ఆ 3వేలకు మోక్షమెప్ప్పుడు
- Guest Writer
- 1 day ago
- 2 min read
కార్పొరేషన్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు
2019 నుంచి పరిష్కారానికి నోచుకోని సమస్య
విలీన పంచాయతీల్లో హౌస్‌ట్యాక్స్ లబ్ధిదారుల అవస్థలు

విజయనగరం కాలనీలో ఉంటున్న బుడుమÖరు చిన్నమ్మలు పంచాయతీగా ఉన్నప్ప్పుడు తన ఇంటికి రూ.2వేలు ట్యాక్స్ కట్టేవారు. కార్పొరేషన్‌లో విలీనం అయిన తర్వాత రూ.5వేలుగా నిర్ణయించారు. ఇది సరికాదంటూ 2019లో చిన్నమ్మలు ఫిర్యాదు చేశారు. అప్పట్నుంచి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం చుట్టూ తిరుగుతునే ఉన్నారు.
గోవిందనగర్ కాలనీకి చెందిన సలుగు సత్యనారాయణ పేరు మీద పంచాయతీలో ఉన్నప్ప్పుడు ట్యాక్స్ వచ్చేది. కార్పొరేషన్‌లో విలీనమైన తర్వాత శాసనపురి సత్యనారాయణ పేరుతో రావడం మొదలైంది. దీనిపై ఆయన 2019లో ఫిర్యాదు చేశారు. ఇప్పటి వరకు పేరు మారలేదు. కానీ ఆయన ట్యాక్స్ కడుతునే ఉన్నారు.
గోవిందనగర్ కాలనీకి చెందిన కరిమిల్లి గోవిందరాజులు భార్య పోలవరపు జీవరత్నం పేరు పైన పంచాయతీలో ట్యాక్స్ కడుతుండేవారు. కార్పొరేషన్‌లో విలీనమయ్యాక జీవరత్నం పేరు మీద ట్యాక్స్ లేదని తెలియడంతో ఫిర్యాదు చేశారు. ఇప్పటికీ ఆ సమస్య పరిష్కారం కాలేదు.
శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్‌లో విలీనమైన ఏడు పంచాయతీల్లో సొంత ఇల్లు ఉన్నవారు ఇప్ప్పుడు లబోదిబోమంటున్నారు. జగనన్న ప్రభుత్వంలో సచివాలయాలు ఏర్పాటుచేసి సేవలను ఇంటి ముంగిటకు తీసుకువచ్చామని చెప్ప్పుకున్నారు గానీ, అవి సక్రమంగా చేపట్టలేదన్నది కాలం గడుస్తున్నకొద్దీ తేలుతోంది. ఆదరాబాదరాగా చేసిన రీసర్వే ఎలాంటి తలనొప్ప్పులు తీసుకువచ్చిందో, ఇప్ప్పుడు విలీన పంచాయతీల్లో హౌస్ ట్యాక్స్ గణింపు కూడా అంతే తలనొప్పిని తెచ్చిపెట్టింది. దీంతో దాదాపు 3వేలు (2960) దరఖాస్తులు పరిష్కారం కోసం మున్సిపల్ కార్యాలయం చుట్టూ హౌస్ ఓనర్లు తిరుగుతున్నారు. వివరాల్లోకి వెళితే..
2019 నవంబరులో విలీనమైన పంచాయతీల్లోని ఇంటిపన్నును కార్పొరేషన్‌కు బదలాయిస్తూ అడ్మిన్ సెక్రటరీలు ఆన్‌లైన్ చేశారు. ఈ సమయంలో అన్ని ఇళ్లకూ ఆ పంచాయతీ పేరును కంప్యూటర్‌లోకి ఎక్కించారు గానీ, అందులో కాలనీ పేరేంటి? లేదా వీధికి ఏ పేరు ఉంది? అనేది ఇవ్వలేదు. దీంతో అడ్రస్ ఛేంజ్ చేయాలంటూ 720 ఫిర్యాదులు మున్సిపల్ కార్యాలయానికి అందాయి. ఇప్పటి వరకు దానికి అతీగతీ లేకుండాపోయింది. ఇప్ప్పుడు 2019 వరకు పంచాయతీలకే డైరెక్ట్‌గా పన్నులు కట్టేవారు. అప్పటి వరకు ఏ ఇబ్బందీ లేకుండా సజావుగానే జరిగింది. ఎప్ప్పుడైతే మున్సిపల్ కార్పొరేషన్‌కు బదలాయించారో సమస్య ఉత్పన్నమైంది. వారం వ్యవధిలో పన్నుల వివరాలు అప్‌లోడ్ చేయాల్సిరావడంతో అప్ప్పుడే కొత్తగా వచ్చిన సచివాలయ సిబ్బంది అవగాహన లేమి కారణంగా తప్ప్పులతడకలతో నమోదు చేశారు. అప్పటి వరకు పంచాయతీకి కడుతున్న ట్యాక్స్‌కు, కొత్తగా కార్పొరేషన్‌కు బదలాయించాక కడుతున్న ట్యాక్స్‌కు భారీగా వ్యత్యాసం మొదలైంది. పంచాయతీల్లో ఏడాదికోసారే పన్ను కడతారు. అదే మున్సిపాలిటీకి వస్తే ఏడాదికి రెండుసార్లు పన్ను కట్టాలి. పంచాయతీలను విలీనం చేస్తున్నప్ప్పుడు పంచాయతీ పద్ధతి ప్రకారమే పన్నులు చెల్లించాలన్న ఒక జీవో ఇచ్చారు. అంటే.. అప్పటి వరకు వెయ్యి రూపాయలు పన్ను ఉంటే.. దాన్ని మున్సిపాలిటీలో రెండు టెర్మ్‌లకు రూ.500 చొప్ప్పున వెయ్యి చెల్లించాలి. కానీ సచివాలయ సిబ్బంది నిర్వాకం వల్ల వెయ్యి రూపాయలను రెండుసార్లు చెల్లించాల్సి రావడంతో వీరు మున్సిపల్ కార్యాలయానికి ఫిర్యాదులు చేశారు. ఇవే ఇప్ప్పుడు దాదాపు 3వేల వరకు ఉన్నాయి. అప్పట్నుంచి తమకు న్యాయం చేయాలని కాలనీవాసులు తిరుగుతున్నారు. ఎంతమంది కమిషనర్లు మారినా ఫలితం మాత్రం రావడంలేదు. 2021 నుంచి ఇక్కడ పనిచేసిన కమిషనర్లంతా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్‌కు అనేకసార్లు లేఖలు రాశారు. అయినా ఎవరూ స్పందించలేదు. దీంతో దాదాపు 3వేల ఫిర్యాదులు పరిష్కారం కాకుండానే నిలిచిపోయాయి. పంచాయతీల నుంచి మున్సిపాలిటీకి బదలాయించినప్ప్పుడు మొత్తం 13,500 అసెస్‌మెంట్లు ఉన్నట్లు గుర్తించారు. వీటిని ఆన్‌లైన్‌లో పెట్టారు. అప్పటికి ఇంకా గుర్తించనివి 250 వరకు ఉంటాయని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. మొత్తం లబ్ధిదారుల్లో సుమారు 5వేల మంది దీనిపై ఫిర్యాదులిచ్చారు. ఇందులో చిరునామాలు తప్ప్పులతడకగా నమోదైనవి, ఆన్‌లైన్‌లో చూపించని ట్యాక్స్‌ల వివరాలు, ఏడాదికి రెండుసార్లు పన్ను చెల్లింపులు వంటివాటిపై ఫిర్యాదులు ఉన్నాయి. దీనిపై గుంటూరులో ఉన్న మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ మోడిఫికేషన్ స్క్రీన్ ఇవ్వాలి. అంటే.. ఇక్కడ కమిషనర్ ఆ సమస్యను పరిష్కరించే విధంగా హక్కులు కల్పించాలి. ఆ విధంగా 2023లో ఒకసారి మోడిఫికేషన్ స్క్రీన్ ఇచ్చారు. దీని వల్ల కొన్ని పరిష్కారమయ్యాయి. అయినా ఇంకా 3వేల దరఖాస్తులు అలాగే మిగిలిపోయాయి. కొత్తగా వచ్చిన కమిషనర్ కూర్మారావు, ఎమ్మెల్యే గొండు శంకర్‌లు దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెడితే గాని ఈ సమస్య పరిష్కారం కాదు.
- బిర్లంగి రామ్మోహనరావు, ‘సత్యం’ కోసం..






Comments