top of page

పోస్టింగులపై పట్టు.. సెలవుపై జంప్

  • Writer: Prasad Satyam
    Prasad Satyam
  • 1 hour ago
  • 2 min read
  • రవికుమార్ వస్తేనే రామాయణం ముగింపు

  • డైరెక్టర్ ఆర్డర్లు కమ్యూని కేట్ చేయకుండా సెలవు

  • ట్రెజరీలో ఇంకా కొనసాగుతున్న డ్రామా

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

ఎన్ని చేసినా, ఎంతమంది చెప్పినా శ్రీకాకుళం ట్రెజరీస్ డీడీ మాత్రం తన సంపాదనకు అడ్డంగా ఉన్నవాళ్లను తన కార్యాలయంలో ఉంచుకోననే మొండిపట్టును వీడటంలేదు. చివరకు ఆయన పైఅధికారి రాష్ట్ర ట్రెజరీస్ డైరెక్టర్ ఆదేశాలు సైతం అమలు చేయకుండా సెలవుపై వెళ్లిపోయారంటే.. ఆయన శ్రీకాకుళంలో ఏమేరకు సొమ్ములు సంపాదించడానికి అలవాటుపడిపోయారో అర్థం చేసుకోవచ్చు. శ్రీకాకుళం ట్రెజరీస్ డీడీ కార్యాలయంలో కొందరు ఉద్యోగులకు, డీడీ రవికుమార్‌కు మధ్య కొన్నాళ్ల క్రితం గొడవ జరగడంతో పోలీస్ స్టేషన్ వరకు వెళ్లిన కథలో డీడీ ఏడుగురు సిబ్బందిని సస్పెండ్ చేశారు. ఆ తర్వాత వారిని శ్రీకాకుళంలో యథాస్థానంలో చేర్చుకోవాలన్న డైరెక్టర్ ఉత్తర్వులను సైతం అమలుచేయకుండా గత సోమవారం సెలవుపై వెళ్లిపోయారు. పోనీ అట్నుంచి అటే బదిలీ చేయించుకున్నా సరిపోయుండేది. కానీ రాబోయే సోమవారం విధుల్లో చేరుతారని కబురు పంపారట.

వివరాల్లోకి వెళితే..

డీడీ రవికుమార్ ఆరుగురు సీనియర్ అకౌంటెంట్లు, ఒక జూనియర్ అకౌంటెంట్ ను సస్పెండ్ చేయడంతో క్లైమాక్స్‌కు చేరిన కథకు ఎండ్ కార్డు వేయడం కోసం వనజారాణి అనే ట్రెజరీస్ అధికారిని ట్రెజరీస్ డైరెక్టర్ ఇక్కడకు విచారణకు పంపారు. ఆమె ఇచ్చిన నివేదిక మేరకు సస్పెండ్ అయినవారి తప్ప్పు లేదని, వారికి మళ్లీ పోస్టింగ్ ఇవ్వాలని డైరెక్టర్ ఆదేశించారు. దీంతో ఈ నెల 12న సస్పెన్షన్ ఎత్తివేస్తూ ఇందులో ఆరుగురికి వేర్వేరు చోట్లకు డీడీ బదిలీ చేశారు. తమ తప్ప్పు లేకపోయినా సస్పెండ్ చేయడమే కాకుండా ఇప్ప్పుడు దాన్ని ఎత్తివేసి బదిలీ చేయడం కక్షసాధింపులో భాగమేనని బాధితులు మళ్లీ డైరెక్టర్‌కు మొరపెట్టుకున్నారు. ఆమె మళ్లీ బదిలీలను రద్దు చేసి, పాత స్థానాల్లో పోస్టింగ్ ఇవ్వాలని ఆదేశాలిచ్చారు. విజయవాడ డైరెక్టర్ కార్యాలయంలో ఇక్కడి డీడీ రవికుమార్ తీసుకున్న నిర్ణయాన్ని తప్ప్పుపడుతూ వీరిని మళ్లీ పాత స్థానాల్లోనే కొనసాగించాలనే ఉత్తర్వులు వస్తున్నాయని వేగుల ద్వారా తెలుసుకున్న డీడీ రవికుమార్ అకస్మాత్తుగా సెలవు పెట్టి హైదరాబాద్ వెళ్లిపోయారు. వీరికి శ్రీకాకుళంలో పోస్టింగ్ ఇచ్చే ఆదేశాలు కమ్యూనికేట్ చేయకుండానే హైదరాబాద్ చెక్కేశారు. ఈయన స్థానంలో ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్న ఏటీవో గోగరాజు డైరెక్టర్ కార్యాలయం నుంచి వచ్చిన తాజా ఆదేశాలను అమలుచేయడానికి భయపడుతున్నారు. వారి సస్పెన్షన్, బదిలీ అన్నీ డీడీ రవికుమార్ ఉద్దేశపూర్వకరంగా చేసినవే కాబట్టి ఇప్ప్పుడు తాజా ఉత్తర్వుల అమలు తానే చేస్తే తనను కూడా టార్గెట్ చేస్తారని భోగరాజు భావించడం వల్ల ఇంతవరకు ఆరుగురు ఉద్యోగులకు డైరెక్టర్ కార్యాలయం నుంచి వచ్చిన ఉత్తర్వులను కమ్యూనికేట్ చేయలేదు. మరోవైపు తమను శ్రీకాకుళంలో చేర్చుకోవాలంటూ వచ్చిన ఉత్తర్వులు కమ్యూనికేట్ చేయాలని ఉద్యోగులు పట్టుపడుతున్నారు. దీంతో డీడీ రవికుమార్ వచ్చేవరకు ఈ సెన్సిటివ్ ఇష్యూను తాను హ్యాండిల్ చేయలేనని గోగరాజు చేతులెత్తేసినట్టు భోగట్టా. వాస్తవానికి తాను వచ్చేవరకు వీరిని విధుల్లోకి తీసుకోవద్దని రవికుమారే తెర వెనుక ఆదేశాలిచ్చినట్లు చెప్ప్పుకుంటున్నారు. డీడీ రవికుమార్‌తో మందులో సోడాలా కలిసిపోయిన వరప్రసాద్ ఇక్కడ జరుగుతున్నవన్నీ ప్రతీక్షణం డీడీకి మోస్తుండటంతో డీడీ వచ్చాకే, ఆయన ముందే వ్యవహారం తేల్చుకోవాలని భోగరాజు తేల్చి చెప్పేశారట. మరోవైపు సస్పెండైన ఏడుగురు ఉద్యోగుల్లో ఒకరికి మాత్రమే పాత స్థానం కేటాయించడంతో ఆయన ఆమదాలవలసలో చేరారు. మిగిలినవారెవరూ బదిలీ అయిన ప్రాంతంలో రిపోర్టు చేయలేదు. మరోవైపు ఇక్కడ చేర్చుకోడానికి డీడీ ఇష్టపడటంలేదు. సోమవారం ఆయన వచ్చాక వీరి ఆర్డర్స్ కమ్యూనికేట్ చేస్తారో? లేదూ అంటే రవికుమార్ సెలవులు పొడిగించుకొని అట్నుంచి అటే బదిలీపై వెళ్లిపోతారో? ఈ రెండూ కాదనుకుంటే ఇక్కడికొచ్చి సస్పెండైపోతారో? వేచిచూడాలి.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page