సత్యదేవ్ జాతకం మహేష్ మారుస్తాడా?
- Guest Writer
- Aug 13, 2025
- 3 min read

మహేష్ బాబు జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్ తో పేరుతో ఓ బ్యానర్ పెట్టారు. నమ్రత ఈ బ్యానర్‌ని యాక్టివ్‌గా నడపాలని భావించారు. అయితే అనుకున్నంత క్రియాశీలంగా సినిమాలు రెడీ కావడం లేదు. గతంలో ‘మేజర్’ సినిమా ఈ బ్యానర్‌లో వచ్చింది. చాలా గ్యాప్ తర్వాత మరో సినిమాను తీసుకొస్తున్నారు. అదే రావు బహదూర్. సత్యదేవ్ హీరో. కేరాఫ్ కంచరపాలెం, ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య చిత్రాలతో ఒరిజినల్ ఫిల్మ్ మేకర్‌గా పేరుతెచ్చుకున్న వెంకటేష్ మహ దర్శకుడు.
తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ వదిలారు. ఇదొక సైకాలజికల్ డ్రామా. ఓ రాజవంశం నేపథ్యంలో జరిగే కథ. రాజవంశీకుడి గెటప్‌లో సత్యదేవ్ లుక్ కొత్తగా ఉంది. మహేష్ బాబు, నమ్రత ఈ సినిమాను సమర్పిస్తున్నారు. చింతా గోపాలకృష్ణ రెడ్డి, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర నిర్మాతలు. ఆగస్ట్ 15న టీజర్ వదులుతున్నారు.
సత్యదేవ్ టాలెంట్‌కి లోటు లేదు. ఏ పాత్రనైనా చేయగలడు. గాడ్ ఫాదర్, కింగ్‌డమ్ లాంటి సినిమాల్లో చేసిన పాత్రలకు మంచి పేరు వచ్చింది గానీ అవి కెరీర్‌కి కలిసిరావడం లేదు. హీరోగా వచ్చిన సినిమాలు నిలబడటం లేదు. ఇలాంటి సమయంలో మహేష్ బాబు ప్రజెంటర్‌గా సినిమా చేస్తున్నాడు. మహేష్ హస్తవాసి మంచిది. మేజర్ సినిమాకు నేషనల్ లెవల్‌లో మంచి పేరు వచ్చింది. ఇప్పుడు సత్యదేవ్‌కి ఓ విజయం కావాలి. రావు బహదూర్ ఆ విజయాన్ని ఇస్తుందేమో చూడాలి.
- తెలుగు 360.కామ్ సౌజన్యంతో...
రజినీ ‘కూలీ’.. రిలీజ్ కు ముందే రూ.100 కోట్లు?

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్.. ఇప్పుడు కూలీ మూవీతో మరికొన్ని గంటల్లో సందడి చేయనున్న విషయం తెలిసిందే. పవర్ఫుల్ గ్యాంగ్ స్టర్ డ్రామాగా స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఆ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కానుంది. ఆగస్టు 14వ తేదీ అంటే రేపే వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ భారీ బడ్జెట్ తో నిర్మించిన కూలీ సినిమాలో అనేక స్టార్ నటీనటులు కనిపించనున్నారు. టాలీవుడ్ కింగ్ నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నారు. అమీర్ ఖాన్, శ్రుతి హాసన్, సాబిన్ సాహిర్, ఉపేంద్ర, సత్యరాజ్, మహేంద్రన్ తదితర నటీనటులు ముఖ్యపాత్రల్లో ఆడియన్స్ ను కనువిందు చేయనున్నారు. అయితే ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మేకర్స్ రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ వేరే లెవెల్ లో హైప్ క్రియేట్ చేసింది. పాటలు, ట్రైలర్ సినిమాపై ఉన్న అంచనాలను తాకేలా చేసింది. కూలీతో లోకేష్ మరో సరికొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించారని అంతా ఫిక్స్ అయ్యారు. పక్కా బ్లాక్ బస్టర్ బొమ్మ అని డిసైడ్ అయ్యారు. అంతలా కూలీ మూవీపై బజ్ ఉంది. అయితే గత కొంతకాలంగా రిలీజ్ కు ముందు ఇంత హైప్ క్రియేట్ చేసుకున్న సినిమా ఇదేనని చెప్పాలి. రజినీ కెరీర్ లో కూడా అంతే. ఎందుకంటే ఆయన నటించిన వివిధ సినిమాలు రీసెంట్ గా మెప్పించలేకపోయాయి. జైలర్ తప్ప పేట, పెద్దన్న, వేట్టయాన్ వంటి చిత్రాలకు అసలు హైప్ కనపడలేదు. కానీ ఇప్పుడు కూలీ యమా హైప్ తో రిలీజ్ కానుంది. ఇప్పుడు విడుదలకు ముందే రూ.100 కోట్ల క్లబ్ లోకి చేరనున్నట్లు కనిపిస్తుంది. ఇప్పటికే మేకర్స్ అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ చేయగా.. ఓ రేంజ్ లో జరుగుతున్నాయి. దీంతో ఇప్పటి వరకు రూ.70 కోట్లకు పైగా కూలీ మూవీ.. అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రాబట్టినట్లు తెలుస్తోంది. ఇంకా రిలీజ్‌కు కొన్ని గంటల సమయం ఉంది కాబట్టి రూ.100 కోట్లు రాబట్టడం పక్కాలా ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే కూలీ ఓపెనింగ్స్ రూ.150 కోట్లు సాధించే అవకాశం ఉంటుందనే చెప్పాలి. మొత్తానికి ఫస్ట్ షో పడడానికి ముందే ప్రతిష్టాత్మక క్లబ్ లోకి కూలీ వెళ్లేలా కనపడడం విశేషం. సినిమాకు పాజిటివ్ టాక్ వేస్తే దూకుడు వేరు. రూ.1000 కోట్ల మార్క్ కూడా టచ్ చేసే ఛాన్స్ ఉంది.
- తుపాకి.కామ్ సౌజన్యంతో...
ముంబై కంటే హైదరాబాద్ బిర్యానీ ఫేమస్!

హైదరాబాద్ దమ్ బిర్యానీకి ఫిదా కానిదెవరు? భాగ్యనగరంలో కాలు మోపిన ఎవరైనా హైదరాబాద్ బిర్యానీ రుచి చూడాల్సిందే. కామన్ మ్యాన్ అయినా? సెలబ్రిటీ అయినా బిర్యానీ తినకుండా తిరుగు ప్రయాణ మయ్యేదే లేదు. అదీ హైదరాబాద్ బిర్యానీకి ఉన్న ప్రత్యేకత. వరల్డ్ లోనే హైదరాబాద్ బిర్యానీ ఫేమస్. తాజాగా సోషల్ మీడియా క్వీన్ ఉర్పీ జావెద్ ముంబై...హైదరాబాద్ బిర్యానీ మద్య వత్యాసం చెప్పే ప్రయత్నం చేసింది. ముంబై బిర్యానీ అన్నది పులావ్ లా ఉంటుంది.
అందులో ఆయిల్ తప్ప ఇంకేమీ ఉండదు. కానీ హైదరాబాద్ బిర్యానీ రుచే వేరుగా ఉంటుంది. పేరు పెట్టా ల్సిన పనిలేదు. చాలా రుచికరమైన పుడ్ అనేసింది. అయితే సీ పుడ్స్ మాత్రం హైదరాబాద్ కంటే ముంబైలోనే బాగుంటాయంది. ముంబై కోస్టల్ తీరం కావడంతో అన్నిరకాల చేపలు అందుబాటులో ఉంటాయి. వాటితో రకరకాల స్పెషల్ ఐటమ్స్ తయారవుతుంటాయి. కానీ హైదరాబాద్ కి ఆ ఛాన్స్ లేదు. సీ పుడ్స్ ఇష్ట పడేది కూడా చాలా తక్కువ మందే. ఆరకంగా సీ పుడ్స్ అక్కడ ప్రత్యేకం కాలేకపోయాయి. బిర్యానీ.. చికెన్..మటన్ ఐటమ్స్ కు మాత్రం భాగ్యనగరం ఎప్పటికీ ప్రత్యేకమే. ఇటీవలే హైదరాబాద్ విచ్చేసిన బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ కూడా హైదరాబాద్ బిర్యానీ గురించి రివ్యూ కూడా ఇచ్చారు. ఇక్కడ బిర్యానీ టెస్ట్ ఇంకెక్కడా ఉండదన్నారు. అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ బిర్యానీ మాత్రం హైదరాబాద్ బిర్యానీ రుచిని మించి ఉంటుదన్నట్లు పబ్లిక్ వేదికపైనే స్పందించారు. ఇంకా సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, రణబీర్ కపూర్, అమితాబచ్చన్ లాంటి బాలీవుడ్ స్టార్లు ఎంతో మంది హైదరాబాద్ బిర్యానీ గురించి ఎన్నో సందర్భాల్లో ముచ్చటించారు. ముంబై, కేరళ, బెంగుళూరు, చెన్నై నుంచి దుగుమతైన భామలు కూడా భాగ్యనగరం నాన్ వెజ్ వంటకాలపై స్పెషల్ రివ్యూలు ఇచ్చిన వారే.
` తుపాకి.కామ్ సౌజన్యంతో...
RRRRRRRRRRRRRRRRRRRRRRRRR










Comments