top of page

పసిడి ‘పతనం’!!

  • Writer: NVS PRASAD
    NVS PRASAD
  • 3 hours ago
  • 2 min read
  • 7 నెలల కనిష్ఠానికి బంగారం ధరలు! ` 30 శాతం మేర క్షీణించిన పసిడి..

  • వెండిలో 50% పైగా కోత అసలు కారణాలేంటి?

  • మళ్లీ ఎప్పుడు పుంజుకుంటుంది?

(సత్యంన్యూస్, అమరావతి)

గత ఏడాది వరుస రికార్డులతో ఆకాశాన్ని తాకి న బంగారం ధరలు ఇప్పుడు ఒక్కసారిగా నేల చూపులు చూస్తున్నాయి. సామాన్యుడికి సైతం షాక్ ఇస్తూ పసిడి ధరలు భారీగా పతనమవు తున్నాయి. ఈ ఏడాది జనవరిలో అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్‌కు రికార్డు స్థాయిలో 5,595 డాలర్ల జీవితకాల గరిష్ఠాన్ని తాకిన బంగారం, ప్రస్తుతం 4,000 డాలర్ల దిగువకు పడిపోయి ఏడు నెలల కనిష్ఠానికి చేరుకుంది. జనవరి గరిష్ఠంతో పోలిస్తే ఇది సుమారు 30 శాతం భారీ తగ్గుదల కావడం గమనార్హం. ఈ ఏడాది ప్రారంభం నుంచి చూసుకుంటే 7.6శాతం మేర ధరలు క్షీణించాయి. అయితే దేశీయంగా మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్)లో దిగుమతి సుంకాల పెంపు ప్రభా వం వల్ల అంతర్జాతీయ మార్కెట్‌స్థాయిలో కాకుం డా, తగ్గుదల కొంత పరిమితంగా (సుమారు 22 శాతం) నమోదైంది. మరోవైపు వెండి సైతం బంగారం బాటలోనే పయనిస్తూ ఏకంగా 50 శాతానికి పైగా క్షీణించి ఇన్వెస్టర్లను కలవరపెడు తోంది.

అసలు బంగారం ఎందుకు పడిపోతోంది?

ప్రస్తుతం ప్రపం చ ఆర్థిక పరిస్థి తులు, వివిధ దేశా ల ద్రవ్య విధానా లు, భౌగోళిక ఉద్రిక్తతలు కలిసి మార్కెట్‌ను తీవ్రంగా ఒడిదుడుకులకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా-ఇరాన్ యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఇంధన ధరలు పెరగడంతో ద్రవ్యోల్బ ణంపై ఆందోళనలు ఎక్కువయ్యాయి. దీనివల్ల అమె రికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందన్న అంచనాలు పూర్తిగా తలకిందులయ్యాయి. రాను న్న అక్టోబర్‌లో, అలాగే వచ్చే ఏడాది మార్చిలో ఫెడ్ వడ్డీ రేట్లను మరింత పెంచే అవకాశం ఉందనే అంచనాలు మార్కెట్‌లో బలపడ్డాయి. సాధారణంగా వడ్డీ రేట్లు పెరిగితే, ఎలాంటి వడ్డీ రాబడి లేని బంగారం కంటే ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడులు పెట్టడానికే ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతారు. దీనికి తోడు అంతర్జాతీయంగా అమె రికన్ డాలర్ విలువ పెరగడం, బంగారం ఆధా రిత ఈటీఎఫ్‌ల నుంచి ఇన్వెస్టర్లు తమ పెట్టుబ డులను ఉపసంహరించుకోవడం పసిడిపై ఒత్తిడిని మరింత పెంచింది.

నిపుణులు సూచిస్తున్న కీలక స్థాయిలు

కమోడిటీ మార్కెట్ నిపుణుల అంచనా ప్రకారం.. సమీప కాలంలో బంగారం ధరలు ఒక నిర్దిష్ట పరిధిలోనే కదలాడే అవకాశం ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ఔన్స్‌కు 3,850 డాలర్ల వద్ద కీలక మద్దతు స్థాయిని, 4,630 డాలర్ల వద్ద నిరోధక స్థాయిని కలిగి ఉంది. ఇక దేశీయ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారానికి రూ. 1.29 లక్షలు కీలక మద్దతుగా, రూ. 1.56 లక్షలు నిరోధక స్థాయిగా మారే అవ కాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

ఈ క్యాలెండర్ ఏడాది మూడో త్రైమాసికంలో దేశీయంగా పసిడి ధరలు రూ.1.35 లక్షల నుంచి రూ. 1.54 లక్షల మధ్య ట్రేడ్ అవ్వచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అమెరికా-ఇరా న్ చర్చల సఫలత, చమురు ధరల తగ్గుదల దృష్ట్యా ఫెడరల్ రిజర్వ్ ఊహించినంత కఠిన వైఖరి అవలంబించకపోవచ్చని, అయితే ద్రవ్యోల్బ ణం, ఉపాధి గణాంకాలే భవిష్యత్ దిశను నిర్ణయి స్తాయని పేర్కొంటున్నారు.

ఇంకా తగ్గే ఛాన్స్ ఉందా?.. కొనుగోలుకు మంచి సమయమేనా?

డాలర్ గనుక ఇలాగే బలంగా కొనసాగితే బంగారం ధరలు మరో 5 నుంచి 8 శాతం వరకు పడిపోయే ప్రమాదం లేకపో లేదని కొంత మంది నిపుణులు హెచ్చరి స్తున్నారు. అదే జరిగితే దేశీయంగా 10 గ్రాముల ధర రూ. 1.38 లక్షల నుంచి రూ. 1.36 లక్షల వరకు దిగిరావచ్చు. అయితే, దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు ఈ తగ్గుదల ఒక అద్భుతమై న కొనుగోలు అవకాశమని సూచిస్తు న్నారు. కాగా, ఇటీవల భారీగా పడిపోయిన వెండి ధరలు స్వల్పకాలంలో కోలుకునే అవకాశం ఉందని, అయితే మధ్యకాలంలో వెండి కూడా నిర్దిష్ట ధరల పరిధిలోనే ట్రేడవుతుందని అంచనా వేస్తున్నారు.

‘ఆగస్టు’ సెంటిమెంట్ ఊరటనిస్తుందా?

గత 50 ఏళ్ల మార్కెట్ చరిత్రను పరిశీలిస్తే.. ప్రతి ఏటా ఆగస్టు నెలలో బంగారం ధరలు సగటున 1.5 శాతం నుంచి 1.8 శాతం వరకు పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. భారతదే శంలో ఆగస్టు నెల నుంచి వరుస పండుగలు, వివాహాల సీజన్ ప్రారంభం కావడం వల్ల భౌతిక బంగారానికి డిమాండ్ భారీగా పెరుగుతుంది. కాబట్టి, రాబోయే ఆగస్టు నెలలో పసిడి మళ్లీ పుం జుకునే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు ఆశా భావం వ్యక్తం చేస్తున్నాయి.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page