top of page

ఈ వారం ‘వీరమల్లు’దే రాజ్యమంతా!

  • Guest Writer
  • Jul 21
  • 2 min read
ree

ఈయేడాది ప్రధమార్థం చాలా చప్పగా సాగింది. అరకొర విజయాలు తప్ప బాక్సాఫీసు దగ్గర పెద్దగా సందడి కనిపించలేదు. దాంతో నిర్మాతలూ, అభిమానులూ ద్వితీయార్థంపై ఆశలు పెంచుకొన్నారు. దానికి తగ్గట్టు ఈ యేడాది చివరి వరకూ క్రేజీ సినిమాలే రాబోతున్నాయి. అందులో భాగంగా విడుదల కాబోతున్న చిత్రం హరి హర వీరమల్లు.. పవన్‌ కల్యాణ్‌ డిప్యూటీ సీ.ఎం అయిన తరవాత విడుదల అవుతున్న సినిమా ఇది. పవన్‌ ఎక్కువగా రీమేక్‌ సినిమాలు చేస్తుంటారు. కానీ చాలా కాలం తరవాత ఆయన నటించిన స్ట్రయిట్‌ సినిమా. అందులోనూ చారిత్రక నేపథ్యం ఉన్న కథ. నాలుగేళ్ల పాటు సుదీర్ఘంగా చిత్రీకరణ జరుపుకొని, పలుసార్లు వాయిదా పడుతూ.. చివరికి ఈనెల 24న రాబోతోంది.

పవన్‌ కల్యాణ్‌ సినిమా వస్తోందంటే మరో సినిమాని పోటీకి దింపడానికి భయపడతారు. ఈసారి కూడా పవన్‌కు సోలో ఎంట్రీనే దొరికింది. పెద్ద స్టార్‌ సినిమా విడుదలై చాలా కాలం అయ్యింది. దాంతో బాక్సాఫీసు దగ్గర ఈ వారం వసూళ్ల వర్షం కురిసే అవకాశం ఉంది. ముందు రోజు నుంచే ప్రీమియర్లు మొదలైపోతాయి. టికెట్‌ రేట్లు పెంచుకొనే వెసులుబాటు కూడా దొరికింది. ఏపీలో ప్రీమియర్‌ షోకి టికెట్‌ రేటు ఆరు వందలుగా నిర్ణయించారు. ఎలా చూసినా తొలి రోజు భారీ వసూళ్లు కుమ్ముకోవడం ఖాయం. టాక్‌ బాగుంటే నాలుగురోజుల లాంగ్‌ వీకెండ్‌ ని వీరమల్లు క్యాష్‌ చేసుకొనే అవకాశం ఉంది.

దాదాపు రూ.250 కోట్ల భారీ వ్యయంతో నిర్మించిన చిత్రమిది. ఆ పెట్టుబడి రాబట్టుకోవాలంటే కచ్చితంగా తొలి 4 రోజుల్లోనూ వీరమల్లు మ్యాజిక్‌ చేయాల్సిందే. ఆ సత్తా కూడా ఈ సినిమాకు ఉంది. సాధారణంగా ఓ ప్రాజెక్ట్‌ ఆలస్యం అయితే దానిపై క్రేజ్‌ తగ్గుతుంది. కానీ వీరమల్లు అలా కాదు. పవన్‌పై ఉన్న అభిమానం, ట్రైలర్‌ లో జరిగిన మ్యాజిక్‌.. ఈ సినిమాపై ఆశల్ని ఇంకా సజీవంగా ఉంచింది. అదే మ్యాజిక్‌ తెరపై కూడా కనిపిస్తే కచ్చితంగా వీరమల్లు రాజ్యమేలతాడు.

-తెలుగు 360.కామ్‌ సౌజన్యంతో...


50లో 20 ఎలా పాజిబుల్‌ మలైకా?
ree

బికినీ బీచ్‌ విహార యాత్రలతో తన ఇన్‌ స్టా అభిమానులకు ట్రీట్‌ ఇవ్వడంలో మలైకా ఎప్పుడూ వెనకాడదు. ఇటీవల కొంత కాలంగా టస్కానీ యాత్ర నుంచి రకరకాల ఫోటోషూట్లను మలైకా షేర్‌ చేయగా అవన్నీ వైరల్‌ గా మారాయి. ఇప్పటికీ మలైకా అరోరా టస్కానీ డైరీస్‌ నుంచి చిల్లింగ్‌ ఫోటోషూట్లు వెబ్‌ ని ముంచెత్తుతున్నాయి. మల్లా చిల్‌ వైబ్స్‌ చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. మలైకా అరోరా కొద్దిరోజులుగా తన కుమారుడు అర్హాన్‌ ఖాన్‌తో కలిసి టస్కానీ బీచ్‌ లలో సెలవులను గడుపుతోంది. వెకేషన్‌ లో ఆస్వాధనకు ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని విడిచిపెట్టడం లేదు. కుమారుడు అర్హాన్‌ తో కలిసి ఉన్న కొన్ని ఫోటోలను షేర్‌ చేసిన 51 ఏళ్ల మలైకా.. వాటితో పాటు వరుసగా బికినీ, స్విమ్‌ సూట్లలో ఉన్న ఫోటోషూట్లను కూడా షేర్‌ చేస్తుంటే అవన్నీ వెబ్‌ లో సునామీ సృష్టిస్తున్నాయి.

51 వయసులో ఇంతటి అందం, వేడి ఎలా సాధ్యం మ్యాడమ్‌ ? యాభైలో ఇరవై చూపిస్తున్నారు! అంటూ అభిమానులు ఈ ఫోటోషూట్లపై కామెంట్‌ చేస్తున్నారు. తాజాగా మలైకా ఓ యూనిక్‌ ఫోటోషూట్‌ ని షేర్‌ చేసింది. ఈసారి పింక్‌ బికినీలో దుమారం రేపింది. మలైకా టూపీస్‌ బికినీ స్పెషల్‌ గా ఎలివేట్‌ అవ్వడంతో ఇది క్షణాల్లో వెబ్‌ లో వైరల్‌ గా మారింది. అందమైన బీచ్‌ రిసార్ట్‌, చుట్టూ బులుగు సముద్రం, అక్కడ మలైకా రకరకాల భంగిమల్లో ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోషూట్‌ యూత్‌లో దుమారం రేపుతోంది. టస్కానీ టూర్‌ ముగించాక తిరిగి మలైకా తన రియాలిటీ షో వ్యవహారలతో బిజీ అవుతుంది.

-తుపాకి.కామ్‌ సౌజన్యంతో..

సమంత.. ఎన్నాళ్లకెన్నాళ్లకి?
ree

ఓ తెలుగు ప్రాజెక్టులో సమంత పేరు విని చాలా కాలం అయ్యింది. ఈమధ్య తను సినిమాల్ని చాలా ఆచి తూచి ఎంచుకొంటోంది. వ్యక్తిగత జీవితానికి తగిన ప్రాధాన్యం ఇస్తోంది. అందుకే సినిమాల్ని బాగా తగ్గించేసింది. కొన్ని ప్రాజెక్టులు ఆమె దగ్గరకు వెళ్లాయి. కానీ వివిధ కారణాల వల్ల ఒప్పుకోలేదు. ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ లో కూడా ఆమెను తీసుకొందామనుకొన్నారు. కానీ చివరికి రాశీఖన్నాతో సరిపెట్టుకోవాల్సివచ్చింది.

చాన్నాళ్లకు సమంత తెలుగులో ఓ ప్రాజెక్ట్‌ ముందుకు తీసుకెళ్లడానికి సిద్ధమవుతోంది. త్వరలో ఆమె నందినిరెడ్డి దర్శకత్వంలో నటించబోతోందని తెలుస్తోంది. ‘అన్నీ మంచి శకునములే’ తరవాత నందిని మరో ప్రాజెక్ట్‌ చేయలేదు. ఆమె కొన్ని కథలు సిద్ధం చేసుకొన్నారు. అందులో ఓ కథ సమంతకు వినిపించినట్టు తెలుస్తోంది. ఆ కథ సమంతకు బాగా నచ్చి, తన బ్యానర్‌లోనే రూపొందించాలని ఫిక్సయ్యారని సమాచారం. ఇటీవల సమంత నిర్మాతగా ‘శుభం’ అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. బాక్సాఫీసు దగ్గర సరైన ఫలితం రాలేదు కానీ, నిర్మాతగా సమంతకు లాభాల్ని తెచ్చిపెట్టింది. నందిని రెడ్డి ప్రాజెక్ట్‌ కూడా లిమిటెడ్‌ బడ్జెట్‌ తో రూపొందిస్తున్నారని, నటిగా, నిర్మాతగా సమంతకు అన్ని విధాలా సంతృప్తికరమైన సినిమాగా మిగలబోతోందని ఇన్‌ సైడ్‌ వర్గాలు చెబుతున్నాయి. సమంత-నందినిరెడ్డి కాంబోలో 2 సినిమాలొచ్చాయి. అందులో ‘ఓ బేబీ’ మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడు ఇది ముచ్చటగా మూడో ప్రాజెక్ట్‌ కానుంది.

-తెలుగు 360.కామ్‌ సౌజన్యంతో...

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page