top of page

మనం ఎటు పోతున్నాం?

  • Writer: SATYAM DAILY
    SATYAM DAILY
  • 3 hours ago
  • 3 min read
  • జగ్గీ వాసుదేవ్ పాదాల ఫొటో ఆన్‌లైన్‌లో రూ.3,200

  • నెటిజన్లు విరుచుకుపడటంతో ఇప్ప్పుడు నో స్టాక్ బోర్డు

  • మరోసారి వివాదంలోకి వచ్చిన ఇషా ఫౌండేషన్

(సత్యంన్యూస్, అమరావతి)

ఎన్నయినా చెప్పండి దేవుడు దేవుడే.. మనిషి మనిషే. ఈ సిద్ధాంతం ఆస్తికులకైనా, నాస్తికులకైనా ఒకటే. పాదాలను పూజించడం మనకు కొత్త కాకపోవచ్చు. ఎందుకంటే.. ఇది ఎప్పట్నుంచో వస్తున్న ఒక నమ్మకం. కానీ ఇది అమ్మకానికి గురైనప్ప్పుడే అనేక ప్రశ్నలు తలెత్తుతాయి. స్వీయ ప్రకటిత గురువు జగ్గీ వాసుదేవ్ తన పాదం ఫొటోను రూ.3,200కు అమ్మకానికి పెట్టడంపైనే ఇప్ప్పుడు దేశవ్యాప్తంగా చర్చంతా. నిరాడంబరంగా ధర్మప్రచారం చేస్తూ నిజసాధువుల్లా బతికిన గురువుల సమాధులను కూడా మనం పూజిస్తాం. వారు బతికిన తీరు పట్ల మనమిచ్చే గౌరవమది. వారు నడయాడిన చోట్ల ఏదో మనకు తెలియని పాజిటివ్ వైబ్స్ ఉంటాయని మన నమ్మకం. అరుణాచలంలో శివుడ్ని దర్శించడానికి ఎంతమంది వెళ్తారో.. అందరూ రమణ మహర్షి ఆశ్రమాన్ని కూడా సందర్శిస్తారు. అయితే జగ్గీ వాసుదేవ్‌కు అంత స్థాయి ఉందా అనేదే ఇప్ప్పుడు జరుగుతున్న చర్చ. దీని మీద నెటిజన్లు అందిస్తున్న సమాచారంపై ఆయన శిష్యులు విరుచుకుపడుతున్నారు. అది వేరే విషయం. ఇక్కడ మహిమలు పక్కనపెట్టి మహÃన్నత విలువల కోసమైనా మనం చెప్ప్పుకోవాలి. జగదీష్ వాసుదేవ రెడ్డి అలియాస్ జగ్గీ వాసుదేవ్ జన్మస్థలం కడప. ఆయన కర్మస్థలం కోయంబత్తూరు. రూ.3,200కు ఆయన పాదాల ఫొటో కొనుక్కోవచ్చని నెట్‌లో పెడితే, ప్రస్తుతం ఔట్ ఆఫ్ స్టాక్ అని కనిపిస్తుందంటే ఆ స్థాయిలో డిమాండ్ ఉందా? లేదూ అంటే సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలకు భయపడి అమ్మకాలు ఆపేశారా? అనేది తెలియదు.

జగ్గీ వాసుదేవ్ ప్రయాణం కర్ణాటకలోని మైసూర్ వీధుల్లో ఒక సాదాసీదా కోళ్ల ఫారం యజమానిగా, రియల్ ఎస్టేట్ వ్యాపారిగా మొదలైంది. లాభనష్టాల లెక్కల మధ్య సాధారణంగా సాగుతున్న ఆయన జీవితం ఒక్కసారిగా ‘ఆధ్యాత్మిక గురువు’గా మలుపు తిరగడం వెనుక అనేక మిస్టరీలు ఉన్నాయి. ముఖ్యంగా 1997లో ఆయన భార్య విజయకుమారి మరణం ఈ కథలో అత్యంత చీకటి అధ్యాయం. ఆరోగ్యంగా ఉన్న 31 ఏళ్ల మహిళ ‘మహాసమాధి’ పేరుతో ప్రాణాలు వదిలిందని జగ్గీ ప్రకటించినప్పటికీ, అది పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన హత్య అని ఆమె తండ్రి గంగాధరన్ అప్పట్లోనే బెంగళూరు, మైసూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారని నెటిజన్లు చెప్ప్పుకొస్తున్నారు. అనుమానాస్పద స్థితిలో చనిపోయిన ఆమె మృతదేహానికి పోస్టుమార్టం జరగకుండా, పోలీసులు వచ్చేలోపే అత్యంత వేగంగా దహనం చేయడం వెనుక సాక్ష్యాలను రూపుమాపే కుట్ర ఉందనేది నేటికీ ఒక బలమైన వాదన.

ఇక్కడ గమనించాల్సిన కీలకమైన విషయం ఏమిటంటే, భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయం ప్రకారం సిద్ధులను లేదా మహాసమాధి పొందిన యోగులను ఎన్నడూ దహనం చేయరు, కేవలం ఖననం (పూడ్చిపెట్టడం) మాత్రమే చేస్తారు. కానీ జగ్గీ మాత్రం ఆమె సిద్ధురాలు అని చెబుతూనే, నిబంధనలకు విరుద్ధంగా ఆమె శరీరాన్ని తగలబెట్టించడం వెనుక ఏదో పెద్ద క్రైమ్ దాగి ఉందనే అనుమానాలు అప్పుడూ ఇప్పుడూ వున్నాయి

మైసూర్ నుండి తమిళనాడులోని కోయంబత్తూర్ వెళ్లియార్ కొండల పాదాల వద్దకు చేరిన జగ్గీ ఈషా ఆశ్రమం, అక్కడ ఉన్న అమాయక గిరిజనుల కొంపలు ముంచింది. ‘పల్లాంటి’ అనే తెగకు చెందిన గిరిజనులను భయపెట్టి, ప్రలోభాలకు గురిచేసి వారి భూములను లాక్కోవడం ద్వారా ఆశ్రమ సామ్రాజ్యం విస్తరించింది. ఇది కేవలం మనుషులకే కాదు, మూగజీవాలకు కూడా శాపమైంది. ఏనుగుల సహజ సంచార మార్గాలను ఆక్రమించి భారీ కట్టడాలు నిర్మించడంతో, దారితప్పిన ఏనుగులు జనారణ్యంలోకి వచ్చి ప్రాణాలు కోల్పోతున్నాయి. ప్రకృతి ప్రేమికుడినని చెప్పుకునే వ్యక్తి, వన్యప్రాణుల మరణాలకు కారణమవుతున్నారనేది మరో కమ్యూనిస్టు వాది ఫేస్‌బుక్ వాల్ మీద కనిపించిన వాదన.

ఇక ఇతడి ఆర్థిక కోణం చూస్తే, ‘కావేరీ కాలింగ’, ‘ర్యాలీ ఫర్ రివర్స’ వంటి కార్యక్రమాల పేరుతో సామాన్య ప్రజల నుంచి వందల కోట్ల రూపాయల విరాళాలు సేకరించారు. ఒక్కో మొక్కకు రూ.42 చొప్పున వసూలు చేసిన ఆ నిధులు ఏమయ్యాయో చెప్పే లెక్కల్లో పారదర్శకత లేదనే ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు, ఆశ్రమానికి వచ్చే యువతీ యువకులను ‘మైండ్ కంట్రోల’ చేస్తున్నారనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. తన సొంత కూతురికి వైభవంగా పెళ్లి చేసి విదేశాల్లో స్థిరపరిచిన జగ్గీ, ఇతరుల కూతుళ్లను మాత్రం సన్యాసినులుగా మారాలని ప్రబోధించడం ఆయన ద్వంద్వనీతికి నిదర్శనం. తమ పిల్లలను అక్రమంగా నిర్బంధించారంటూ తల్లిదండ్రులు నేటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు.

మెడిటేషన్ చెయ్యండి, నేను తయారుచేసిన మందులు తినండి అని గప్పాలు కొట్టే ఈ మనిషి తనకు జబ్బొస్తే మాత్రం హైదరాబాద్‌లోనో, బెంగళూరులోనో పెద్ద పెద్ద హాస్పిటల్‌లో చేరి బ్రెయిన్ సర్జరీ చేయించుకున్నారని ఆమధ్య చాలామంది ఆరోపించారు. మహిళల్ని, అమ్మాయిల్ని బ్రెయిన్‌వాష్ చేసి ఆశ్రమంలో బంధించాడనే కేసు సుప్రీంకోర్టు దాకా వెళ్లింది. ఇంత ‘పెద్ద మనిషి’ ఇప్పుడు తన కాలి ఫోటో అమ్మకానికి పెట్టాడు. జనాలు అమాయకులైతే ఏదైనా అమ్మొచ్చు. ఇక్కడి పేడ డ్రై చేసి ఇతర దేశాల్లో ‘పుణ్యం’ కోసం అమ్మిన సంస్థ అక్రమ వ్యాపారాల జాబితాలో చేరి తర్వాత ఇక్కడ మూసివేయబడింది. కానీ ఇక్కడ ఇతని అక్రమం అమాయకుల మనసుల్లో జొరబడింది. శివరాత్రి నాడు మొన్నో వీడియో చూసినప్పుడు ఇతను మ్యూజిక్‌కి ఎగురుతుంటే, చూస్తున్న వాళ్లల్లో అనేకమంది కన్నీళ్లతో ఏడుస్తున్నారు. తప్పదిక అతని కాలి ఫోటోలు పొద్దున్నే పూజ గదుల్లో చూసి తరించాలి. దేవుడా, నా బంధువుల ఇళ్లల్లో నేను చూసి తరించే అవకాశం మాత్రం నాకివ్వొద్దు మా మంచి దేవుడా.. అంటూ కొండవీటి సత్యవతి ఫేస్‌బుక్‌వాల్ మీద పోస్టుకు ఒంగోలు అడ్వకేట్ నూకతోటి రవికుమార్ కొంత జోడించారు.

“కలందర్ అనే జానపద కళాకారులు ఎలుగుబంటిని తెచ్చి ఆడించేవారు. చివరకు ఆ ఎలుగుబంటి వెంట్రుకను ఒక రూపాయకు అమ్మి పోయేవారు. ఆ వెంట్రుకను పిల్లలకు కడితే దుష్టశక్తుల నుంచి రక్షిస్తాయని గ్రామీణులు నమ్మేవారు. ఇప్పుడు కాలం మారింది. కలందర్ తెగ ప్రజలు అంతరించారు. ఎలుగుబంట్లు బాబాలుగా పునర్జన్మ పొంది, తమ గోళ్లు, జుట్టు తామే అమ్ముకుంటున్నాయి. చివరకు కాళ్ల ఫోటోలు కూడా అమ్ముకుంటున్నాయి. అప్పుడు ఎలుగుబంటి వెంట్రుక కొన్నవారిది ‘అమాయక గ్రామీణ ముగ్ధత్వం.’ ఇప్పుడు బాబాల పాదాల ఫోటోలు కొనేవారిది ‘మాయదారి పట్టణ నయాధనిక వెధవాయిత్వం”

ముక్తాయింపు..

మోక్షం కూడా ప్యాకేజీ రూపంలో దొరుకుతుందేమో” అంటూ ట్రోల్స్ వస్తున్నాయి. భారతదేశంలో గురు-శిష్య పరంపర పవిత్రమైనది. కానీ, ఆధునిక కాలంలో ఆధ్యాత్మిక సంస్థలు కార్పొరేట్ తరహాలో నడుస్తూ, భక్తుల నమ్మకాన్ని మార్కెట్ వస్తువుగా మార్చడం చర్చనీయాంశంగా మారింది. ఈ రూ.3,200 ఫోటో ఫ్రేమ్ అనేది ఆధ్యాత్మిక విలువలకు, వ్యాపార ప్రయోజనాలకు మధ్య ఉన్న సన్నని గీతను ప్రశ్నిస్తోంది. పుట్టపర్తి సత్యసాయిబాబా, షిరిడీ సాయిబాబా పాదాలు కూడా ఫొటోలుగా మార్చి పెట్టుకున్న ఇళ్లు మనకు కనిపిస్తాయి. అయితే ఇవి ఆ బాబాలు అమ్ముకోలేదు. పాదపూజకు అలవాటుపడిపోయిన భక్తుడు మార్కెట్‌లో కొనుక్కున్నాడు. ఇక్కడ జగ్గీ వాసుదేవ్ దీన్ని ఏకంగా మార్కెట్ చేసేశారు.. అంతే తేడా.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page