top of page

తొలి సినిమాతోనే రిటైర్మెంట్!

  • Guest Writer
  • 4 hours ago
  • 2 min read

అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ సినీ ప్రయాణం వెనుక ఉన్న చీకటి కోణాన్ని తాజాగా బయటపెట్టారు. జాన్వీ తొలి చిత్రం ‘ధడక’ బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించినా వ్యక్తిగతంగా తాను తీవ్రమైన మానసిక వేదనను అనుభవించానని ఆమె వెల్లడించింది. ఒక పక్క సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ జరుగుతుంటే మరోపక్క తాను డిప్రెషన్ లోకి వెళ్ళిపోయానని చెప్పడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.’ధడక’ సినిమా విడుదల కావడానికి కొన్ని నెలల ముందే ఆమె తల్లి శ్రీదేవి మరణించారు. తల్లి లేని లోటు ఒకవైపు పీడిస్తుంటే మరోవైపు సినిమా రిజల్ట్‌పై ఉన్న ఒత్తిడి ఆమెను ఉక్కిరిబిక్కిరి చేసింది.

‘నా పని అయిపోయిందని అందరూ నన్ను అసహ్యించుకుంటున్నారని బలంగా నమ్మాను’ అని జాన్వీ ఆనాటి చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో తనపై వచ్చిన విమర్శలు, నెపోటిజం పై జరిగిన చర్చలు జాన్వీని మానసికంగా దెబ్బతీశాయి. స్టార్ కిడ్ కావడమే ఆమె చేసిన తప్పా? అన్నట్లుగా నెటిజన్లు చేసిన కామెంట్స్ ఆమెను కుంగదీశాయి. జాన్వీకి వచ్చిన అవకాశం కేవలం వారసత్వం వల్లేనని తనలో ప్రతిభ లేదని కొందరు చేసిన విమర్శలు ఆమె ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశాయి.

దీంతో తాను విలువ లేనిదాన్నిగా భావించుకున్నానని ఆవేదన చెందింది. ‘ధడక’ 100 కోట్ల వసూళ్లు కూడా ఆమెకు సంతోషాన్ని ఇవ్వలేకపోయాయి. కేవలం నెగటివ్ కామెంట్స్ మాత్రమే తన దృష్టిని ఆకర్షించాయని అందరూ తనను ద్వేషిస్తున్నారనే భ్రమలో ఉండిపోయానని పేర్కొంది. తల్లి నుంచి అందాల్సిన ప్రోత్సాహం లేకపోవడం, ప్రేక్షకుల నుంచి ఆశించిన గుర్తింపు లభించకపోవడం తనను ఒంటరిని చేసాయంది. ధడక్ హిట్ సినిమా అని తెలుసుకోవడానికి కూడా తనకు చాలా సమయం పట్టిందంది.

ఇప్పుడా క్లిష్ట పరిస్థితుల నుండి జాన్వీ పూర్తిగా కోలుకుంది. విమర్శలను స్వీకరిస్తూనే నటనతో సమాధానం చెప్పాలనే పట్టుదలతో ముందుకు సాగుతుంది. వరుసగా విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ఇప్పుడు ఆమె కేవలం ఒక స్టార్ కూతురిగానే కాక ప్రతిభావంతమైన నటిగా నిరూపించుకోవడానికి అహర్నిశలు శ్రమిస్తోంది. ప్రస్తుతం జాన్వీ కపూర్ పాన్ ఇండియా ప్రాజెక్టు లపై దృష్టి పెట్టింది. హిందీ-తెలుగులో నటిస్తోంది. మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న పెద్దిలో నటిస్తోంది. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అలాగే దేవర2 లోనూ అమ్మడు హీరోయిన్‌గా నటిస్తుంది. పెద్ది హిట్ అయితే గనుక జాన్వీ ఇమేజ్ రెట్టింపు అవుతుంది.

- తుపాకి.కామ్ సౌజన్యంతో..


పెద్ది ప్లేస్‌లో ‘ఎపిక్’?

ఓవైపు ఏప్రిల్ 30న ‘పెద్ది’ వస్తుందా, రాదా? అనే డిబేట్ నడుస్తూనే ఉంది.. మరోవైపు మరి కొంతమంది నిర్మాతలు ప్లాన్ బి ని రెడీ చేసుకొంటున్నారు. ‘గాయపడ్డ సింహం’ చిత్రాన్ని మే 1న విడుదల చేస్తామంటూ చిత్రబృందం ప్రకటించింది. ఇప్పుడు మరో సినిమా కూడా మే 1ని టార్గెట్ చేసింది.

ఆనంద్ దేవరకొండ నటించిన సినిమా ఎపిక్. సితార ఎంటర్‌టైన్మెంట్స్ సంస్థ నిర్మించింది. వైష్ణవి చైతన్య కథానాయికగా నటించిన ఈ చిత్రానికి ’90’ ఫేమ్ ఆదిత్య హాసన్ దర్శకుడు. ఈ చిత్రాన్ని మే 1న విడుదల చేయాలని నిర్మాత నాగవంశీ భావిస్తున్నారు. సినిమా పూర్తయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వేగవంతంగా జరుగుతున్నాయి. ‘పెద్ది’ రాకపోతే.. మే 1.. పర్‌ఫెక్ట్ డేట్ అవుతుందని ఆయన నమ్మకం. అందుకే రిలీజ్ డేట్ ప్రకటించి, ఆ తరవాత వీలుని బట్టి సినిమాని రిలీజ్ చేయాలని అనుకొంటున్నారు. ఇక్కడ కూడా కండీషన్స్ అప్లైనే. ‘పెద్ది’ రాకపోతేనే ఎపిక్ వస్తుంది. లేదంటే కొత్త డేట్ చూసుకొంటుంది.

అయితే.. ‘పెద్ది’ వస్తుందన్న కారణంతోనే అఖిల్ సినిమా ‘లెనిన్’ వాయిదా వేశారు నాగవంశీ. ఇప్పుడు ‘పెద్ది’ రావట్లేదని ఎపిక్ రిలీజ్ చేయాలనుకోవడం చర్చనీయాంశం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ‘లెనిన్’ వాయిదా పడడానికి కారణం ‘పెద్ది’ కాదని, సినిమా షూటింగ్ ఇంకా పెండింగ్ లో ఉందని, అందుకే రిలీజ్ చేయడం లేదని అక్కినేని అభిమానులు భావిస్తున్నారు. ఎపిక్ గనుక ఇప్పుడు మే 1న రిలీజ్ డేట్ అంటూ ప్రకటిస్తే గనుక ఆ మాటే నిజం అయినట్టు లెక్క.

- తెలుగు 360.కామ్ సౌజన్యంతో...


Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page