top of page

అవినీతికే అందలం..పనితీరు పాతాళం!

  • Writer: Prasad Satyam
    Prasad Satyam
  • 2 days ago
  • 4 min read
  • పర్యావరణ ప్రేమికుడి ఆధ్వర్యంలో పతనావస్థ

  • అవినీతిపరులకే ఆ శాఖలో పర్యవేక్షణాధికారాలు

  • పర్యవేక్షణ మర్చి పైరవీలు, అక్రమాల్లో నిమగ్నం

  • ఇష్టమైన శాఖ పనితీరును సమీక్షించని పవన్‌కల్యాణ్

  • ఫలితంగానే ర్యాంకుల్లో అట్టడుగున అటవీశాఖ

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

జిల్లా కలెక్టర్లతో నిర్వహిస్తున్న రెండురోజుల సమీక్ష సమావేశం సందర్భంగా ప్రభుత్వ శాఖలకు గ్రేడ్లను, జిల్లాలక ర్యాంకులను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. జిల్లా సంగతి అలా ఉంచితే.. 28 మంత్రిత్వ శాఖలకు గ్రేడ్లు ప్రకటించగా వాటిలో ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ సారధ్యం వహిస్తున్న అటవీశాఖ వందకు 67 మార్కులతో చిట్టచివరి స్థానంలో ఉన్నట్లు శుక్రవారం ప్రజాశక్తి పత్రిక ప్రచురించిన కథనం ద్వారా తెలుస్తోంది. ఐ అండ్ పీఆర్ కవర్ చేసే ఈ కార్యక్రమంపై ముఖ్యంగా మంత్రులు`వారి శాఖలకు గ్రేడ్లు ఇవ్వడాన్ని పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. సాక్షికి ఎలాగూ పట్టదు. ఇక ఈనాడు, ఆంధ్రజ్యోతి ఈ వార్తను ప్రచురిస్తే ఎక్కడ పొత్తు చెడిపోతుందోనని సహజంగానే వెనక్కు తగ్గుతాయి. ప్రజాశక్తి కథనమే నిజమైతే.. అందుకు వంద కారణాలున్నాయి. అడవులు, పర్యావరణం అంటే తనకు చాలా ప్రేమ అంటూ అటవీశాఖను కోరి తీసుకున్నానని ప్రకటించుకున్న ఆ శాఖ మంత్రి కమ్ ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ ఏరోజూ దాని పనితీరును సమీక్షించినట్లు కనిపించలేదు. దీనికితోడు చెట్టు నుంచి ఆకులు తక్కువగా రాలతాయేమో గానీ.. ఈ శాఖలో పని చేస్తున్న అధికారులపై కాసులు రాలడం మాత్రం ఎక్కువే. ఇటువంటి శాఖను నిత్యం పర్యవేక్షించాల్సిన పవన్‌కల్యాణ్ అటువైపు దృష్టి సారించిన దాUలాల్లేవు. మంత్రికి సహాయకులుగా ఈ శాఖకు ఇద్దరు సలహాదారులు ఉన్నారు. అందరు సలహాదారుల్లాగే వీరికీ లక్షల్లో జీతాలుంటాయి. కానీ వీరు ఏరోజూ అటవీశాఖ ప్రగతికి సంబంధించి ఒక్క సలహా ఇచ్చిన పాపాన పోలేదో.. ఇచ్చినా పవన్‌కల్యాణ్ పట్టించుకోలేదో గానీ అటవీశాఖ మాత్రం అట్టడుగుకు చేరింది. ఇద్దరు సలహాదారుల్లో ఒకరు సాక్షాత్తు రిటైర్డ్ పీసీసీఎఫ్(ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్) మల్లికార్జునరావు కాగా.. ఇంకొకరు పర్యావరణ ప్రేమికునిగా గుర్తింపు పొందిన అంకారావు. ప్రతినెలా వీరికి జీతభత్యాలన్నీ కలుపుకొని రూ.10 లక్షల వరకు ఉంటుందని భోగట్టా. అయినా కూడా చంద్రబాబు ఇచ్చిన గ్రేడ్లలో ఈ శాఖ అట్టడుగుకు జారిపోవడం విడ్డూరం. ఇందుకు కారణం నిజాయితీ అధికారులను బదిలీ చేసి, అవినీతి ఆరోపణలు ఉన్నవారికి పర్యవేక్షణ బాధ్యతలు ఇవ్వడమే. ఇలాంటివన్నీ తెలుసుకోవడానికి పవన్‌కల్యాణ్ ఎప్ప్పుడూ సమీక్షించలేదు.

లూప్‌లైన్లోకి నిజాయితీ

తూర్పుకనుమల అటవీ విస్తీర్ణం, సాంద్రత మన రాష్ట్రంలోనే అత్యధికం. ఈ అడవుల్లో గుగ్గిలం, రోజ్‌వుడ్, ఏగిస, టేకు వంటి విలువైన అటవీ సంపద ఉంది. తిరుమల ప్రాంతంలోని శేషాచలం అడవుల్లో ఎర్రచందనం, నల్లమల అటవీ ప్రాంతంలో శ్రీశైలంలో టైగర్ జోన్, పశ్చిమగోదావరి`కృష్ణా జిల్లాల మధ్య కొల్లేరు రక్షిత ప్రాంతంలో అభయారణ్యం, నెల్లూరు జిల్లా పులికాట్ సరస్సు, విశాఖ జిల్లాలో కంబాలకొండ అభయారణ్యంతో విస్తారమైన అటవీ వనరులు ఉన్న అటవీశాఖలో అవినీతి అధికారులకు అందలమెక్కించి పర్యవేక్షణ బాధ్యతలు కట్టబెడితే ఇలాంటి రిజల్టే వస్తుంది. ముఖ్యమైన విభాగాల్లో ఉన్న నిజాయితీ అధికారులను బదిలీ పేరుతో లూప్‌లైన్ పోస్టుల్లో కి నెట్టేసి అవినీతి చేసేవారిని ఫోకల్ పాయింట్లలోకి తెచ్చుకుంటున్నారు. గతంలో రూ.15 లక్షల లంచం సొమ్ముతో దొరికిపోయి జైలుకు వెళ్లిన ఒక అధికారి ఇప్ప్పుడు అటవీశాఖ ప్రధాన కార్యాలయంలో చక్రం తిప్ప్పుతున్నారు. శ్రీకాకుళం డీఎఫ్‌వోగా పని చేసి ప్రస్తుతం సీసీఎఫ్ పైస్థాయిలో ఉన్న శాంతిప్రియకు నిజాయితీపరురాలిగా పేరుంది. వైల్డ్‌లైఫ్ వింగ్‌ను పర్యవేక్షిస్తున్న ఆమెను తప్పించి ఏసీబీకి దొరికిపోయి రాష్ట్ర విభజన సమయంలో గొడవలు జరుగుతున్నప్ప్పుడు కేసు ఎత్తివేయించుకున్న అధికారికి బాధ్యతలు అప్పగించారు. అలాగే శ్రీకాకుళం డీఎఫ్‌వోగా పని చేసిన విజయ్‌కుమార్ ఆ తర్వాత శ్రీశైలం వెళ్లారు. ఈయన కూడా ముక్కుసూటి అధికారే. అక్కడ భక్తులకు ఇబ్బంది పెడుతున్నారనే ఫేక్ ఫిర్యాదుపై రాజమండ్రి ట్రైనింగ్ సెంటర్‌కు బదిలీ చేశారు. ఆ స్థానంలో అస్మదీయులను తెచ్చి కూర్చోబెట్టారు. డిపార్ట్‌మెంట్‌లో పీసీసీఎఫ్ స్థాయిలో పని చేసిన వ్యక్తి ఉంటే మంచి సలహాలిస్తారని భావిస్తే.. ఆయన తాను సర్వీసులో ఉన్నప్ప్పుడు సహకరించని ఉద్యోగులందర్నీ పనిగట్టుకుని వేధించేందుకే పూర్తి సమయాన్ని వెచ్చిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. గతంలో తనకు వ్యతిరేకంగా పని చేసిన అధికారులపై కక్ష తీర్చుకుంటూనే వారికి మంచి పోస్టింగ్‌లు రాకుండా అడ్డుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కార్యాలయాలు కదలని డీఎఫ్‌వోలు

పవన్‌కల్యాణ్ పేషీ నుంచి ఇటువంటి తలనొప్ప్పులు నిత్యం ఎదురవుతున్నాయని ముఖ్యమంత్రి పేషీకి కూడా తెలుసని, అందుకే కలెక్టర్ల సమావేశంలో రెండు మÖడు పాయింట్లు పట్టుకొని చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారని చెప్ప్పుకొంటున్నారు. కాకపోతే దీని వెనుక పెద్ద కథే ఉంది. రాష్ట్రవ్యాప్తంగా అటవీశాఖలో ఉన్న అవినీతిపరుల చిట్టాను ముఖ్యమంత్రి తెప్పించుకున్నట్లు భోగట్టా. గిరిజనుల పోడు వ్యవసాయానికి అటవీశాఖ కొండల మీద చెట్లు నరకనివ్వడంలేదని, దీనివల్ల కాఫీ గింజల దిగుమతి తగ్గిపోతున్నదని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. అలాగే కొల్లేరు విషయంలో కూడా ముఖ్యమంత్రి వద్ద కొన్ని ఫిర్యాదులు ఉన్నాయి. వాస్తవానికి అటవీ శాఖలో డీఎఫ్‌వో స్థాయిలో ఉన్న ఐఎఫఎస్ అధికారి సీటు కదలకపోవడం వల్ల ఈ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రతి జిల్లాలో మÖడు ఆలిండియా సర్వీస్ క్యాడర్ ఉద్యోగాలు ఉంటాయి. వాటిలో రెండు కలెక్టర్, ఎస్పీ పోస్టులు కాగా మÖడోది ఐఎఫఎస్ క్యాడర్‌కు చెందిన డీఎఫ్‌వో పోస్టు. వీరిలో మొదటి ఇద్దరు ఫీల్డ్ విజిట్, ఆకస్మిక తనిఖీలు, పోలీస్‌స్టేషన్ల పరిశీలన చేస్తుంటారన్నది తెలిసిందే. కానీ డీఎఫ్‌వోలు ఎక్కడైనా ఒక అటవీ ప్రాంతానికి వెళ్లినట్టుగాని, కోత మిల్లుల మీద దాడి చేసినట్టు గానీ వార్తలు లేక చాలా రోజులైంది. ఇదే అదనుగా కిందిస్థాయిలో రేంజర్ల దగ్గర్నుంచి అందరూ కార్యక్షేత్రమైన అడవులను గాలికొదిలేసి జిల్లా లేదా నియోజకవర్గ హెడ్‌క్వార్టర్లలో శుభ్రంగా కాపురాలు చేసుకుంటున్నారు. యÖనిఫారమే ఒంటిపై ఉంచడానికి ఇష్టపడని అటవీ ఉద్యోగులకు తుపాకులు ఇస్తామని ఆమధ్య పవన్‌కల్యాణ్ ప్రకటించారు. ఇది పూర్తిగా హాస్యాస్పదం. అడవులను, కలప వంటి అటవీ సంపదను కాపాడటం ఎలాగూ చేతకావడంలేదు. కనీసం సోషల్ ఫారెస్ట్ విభాగంలో మొక్కలు పెంచడానికి కూడా ఫారెస్ట్ ఉద్యోగులకు ఒళ్లొంగడంలేదు. ఎవరికో ఒక నర్సరీ నడుపుతున్నవాడికి వాటిని అప్పజెప్పేసి జీతం మాత్రం తీసుకుంటున్నారు. ఎటువంటి ఐఎఫఎస్ ఆఫీసర్ లేకుండానే కడియం ప్రైవేట్ నర్సరీల్లో దేశవిదేశాలకు చెందిన మొక్కలు పెంచుతుంటే, మనమంతా అక్కడికి వెళ్లి కొనుక్కుంటున్నాం తప్ప అటవీశాఖలో కూడా నర్సరీలు ఉంటాయని ఎంతమందికి తెలుసు?

థర్డ్‌పార్టీలతో మమ

ఏసీబీ కూడా హాస్టళ్లలో సర్‌ప్రైజ్ చెక్‌లు చేసినట్టు ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌లో చేసిన దాఖలాలు కనిపించవు. మన దగ్గర టేకు, గుగ్గిలం, ఏగిస వంటి విలువైన చెట్లు ఉన్నాయని, వాటిని అక్రమంగా నరుక్కుపోకుండా కాంపా స్కీమ్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ పథకంలో భాగంగా స్థానిక గిరిజన యువతకు ఉపాధి కల్పిస్తూ స్ట్రైకింగ్ ఫోర్స్, బేస్ ఫోర్స్ వంటి బృందాల్లో నియమించింది. దాంతో రెగ్యులర్ ఫారెస్ట్ ఉద్యోగులు కనీసం అటువైపు చూడటం మానేశారు. నిత్యం సముద్రం ఒడ్డునో, సంరక్షణ కేంద్రాల్లోనో సముద్ర తాబేళ్లు మృత్యువాత పడుతున్నాయని పత్రికల్లో చూస్తున్నాం. అంటే ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ ఏం చేస్తున్నట్టు? సీజన్‌లో ఏ మంత్రో సముద్రంలో తాబేళ్లను విడిచిపెట్టినప్ప్పుడు అటవీ ఉద్యోగులు యÖనిఫామ్ వేసుకొచ్చి ఫొటోకు ఫోజివ్వడం తప్ప వాటిని సంరక్షిస్తున్నది మాత్రం మద్రాసుకు చెందిన ట్రీ ఫౌండేషన్. వీరే రాష్ట్రంలో సముద్ర తీరాలన్నీ పర్యటించి తాబేళ్ల జాతి అంతరించిపోకుండా రక్షిస్తున్నారు. కాకపోతే ఆ క్రెడిట్ అటవీశాఖ తన ఖాతాలో వేసుకుంటోంది. పొలాల్లోకి ఏనుగులు ప్రవేశించకుండా ఎలిఫెంట్ ట్రాకర్ల పేరుతో ప్రత్యేక సిబ్బందిన నియమించారు. వీరు వచ్చాక అటవీశాఖ ఉద్యోగులకు ఆ పని కూడా లేకుండాపోయింది. అలాగే విదేశీ పక్షుల సంరక్షణకు WARD వాచర్లను ప్రభుత్వం నియమించింది. పక్షులు చనిపోతే గానీ ఫారెస్ట్ అధికారులు అక్కడకు వెళ్లడంలేదు. అన్నింటికీ మించి టింబర్ డిపోలకు కలప ఎక్కడి నుంచి వస్తుంది, పర్మిషన్ ఎవరిచ్చారు? అనేది పట్టించుకోవడం పూర్తిగా మానేశారు. వాస్తవానికి ప్రస్తుతం ఆన్‌లైనులో అనుమతులు ఇస్తున్నారు. కానీ తగిన పత్రాలు ఉన్నాయో లేవో చూసే తీరిక, ఆసక్తి మనవాళ్లకు ఉండటంలేదు. ఎంత కలపకు అనుమతులు ఇచ్చారు, సా మిల్లులో ఎంత ఉంది? టింబర్ డిపోలో ఎంత ఉంది? అనే భౌతిక పర్యవేక్షణే లేదు. ఎప్ప్పుడూ థర్డ్ పార్టీకి వర్క్‌లు ఇచ్చేయడం, వందకు 30 రూపాయలు పై అధికారులకు పంచేయడం ఇదే ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌లో జరుగుతోంది. ఇది ఏ ఒక్క జిల్లాకో పరిమితం కాదు.. రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. అందుకే చంద్రబాబునాయుడు గత కలెక్టర్ కాన్ఫరెన్స్‌లో కూడా పీసీసీఎఫ్‌తో పాటు కొందరు అధికారుల మీద సీరియస్ అయినట్లు చెప్ప్పుకుంటున్నారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page