ఆ పని చేయడానికి... పెళ్లే కానవసరం లేదు!!
- Guest Writer
- Nov 6, 2025
- 2 min read

స్వేచ్ఛగా జీవించడంపై నిరభ్యంతరంగా మాట్లాడటంలో ఎప్పుడూ ముందుంటుంది మలైకా అరోరా. మాజీ భర్త ఆర్భాజ్ ఖాన్ నుంచి విడిపోయిన మలైకా అరోరా తన కంటే వయసులో చిన్నవాడైన అర్జున్ కపూర్ తో సహజీవనం చేసిన సంగతి తెలిసిందే. ఆ ఇద్దరూ కలిసి బహిరంగంగా షికార్లు చేసారు. అతడితో తన శృంగార జీవితం చాలా బావుందని కొన్నిసార్లు మలైకా బహిరంగంగా అంగీకరించారు. ఇప్పుడు ఓ ఇంటర్వ్యూలో మలైకా చేసిన వ్యాఖ్యలు దుమారంగా మారాయి. ప్రతి వ్యక్తికి తన జీవితాన్ని తన ఇష్టానుసారం జీవించే హక్కు ఉంది. మనసుకు నచ్చినవాడితో శృంగారం చేయడం తప్పేమీ కాదు. దీనికి పెళ్లి కావాల్సిన అవసరం లేదు. ఎంత స్వేచ్ఛగా జీవించాము అన్నదే ముఖ్యం.. అని మలైకా వ్యాఖ్యానించారు.
అయితే మలైకా ఇలాంటి విషయాలను పబ్లిగ్గా మాట్లాడటం సరికాదని పలువురు సూచిస్తున్నారు. మనసులోని మాటను బోల్డ్ గా మాట్లాడేయడం మలైకా ఎప్పుడూ వెనకాడదు. తన జీవితంలో ప్రతి చర్యా ఎంతో స్వేచ్ఛతో ముడిపడి ఉంది. 30 ఏళ్ల కుర్రాడితో మళ్లీ డేటింగ్? మలైకా అరోరా అర్జున్ కపూర్ నుంచి విడిపోయాక పూర్తిగా డేటింగ్ లైఫ్ కి దూరంగా ఉంది. కానీ ఇటీవల 53ఏళ్ల మలైకా 30 ఏళ్ల కుర్రాడితో ఓ పబ్లిక్ ఈవెంట్లో కనిపించడంతో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. ఇటీవల ముంబైలో జరిగిన ఎన్రిక్ ఇగ్లేసియాస్ కచేరీలో కనిపించిన ఆ ముప్పై ఏళ్ల యువకుడు ఎవరో అంటూ హిందీ మీడియా చాలా ఊహాగానాలను సాగించింది. ఈవెంట్లో మలైకా హుషారుగా, సరదాగా సాయంత్రం గడుపుతూ, నృత్యం చేస్తూ, పాప్ స్టార్ హిట్ పాటలతో హమ్ చేస్తూ కనిపించింది. అయితే ఆ సమయంలో తన చెంతనే ఉన్న ఆరున్నర అడుగుల ఆజానుభాహుడు ఎవరో అంటూ కెమెరాలను జూమ్ చేయడం ఆసక్తిని రేకెత్తించింది.
మలైకా అరోరా మిస్టరీ మ్యాన్ ఎవరై ఉంటారు? అన్న చర్చా సోషల్ మీడియాలో మొదలైంది. ఈ భారీ కార్యక్రమానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో మలైకాతో ఉన్న మిస్టరీ మ్యాన్ ని గుర్తు పట్టేందుకు చాలా మంది ప్రయత్నించారు. ఇన్నిరోజులు మలైకాపై సరైన గాసిప్పులు లేవు. ఇకపై ప్రతిరోజూ ఏదో ఒక విధంగా కొత్త వార్తలు పుట్టుకు రావడం ఖాయం.
కుమారుడి డెబ్యూ ఎప్పుడు?
మలైకా ఇప్పటికే ఎదిగేసిన టీనేజర్ కి మామ్. ఇప్పుడు తన బాధ్యతలు చాలా పెద్దవి. నటవారసుడు అర్హాన్ ఖాన్ ని బాలీవుడ్ కి ఘనంగా పరిచయం చేయాలనే ఆలోచనలు తనకు ఉన్నాయి. మలైకా ఇటీవల సల్మాన్ ఖాన్ కుటుంబ మద్ధతును కూడగడుతోంది. అయితే మలైకా కుమారుడి డెబ్యూ మూవీ గురించి ప్రకటించేందుకు ఇంకా సమయం పడుతుందని భావిస్తున్నారు.
- తుపాకి.కామ్ సౌజన్యంతో...
‘కాంత’ ట్రైలర్: సినిమా ‘మాయా’ లోకం

హీరోలు దుల్కర్ సల్మాన్, రానా కలిసి ఓ సినిమా నిర్మించారంటేనే తప్పకుండా అటువైపు కళ్లన్నీ వెళ్లిపోతాయి. వాళ్లిద్దరూ నిర్మించడం మాత్రమే కాదు. నటించారు కూడా. ఆ సినిమానే ‘కాంత’. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. ఈనెల 14న విడుదల అవుతోంది. ఇప్పుడు ట్రైలర్ వదిలారు. 3 నిమిషాల నిడివి ఉన్న ట్రైలర్ ఇది. దాదాపుగా కథంతా చెప్పే ప్రయత్నం చేశారు.
‘ఒక కథ ఎప్పుడు చెప్పాలన్నది ఆ కథేరా నిర్ణయిస్తుంది’ అనే సముద్రఖని డైలాగ్ తో ఈ ట్రైలర్ ప్రారంభమైంది.
‘ఒక న్యూస్.. దాని తరవాత వచ్చిన ఒక ఫోన్ కాల్.. ఎవ్రిథింగ్ ఛేంజ్’
‘ఈ సినిమా ఇచ్చే డబ్బు పేరు ఖ్యాతి ఇవన్నీ నిన్ను పాడు చేసేశాయ్’ లాంటి డైలాగులు ఈ కథలోని ఎమోషన్‌ని, డెప్త్‌ని తెలియజేస్తాయి. బ్యాక్ గ్రౌండ్ లో ‘‘ఈ అద్భుతమే’’ అని పాట.. అందులోని మెలోడీ హాయిగా మనసుల్ని తాకుతుంది.
చిత్రసీమ నేపథ్యంలో సాగే కథ ఇది. ఓ హీరోకీ, దర్శకుడికీ మధ్య క్లాష్ వస్తుంది. ఆ క్లాష్ ఈ కథని ఎలాంటి మలుపులు తిప్పిందన్నదే ‘‘కాంత’’. ఎమోషనల్ గా మొదలై, థ్రిల్లర్ టర్న్ తీసుకొన్నట్టు ట్రైలర్ లో అర్థమవుతోంది. హీరోగా దుల్కర్, దర్శకుడిగా సముద్రఖని నటించారు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా రానా ఎంట్రీ ఇచ్చారు. రానా గెటప్ బాగుంది. దుల్కర్‌ని చూస్తుంటే మహానటి ఫ్లేవర్ కనిపిస్తోంది. ఓ హీరో బయోపిక్ చూస్తున్నట్టు అనిపించింది. తెలుగు సినిమాలా అనిపించదు కానీ, ఓ డబ్బింగ్ సినిమా చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. బహుశా తమిళంలో ఈ సినిమా తెరకెక్కించి, తెలుగులో డబ్ చేసి ఉంటారు. టెక్నికల్‌గా స్ట్రాంగ్‌గా ఉంది. బ్లాక్ అండ్ వైట్‌లో కూడా కొన్ని సన్నివేశాల్ని తెరకెక్కించారు. ట్రైలర్ చూస్తున్నప్పుడు సినిమా కూడా చూడాలన్న ఫీలింగ్ కలగాలి. అదే ట్రైలర్ ఉద్దేశ్యం అయితే ఈ ట్రైలర్ కట్.. దాన్ని నెరవేర్చింది.
- తెలుగు 360.కామ్ సౌజన్యంతో...










Comments