top of page

హోరా హోరీగా బార్ కౌన్సిల్ పోరు

  • Writer: Prasad Satyam
    Prasad Satyam
  • 6 hours ago
  • 2 min read
  • చెల్లని ఓట్లపైనే సందిగ్ధత

  • తెలంగాణలో బయటపడిన న్యాయవాదుల డొల్లతనం

  • రెండు బాక్సుల్లో 41 శాతం చెల్లని ఓట్లు

  • ఏపీ బార్ వర్గాల్లో ఇప్పుడు అదే ఆందోళన

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులను ఎన్నుకునేందుకు శుక్రవారం పోలింగ్ జరుగుతోంది. ఈసారి ఎన్నిక హోరా హోరిగా ఉండటంతో ఫలితం ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ న్యాయవాద వర్గాల్లో నెలకొంది. ఐదేళ్ల పాటు బార్ కౌన్సిల్ సభ్యులుగా 23 మందికి అవకాశం ఉండటంతో ఈసారి ప్రతిఒక్కరు ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఉనికిని చాటుకోవడానికే బరిలో నిలబడటం కాకుండా ఇప్పటికే ప్రాక్టీస్‌లో ఒక స్థాయికి చేరి బార్ కౌన్సిల్ మెంబర్ కావాలనే తపన ఉన్న అందరూ గట్టిగానే కషి చేశారు. అయితే అత్యంత కీలకమైన న్యాయవాద వత్తిలో ఉంటూ కూడా ఓటు ఎలా వేయాలో తెలియకపోవడమో, లేక అంకెలు ఇంగ్లీషు అక్షరాల్లో రాయలేకపోవడమో తెలియదు గానీ తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో లెక్కించిన రెండు బ్యాలెట్ బాక్స్‌ల్లో 41 శాతం ఓట్లు చెల్లనివిగా గుర్తించారు. రెండు బాక్స్‌ల్లో కలిపి మొత్తం 498 ఓట్లు పోలైతే వాటిలో 204 చెల్లలేదు. ఇప్ప్పుడు ఏపీ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో కూడా ఈ చెల్లని ఓట్లు నమోదైతే.. అవి ఎవరి కొంప ముంచుతాయన్న అనుమానాలు , ఆందోళన వ్యక్తమవుతున్నాయి. సమాజానికి దిశానిర్దేశం చేసే వ్యక్తులు ఓటు వేసేటప్ప్పుడు కనీస జాగ్రత్తలు పాటించలేదా? లేక ఇంగ్లీష్‌లో రాయడం రాలేదా? అనేది ఎవరికి వారే సమాధానం చెప్ప్పుకోవాల్సిన పరిస్థితి. తెలంగాణ బార్ కౌన్సిల్‌లో 109 పోలింగ్ కేంద్రాల నుంచి బ్యాలెట్ బాక్స్‌లను కౌంటింగ్ కేంద్రానికి తరలిస్తే, తొలిరోజు కేవలం రెండు బ్యాలెట్ బాక్స్‌లను తెరిచి లెక్కించారు. వీటిలో 41 శాతం ఓట్లు చెల్లనివని ప్రకటించింది మన జిల్లాకే చెందిన మాజీ న్యాయమూర్తి జస్టిస్ యతిరాజులే.

ప్రాధాన్యత నమోదులో లోపాలు

ఇప్ప్పుడు ఏపీ బార్ కౌన్సిల్‌కు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ 23 స్థానాలకు గాను 143 మంది బరిలో ఉన్నారు. దాదాపు 39,600 మంది న్యాయవాదులు ఓటర్లుగా ఉన్నారు. మొత్తం 143 మందికి ఒకటే బ్యాలెట్ ఉంటుంది. వీరిలోంచి 23 మందినే ఎన్నుకోవాల్సి ఉన్నందున ఒకటి నుంచి 23 వరకు మాత్రమే ప్రాధాన్యత ఓటు నమోదు చేయాల్సి ఉంటుంది. ప్రిఫరెన్షియల్ ఓటు పద్ధతిలో మొదటి ఓటు ఎవరికి ఇవ్వాలి అనుకుంటే.. ఆ పేరు ఎదురుగా ఓఎనఈ వన్ అని రాయాలి. 22వ ప్రాధాన్యం ఎవరికైనా ఇవ్వాలనుకుంటే త్వంటీటూ అని ఇంగ్లీష్‌లో రాయాలి. అలా రాయలేకపోవడం వల్లే అక్కడ 41 శాతం ఓట్లు చెల్లలేదు. మరి ఇప్పుడు ఆంధ్రాలో న్యాయవాదులు ఏం చేస్తారో చూడాలి. మన జిల్లా నుంచి బార్ కౌన్సిల్ ఎన్నికల్లో నగరానికి చెందిన గేదెల వాసు, ఆమదాలవలసకు చెందిన కిల్లి మార్కండేశ్వరరావులు బరిలో ఉన్నారు. 23 స్థానాల్లో మహిళలకు ఐదు రిజర్వ్ చేశారు. మిగిలినవన్నీ జనరల్ కేటగిరీ కిందకే వస్తాయి. జనవరి 30న తెలంగాణ బార్ కౌన్సిల్‌కు ఎన్నికలు జరిగాయి. శుక్రవారం ఆంధ్రా బార్ కౌన్సిల్‌కు పోలింగ్ జరుగుతోంది. సింగిల్ ట్రాన్స్‌ఫరబుల్ ఓటులో ఒకరికి ఒక సంఖ్య ఇచ్చిన తర్వాత మరో వ్యక్తికి అదే అంకె వేయడానికి లేదు. అలాగే ఈ అంకెలను పదాల రూపంలో ఇంగ్లీష్‌లో రాయాలి. ఈ రెండింటిలో ఎక్కడ తేడా కొట్టినా చెల్లని ఓటుగా పరిగణిస్తారు.

బార్ కౌన్సిల్ ఎన్నికల పుణ్యమాని న్యాయవాద వత్తిలో ఉన్న అనేక మందిపై ప్రశ్నలు ఇప్ప్పుడు తలెత్తుతున్నాయి. 1 నుంచి 23 వరకు ప్రాధాన్యత క్రమం నమోదు చేయలేని పరిస్థితి ఎందుకొచ్చింది? ఇలాంటి లాయర్లు కోర్టులో పిటిషన్లు, వాదనలు ఎలా సిద్ధం చేస్తారు? చట్టపరమైన సెక్షన్లు, రాజ్యాంగ అంశాలు ఎలా ప్రస్తావించగలరు? అని ఇప్పటికే ఒక వెబ్‌సైట్ ప్రశ్నలు సంధించింది. న్యాయవాది కేవలం వత్తి నిపుణుడే కాదు.. అంతకు మించి. అటువంటి చోట చెల్లని ఓట్లంటే ఎలా చూడాలో తెలియడంలేదు. ఇప్ప్పుడు ఆంధ్రాలో ఈ మేరకు ఓటర్లను ప్రిపేర్ చేశారా? లేక ఐదేళ్లకోసారి వస్తున్న కొత్త న్యాయవాదులు తెలియక చెల్లని ఓట్లు వేస్తారో చూడాలి.

న్యాయరంగంలో కీలకపాత్ర

అడ్వకేట్స్ యాక్ట్`1961 ప్రకారం ఏర్పాటైన బార్ కౌన్సిల్ న్యాయవాదుల వత్తిని నియంత్రించే సంస్థ. న్యాయవాదుల నమోదు, ఆలిండియా బార్ పరీక్షల నిర్వహణ, వత్తి, నైతిక ప్రమాణాల పర్యవేక్షణ వంటి విధులు నిర్వర్తిస్తుంది. క్రమశిక్షణ చర్యలు, లా కాలేజీల ప్రమాణాల పర్యవేక్షణ వంటి విధులను నిర్వహించే బార్ కౌన్సిల్ న్యాయమూర్తులకు సలహామండలిగా కూడా వ్యవహరిస్తుంది. అందుకే ఈ కౌన్సిల్ సభ్యత్వానికి విపరీతమైన పోటీ ఉంటుంది. శిబిరాలు నిర్వహించడం, క్యాంపెయినింగ్ అన్నీ కలుపుకుంటే కొందరికి కోటికి పైనే ఖర్చయినట్లు తెలుస్తోంది. ఎప్పట్నుంచో బార్ కౌన్సిల్ ఎన్నికకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లా బార్‌లలో సభ్యులు ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఇప్ప్పుడు పోటీలో ఉన్న 143 మందిలో విజేతలెవరో తేలాలంటే మరికొంత సమయం పడుతుంది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page