కమిషనర్ సస్పెన్షన్
- Prasad Satyam
- 3 hours ago
- 1 min read
నగరంలో డయేరియా ఎఫెక్ట్
ఫిబ్రవరి 11నే ఛార్జి తీసుకున్న కూర్మారావు
మున్సిపల్ మంత్రి వచ్చేలోగా డ్యామేజ్ కంట్రోల్ చర్యలు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
శ్రీకాకుళం నగర కార్పొరేషన్ పరిధిలో డయేరియా ప్రబలడంతో ఒకరు మతిచెందినట్లు అధికారికంగా ప్రకటించిన ప్రభుత్వం ఇందుకు కార్పొరేషన్ కమిషనర్ హనుమంతు కూర్మారావుపై సస్పెన్షన్ వేటు వేసింది. ఈమేరకు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్‌కుమార్ బుధవారం మధ్యాహ్నం ఉత్తర్వులు జారీ చేశారు. 76 మంది ఆసుపత్రుల్లో ఉన్నట్లు నిర్ధారించారు. నగరంలో పలు ప్రాంతాలకు డయేరియా విస్తరించడంతో పాటు మరణాల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుందని ప్రభుత్వానికి సూచన ప్రాయంగా ఇంటెలిజెన్స్ వర్గాలు తెలపడమే కమిషనర్ సస్పెన్షన్‌కు ప్రధాన కారణం. ఇదిలా ఉండగా కమిషనర్ హనుమంతు కూర్మారావు డయేరియా వెలుగుచూసిన నాటికి విధుల్లో చేరి 20 రోజులు మాత్రమే అయింది. మరోవైపు మున్సిపల్ శాఖామంత్రి పొంగులేటి నారాయణ బాధిత ప్రాంతంలో పర్యటించడానికి వస్తున్నారు. వైకాపా అధినేత జగన్మోహన్‌రెడ్డి కూడా దమ్మలవీధిలో పర్యటించే అవకాశాలున్నాయని సూచనప్రాయంగా ప్రభుత్వానికి తెలిసింది. ఈమేరకు మాజీమంత్రులు ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కష్ణదాస్, డాక్టర్ సీదిరి అప్పలరాజులు ఏ మరణాలనైతే ప్రభుత్వం గుర్తించలేదో వారింటికి వెళ్లి ఓదార్చారు. మొత్తం ఎపిసోడ్‌కు కొత్త కమిషనర్‌ను బాధ్యుడ్ని చేస్తూ ప్రభుత్వం సస్పెండ్ చేసింది.






Comments