ధంలో పాల్గొంటున్నట్లు కాదు. ప్రత్యక్షంగా యుద్ధంలో పాల్గొనకపోయినా దాని ప్రభావానికి గురయినా కూడా యుద్ధబాధితుల కిందే లెక్క. యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొనే దేశాలు ఒక రకమైన నష్టాలు చవిచూస్తే.. పాల్గొనని దేశాలు మరో రకమైన ఇబ్బందులకు గురవుతాయి. ప్రస్తుతం ప్రపంచంలో ఇదే పరిస్థితి నెలకొంది. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ ఉమ్మడిగా దాడులకు దిగాయి. ఏకంగా సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ సహా ముప్పై మందికిపైగా టాప్ సైనిక జన రళ్లను సామూహికంగా మట్టుబెట్టాయి. దీనికి ప్రతిగా ఇరాన్ ఇజ్రాయెల్‌తో పాటు పశ్చిమాసియాలోని సుమారు పది దేశాలపై విరుచుకుపడి ఆయా దేశాల్లో ఉన్న అమెరికన్ ఎయిర్‌ఫోర్స్, నేవీ బేస్‌లతో పాటు సైనిక స్థావరాలే లక్ష్యంగా బాలిస్టిక్ మిసైళ్లతో దాడులు చేసి పెద్దనష్టమే వాటిల్లజేసింది. అంటే ప్రస్తుతం యుద్ధంలో డజనుకుపైగా దేశాలు నేరుగా ప్రభావితమవుతున్నాయి. ఆయా దేశాý ఆర్థిక వ్యవస్థలు, ప్రజాజీవనం దెబ్బతింటున్నాయి. కాగా తమపై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇరాన్ కీలకమైన హర్మూజ్ జలసంధిని మూసివేసింది. ఈ చర్య వల్ల ప్రపంచ ఆయిల్ సరఫరా చెయిన్ తెగిపోయి, చాలా దేశాలకు ఇంధన సరఫరా నిలిచిపోయింది. ప్రపంచ ఆయిల్ రవాణాలో సుమారు 25 శాతం ఈ జలసంధి గుండానే రవాణా అవుతుంటుంది. మరోవైపు ఇంధన క్షేత్రాలు అపారంగా ఉన్న దేశాల్లో ఇరాన్ కూడా ఒకటి. యుద్ధం వల్ల ఇప్పుడు ఇరాన్ నుంచి ఆయిల్ సరఫరా నిలిచిపో యింది. బ్రిటిష్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ నివేదిక ప్రకారం దాడుల పరిస్థితి ఊహించిన దానికంటే తీవ్రంగా ఉంది. క్షిపణుల దాడికి గురై రెండు భారీ నౌకలు మంటల్లో చిక్కుకోగా మరో నౌకలో భారీ పేలుడు సంభవించింది. యుద్ధ ప్రభావంతో అంతర్జాతీయ చమురు మార్కెట్ కూడా మంటలు రాజుకున్నాయి. ముడిచమురు ధరలు మిసైళ్ల కంటే వేగంగా దూసుకెళ్తున్నాయి. బ్రెంట్ క్రూడ్ ధర ఒకేసారి తొమ్మిది శాతం పెరిగి ఒక దశలో 82 డాలర్లను దాటేసింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ముడిచమురు బ్యారెల్ ధర అంతర్జాతీయ మార్కెట్‌లో వంద డాలర్లు దాటిపోయే ప్రమాదముందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఫలితంగా ఆయిల్ దిగుమతులపై ఆధారపడిన భారత్‌లాంటి దేశాల్లో చుమురు ధరలు భగ్గుమనడం ఖాయం. వాటి ప్రభావం రవాణా ఛార్జీలు, దాదాపు అని రకాల నిత్యావ సర ధరల మీద కూడా పడుతుంది. అయితే ధరలు పెరగకుండా సౌదీ అరేబియా, రష్యా నేతత్వంలో ఆయిల్ ఉత్పత్తి చేసే దేశాలు(ఒపెక్) రోజులు 2.06 లక్షల బ్యారెళ్ల ముడిచమురును అదనంగా ఉత్పత్తి చేయాలని నిర్ణయించడం కాస్త ఉపశమనం కలిగిస్తుంది. అయితే ఆయిల్ ఉత్పత్తి చేస్తున్న కొన్ని దేశాల్లోని అమెరికన్ స్థావరాలపైనా ఇరాన్ దాడులు చేస్తున్న పరిస్థితుల్లో అదనపు ఉత్పత్తి అటుంచి రోజువారీ చమురు ఉత్పత్తి అయినా జరుగుతందా? అన్నది అనుమానమే. ఒకప్పుడు ఇరాన్ నుంచి భారత్ భారీగా ముడిచమురు కొనుగోలు చేసేది. కానీ అమెరికా ఆంక్షల వల్ల గత దశాబ్ద కాలంలో ఇరాన్ నుంచి చమురు దిగుమతి బిల్లు 26 బిలియన్ డాలర్ల నుంచి 2.5 బిలియన్ డాలర్లకు తగ్గిపో యింది. యుద్ధపరిస్థితులు తలెత్తినప్పుడు అంతర్జాతీయ స్థాయిలో మదుపరులు(ఇన్వెస్టర్లు) షేర్‌మార్కెట్ల నుంచి తప్పుకొంటుంటారు. తమ పెట్టుబడులను షేర్ల నుంచి ఉపసంహరించి సురక్షితమైన బంగారం, వెండి వంటి లోహాలకు మళ్లిస్తుంటారు. అమెరికా`ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ఇప్పుడు కూడా అదే జరుగుతుందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. దీనివల్ల బులియన్ మార్కెట్ మరింత బుల్లిష్‌గా మారుతుంది. గత కొన్నాళ్లుగా ఆకాశంలో విహరించిన బంగారం, వెండి ధరలు కొద్దిరోజుల క్రితం కాస్త దిగివచ్చినా.. పెళ్లిళ్ల సీజన్ మొదలుకావడంతో మళ్లీ పైపైకి ఎగబాకుతున్నాయి. దీనికి అదనంగా యుద్ధం వీటి ధరలను మళ్లీ మండిస్తుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇతర దేశాల సంగతెలా ఉన్నా మన దేశ వాణిజ్య రంగంపైనే ప్రస్తుత యుద్ధపరిస్థితులు తీవ్ర ప్రభావం చూపునున్నాయని నిపు ణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఎగుమతులు, దిగుమతులపై ఆధారపడిన విదేశీ వాణిజ్యం అతలాకు తలం అవుతుంది. మన దేశం నుంచి ఐరోపా దేశాలకు ఎగుమతి అయ్యే వస్తుసామగ్రిలో 80 శాతానికి పైగా ఎర్ర సముద్రమార్గం గుండానే రవాణా అవుతుంటాయి. ప్రస్తుత యుద్ధ వాతావరణంలో ఈ జల మార్గంలో సరుకు రవాణా ప్రమాదంలో పడింది. క్లిష్ట పరిస్థితుల్లోనూ కార్గో (సరుకు రవాణా) నౌకలు ఈ మార్గంలో ప్రయాణించాలంటే బీమా(ఇన్సూరెన్స్) ఖర్చులు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతాయి. దీని వల్ల ఎగుమతి ఖర్చులు అదుపు తుప్పుతాయి. అలాగే దిగుమతి బిల్లులు కూడా అమాంతం ఎగబాకు తాయి. ఫలితంగా విదేశాల నుంచి మనం దిగుమతి చేసుకునే ఎలక్ట్రానిక్ వస్తువులు, సెల్‌ఫక్షన్లు, ల్యాప్‌టాప్‌లు, ఇతర యంత్రాలు, యంత్ర పరికరాల ధరలు దారి తప్పుతాయంటున్నారు. భారత్ నుంచి ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలకు బాస్మతి బియ్యం, టీ, కాఫీ, మసాలా దినుసులు పెద్ద ఎత్తున ఎగు మతి అవుతుంటాయి. యుద్ధం వల్ల ఈ ఎగుమతులు నిలిచిపోతే దేశంలోని రైతులు, వ్యాపారులు నష్ట పోతారు. రష్యా`ఉక్రెయిన్ యుద్ధం మాదిరిగా అమెరికా`ఇరాన్ యుద్ధం కూడా సుదీర్ఘ కాలం కొన సాగితే ఎరువుల ధరలు కూడా పెరిగి వ్యవసాయం కూడా భారంగా పరిణమిస్తుంది. యుద్ధంలో ప్రత్య క్షంగా పాల్గొంటున్న ఇజ్రాయెల్‌తో మనదేశ రక్షణ సంబంధాలు బాగా పెరిగాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇజ్రాయెల్ నుంచి రావాల్సిన అత్యాధునికి రక్షణ పరికరాలు, డ్రోన్లు, క్షిపణుల దిగుమతుల్లో జాప్యం అనివార్యంగా కనిపిస్తున్నది. ఇదే జరిగితే అటు చైనా, ఇటు పాకిస్తాన్‌తో సరిహద్దుల్లో సమస్యలు, ఉద్రిక్తతలు పెరుగుతున్న పరిస్థితుల్లో భారత్ భద్రతాపరంగా ఇబ్బందిపడవచ్చు. పరిస్థితి పూర్తిగా సద్దు మణిగేవరకు సామాన్యులు కూడా ధరలతో యుద్ధం చేయాల్సిందే.






Comments