top of page

ఉత్తరాదిని మనం ఎన్నాళ్లు మోయాలి?

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • 8 hours ago
  • 3 min read

ప్రస్తుత 543 లోక్‌సభ స్థానాలను 850కి పెంచాలనే ప్రతిపాదనకు చట్టబద్ధత వస్తుందో, రాదో గురువారం తెలిసిపోతుంది. 815 స్థానాలు రాష్ట్రాలకు, 35 సీట్లు కేంద్రపాలిత ప్రాంతాలకు కేటాయించబోతున్నారు. ఈ పెంపునకు హేతుబద్ధత ఏంటో తెలియదు. ఇప్పుడు 2026 సెన్సెస్ తర్వాత డీ లిమిటేషన్ చేపట్టాలి. కానీ 2026 సెన్సస్‌కు ముందే ఆదరాబాదరగా డీ లిమిటేషన్ చేపట్టడంలో కేంద్ర ప్రభుత్వ రాజకీయ లక్ష్యం ఏం{నేది స్పష్టం కావాలి. ఎందుకంటే దీని కోసం ప్రత్యేకంగా రాజ్యాంగాన్ని కూడా సవరిస్తున్నారు. తెలివిగా దీనికి మహిళా రిజర్వేషన్‌తో లింక్ చేస్తున్నారు. ఈ డీ`లిమిటేషన్ వల్ల ఏం జరుగుతుంది.. అన్ని రాష్ట్రాలకు వాళ్లకున్న సీట్లలో 50% పెంచుతాము, అన్యాయం ఎక్కడా చేయడం లేదు కదా అంటూ 2011 సెన్సస్ ఆధారంగా తీసుకున్నారు. మరోవైపు తాజా సెన్సస్ ప్రక్రియ మొదలైంది. అటువంటప్ప్పుడు 2011 సెన్సెస్ ఎందుకన్నదానికి సమాధానం లేదు.

మేము అన్ని రాష్ట్రాలకు 50% పెంచుతున్నాం గనుక ఓవరాల్ పార్లమెంట్లో ప్రాతినిధ్యం తగ్గదు కదా అనేది ఒక ఆర్గ్యుమెంట్. దీన్ని సౌత్ ఇండియన్ స్టేట్స్, ఇతర రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. జనాభాను నియంత్రించిన రాష్ట్రాలు నష్టపోతాయి. జనాభాను నియంత్రించని రాష్ట్రాలు లాభపడతాయని సౌత్ నుంచి బాగా వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు వ్యూహాత్మకంగా 50% సీట్లు పెంచుతాం అంటున్నారు. పైపైన చూస్తే కరెక్టే అనిపిస్తుంది. కానీ కాస్త లోతుల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లో 80 సీట్లు ఉన్నాయి అది 120 అవుతుంది. కేరళలో 20 సీట్లు ఉన్నాయి అది 30 అవుతుంది. అప్పుడైనా ఇప్పుడైనా కేరళ కంటే నాలుగు రెట్లు ఎక్కువ కదా యూపీలో తేడా ఏం రాలేదు కదా అనిపిస్తుంది. కానీ ఇందులో మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఇప్పుడు కేరళలో 20 పార్లమెంట్ ఉన్నాయి. అది పెంచడం వల్ల 30 అవుతున్నాయి. యూపీలో 80 ఉన్నాయి. అది పెంచడం వల్ల 120 అవుతున్నాయి. అంటే తేడా బాగా పెరిగిపోయింది. ఇలాంటి వ్యత్యాసాల వల్ల నార్త్ అండ్ సౌత్‌ల మధ్య గ్యాప్ పెరిగిపోతుంది. దక్షిణాది రాష్ట్రాలు పొలిటికల్‌గా నష్టపోతాయి. సింపుల్ లెక్క మేరకు అంతకుముందు 60 సీట్లు తేడా ఉన్నచోట ఇప్పుడు 90 సీట్లు తేడా వస్తుంది. పొలిటికల్లీ సౌత్ ఇండియాను దెబ్బతీయడం కోసం, సౌత్ ఇండియాను మరింతగా పొలిటికల్‌గా మార్జినలైజ్ చేసే ఎత్తుగడ. అందుకే అంగీకరించకూడదనేది సౌత్ నుంచి వస్తున్న ప్రొటెస్ట్. సీట్లు పెంచడానికి ఎవరూ అభ్యంతరం చెప్పడం లేదు. దాని ప్రక్రియ పైనే అనుమానాలు. ఉత్తరానికి, దక్షిణానికి వున్న తేడా ఇప్పుడున్నట్టు 287 ఎంపీ స్థానాలే ఉండాలని కాంగ్రెస్ అంటోంది. దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, కేరళ ఈ ప్రతిపాదనకు వ్యతిరేకస్తుంటే ఏపీలోని ఎంపీల బలం కలిగివున్న పార్టీలు వైకాపా, టీడీపీలు మద్దతిస్తున్నాయి. ఇండియా కూటమి కేంద్రం ప్రతిపాదనకు మద్దతు ఇవ్వకుంటే ఈ బిల్లు పాస్ అవడం దాదాపు అసాధ్యం. ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలకు నష్టం అనేక రూపాల్లో జరుగుతుంది. ఫైనాన్స్ కమిషన్ నిధుల కేటాయింపులో జరుగుతుంది. ఎందుకంటే 1971 సెన్సెస్‌ను ప్రాతిపదికగా తీసుకొని 40 ఏళ్ల పాటు కూడా ఫైనాన్స్ కమిషన్ నిధులు మంజూరు చేస్తున్నారు. 1971 తర్వాత పాపులేషన్ కంట్రోల్ మెజర్స్ ఇండియాలో మొదలుపెట్టారు. దానివల్ల సౌత్ ఇండియా చాలా సమర్థవంతంగా పాపులేషన్‌ను నియంత్రించింది, ఆర్థిక వృద్ధిని సాధించింది. ఎకనామిక్ గ్రోత్ సాధించింది. నార్త్ ఇండియా ఇంకా మూర్ఖత్వంలో మూఢత్వంలో మగ్గుతూ కులం మతం పిచ్చిలోనే బతుకుతూ కనీసమైన ఆర్థిక అభివృద్ధికి నోటుకోలేదు. ఎకానమీని డెవలప్ చేయలేదు అక్కడ మీకు నార్త్, సౌత్ డివైడ్ క్లియర్‌గా కనబడుతుంది. ఎకనామిక్ డెవలప్మెంట్ సూచికను తీసుకుంటే నార్త్ ముఖ్యంగా బీహార్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలతో పోలిస్తే తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఆంధ్ర, తెలంగాణ చాలా అభివద్ధి చెందాయి. ఇది ఎలా సాధ్యమైంది? పొలిటికల్ పవర్ ఏమో నార్త్‌లోనే ఉంది. ఇప్పటివరకు అయిన ప్రైమ్ మినిస్టర్స్‌లో సౌత్ నుంచి ఎంతమంది అయ్యారో లెక్కతీస్తే.. ఓ పివి నరసరావు ఐదేళ్లు, ఒక దేవగౌడ కొంత కాలం ఉన్నారు. పొలిటికల్ పవర్ ఢిల్లీలో అందరికీ తెలుసు. హిందీ మాట్లాడే వారికే తొలి ప్రాధాన్యం. సౌత్ ఇండియాకు వాల్యూ కూడా ఉండదు.

సౌత్ ఇండియా చేసిన పాపం ఏంటంటే ఆర్థికంగా, సామాజికంగా వృద్ధి చెందడం, జనాభాను నియంత్రించడం, కేంద్రంపై ఆధారపడకపోవడం, కేంద్రానికే వనరులు సమకూర్చడం.. ఇలా సౌత్ ఇండియా రూపాయి ఇస్తే, వారి వాటాలో వెనక్కు వచ్చేది ఎంత? 50 పైసలో 60 పైసలో. అదే నార్త్ ఇండియాను తీసుకుంటే.. రూపాయి వాళ్లు కంట్రిబ్యూట్ చేసి రెండు మూడు రూపాయలు తీసుకుంటున్నారు.

నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఉన్నాయి. కొన్ని బార్డర్ స్టేట్స్ ఉన్నాయి. వాళ్లకు ఆర్థికంగా జాగ్రఫీ రీత్యా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఎకనామిక్ గ్రోత్ కష్టం. ఎవరైతే వారి చేతిలో లేని ఫ్యాక్టర్స్ వల్ల వెనకబడి ఉన్నారో వాళ్లని సపోర్ట్ చేయాలి. కానీ మతతత్వం, కులతత్వం, కరప్షన్‌లో మునిగి, డెవలప్ కాకపోతే దాని భారం సౌత్ ఇండియా మీద వేస్తాం అంటే ఎలా? ఎకనామిక్ గ్రోత్ ఆధారంగా పార్లమెంట్లో సీట్లు ఇవ్వాలి. అలా కాకపోయినా కనీసం శిక్షించకుండా ఉంటే చాలు. ఇప్పుడు పొలిటికల్ రిప్రజెంటేషన్ కూడా తగ్గితే ఈ దక్షిణాదిని ఎవడూ పట్టించుకోడు. ఢిల్లీలో తెలుగులో మాట్లాడితే మనల్ని పిచ్చోలా చూస్తారు. హిందీ మాట్లాడే వారికే వాల్యూ, ఇంగ్లీష్ మాట్లాడినా వాల్యూ ఉండదు. అసలు ఈ ఆధిపత్యం ఎంత కాలం? సో దీన్ని ఎవరు ఎందుకు యాక్సెప్ట్ చేయాలి అనే క్వశ్చన్ వస్తుంది. అందులో తప్ప్పులేదు. రేవంత్‌రెడ్డి దీని మీద మాట్లాడితే అది మనకు కాంగ్రెస్ స్టాండ్‌లా కనిపిస్తుంది. స్టాలిన్ మాట్లాడితే బీజేపీకి వ్యతిరేకమనిపిస్తుంది. కానీ మనకు మనం ప్రశ్నించుకుంటే ఎన్నాళ్లు ఉత్తరాదిని మనం మోయాలి?

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page