SVR భయం..NTR అభయం!!
- SATYAM DAILY
- 2 minutes ago
- 3 min read

ఎన్టీఆర్, ఎస్వీ రంగారావు వీరిద్దరూ దాదాపు ఒకేసారి సినీ రంగ ప్రవేశం చేశారు. ఎన్టీఆర్ హీరోగా నటించిన పల్లెటూరి పిల్ల, షావుకారు చిత్రాలల్లో రంగారావు పోషించిన పాత్రలు చిన్నవైనా ఆయన బాణీ కనిపించింది. అప్పటి నుంచి చివర వరకు ఈ మహానటుల మధ్య అనుబంధం కొనసాగింది.
ప్రారంభంలో ఇద్దరు విజయ సంస్థలో పర్మినెంట్ ఆర్టిస్ట్స్‌గా చేరారు. పాతాళ భైరవి చిత్రం ఎన్టీఆర్‌కి ఎంత పేరు తెచ్చి పెట్టిందో అందులో నేపాలీ మంత్రికుడిగా రంగారావును అంత ఏలివేట్ చేసింది. ఈ చిత్రంలో నటిస్తున్న సమయంలోనే తన భవిష్యత్తు గురించి రంగారావు అందోళన చెందుతుంటే ఈ పరిశ్రమలో అగశ్రేణి నటుల్లో మీరు ఒక్కరని అన్నిపించుకొనే రోజు తప్పకుండా వస్తుంది బ్రదర్ అన్ని ధైర్యం చెప్పేవారు ఎన్టీఆర్.
ఆయన చెప్పినట్లుగానే కొద్ది కాలంలోనే గొప్ప నటుడని పేరు తెచ్చుకొని ఎన్టీఆర్, అక్కినేనిలతో సమానస్థాయిలో పారితోషికం తీసుకొనేలా ఎదిగారు రంగారావు. వయస్సులో తనకంటే దాదాపు అయిదు ఏళ్ళు పెద్దవాడు అయిన రంగారావును ఎన్టీఆర్ ఎంతో గౌరవించేవారు. మరో విషయం ఏమిటంటే ఎన్టీఆర్ కాని, రంగారావు కాని నటనకే పరిమితం కాలేదు నిర్మాతలుగా, దర్శకులుగా కూడా పేరు తెచ్చుకున్నారు. ఎన్టీఆర్ నిర్మించిన జయసింహ, రెచుక్క, పగటిచుక్క, శ్రీ కృష్ణ సత్య తదితర చిత్రాలలో యస్వీఆర్ నటించారు
అలాగే రంగారావు నిర్మించిన నాదీ ఆడజన్మే సినిమాలో ఎన్టీఆర్ నటించారు. అయితే ఒకరి దర్శకత్వంలో మరొక్కరు నటించలేదు. వయస్సు మీరకున్న జుట్టు రాలిపోవడంతో నలభై ఏళ్ళ వయస్సుల్లోనే ఎన్టీఆర్, అక్కినేనిలకూ తండ్రిగా రంగారావు నటించవలసి వచ్చింది. ఎన్టీఆర్, రంగారావు చాలా చిత్రాలలో తండ్రి కొడుకులుగా నటించారు. పర్సనాలిటీ పరంగా ఆరోజుల్లో రంగారావు, ఎన్టీఆర్, గుమ్మడి, అక్కినేని కాంబినేషన్‌లో తండ్రి కొడుకుల పాత్రలు ఉండేవి. రంగారావు, ఎన్టీఆర్ తండ్రి కొడుకులుగా నటించిన చివరి చిత్రం దేవుడు చేసిన మనుషులు.
కాలం చెరగని కళాబంధం
ఇద్దరు మిత్రులు - ఎన్టీ రామారావు , కొంగర జగ్గయ్య . గుంటూరులోని ఆంధ్రా క్రిస్టియన్ కాలేజీలో చదువుతున్నప్పుడు ఎన్టీఆర్, జగ్గయ్యలకు పరిచయం ఏర్పడింది, ఇద్దరూ ఒకే క్లాస్ కాకపోయినా వారికి నటన మీద ఉన్న అభిరుచే వారిని స్నేహితులుగా మార్చింది. ఇద్దరూ కలిసి నాటకాలలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఇద్దరూ కలిసి ఎన్నో నాటకాలు వేసేవారు. 1946లో ‘అలీ ది కాబ్లర’ నాటకానికి సంయుక్తంగా ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నారు. రవీంద్రనాథ్ టాగూర్ రాసిన ‘స్రిఫైస’ నాటకాన్ని జగ్గయ్య తెలుగులోకి ‘బలిదానం’గా అనువదించగా, ఎన్టీఆర్‌తో కలిసి విజయవంతంగా ప్రదర్శించారు. సినిమా ప్రయాణంనాటకాల ద్వారా వచ్చిన పరిచయం సినిమాల్లోనూ కొనసాగింది. ‘అప్పు చేసి పప్పు కూడు’, ‘మంచి మనిషి’, ‘గాలి మేడలు’ వంటి పలు చిత్రాల్లో ఇద్దరూ కలిసి నటించి ప్రేక్షకులను అలరించారు. రామారావు గారిలా జగ్గయ్య గారు పౌరాణికాల జోలికి పోలేదు.
పావలా శ్యామల మృతి

తెలుగు సినీ అభిమానులకు తీరని లోటు. తమ సహజ నటనతో, అమాయకపు నవ్వులతో దశాబ్దాల పాటు అలరించిన ప్రముఖ నటి పావలా శ్యామల ఇకలేరు. ఆమె మరణవార్త విన్న సినీ వర్గాలు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న ఆమె, హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. అర్ధరాత్రి తర్వాత గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. ఒక మంచి నటిని కోల్పోయామని టాలీవుడ్ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తోంది. ఆ వివరాలు చూద్దాం..
గత కొంతకాలంగా శ్యామల గారు రకరకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇక పరిస్థితి కాస్త విషమించడంతో ఆమెను హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న సమయంలోనే, అర్ధరాత్రి దాటిన తర్వాత ఆమెకు తీవ్రమైన గుండెపోటు వచ్చింది. డాక్టర్లు కాపాడటానికి ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ప్రస్తుతం ఆమె భౌతికకాయాన్ని ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు.
‘పావలా’ పేరు వెనుక ఉన్న అసలు కథ:
మనందరికీ ఆమె ‘పావలా శ్యామల’గానే తెలుసు. కానీ ఆమె అసలు పేరు నేతి శ్యామల. 1951లో ఏపీలోని గుంటూరు జిల్లా అమరావతిలో ఆమె జన్మించారు. ఇక చిన్నప్పటి నుంచే నటన అంటే చాలా ఇష్టం. దాంతో మొదట్లో నాటకాలు వేస్తూ, రేడియో ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించారు. ఆ రోజుల్లో ఆమె నటించిన ‘పావలా’ అనే నాటకానికి చాలా మంచి పేరు వచ్చింది. ఆ నాటకం ఎంత హిట్టయిందంటే, చివరికి ఆ ‘పావలా’ అనే పేరే ఆమె ఇంటిపేరుగా మారిపోయింది.
రంగస్థలం నుంచి వెండితెరకు:
నాలుగు దశాబ్దాల సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఆమె ఏకంగా 250కి పైగా సినిమాల్లో నటించారు. 1985లో వచ్చిన ‘బాబాయ్ అబ్బాయ’ సినిమాతో ఆమె వెండితెరకు పరిచయమయ్యారు. అయితే, ప్రముఖ దర్శకుడు కె. విశ్వనాథ్ తీసిన ‘స్వర్ణకమలం’ సినిమా ఆమె కెరీర్‌ను మలుపు తిప్పింది. ఇక ఆ సినిమాలో ఆమె చేసిన పాత్ర ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయింది. మనసు దోచుకున్న సహజ నటన: ‘ఖడ్గం’, ‘ఆంధ్రావాలా’, ‘అతడు’, ‘గోలీమార’ లాంటి ఎన్నో హిట్ సినిమాల్లో శ్యామల గారు నటించి మెప్పించారు. ఇక ఏ పాత్ర ఇచ్చినా తనదైన అమాయకత్వంతో, చక్కటి కామెడీ టైమింగ్‌తో నవ్వించేవారు. ఆమె తెరపై కనిపిస్తే చాలు, ప్రేక్షకులకు ఒకరకమైన ఆప్యాయత, నవ్వు వచ్చేవి. అంత సహజంగా ఉండేది ఆమె నటన. చిన్న నాటకాల స్థాయి నుంచి మొదలై, వెండితెరపై తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న పావలా శ్యామల గారి ప్రయాణం నిజంగా గొప్పది. సహాయ నటిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తెలుగు చిత్రసీమకు ఆమె చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఆమె మరణం తెలుగు పరిశ్రమకు తీరని లోటు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం.






Comments