top of page

అనుకున్నదొక్కటి.. అవుతున్నదొక్కటి!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Mar 10
  • 3 min read

ఒక నాయకుడు పోయాడు. కొత్త నాయకుడు వచ్చాడు. ఇరువైపులా ఆయుధాలు గర్జిస్తున్నాయి. ప్రాణ, ఆస్తి నష్టాలు నానాటికీ పెరుగుతున్నాయి. కానీ పరిష్కారం మాత్రం కనుచూపు మేర కనిపించ డంలేదు. యుద్ధం మొదలై పది రోజులు గడిచిపోతున్నాయి. యుద్ధం మొదలైన తొలిరోజే ఇరాన్ సుప్రీం లీడర్ జాడ కనుగొని మట్టుబెట్టిన సంయుక్త దళాలు ఆ ఉత్సాహంతో ఇరాన్‌ను లొంగదీసుకో వడం పెద్దకష్టం కాదని భావించాయి. రెండు రోజులు గట్టిగా దాడులు చేస్తే ఇరాన్ పీచమణిచేయ వచ్చని అమెరికా, ఇజ్రాయెల్ వ్యూహకర్తలు అంచనా వేశారు. కానీ వారి అంచనాలు తలకిందుల య్యాయి. ఇరాన్ సుప్రీం నాయకుడ్ని హతమారిస్తే చాలు.. అక్కడ ప్రభుత్వంపై అప్పటికీ తీవ్ర వ్యతి రేకతతో ఉన్న ప్రజలు అంతర్గతంగా తిరగబడి ప్రభుత్వాన్ని పడగొట్టేస్తారని, అప్పుడు తనకు నచ్చిన వాడిని నియమించుకోవచ్చని అనుకున్న అమెరికా ప్రణాళిక అట్టర్‌ఫ్లాప్ అయ్యిందని పదిరోజులు ఇరాన్ ప్రతిఘటిస్తున్న తీరు చూస్తే స్పష్టమవుతుంది. ఇప్పుడు యుద్ధం ఎందుకు చేయాలో, ఎక్కడ ఆపాలో తెలియని స్థితిలోకి అమెరికా నెట్టబడింది. గత రెండు రోజులుగా అమెరికా దాడుల తీవ్రత కూడా తగ్గినట్లు కనిపిస్తోంది. ఇజ్రాయెల్ మాత్రం ఇరాన్ మీద దాడులు చేస్తూనే ఉంది. ఆయిల్ క్షేత్రాలు, వాటికి సŸంబంధించిన మౌలిక సదుపాయాలపై ఇజ్రాయెల్ దాడులు అమెరికాకు కూడా మింగుడుపడట లేదనే వార్తలు వస్తున్నాయి. సుప్రీం నాయకుడు హతమైనప్పటికీ చెక్కు చెదరకుండా వ్యవస్థను స్థిరంగా నడపటంలో ఇరాన్ సఫలీకృతమైంది. సహజంగా 40 ఏళ్ల పాటు నియంత పాలన సాగించిన నాయకుడి మరణిస్తే దేశం అతలాకుతలం అయిపోతుంది. కానీ ఇరాన్‌లో అలా జరగలేదు. దానికి కారణం అధికార వికేంద్రీకరణే. ఇటువంటి గడ్డు పరిస్థితులు ఉత్పన్నమైతే ఇబ్బంది పడకుండా ముందుజాగ్రత్తగా ప్రతి వ్యవస్థను నడపటానికి ముగ్గురు, నలుగురిని వివిధ అంచెల్లో నియమించారు. ఆ విధంగా మొత్తంగా 80 మందికి పైగా వ్యక్తుల చేతుల్లో పాలన పర్యవేక్షణ బాధ్యతలు చేపట్టారు. అయితే వీరిలో సగం మందికి పైగా ఈ దాడుý మొదటి రెండు రోజుల్లోనే మరణించినప్పటికీ ఆ లోటు ఎక్కడా కనిపించలేదు. అధికార వికేంద్రీకరణ ఎంత అవసరమో, ఎంత చక్కగా చేశారో ఈ ‘నియంత’ నుంచి ప్రజాస్వామ్య దేశాలు తెలుసుకోవాలి. ఆ విషయం ఎలా ఉన్నా.. ఇరాన్‌పై ఇజ్రా యెల్, అమెరికా విరుచుకుపడుతున్న వేళ అమెరికన్ ఇంటెలిజెన్స్ విభాగం ప్రభుత్వానికి ఇచ్చిన నివే దిక అక్కడి అధికారవర్గాల్లో సంచలనం రేపుతోంది. ఇంత పెద్దఎత్తున విరుచుకుపడుతున్నా కూడా ఇరాన్‌లో పాలన మార్పు సాధ్యం కాదని ఆ నివేదిక కుండబద్దలు కొట్టేసింది. ఆపరేషన్ ఎపిక్ ప్యూరీ పేరుతో ఇజ్రాయెల్‌తో కలిసి ఇరాన్‌ను అతలాకుతలం చేస్తున్నప్పటికీ ప్రభుత్వాన్ని కూలదోయడం మాత్రం అసాధ్యమని నేషనల్ ఇంటెలిజెన్స్ కౌన్సిల్ (ఎనఐసీ) రూపొందించిన ఈ నివేదిక హెచ్చరిం చింది. సుప్రీం లీడర్ వంటి అత్యున్నత నాయకుడు చనిపోయిన తర్వాత కూడా అక్కడి ప్రభుత్వ పాలన సజావుగా సాగుతుండటం, సైన్యం, ఐఆర్‌జీసీ దళాలు ప్రత్యర్థులను ధీటుగా ఎదుర్కొంటున్న విధానం చూస్తే స్పష్టమైన ప్రోటోకాల్‌ను ఇరాన్ పాలకులు ముందే ఏర్పాటు చేసినట్లు వెల్లడవుతోందని నివేదిక పేర్కొంది. ప్రభుత్వాన్ని పతనం చేసినా ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగే స్థితిలో అక్కడి ప్రతిపక్షాలు బలంగా లేవని నివేదిక పేర్కొంది. అలాగే బాంబు దాడులు జరుగుతున్న ఈ సమయంలో ప్రజలు వీధుల్లోకి వచ్చి ఉద్యమాలు, సామూహిక తిరుగుబాటు వంటివి చేయడం కూడా సాధ్యం కాదని యూఎస్ అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే యూఎస్ దళాలు ఇరాన్‌లోకి ప్రవేశించి ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకోవడం, కుర్దులతో తిరుగుబాటు చేయించే అవకాశాలు వంటి అంశాల గురించి మాత్రం ఆ నివేదికలో ప్రస్తావించలేదు. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అరెస్ట్ చేసి ఆయన స్థానంలో ప్రతిపక్ష నేత డెల్సీ రోడ్రిగ్స్‌కు వెనిజులా ప్రభుత్వ బాధ్యతను అమెరికా అప్పగిం చింది. అదే రీతిలో ఇరాన్‌లోనూ ప్రస్తుత ప్రభుత్వాన్ని పడగొట్టి ప్రతిపక్షంలో తనకు అనుకూలంగా ఉన్నవారితో కీలుబొమ్మ ప్రభుత్వం ఏర్పాటు చేయించి తనకు నచ్చినట్లు ఆడించాలని అమెరికా ప్లాన్ వేసింది. తదనుగునంగా సుప్రీంలీడర్‌ను హతం చేయగలిగినా తనకు నచ్చని నేతను ప్రభుత్వాధినేతగా నియమించడం మాత్రం అంత ఈజీ కాదని నివేదిక చెబుతోంది. అయితే ఈ నివేదికను ఖాతరు చేయని ట్రంప్ ఇంకా మొండి పట్టుతోనే ఉన్నట్లు ఆయన వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. ‘ఇరాన్ పాల కుడిని నేనే ఖరారు చేస్తాను. దివంగత ఖమేని కుమారుడు ముజ్తబా ఖమేనీ తదుపరి సుప్రీంలీడర్ కావడం తనకు ఇష్టం లేదు’ అని ట్రంప్ వ్యాఖ్యనిస్తే.. కొత్త లీడర్‌ను కూడా రెండు రోజుల్లోనే చంపేస్తా మని ఇజ్రాయెల్ హెచ్చరించింది. దీనిపై ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘేర్ ఘాలిబాఫ్ తీవ్రంగా స్పందించారు. ఇరాన్ తలరాతను తమ దేశ ప్రజలే నిర్ణయిస్తారని వ్యాఖ్యానించారు. అంతే తప్ప ఎప్‌స్టీన్ గ్యాంగ్ నిర్ణయించదని ట్రంప్‌ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. అన్నట్లుగానే ఇరాన్ అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్ నిర్ణయం ప్రకారం యతుల్లా అలీ ఖమేనీ రెండో కుమారుడైన మొజ్తాబా ఖమేనీ కొత్త సుప్రీం కమాండర్‌గా నియమితులయ్యారు. దాంతో ఇరాన్ కొత్త ఉత్సాహంతో ఇజ్రాయెల్, అమెరికా లపై ప్రతిదాడులు చేసే అవకాశం ఉంది. కాగా ఈ యుద్ధం ట్రంప్ ప్రణాళికలను తుత్తునీయలు చేస్తూ కొత్త తలనొప్పులు సష్టిస్తున్నది. తన నెచ్చెలి ఇజ్రాయెల్ దుందుడుకు దాడులు ట్రంప్‌కు ఆగ్రహం, అసంతప్తి కలిగిస్తున్నాయి. ఇరాన్ చమురు క్షేత్రాలను, రిఫైనరీలను ఇజ్రాయెల్ ధ్వంసం చేస్తుంటే.. దానికి ప్రతీకారంగా ఇరాన్ కూడా అదే పని చేస్తోంది. అమెరికాకు మద్దతుగా ఉన్న ఇతర గల్ఫ్ దేశా ల్లోని అమెరికన్ సైనిక స్థావరాలతో పాటు ఇంధనక్షేత్రాలు, డిపోలను నాశనం చేస్తుండటం, హర్మూజ్ జలసంధిని మూసివేయడంతో చమురు సంక్షోభం పెరుగుతోంది. ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఫలితంగా ప్రపంచ దేశాల నుంచి ట్రంప్‌పై ఒత్తిడి తీవ్రతరమవుతోంది.


Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page