ఇంట్రెస్టింగ్‌గా రష్మీక వరల్డ్ ఆఫ్ థామా
- Guest Writer
- 4 days ago
- 2 min read

రష్మిక మందన వరుస హిట్స్ తో దూసుకుపోతుంది. ఒక సినిమా తర్వాత మరొక సినిమా వస్తూనే ఉంది. రష్మిక నటించిన గర్ల్ ఫ్రెండ్ మూవీ రిలీజ్ కు రెడీ ఉంది. ఇక అది కాకుండా ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీ ఒకటి అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు బాలీవుడ్ లో మరొక ఇంట్రెస్టింగ్ మూవీతో రానుంది రష్మిక. బాలీవుడ్ లో కొత్త జోష్ ని తీసుకుని వచ్చిన హర్రర్ కామిడి యూనివర్స్ గురించి తెలిసిందే . ఈ యూనివర్స్ నుంచి స్త్రీ, భేడియా, ముంజ్య, స్త్రీ 2 లాంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర విధ్వంసం సృష్టించిన సంగతి తెలియనిది కాదు.
ఇప్పుడు ఇదే యూనివర్స్ నుంచి రష్మిక లీడ్ రోల్ లో ‘థామా’ అనే మూవీ రాబోతుంది. రష్మిక మందన్నా, ఆయుష్మాన్ ఖురానా జంటగా నటిస్తున్న సినిమా ఇది. తాజాగా దీనికి సంబందించిన టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. రష్మిక కొత్త గెటప్ లో కనిపిస్తూ అందరిని ఆశ్చర్యపరిచింది. రష్మిక ఇప్పటివరకు ఇలాంటి రోల్ లో నటించింది లేదు.. హర్రర్ టచ్ లో కనిపించడం ఇదే మొదటి సారి. ఈ సినిమాను ఈ దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది. సో ముందు ముందు సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి.
- ఐడ్రీమ్‌పోస్ట్.కామ్ సౌజన్యంతో..
ఏందమ్మా జాకీ ఈ పులి వేషం?

అందాన్ని అందంగా ప్రెజెంట్ చేయడం ఒక కళ. ఈ కళలో చాలా ఆరితేరిపోయింది జాక్విలిన్ ఫెర్నాండెజ్. ఈ శ్రీలంకన్ బ్యూటీ బికినీ బీచ్ సెలబ్రేషన్, ముంబైలో ర్యాంప్ వాక్‌లు, ఐపీఎల్ సీజన్‌లో డ్యాన్సులు మెరుపులతో ప్రతిసారీ తనదైన ప్రత్యేకతను చాటుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. ప్రతిసారీ వేదిక ఏదైనా తానే కేంద్రక ఆకర్షణగా మారుతోంది. ఫ్యాషన్ సెన్స్‌పరంగా నిరంతరం యువతరంలో స్ఫూర్తి నింపుతూనే ఉంది.
తాజాగా జాక్విలిన్ స్పెషల్ ఫ్రాక్‌లో కనిపించి ఆశ్చర్యపరిచింది. ఇది చూడగానే ఏంటమ్మా ఈ పులి వేషం? అంటూ అభిమానులు సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు. జాకీ ఈసారి సేవ్ టైగర్స్ అని నినదిస్తుందా? అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. అందమైన టైట్ ఫిట్ ఫ్రాక్‌పై టైగర్ ఫోటోలను ముద్రించిన ప్రింటెడ్ డిజైనర్ డ్రెస్ నిజంగా అందరినీ ఆకట్టుకుంది. బ్యాక్ లెస్, షోల్డర్ లెస్ లుక్స్ సహా రకరకాల భంగిమల్లో జాకీ అదిరిపోయే ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ స్పెషల్ ఫోటోషూట్ ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారుతోంది.
నిజమైన టైగర్ అయినా అలా జాక్విలిన్ ముందు నడుచుకుంటూ వెనక్కి తిరిగి చూడాల్సిందే! అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ స్పెషల్ ఫోటోషూట్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతోంది. జాక్విలిన్ కెరీర్ మ్యాటర్‌కి వస్తే ‘‘వెల్ కం బ్యాక్ 3’’ మినహా చేతిలో ఎలాంటి ప్రాజెక్టులు లేవు. జైలు నుంచే తన ప్రియుడు సుకేష్ చంద్రశేఖర్ చాలా ప్రాజెక్టులు ఆఫర్ చేస్తున్నాడు. కానీ వాటిని జాకీ తిరస్కరిస్తూ పరువు కాపాడుకునే పనిలో పడిరది. మరోవైపు జాక్విలిన్ 120కోట్ల పైబడిన నికర ఆస్తులతో రిచెస్ట్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతోంది.
- తుపాకి.కామ్ సౌజన్యంతో..
లిటిల్ హార్ట్స్: ఇంటర్ ప్రేమలు, నవ్వులు

ఈటీవీ విన్ ఒరిజినల్ కంటెంట్ క్రియేట్ చేయడంలో స్పీడు పెంచింది. 90స్, వీరాంజనీలు విహారయాత్ర, అనగనగా, ఎయిర్ లాంటి చిత్రాలు ప్రేక్షకుల ఆదరణ అందుకున్నాయి. ఇప్పుడు యువ నటీనటులు మౌలి, శివానీ నాగారం కీలక పాత్రల్లో ‘లిటిల్ హార్ట్స్’ చిత్రాన్ని తీసుకొస్తున్నారు. సాయి మార్తాండ్ దర్శకుడు. తాజాగా టీజర్ విడుదలైంది. ఇంటర్ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే కథ ఇది. ఇంటర్ ప్రేమలు అనగానే నిబ్బా లవ్ స్టోరీస్ అనే ముద్రపడే ఛాన్స్ ఎక్కువ. అయితే ఈ కథని డీసెంట్‌గా డీల్ చేశారని టీజర్ చూస్తే అర్థమౌతుంది. టీజర్‌లో కొన్ని నోస్టాల్జిక్ మూమెంట్స్ ఉన్నాయి. ఎంసెట్ కోచింగ్, కుర్రాళ్ల గొడవలు, ఇంట్లో చీవాట్లు, ఓ క్యూట్ లవ్ స్టోరీ ఇవన్నీ మేళవింపుతో టీజర్ వదిలారు. ‘ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఇద్దరినీ ఎందుకు కంటారో తెలుసా? ఈ సొసైటీ పెట్టే ప్రెషర్‌కి ఒకడు పోయినా ఇంకొకడు ఉంటాడని’ ఈ డైలాగ్ టీజర్‌లో కొసమెరుపు. అనగనగా సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చిన తర్వాత కొన్ని థియేటర్స్‌లో రిలీజ్ చేశారు. అయితే ‘లిటిల్ హార్ట్స్’ని మాత్రం ముందుగా థియేటర్స్‌లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సెప్టెంబర్ 12న ఈ సినిమా విడుదల కానుంది.
- తెలుగు 360.కామ్ సౌజన్యంతో..
Comments