top of page

అమ్మ సినిమాలు తీసింది, కొడుకు రాజకీయాల్లో బ్లాక్‌ బస్టర్‌!

  • Guest Writer
  • Nov 7, 2025
  • 3 min read

న్యూయార్క్‌ మేయర్‌గా ఎన్నికైన జొహ్రాన్‌ మమ్‌దానీ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా హాట్‌ టాపిక్‌. ముఖ్యంగా తన విజయాన్ని ఘనంగా జరుపుకున్న తీరు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. కారణం ఏమిటంటే ఆయన ‘‘ధూమ్‌ మచాలే’’ అనే బాలీవుడ్‌ సూపర్‌హిట్‌ పాటకు అడుగులు వేసి స్టేజ్‌ మీదకు ఎంట్రీ ఇచ్చారు! 2004లో విడుదలైన ధూమ్‌ సినిమాలో హృతిక్‌ రోషన్‌, జాన్‌ అబ్రహం, ఐశ్వర్యరాయ్‌ నటించిన ఆ పాటకి జొహ్రాన్‌ చేసిన వాక్‌ఇన్‌ చరిత్రలో నిలిచే క్షణంగా మారింది. ఈ క్రమంలో ఆయన గెలుపుకు సినిమా నేపధ్యం ఎలా ఉపయోగపడిరదనేది అంతటా చర్చనీయాంశంగా మారింది.

అమెరికా రాజకీయాలు ఇప్పటివరకు ఇంత ‘ఫిల్మీ’ విజయం ఎప్పుడూ చూడలేదు! న్యూయార్క్‌ నగర మేయర్‌ ఎన్నికల్లో డెమోక్రటిక్‌ పార్టీకి చెందిన జొహ్రాన్‌ మమ్‌దానీ చరిత్ర సృష్టించారు. 33 ఏళ్ల వయసులోనే మాజీ గవర్నర్‌ ఆండ్రూ కువోమో, రిపబ్లికన్‌ కర్టిస్‌ స్లివా లాంటి ప్రత్యర్థులను ఓడిరచి గెలిచిన ఆయన, అమెరికా చరిత్రలో మొదటి భారతీయ మూలాలున్న ముస్లిం మేయర్‌ అయ్యారు. కానీ ఈ విజయం కేవలం రాజకీయ గెలుపు మాత్రమే కాదు ు ఇది ఒక సినిమా లా ఫీల్‌ ఇచ్చే కలయిక. ఎందుకంటే, కొత్త మేయర్‌ జొహ్రాన్‌ ఎవరో కాదు.. ‘మాన్‌సూన్‌ వెడ్డింగ్‌’, ‘సలామ్‌ బాంబే’ వంటి అద్భుత చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న భారతీయ దర్శకురాలు మీరా నాయర్‌ కుమారుడు!

జొహ్రాన్‌-బాలీవుడ్‌ బంధం జొహ్రాన్‌కి భారత సినిమా ప్రపంచంతో బంధం చాలా లోతైనది. ఆయన తల్లి మీరా నాయర్‌ ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందిన దర్శకురాలు. సలామ్‌ బాంబే! (1988), మాన్సూన్‌ వెడ్డింగ్‌ (2001), ది నేమ్‌సేక్‌ (2006) వంటి సినిమాలు ఆమెకు అంతర్జాతీయ పేరు తెచ్చాయి. ఈ సినిమాలు బాలీవుడ్‌లో భాగం కాకపోయినా, వాటి హృదయంలో భారతీయ కుటుంబాల సున్నితమైన వాస్తవాలు, నసీరుద్దీన్‌ షా, తబు, ఇర్ఫాన్‌ ఖాన్‌ వంటి గొప్ప నటుల ద్వారా ప్రతిబింబిస్తాయి.

జొహ్రాన్‌ తండ్రి మహ్మూద్‌ మమ్‌దానీ ప్రసిద్ధ అకడెమిక్‌, రచయిత. ఆయన రచనలు వలస పాలన, గుర్తింపు, స్వాతంత్రానంతర రాజకీయాలపై కేంద్రీకృతమై ఉంటాయి. ఆసక్తికరంగా, మీరా నాయర్‌ మిసిసిప్పీ మసాలా కోసం లొకేషన్లు వెతుకుతూ ఉన్నప్పుడు మహ్మూద్‌ను కలిశారు. ఆ సినిమా ఉగాండా నుండి భారతీయుల బహిష్కరణ నేపథ్యంలో సాగే డెంజెల్‌ వాషింగ్టన్‌, సరితా చౌదరి నటించిన ప్రేమకథ. అదే పరిచయం తర్వాత వారి వివాహానికి దారి తీసింది. తరువాత వారు అమెరికా, ఆఫ్రికా వంటి ప్రదేశాల్లో నివసించి చివరకు న్యూయార్క్‌లో స్థిరపడ్డారు.

ఇక జొహ్రాన్‌ మమ్‌దానీ 1991లో ఉగాండాలోని కంపాలాలో జన్మించాడు. బాల్యం ఉగాండా, దక్షిణాఫ్రికా, న్యూయార్క్‌ లాంటి మూడే దేశాల్లో గడిపాడు. అక్కడే చదువుకున్నాడు. సైన్స్‌, ఆఫ్రికన్‌ స్టడీస్‌లో గ్రాడ్యుయేషన్‌ చేశాడు. తల్లి-కొడుకు సృజనాత్మక అనుబంధం మీరా నాయర్‌ తన సినిమాల్లో కొడుకు జొహ్రాన్‌ ఇచ్చిన సలహాలను ఎన్నోసార్లు ప్రస్తావించారు. ఒకసారి ఆమెకు హ్యారీ పాటర్‌ సినిమా దర్శకత్వం చేసే ఆఫర్‌ వచ్చినప్పుడు, జొహ్రాన్‌ ఇలా అన్నాడట:

‘‘అమ్మా, చాలామంది మంచి దర్శకులు హ్యారీపాటర్‌ తీస్తారు, కానీ ది నేమ్‌సేక్‌ మాత్రం నువ్వే తీయగలవు.’’ అంతే కాకుండా, ది నేమ్‌సేక్‌ చిత్రంలో గోగోల్‌ పాత్ర కోసం కల్పెన్‌ను ఎంపిక చేయమని కూడా జొహ్రాన్‌నే సలహా ఇచ్చాడట. మీరా నాయర్‌ ఆ క్షణాలను గుర్తుచేసుకుంటూ చెప్పింది. ‘‘నేను స్టార్‌ హీరోలని చూసే ప్రయత్నం చేస్తున్నా. కానీ జొహ్రాన్‌ ‘అమ్మా, హారోల్డ్‌ అండ్‌ కుమార్‌ గో టు వైట్‌ క్యాసిల్‌ సినిమా చూడండి’ అన్నాడు. మొదట పోస్టర్‌ చూసి నచ్చలేదు. కానీ చూసాక, కల్పెన్‌ నిజమైన గోగోల్‌ అని అర్థమైంది.’’

అలా కల్పెన్‌కి జీవితాన్ని మార్చేసిన అవకాశం దక్కింది. టబు, ఇర్ఫాన్‌ లాంటి లెజెండ్స్‌తో నటించే అవకాశం అదే. తరువాత జొహ్రాన్‌ తన తల్లి తీసిన క్వీన్‌ ఆఫ్‌ కట్వే చిత్రంలో మూడవ అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా, మ్యూజిక్‌ సూపర్వైజర్‌గా పని చేశాడు. అంతే కాకుండా, సినిమాలో ఒక చిన్న పాత్రలో కనిపించాడు, అలాగే చ1 %ూజూఱషవ% అనే రాప్‌ ట్రాక్‌ పాడాడు ‘యంగ్‌ కార్డమమ్‌’ అనే పేరుతో. ప్రతీకాత్మక బాలీవుడ్‌ మిషన్‌ ‘‘జొహ్రాన్‌ విజయంలో బాలీవుడ్‌ పాత్ర ఉందా?’’ అంటే ‘‘అవును, ఉంది!’’ అని చెప్పాలి. తన ఎన్నికల ప్రచారం మొత్తం ఆయన బాలీవుడ్‌ టచ్‌తో నింపేశాడు. హిందీలో వీడియోలు పోస్ట్‌ చేయడం నుండి క్లాసిక్‌ డైలాగ్‌లతో వోటర్లను ఆకట్టుకోవడం వరకు, జొహ్రాన్‌ ప్రచారం పూర్తిగా ‘‘ఫిల్మీ స్టైల్‌’’లో సాగింది.

ఒక వైరల్‌ వీడియోలో ఆయన దీవార్‌ (1975)లో అమితాబ్‌ బచ్చన్‌ డైలాగ్‌ ‘‘ఆజ్‌ మేరే పాస్‌ బిల్డింగ్స్‌ హై, ప్రాపర్టీ హై, బంగ్లా హై..’ అని చెప్పి, షారుక్‌ ఖాన్‌ లా చేతులు తిప్పి, ‘‘ఆప్‌’’ అంటూ ముగించాడు. మరొక వీడియోలో ఓం శాంతి ఓం (2007), కర్జ్‌ (1980) సినిమాల పాటలతో ర్యాంక్‌డ్‌ చాయిస్‌ ఓటింగ్‌ను సరదాగా వివరించాడు. ఆయన పోస్టర్లు కూడా 70ల బాలీవుడ్‌ పోస్టర్ల మాదిరిగా ప్రకాశవంతమైన రంగులు, పెద్ద ఫాంట్లు, సినిమాటిక్‌ ఫ్లేవర్‌తో నిండిపోయాయి.

ప్రచారం డిజైనర్‌ అనీష్‌ భూపతీ హాలీవుడ్‌ రిపోర్టర్‌ కు చెప్పినట్టు: జొహ్రాన్‌ స్వయంగా బాలీవుడ్‌ పోస్టర్లు పంపించాడు. ‘వీ లుక్‌ డిఫరెంట్‌!’ అని చెప్పాడు. అతని సౌత్‌ ఏషియన్‌ ఐడెంటిటీని గర్వంగా చూపించాడు. . అలాగే జొహ్రాన్‌ బాలీవుడ్‌ పోస్టర్లను ఇన్‌స్పిరేషన్‌గా తీసుకున్నాడు. పసుపు, ఎరుపు వంటి ప్రకాశవంతమైన రంగులు, విభిన్న టైపోగ్రఫీతో సౌత్‌ ఏషియన్‌ ఐడెంటిటీని హైలైట్‌ చేయాలనుకున్నాం.’’ అన్నారు. అమ్మ చెప్పిన కథలే ప్రేరణ

జొహ్రాన్‌ చెబుతాడు ‘‘నా తల్లి జీవితమే నా మొదటి రాజకీయ పాఠశాల.’’. మీరా నాయర్‌ ఎప్పుడూ చెప్పేది ‘‘మన కథలను మనమే చెప్పాలి, లేకపోతే అవి ఎప్పటికీ చెప్పలేము.’’ అని. ఆ మాట జొహ్రాన్‌ రాజకీయ ప్రయాణానికి దిశ చూపింది. తన తల్లి చూపిన ధైర్యం, సమాజంపై అవగాహన, అణచివేతకు వ్యతిరేకంగా గళం వినిపించే తత్త్వం ఇవన్నీ ఆయనలో నాటుకుపోయాయి. 2020లో జొహ్రాన్‌ మొదటిసారి న్యూయార్క్‌ అసెంబ్లీలోకి ఎన్నికయ్యాడు. ‘ప్రజల కోసం మాట్లాడే నాయకుడు’ అనే పేరును సంపాదించాడు. ఇప్పుడు మేయర్‌గా గెలిచి ఆ అణచివేతకు గళమెత్తే స్ఫూర్తిని మరింత పెద్ద స్థాయిలో చూపిస్తున్నాడు.

బాలీవుడ్‌ నుంచి బ్రాడ్‌వే వరకు ఒకే జోష్‌! జొహ్రాన్‌ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఒకే నినాదం చెబుతున్నాడు. ‘‘అణచివేతను చూసి మౌనం వహించకూడదు.’’. ఇప్పుడు న్యూయార్క్‌ నగరానికి మేయర్‌గా, ఆయన ఆ మాటను వాస్తవంగా నిరూపించాడు. తన తల్లి లాగా ప్రపంచాన్ని కథలతో కదిలించిన ఈ యువకుడు, ఇప్పుడు తన తరం కోసం రాజకీయ కథ రాస్తున్నాడు. ఫిల్మీ బ్లాక్‌బస్టర్‌లా మారిన రాజకీయ విజయం! బాలీవుడ్‌ రక్తం, రాజకీయ మెదడు, అమెరికన్‌ హృదయం.. ఈ మూడిరటి మేళవింపే జొహ్రాన్‌ మమ్‌దానీ. న్యూయార్క్‌ స్టేజ్‌పై ‘‘ధూమ్‌ మచాలే’’ బీట్‌లు వినిపించగా, ప్రపంచం మొత్తానికి ఒక సందేశం ఇచ్చాడు. ‘‘నువ్వెక్కడి వారైనా, నీ మూలాలను గర్వంగా ధరించు!’’

- జోశ్యుల సూర్యప్రకాశ్‌

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page