top of page

మేం వచ్చాక వారికి చుక్కలు చూపిస్తాం

  • Writer: Prasad Satyam
    Prasad Satyam
  • 2 days ago
  • 2 min read

(ధర్మాన ప్రసంగం కోసం.. క్యాఆర్ కోడ్‌ను స్కాన్ చేయండి)

  • రెండేళ్లు హుషారుంటుందని వదిలేశాం

  • రాజ్యాంగానికి వ్యతిరేకంగా పని చేస్తున్నవారి జాబితా సిద్ధం చేస్తున్నాను

  • రాష్ట్రవ్యాప్తంగా దీన్నే అమలుచేయడానికి జగన్‌ను ఒప్పిస్తాను

  • సర్పంచ్‌ల వీడ్కోలు సభలో మాజీమంత్రి ధర్మాన

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

సగటు వైకాపా కార్యకర్తలోను, జిల్లాలో ధర్మాన అభిమానుల్లోను ఎప్పట్నుంచో గూడుకట్టుకుపోయిన ఒక అభద్రతను మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు బద్దలుగొట్టారు. పరోక్షంగా ఇంతవరకు అధికారంలో ఉన్నప్ప్పుడు తాము చేసింది తప్పేనని అంగీకరిస్తూనే ఇÅ£నుంచి ఎలా ఉండబోతున్నామనేదానికి స్పష్టమైన హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో సర్పంచ్‌ల పదవీకాలం ముగియడంతో వారికి ధర్మాన రామ్‌మనోహర్‌నాయుడు ఇచ్చిన విందులో ఆయన మంగళవారం మాట్లాడారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే.. ఆ పార్టీ గొడుగు మోస్తూ తమకు వ్యతిరేకంగా వ్యవహరించినవారు ఆ తర్వాత వైకాపా అధికారంలోకి వస్తే మళ్లీ ప్రధాన పోస్టుల్లోకి వచ్చేస్తున్నారన్న భావన ఎప్పట్నుంచో కార్యకర్తల్లో ఉంది. దాన్ని దష్టిలో పెట్టుకొని ధర్మాన నర్మగర్భమైన వ్యాఖ్యలు చేశారు. దీనికి కార్యకర్తల నుంచి విశేషంగా స్పందన వచ్చిందంటే.. వారిలో ఈ అంశం ఎంతగా గూడుకట్టుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా వెలమ సామాజికవర్గానికి చెందిన అధికారులు శ్రీకాకుళంలో ధర్మాన కాదంటే నరసన్నపేటలోను, అక్కడి నుంచి టెక్కలికి.. ఇలా ఫోకల్ పాయింట్లలో చుట్టరికంతోనో, మరొక బంధంతోనో ఉద్యోగాలు చేస్తూ అధికార పార్టీలకు కొమ్ముకాస్తూ వస్తున్నారన్న భావన చాలామందిలో ఉంది. కానీ వైకాపా కార్యకర్తను వేధించిన అధికారి ఎక్కడైనా శిక్షార్హుడేనని ధర్మాన స్పష్టం చేశారు. ఆయన ప్రసంగం యధాతథంగా దిగువున ఉంది. చదవండి

“ఎవరెవరు అధికారులు చట్టవ్యతిరేకంగా, రాజ్యాంగ వ్యతిరేకంగా పనిచేస్తారో వారి జాబితాలను సేకరించేటువంటి పని చేస్తాం.. నియోజకవర్గ స్థాయిలోను, మల్టీజోన్ స్థాయిలోను, రాష్ట్రస్థాయిలో కూడా. మనకు పని చేయలేదని సేకరించం.. చ{్టవ్యతిరేకంగా ఉంటే, రాజ్యాంగ వ్యతిరేకంగా అతను వ్యవహరిస్తే చేస్తాం. ఇతను వైఎస్సార్ పార్టీవాడు కనుక వేధిస్తానని గొప్పలకు పోయే అధికారుల పేర్లన్నీ జాగ్రత్తపెట్టాలని నిర్ణయించుకున్నాం. ఎందుకు? మీరు మమ్మల్ని నమ్మడం మానేశారు. లేదులే అన్నయ్యా.. మేమేం చెప్పినా వాళ్లు మీ దగ్గరకొచ్చి జనార్ధన చెప్పాడని, శ్రీను చెప్పాడని పోస్టింగ్‌లు వేయించుకుంటున్నారు. అధికారులకూ అలాగే ఉంది. ఎంత అల్లరి పెట్టినా ఏదో ఒక వైకాపా నాయకుడి రిఫరెన్స్‌తో ఇక్కడికి వచ్చేద్దామని. ఈసారి అటువంటి వారి సంగతంతా ఒక పుస్తకంలో రాసి దగ్గర పెట్టుకుంటాం. ఆ అధికారి పని వచ్చేసరికి ఈ పుస్తకం తెరుస్తాం. బుక్‌లో చరిత్ర చూసిన తర్వాతే ఏ రికమండేషనైనా చేస్తాం. అదే ఇప్ప్పుడు నేను తయారుచేశాను. దాన్నే పట్టుకొని జగన్మోహన్‌రెడ్డి దగ్గరకు వెళ్తున్నాం. ఆయన్ని ఒప్పించి రాష్ట్రమంతా అమలు చేస్తాం. ఇప్ప్పుడు మీరంతా ఎందుకు చప్పట్లు కొడుతున్నారంటే.. ఎవరికైనా పనైపోయిన పరిస్థితి దగ్గర్నుంచి ఇప్ప్పుడు విముక్తి లభిస్తుందని నమ్మకం కుదిరింది. మీ కంప్లైంట్లన్నీ ఒక కమిటీకి వస్తాయి. మండల లెవెల్ నుంచి జిల్లా స్థాయి వరకు అందరు అధికారులకు సంబంధించిన వివరాలు అందులో ఉంటాయి. ఒకటికి రెండుసార్లు చూసి ఆ అధికారితో మాట్లాడతాను. నాయినా నువ్వు ఇలాగే ఉంటావా? చట్టవ్యతిరేక కార్యక్రమాలు చేస్తునే ఉంటావా? మరో ప్రభుత్వంలో నువ్వు పనిచేయవా? నీకు మా అవసరం మరిపడదా? నీ అభిప్రాయమేమిటి? ప్రజలందరూ నీ మీద ఫిర్యాదు చేస్తున్నారు అని అడుగుతాను. ఆ సమాధానం నోట్ చేస్తాను. మూడు సంవత్సరాల తర్వాత ఆ శ్రీముఖం బయటకు తీసి వారికి చుక్కలు చూపించే కార్యక్రమం చేపడతాం. ఏదో రెండేళ్లయింది హుషారుగా ఉన్నారని ఊరుకున్నాను. ఇంకా చేస్తారంటే మరి ఊరుకోను. జగన్మోహన్‌రెడ్డి హయాంలో పార్టీలు చూడకుండా పథకాలిచ్చినందుకు మన కార్యకర్తలే ఫీలయ్యారు. అది మీ అందరికీ తెలుసు. ఇప్ప్పుడు మన పార్టీ తప్ప్పు చేసిందని వారంటున్నారు. అధికారులు మారకపోతే మనం అధికారంలోకి వచ్చిన తర్వాత వీరికి సినిమా చూపిస్తాం.”

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page