top of page

వైబ్రేటర్ ఎందుకు? నన్నే వాడండి

  • Guest Writer
  • 10 hours ago
  • 2 min read
  • ఆర్డర్ చేసిన మహిళకు డెలివరీ బాయ్ వేధింపులు

  • క్విక్ కామర్స్ యాప్‌ల్లో మహిళల గోప్యతకు ముప్పు?

మీకు వైబ్రేటర్ ఎందుకు? నన్నే వాడండి’ అంటూ ఆన్‌లైన్‌లో వైబ్రేటర్ ఆర్డర్‌ను చేసిన ఒక మహిళకు డెలివరీ బాయ్ వేధించిన విషయం ఇప్ప్పుడు దేశంలో ఈకామర్స్ ప్లాట్‌ఫామ్స్‌పై చర్చకు దారితీసింది. వ్యక్తిగత ఉత్పత్తుల డెలివరీల్లో షాకింగ్ వాస్తవాలు ఇప్ప్పుడిప్ప్పుడే బయటకొస్తున్నాయి. కరోనా తర్వాత అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మీషో, బ్లింకిట్‌తో పాటు వందలాది ఈకామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో ఆన్‌లైన్‌లో వస్తువులు ఆర్డర్ చేయడం ఎక్కువైంది. అయితే ఇందులో పూర్తిస్థాయి గోప్యత లేదని వైబ్రేటర్ అంశంలో బయటపడింది. ఆమధ్య ఫుడ్ డెలివరీ యాప్‌లలో రైడర్ మధ్యలోనే ప్యాక్ విప్పేసి, కొంత తినేసి దాన్ని కస్టమర్‌కు ఇస్తున్న వీడియో వైరలయింది. ఇప్ప్పుడు వైబ్రేటర్ ఆర్డర్ చేసిన ఓ మహిళకు కూడా రైడర్ నుంచే ఇలాంటి అనుభవం ఎదురుకావడంతో ఈకామర్స్ ప్లాట్‌ఫామ్‌లపై నమ్మకం తగ్గిపోతోంది.

ఢిల్లీకి చెందిన 36 ఏళ్ల అదితి అనుభవం దీనికి ఉదాహరణ. ఆమె ఒక వ్యక్తిగత మసాజర్‌ను ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసింది. ఉత్పత్తి ప్యాకేజింగ్ సరిగా లేకపోవడంతో రిటర్న్ కోరింది. వస్తువు తీసుకెళ్లడానికి వచ్చిన డెలివరీ బాయ్ పెట్టె తెరిచి ఉత్పత్తిని బయటకు తీసి పరిశీలించడమే కాకుండా, దానిని వాసన చూసి వెకిలి నవ్వు నవ్వాడని ఆమె చెబుతోంది. అనంతరం ‘రిప్లేస్‌మెంట్ కావాలా?’ అంటూ వ్యంగ్యంగా మాట్లాడాడని తెలిపింది.

‘ఆ క్షణంలో నాకు అసహ్యం, భయం రెండూ కలిగాయి. వెంటనే వెళ్లిపోమని చెప్పాను. కానీ ఆ సంఘటన అక్కడితో ముగియలేదు. తర్వాత అతను కాలనీలో కనిపించిన ప్రతిసారి ఆర్డర్ గురించి తెలిసిన వ్యక్తిలా నవ్వుతూ చూడటం మరింత ఇబ్బందికి గురిచేసింది’ అని అదితి పేర్కొంది.

వైబ్రేటర్ డెలివరీ... తర్వాత వేధింపుల కాల్

ఇటీవల ఫరీదాబాద్‌కు చెందిన మీడియా వ్యూహకర్త పూజా జోషి ఎదుర్కొన్న అనుభవం మరింత సంచలనం సృష్టించింది. అర్ధరాత్రి సమయంలో ఆమె ఒక వైబ్రేటర్‌ను ఆర్డర్ చేసింది. డెలివరీ ఇచ్చిన వ్యక్తి వెళ్లిపోతూ ‘మీరు ఏమి కొనుగోలు చేశారు?’ అని ప్రశ్నించాడట. ఆమె స్పందించకుండా లోపలికి వెళ్లిన కొద్దిసేపటికే ఫోన్ మోగింది. అదే డెలివరీ రైడర్ కాల్ చేశాడని పూజా చెబుతోంది. ఫోన్ ఎత్తగానే ‘మీకు వైబ్రేటర్ ఎందుకు? నన్నే వాడండి’ అంటూ అసభ్యకరంగా మాట్లాడాడట. బ్లింకిట్‌కు ఫిర్యాదు చేసిన తర్వాత కంపెనీ ఆ డెలివరీ సిబ్బందిని తొలగించినట్లు తెలిపింది. అయితే దీంతో తన భయం మరింత పెరిగిందని పూజా చెబుతోంది. ‘అతనికి నా ఇంటి అడ్రస్ తెలుసు. ఉద్యోగం పోయిందని కోపంతో ఏదైనా చేస్తాడేమోనని భయపడ్డాను’ అని పేర్కొంది.

కండోమ్స్ కొనుగోలు చేసినా తీర్పులే!

నోయిడాకు చెందిన శ్వేత ఇటీవల కండోమ్స్ ప్యాక్‌ను ఆర్డర్ చేసింది. ఇతర కిరాణా వస్తువులతో పాటు వాటిని కూడా బహిరంగంగానే అందజేశారని ఆమె చెబుతోంది.

‘డెలివరీ బాయ్ నన్ను విచిత్రంగా చూశాడు. నేను ఏదో తప్పు చేసినట్లు, నా వ్యక్తిగత జీవితంపై తీర్పు ఇస్తున్నట్లు అనిపించింది’ అని శ్వేత ఆవేదన వ్యక్తం చేసింది.

ఠాణేకు చెందిన దివ్య కూడా ఇలాంటి అనుభవమే ఎదుర్కొంది. బ్యాచిలర్ పార్టీ కోసం హ్యాండ్‌కఫ్స్, వైబ్రేటర్, అడల్ట్ గేమ్స్ ఆర్డర్ చేయగా, వాటిని ఎలాంటి గోప్యతా ప్యాకింగ్ లేకుండా తెచ్చారని తెలిపింది. ‘అవి నిజంగానే మీ ఆర్డరేనా మేడమ్?’ అని డెలివరీ వ్యక్తి రెండుసార్లు ఆశ్చర్యంగా అడిగాడని ఆమె చెబుతోంది.

క్విక్ డెలివరీల కోసం గోప్యతకు తూట్లు?

వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులను ‘పర్సనల్ యూజ్ ఐటమ్స్ ’గా గుర్తించి ప్రత్యేక ప్యాకింగ్ చేయాల్సి ఉంటుంది. తద్వారా డెలివరీ సిబ్బందికి కూడా వాటి వివరాలు తెలియకుండా ఉండాలి. అయితే 10 నిమిషాల్లో డెలివరీ చేయాలనే ఒత్తిడి కారణంగా డార్క్ స్టోర్లలో పని చేసే సిబ్బంది రెండు నుంచి నాలుగు నిమిషాల్లోనే ఆర్డర్ సిద్ధం చేయాల్సి వస్తోంది. ఈ హడావుడిలో ప్రత్యేక ప్యాకింగ్ నిబంధనలు విస్మరిస్తున్నారు.

- టైమ్స్ ఆఫ్ ఇండియా సౌజన్యంతో..

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page